ఆధునిక కాలంలో పాన్ కార్డు గురించి దాదాపు అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం, పాన్ కార్డు కలిగిన వినియోగదారులు తమ ఆధార్ నెంబర్‌తో తప్పకుండా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఆలా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వినియోగదారుల పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం ఎలా?
- ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్‌సైట్ వెళ్ళండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రక్రియను ప్రారంభించడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- సిస్టమ్ మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్‌ని ధృవీకరిస్తుంది.
- మీ పాన్ కార్డుని ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఈ-పే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
- సంబంధిత ఫీజు చెల్లించడానికి ఓటీపీ పొందటానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- ఈ-పే టాక్స్ పేజీలో, ఇన్‌కమ్‌టాక్స్ మీద క్లిక్ చేయండి.
- అసెస్‌మెంట్ సంవత్సరాన్ని 2023 - 2024గా, ఆధార్ పేమెంట్స్ కోసం అక్కడ ఎంచుకోండి.
- మీకు వర్తించే మొత్తం అమౌంట్‌కి సంబంధించి వివరాలు వేరే ట్యాబ్‌లో చూడవచ్చు.
- మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాత IT వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్ డ్యాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది.
- అక్కడ 'లింక్ ఆధార్ టు పాన్' అనే ఆప్సన్ చూడవచ్చు
- దానిపైన క్లిక్ చేసిన తరువాత మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి అభ్యర్థనను తెలియజేస్తుంది.
- ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది.
- కావాల్సిన వివరాలను అందించిన తరువాత "లింక్ ఆధార్" బటన్ మీద క్లిక్ చేయండి.
- ఓటీపీ దృవీకరించండి తరువాత, మీ పాన్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌ని విజయవంతంగా లింక్ చేసారని తెలుసుకోవచ్చు.
పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోవడం ఎలా?
- ఇక్కడ కూడా ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్‌సైట్ వెళ్ళండి
- అలా కాకపోతే ఇక్కడున్న రెండు లింకులతో దేనినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్ వెబ్‌సైట్ / పాన్ కార్డ్ వెబ్‌సైట్
- మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఇన్‌కమ్‌టాక్స్ వెబ్‌సైట్ ఉపయోగించుకుంటే పాన్ నంబర్ & ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- అక్కడ 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి.
- సిస్టమ్ చెక్ చేసి పాన్ కార్డ్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది.
- పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్ వెబ్‌సైట్ ఉపయోగించవచ్చు.
- ఇక్కడ పాన్ నంబర్ & పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది.
పైన తెలిపిన సూచనలను పాటిస్తూ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోండి. అంతే కాకుండా ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల 31లోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. ఈ నెల చివరిలోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చెకపోతే పాన్ కార్డ్ పనిచేయదు.
Comments
Please login to add a commentAdd a comment