ఎన్ఎస్ డీఎల్, సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ల ఖాతాలు: 2.5 కోట్లు | Investor accounts in NSDL, CDSL recorded at 2.5 crore | Sakshi
Sakshi News home page

ఎన్ఎస్ డీఎల్, సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ల ఖాతాలు: 2.5 కోట్లు

Published Wed, Mar 9 2016 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Investor accounts in NSDL, CDSL recorded at 2.5 crore

ముంబై: ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ డిపాజిటరీల్లోని మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు ఫిబ్రవరి నెల చివరి నాటికి 2.5 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి చివరికి మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 2.33 కోట్లుగా ఉంది. గతనెల చివరి నాటికి ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద 1.45 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 1.38 కోట్లు), సీడీఎస్‌ఎల్ వద్ద 1.06 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 95.2 లక్షలు) ఉన్నాయి. 2015 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 18.64 లక్షలమేర పెరిగితే.. 2014 మార్చి నెల నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 14.9 లక్షలమేర పెరిగింది. ఇది క్యాపిటల్ మార్కెట్స్‌పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుదలను ప్రతిబింబిస్తోందని నిపణులంటున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) ఖాతాల్లో ఇన్వెస్టర్లు వారి సెక్యూరిటీలను (షేర్లు, డిబెంచర్స్, బాండ్స్) ఎలక్ట్రానిక్ రూపంలో డిపాజిట్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement