నెహ్రూనగర్(గుంటూరు): ఆధార్ కార్డును ప్రభుత్వం ప్రతి సేవలో తప్పనిసరి చేసింది. ఆధార్ సంఖ్యను ప్రతీ సర్వీసుకు లింక్ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాన్‌కార్డు, సిమ్‌కార్డు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ సబ్సిడీ, మోటార్ వాహనాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాల్సి ఉంది. ఐటీ రిటర్న్‌కు ఆధార్ తప్పనిసరైంది. గడువు తేదీల్లోగా ఆధార్ లింక్ చేయకపోతే ఈ సేవలు నిలిచిపోతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాల్సిన సర్వీసులు వాటి ఆ«ఖరు తేదీల గురించి తెలుసుకుందాం.
పాన్‌కార్డుకు డిసెంబర్ 31
పాన్‌కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి గత నెల ఆగస్టు 31 డెడ్‌లైన్‌గా ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అనుసంధానం చేసుకోకపొవడంతో గడువు డిసెంబర్ 31 వరకూ ఐటీ శాఖ పెంచింది. లింక్ చేసే విధానం ఆశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయడానికి ఆధార్ పాన్‌కార్డు లింక్ తప్పనిసరి. లేదంటే దాఖలు చేసిన రిటరŠన్స్ ఐటీశాఖ పరిగణనలోకి తీసుకోదు. దీంతో పెనాల్టితో రిటరŠన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
సిమ్‌కార్డుకు ఫిబ్రవరి 2018
ఫిబ్రవరి 2018లోగా మొబైల్ సిమ్‌కార్డుకు ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ నంబరు డియాక్టివేట్ అవుతుంది. ఇప్పటికే అన్ని నెబ్‌వర్క్‌ల నుంచి లింక్ చేసుకోవాలని ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిన వాళ్ళు.. వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌తో తమ నెట్‌వర్క్‌కు చెందిన స్టోర్‌కు వెళ్లాలి. ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీని స్టోర్‌కు సిబ్బందికి తెలియజేయాలి. తద్వారా ఆధార్ నంబర్‌ను ఇస్తే బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత మొబైల్ నంబర్‌కు కన్మరేషన్ మేసేజ్ వస్తుంది. దీంతో మీ సిమ్‌కార్డు ఆధార్‌తో లింక్ అయినట్లే..
బ్యాంక్ ఖాతాకు డిసెంబర్ 31
బ్యాంక్ ఖాతాకు, ఫైనాన్షియల్ కంపెనీలకు ఆధార్‌ను లింక్ చేయడానికి డిసెంబర్ 31 వరకూ గడువు విధించారు. కేవైసీ డాక్యుమెంట్‌తో తప్పనిసరిగా బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు కస్టమర్ల ఆధార్ డిటేయిల్స్‌ను అప్‌డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రుణాలు తీసుకున్న కస్టమర్లు కూడా తమ ఆధార్ వివరాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు బ్యాంకుల్లో ఆధార్ అందజేయకపోతే ఆ ఖాతాలు రద్దువుతాయి. రూ.50 వేలు కంటే నగదు లావాదేవీలకు ఆధార్ వివరాలు తప్పనిసరి. సంబంధిత బ్యాంక్‌లో మీ ఆధార్‌కార్డు జిరాక్స్ అందజేయాలి. సంబంధిత బ్యాంక్ శాఖల ఏటీఎం నుంచి కూడా ఈ ఆధార్ లింక్ విధానం అందుబాటులో ఉంది.
సామాజిక భద్రతా పథకాలకు డిసెంబర్ 31
సామాజిక భద్రత పింఛన్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపకార వేతనాలకు, ఇతర సామాజిక భద్రత పథకాలకు ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు డిసెంబర్ 31. సంబంధిత శాఖల సిబ్బంది ద్వారా ఆయా సర్వీసులకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక అన్నిటికీ ఆధార్‌మే!
Published Fri, Oct 20 2017 11:27 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment