ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా మహిళలకు సమగ్రమైన ఆర్థిక సేవలు అందించే దిశగా ‘ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంటు’ను ఆవిష్కరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడేలా ఫ్యామిలీ బ్యాంకింగ్ ప్రోగ్రాం, చిన్న–మధ్య స్థాయి లాకర్లపై తొలి ఏడాది జీరో రెంటల్ ఫీజు, పీవోఎస్‌లలో రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితితో ఏరైజ్ డెబిట్ కార్డు, కాంప్లిమెంటరీగా నియో క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను దీనితో పొందవచ్చు.
అలాగే, మహిళా నిపుణులతో ఆర్థిక సలహాలు, తొలి ఏడాది డీమ్యాట్ అకౌంటుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీల నుంచి మినహాయింపు, ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్ చేసిన స్టాక్స్ బాస్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మొదలైన సర్వీసులను అందుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలకు సంబంధించిన ప్యాప్‌స్మియర్ తదితర నిర్దిష్ట వైద్యపరీక్షలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు, ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులతో అపరిమిత కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది.
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఇటీవలే ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. గత అక్టోబర్ 21 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వారం రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందుతోంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. కనీసం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment