link Aadhaar
-
పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి
ఆధునిక కాలంలో పాన్ కార్డు గురించి దాదాపు అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం, పాన్ కార్డు కలిగిన వినియోగదారులు తమ ఆధార్ నెంబర్‌తో తప్పకుండా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఆలా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినియోగదారుల పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం ఎలా? ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ప్రక్రియను ప్రారంభించడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సిస్టమ్ మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్ని ధృవీకరిస్తుంది. మీ పాన్ కార్డుని ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఈ-పే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ఫీజు చెల్లించడానికి ఓటీపీ పొందటానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ-పే టాక్స్ పేజీలో, ఇన్‌కమ్‌టాక్స్ మీద క్లిక్ చేయండి. అసెస్మెంట్ సంవత్సరాన్ని 2023 - 2024గా, ఆధార్ పేమెంట్స్ కోసం అక్కడ ఎంచుకోండి. మీకు వర్తించే మొత్తం అమౌంట్‌కి సంబంధించి వివరాలు వేరే ట్యాబ్‌లో చూడవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాత IT వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్ డ్యాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది. అక్కడ 'లింక్ ఆధార్ టు పాన్' అనే ఆప్సన్ చూడవచ్చు దానిపైన క్లిక్ చేసిన తరువాత మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి అభ్యర్థనను తెలియజేస్తుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. కావాల్సిన వివరాలను అందించిన తరువాత "లింక్ ఆధార్" బటన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ దృవీకరించండి తరువాత, మీ పాన్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌ని విజయవంతంగా లింక్ చేసారని తెలుసుకోవచ్చు. పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోవడం ఎలా? ఇక్కడ కూడా ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి అలా కాకపోతే ఇక్కడున్న రెండు లింకులతో దేనినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్ వెబ్సైట్ / పాన్ కార్డ్ వెబ్సైట్ మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఇన్‌కమ్‌టాక్స్ వెబ్సైట్ ఉపయోగించుకుంటే పాన్ నంబర్ & ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి. సిస్టమ్ చెక్ చేసి పాన్ కార్డ్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్ వెబ్సైట్ ఉపయోగించవచ్చు. ఇక్కడ పాన్ నంబర్ & పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పైన తెలిపిన సూచనలను పాటిస్తూ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోండి. అంతే కాకుండా ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల 31లోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. ఈ నెల చివరిలోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చెకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. -
పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్‌పై కేంద్రం కీలక ప్రకటన
గత కొన్నిరోజుల నుంచి ఆదాయపన్ను శాఖ వెబ్సైట్లో తలెత్తిన సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువు 2022 మార్చి 31. పాన్ కార్డును ఆదార్‌కార్డుతో లింక్ చేసే గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉపశమనం లభించనుంది. చదవండి: youtube: యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ పాన్ కార్డును, ఆధార్‌తో అనుసంధాన గడువు పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కూడా కేంద్రం పేర్కొంది. In view of the difficulties being faced by the taxpayers, the Central Govt has extended certain timelines. CBDT Notification No. 113 of 2021 in S.O. 3814(E) dated 17th September, 2021 issued which is available on https://t.co/qX8AZ4HCvf. pic.twitter.com/D3pIf64CoU — Income Tax India (@IncomeTaxIndia) September 17, 2021 మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి.. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.inకి లాగిన్ అవ్వండి. 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి సంబంధిత ఫీల్డ్‌లలో పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరునమోదు చేయాలి. తరువాత పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి, పేజీ దిగువన ఉన్న ‘లింక్ ఆధార్’ బటన్‌పై క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు విజయవంతంగా ఆధార్ కార్డుతో అనుసంధానం జరిగినట్లు పాప్ఆప్విండో వస్తుంది. చదవండి: Ford India Shutdown: భారత్‌కు దిగ్గజ కంపెనీ గుడ్‌బై, పరిహారంపై రాని స్పష్టత -
నేడు చివరి తేదీ: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా!
మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే చేయండి లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్‌కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. అనేకసార్లు చివరి తేదీని పొడగించిన ప్రస్తుతం మరోసారి పొడిగించే దాఖలాలు కనబడటం లేదు. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు (2021 మార్చి 31) చివరి తేదీ. ఈ రాత్రిలోగా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా లావాదేవీల కోసం వాడుకోలేరు. ఒకవేళ మీరు గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాన్ కార్డుకు - ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆధార్-పాన్ లింక్ విధానం: ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి. 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్‌పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి. 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి. చదవండి: ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు -
2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం
ప్రస్తుత చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటిఆర్) దాఖలు చేయడానికి భారత ప్రభుత్వం పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్‌తో లింకు చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. ఆధార్ లేని పాన్ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ(2)ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరించింది. 2021 మార్చి 31లోపు లింక్ చేయాలని కేంద్రం ప్రకటించింది. అలా చేయడంలో విఫలమైతే మీరు బ్యాంక్ ఖాతా తెరవడం లేదా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజీ సబ్సిడీ వంటి ప్రభుత్వాల ఆర్థిక ప్రయోజనాలను పొందలేరు. అయితే రెండు కార్డుల్లో మీ వివరాలు ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ వివరాలు వేరువేరుగా ఉంటే కార్డుల లింకింగ్ సాధ్యపడకపోవచ్చు. ఇంకా ఆధార్-పాన్ లింకు కోసం 15 రోజుల సమయం కాబట్టి రెండు నిమిషాల్లో క్రింద చెప్పిన విధంగా లింకు చేయవచ్చు. ఆధార్-పాన్ లింక్ విధానం: ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి. 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్‌పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి. 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి. చదవండి: కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! -
ఆధార్‌తో పాన్ నెంబర్‌ను లింక్ చేశారా...
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను నిర్దేశిత గడువులోగా లింక్ చేసుకోని వినియోగదారులు త్వరగా ఆ పని పూర్తి చేయండి. లేదంటే కార్డు పనిచేయకుండా పోతుంది. ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డుల రద్దుపై ఇప్పటికే పలు హెచ్చరికలను జారీ చేసిన ఆదాయ పన్ను శాఖ భారీ సంఖ్యలో పాన్ కార్డులకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులతో అధిక మొత్తాల్లో లావాదేవీలు నిర్వహిస్తూ తప్పించుకుంటున్న పన్ను ఎగవేతదారులపై కూడా ఐటీ శాఖ కొరడా ఝుళిపించనుంది. దీంతోపాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్,డెబిట్ కార్డులు ద్వారా జరిపే భారీ లావాదేవీలపై కూడా నిఘా పెట్టనుంది. పాన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గడువు 2021 మార్చి 31వ తేదీ లోపు లింకింగ్ ప్రక్రియ పూర్తి చేచేయకపోతే కనీసం180 మిలియన్ల (18 కోట్ల) కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. 130 కోట్ల జనాభాలో కేవలం15 మిలియన్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారని ఐటీ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో 2.5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న సంస్థలు 57 శాతం, 2.5 నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారు పద్దెనిమిది శాతం, 5 నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 17శాతం, 10 నుంచి రూ .50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 7 శాతం, 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. కాగా 32.71 కోట్లకు పైగా పాన్ కార్డులను బయోమెట్రిక్ ఐడీ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. జూన్ 29 నాటికి జారీ అయిన మొత్తం పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉందని మైగోవ్ఇండియా ఒక ట్వీట్లో పేర్కొంది -
అనుసంధానం.. అనివార్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత పారదర్శంగా అసలైన అర్హులకు అందివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా తెల్ల రేషన్ కార్డు దారులంతా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. అంటే కుటుంబంలోని సభ్యులంతా తమ ఆధార్‌ను రేషన్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. సాక్షి, విజయవాడ: తెల్ల రేషన్ కార్డుదారులంతా తప్పని సరిగా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ–కేవైసీ).. అంటే కార్డుదారులు తమ ఆధార్ కార్డును తెల్లకార్డుతో అనుసంధానం చేయడం. అయితే కేవలం కు టుంబంలో ఒక్కరు కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది వెళ్లి తమ వేలిముద్రలు వేసి ఆధార్ నంబర్‌ను తెల్లకార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 12.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల కార్డులకు చెందిన వారు ఈ–కేవైసీనీ చేయించుకున్నారు. అయితే మరో మూడు లక్షల కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీని కోసం ముందుగా ప్రజాసాధికారిక సర్వే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9వ తేదితో ఈ–కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు నిర్ణయించింది. దీనికితోడు రేషన్ దుకాణదారుడే తమ వద్దకు వచ్చే కార్డుదారులకు ఈ–కేవైసీ చేయాలని నిబంధన పౌరసరఫరాల అధికారులు విధించారు. దీంతో డీలర్లు జోరుగా ఈ–కేవైసీలు చేయిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి ఇలా.. ప్రస్తుతం తెల్లకార్డు ఉంటేనే రాష్ట్రంలో పేదలుగా గుర్తింపు పొందుతారు. ప్రభుత్వ పథకాలు వల్ల ఏదైనా లబ్ధిపొందాలంటే తప్పని సరిగా తెల్లకార్డు అవసరం. అయితే ఈ–కేవైసీ చేయించుకోని కార్డులను నాలుగైదు నెలలు వరకు గడువు ఇచ్చి ఆ కార్డుదారులు ఎక్కడ ఉన్నారా? అని అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అందువల్ల తెల్లకార్డుదారులంతా త్వరగా ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అమ్మఒడి, సన్నబియ్యం, ఉచిత గృహాలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వల్ల లబ్ధిచేకూరాలంటే ఈ–కేవైసీ తప్పని సరిగా ఉండాలి. అనర్హులు, బోగస్‌కార్డుల ఏరివేత ఈ–కేవైసీ ప్రక్రియ ద్వారా అనర్హులు, బోగస్ కార్డులు బయటపడే అవకాశం ఉంది. అనేక మందికి రెండు చోట్ల తెల్లకార్డులు ఉన్నాయి. అలాగే ప్రభుత్యోద్యోగులకు తెల్లకార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది చనిపోయినా వారి పేరుతో కుటుంబ సభ్యులు రేషన్ పొందుతున్నారు. ఇక లబ్ధిదారులు స్థానికంగా ఉండకపోయినా ఉన్నట్లు చూపించుకుని ఫలాలు పొందుతున్నారు. ఇటువంటి వారంతా ఈ–కేవైసీ అనుసంధానం ద్వారా బయటపడతారని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాల అందుతాయని అంటున్నారు. -
ఆధార్ అవస్థలు
వికారాబాద్ అర్బన్: కొత్తగా ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ముగిసి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి. ఇందుకోసం విద్యార్థి ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ తప్పకుండా ఉండాలి. చాలా మంది గ్రామీణ విద్యార్థుల ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడంలో వెనకబడుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతీ పథకానికి ఆధార్ లింక్ తప్పని సరి చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు. ఓటీపీ నంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నంబర్లు ఇచ్చి అప్పటి పూర్తిగా పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నంబర్ ఆధార్ లింకు ఉండాలని షరతు పెడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మార్పుల చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అవస్థలు పడి మార్పులు, చేర్పుల దరఖాస్తులు నింపి ఇచ్చినా సకాలంలో మార్పులు జరగడం లేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులను ఆపి తగిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు లింక్ అడుగుతున్నారు. ఇలా ప్రతిపనికి ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతోంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 24న నేతన్నల సమస్యలపై చలో ఢిల్లీ హిమాయత్‌నగర్: నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని జాతీయ చేనేత నాయకులు దాసు సురేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు ఎన్నికల అనంతరం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువైయ్యాడని వాపోయారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలపై తమ వాణి వినిపించేందుకు ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలుగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.1,283 కోట్ల నిధులను ఏ మేరకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఇక అన్నిటికీ ఆధార్మే!
నెహ్రూనగర్(గుంటూరు): ఆధార్ కార్డును ప్రభుత్వం ప్రతి సేవలో తప్పనిసరి చేసింది. ఆధార్ సంఖ్యను ప్రతీ సర్వీసుకు లింక్ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాన్‌కార్డు, సిమ్‌కార్డు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ సబ్సిడీ, మోటార్ వాహనాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాల్సి ఉంది. ఐటీ రిటర్న్‌కు ఆధార్ తప్పనిసరైంది. గడువు తేదీల్లోగా ఆధార్ లింక్ చేయకపోతే ఈ సేవలు నిలిచిపోతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాల్సిన సర్వీసులు వాటి ఆ«ఖరు తేదీల గురించి తెలుసుకుందాం. పాన్‌కార్డుకు డిసెంబర్ 31 పాన్‌కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి గత నెల ఆగస్టు 31 డెడ్‌లైన్‌గా ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అనుసంధానం చేసుకోకపొవడంతో గడువు డిసెంబర్ 31 వరకూ ఐటీ శాఖ పెంచింది. లింక్ చేసే విధానం ఆశాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయడానికి ఆధార్ పాన్‌కార్డు లింక్ తప్పనిసరి. లేదంటే దాఖలు చేసిన రిటరŠన్స్ ఐటీశాఖ పరిగణనలోకి తీసుకోదు. దీంతో పెనాల్టితో రిటరŠన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సిమ్‌కార్డుకు ఫిబ్రవరి 2018 ఫిబ్రవరి 2018లోగా మొబైల్ సిమ్‌కార్డుకు ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ నంబరు డియాక్టివేట్ అవుతుంది. ఇప్పటికే అన్ని నెబ్వర్క్ల నుంచి లింక్ చేసుకోవాలని ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిన వాళ్ళు.. వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌తో తమ నెట్‌వర్క్‌కు చెందిన స్టోర్‌కు వెళ్లాలి. ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీని స్టోర్‌కు సిబ్బందికి తెలియజేయాలి. తద్వారా ఆధార్ నంబర్‌ను ఇస్తే బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత మొబైల్ నంబర్‌కు కన్మరేషన్ మేసేజ్ వస్తుంది. దీంతో మీ సిమ్‌కార్డు ఆధార్‌తో లింక్ అయినట్లే.. బ్యాంక్ ఖాతాకు డిసెంబర్ 31 బ్యాంక్ ఖాతాకు, ఫైనాన్షియల్ కంపెనీలకు ఆధార్‌ను లింక్ చేయడానికి డిసెంబర్ 31 వరకూ గడువు విధించారు. కేవైసీ డాక్యుమెంట్‌తో తప్పనిసరిగా బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు కస్టమర్ల ఆధార్ డిటేయిల్స్‌ను అప్డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రుణాలు తీసుకున్న కస్టమర్లు కూడా తమ ఆధార్ వివరాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు బ్యాంకుల్లో ఆధార్ అందజేయకపోతే ఆ ఖాతాలు రద్దువుతాయి. రూ.50 వేలు కంటే నగదు లావాదేవీలకు ఆధార్ వివరాలు తప్పనిసరి. సంబంధిత బ్యాంక్‌లో మీ ఆధార్‌కార్డు జిరాక్స్ అందజేయాలి. సంబంధిత బ్యాంక్ శాఖల ఏటీఎం నుంచి కూడా ఈ ఆధార్ లింక్ విధానం అందుబాటులో ఉంది. సామాజిక భద్రతా పథకాలకు డిసెంబర్ 31 సామాజిక భద్రత పింఛన్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపకార వేతనాలకు, ఇతర సామాజిక భద్రత పథకాలకు ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు డిసెంబర్ 31. సంబంధిత శాఖల సిబ్బంది ద్వారా ఆయా సర్వీసులకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
రుణమాఫీకి ఆధార్ తప్పనిసరి
ఎచ్చెర్ల రూరల్: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్లను తప్పనిసరిగా సేకరించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. స్థానిక సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో వివిధ బ్యాంక్‌ల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ వర్తింపజేసేందుకు బ్యాంక్‌లకు ప్రొఫార్మాలు పంపిస్తారని, వాటిలో అన్ని కాలమ్స్ నింపాలని సూచించారు. ఆధార్ నంబర్, పాస్ పుస్తకం, కార్డు నంబర్, సర్వే నంబర్లు ఇలా..అన్ని వివరాలు పొందుపరచాలని సూచించారు. రుణమాఫీకి ఎంతమంది రైతులు ఉన్నారు..వారికి ఎంతెంత రుణాలు అందజేశారు..ఎంత మేర మాఫీ చేయాల్సి ఉందన్న విషయాలను తెలపాలన్నారు. అర్హత గల రైతులను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. మాఫీ వివరాలను రైతులకు తెలియజేసేందుకు బ్యాంక్‌ల వద్ద నోడల్ అధికారులు ఏర్పా టు చేస్తారన్నారు. కౌలు రైతులకు సంబంధించి వారు..సాగు చేస్తున్న పంట భూముల సర్వే నంబర్లు సేకరించాలని సూచించారు. రైతుమిత్ర సంఘాలకు సంబంధించి..వేర్వేరుగా రైతుల వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంలో లోపాలు, సమస్యలు ఉంటే..తమకు మెయిల్ చేయాలని, వాటిని ప్రధాన కార్యదర్శికి పంపి..పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి ఎస్హెచ్జీకి రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది బ్యాంక్ లింకేజీల లక్ష్యాలను సకాలంలో అధిగమించాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి..క్షేత్రస్థాయిలో స్పష్టంగా పరిశీలించి..నివేదికలను సక్రమంగా తయారు చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ తనూజారాణి, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం రాజేంద్రకుమార్, ఎస్బీఐ ఏజీఎం రాజారామ మోహన్‌రాయ్, ఏపీజీవీబీ ఆర్వో జీఎస్ఎన్ రాజు, సెర్ప్ డెరైక్టర్ వై.రఘునాథరెడ్డి, ఎల్డీఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.