మన దేశంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం. ఏదైనా అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బు బదిలీకి, అలాగే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డు అవసరం. పాన్ కార్డు సాధారణంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఇస్తారు. అయితే, చాల మందికి తెలియని విషయం ఏమిటంటే 18 ఏళ్లలోపు వారు కూడా ఈ కార్డు పొందవచ్చు. మీరు మీ పిల్లల పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మైనర్లు ఎవరైనా సరే సొంతంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరని గుర్తించుకోవాలి.
పాన్ కార్డు ధరఖాస్తు విధానం
- మీరు ఆన్‌లైన్‌లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మొదట ఎన్‌ఎస్‌డిఎల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- సంబంధిత అభ్యర్థి కేటగిరీని ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం మొత్తం వెల్లడించాలి.
- మీరు ఇప్పుడు మైనర్ వయస్సు రుజువును, తల్లిదండ్రుల ఫోటోతో సహా అనేక ఇతర కీలక పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- ఈ సమయంలో తల్లిదండ్రుల సంతకాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
- రూ. 107 ఛార్జీ చెల్లించిన తర్వాత మీరు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
- ఆ తర్వాత మీకు ఒక రసీదు నెంబరు వస్తుంది. దాని సహాయంతో మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసుకోవచ్చు.
- మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ-మెయిల్ వస్తుంది.
- విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 15 రోజుల్లోగా మీ పాన్ కార్డును ఇంటికి వస్తుంది.
పాన్ కార్డు ఈ డాక్యుమెంట్లు అవసరం
- పాన్ కార్డు అప్లికేషన్ కోసం అనేక పేపర్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది.
- మైనర్ తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు ధృవీకరణ అవసరం
- దరఖాస్తుదారుడి చిరునామా, గుర్తింపు రుజువు అవసరం.
- మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడిలలో ఏదో ఒకదానిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చిరునామా ధృవీకరణ కోసం మీ ఆధార్ కార్డు, పోస్టాఫీసు పాస్ బుక్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ అవసరం.
మీ పిల్లవాడు డబ్బు సంపాదించినప్పుడు, మీ బిడ్డ మీ పెట్టుబడికి నామినీ కావాలని మీరు కోరుకుంటే, పిల్లల పేరిట పెట్టుబడి పెట్టిన సమయంలో వారికి పాన్ కార్డు అవసరం అవుతుంది.
(చదవండి: మెటావర్స్‌తో మహిళలు, పిల్లలకు ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment