Wrong
-
యవ్వనం కోసం మిలియనీర్ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. View this post on Instagram A post shared by Bryan Johnson (@bryanjohnson_) కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర -
పొరబాటు చేసినా రెండ్రోజుల్లో డబ్బు వాపస్!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సింపుల్‌గా యూపీఐ (UPI) దేశంలో ఒక విప్లవంలా వచ్చింది. లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది. నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్‌తో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడీ లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇలా జరిగితే భయపడాల్సిన పనిలేదు.యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పొరపాటున యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేస్తే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదే వేరువేరు బ్యాంకులు అయితే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు.పొరపాటు జరిగితే చేయాల్సినవి..పొరపాటున పంపిన డబ్బు ఎవరికి చేరిందో ఆ వ్యక్తిని సంప్రదించండి. లావాదేవీ వివరాలను తెలిపి డబ్బును తిరిగి పంపమని అభ్యర్థించవచ్చు.తప్పు యూపీఐ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే యూపీఐ యాప్‌లో కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడండి. లావాదేవీ వివరాలను వారికి ఇవ్వండి.యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్‌పీసీఐకి ఫిర్యాదు చేయవచ్చు.మీ డబ్బును తిరిగి పొందడానికి, డబ్బు కట్ అయిన బ్యాంకును సంప్రదించండి. మీ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది.యూపీఐ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
Viveka Case: నా వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి "ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా". విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా? "నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు." నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది? "నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా" నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా? "ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌గారు షాక్‌కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు? తాను CBIకి స్టేట్మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు. CBI దాన్ని తొలగించాల్సిందే "దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. వివక్ష లేకుండా విచారణ జరగాలి సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
Viral Video: సరదాకి గెలికాడు.. దెబ్బకు దూలతీర్చేసిందిగా..
-
మంచి మాట: పాతుకుపోయినా... తప్పు తప్పే!
సంస్కరణలకూ, కచ్చితత్వానికీ మన జీవనవిధానంలోనూ సమాజంలోనూ, కళారంగంలోనూ వ్యతిరేకత ఎదురౌతూనే ఉంటుంది. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాతబృందం సంస్కరణలనూ, నిర్దుష్టతనూ స్వీకరించనూ లేదు, హర్షించనూ లేదు. పాతుకునిపోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. పాతది కాబట్టి అదంతా మంచిది కాదు; కొత్తదైనందువల్ల అది అధమమైనది లేదా పనికిమాలినది కాదు; తెలివైనవాళ్లు పలు పరిశీలనలు చేసి (విషయాన్ని) తీసుకుంటారు; మూఢులు పరులను అనుసరిస్తారు అన్న ఎరుకను కాళిదాసు ఎప్పుడో తెలియజెప్పారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. సంస్కరణలను, నిర్దుష్టత్వాన్ని ఎంత మాత్రమూ స్వీకరించలేని, హర్షించలేని పాత బృందానికి అతీతంగా నేటి తరమైనా సంస్కరణలతో కచ్చితత్వాన్ని సాధించగలగాలి. ‘పాత అడుగుజాడలు తొలగిపోయినప్పుడు అద్భుతాలతో కొత్తదేశం వ్యక్తమౌతుంది‘ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన దాన్ని మనం ఆలోచనల్లోకి తీసుకోవాలి. అలవాటయ్యాయి కదా అని తప్పుల్ని ఆచరించడం, కొనసాగించడం సరికాదు. అలవాట్ల ఏట్లో పడి కొట్టుకుపోతూ ఉండడం మనిషి జీవనానికి పరమార్థం కాదు. ‘మనం చూడం; ఎందుకంటే మనకు చూడడం గురించి అభిప్రాయాలున్నాయి‘ అని జిడ్డు కృష్ణమూర్తి ఉన్న లోపాన్ని చెప్పారు. అందుబాటులో ఉన్నవి సరైనవి అనే అభిప్రాయానికి అతీతంగా మనం కళ్లు తెరుచుకుని చూడాలి. తప్పుల్ని దాటుకుని కచ్చితత్వంలోకి వెళ్లడానికీ ఆపై సరిగ్గా ఉండడానికీ ధైర్యం, సాహసం ఈ రెండూ మనకు నిండుగా ఉండాలి. ఇవి లేకపోవడం వల్లే మనలో చాలమంది పాత తప్పుల్లో బతుకుతూ ఉంటారు. తప్పులకు అలవాటుపడి కొనసాగడం ఒకరకమైన బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి మనం ధైర్యసాహసాలతో విముక్తమవ్వాలి. సరిగ్గా ఉండడం కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనలో చలామణి అవుతున్న తప్పుల్ని మనం తెలుసుకోవాలి. వాటి నుంచి తప్పించుకోవాలి. వాటిని మనం తప్పించెయ్యాలి. తప్పులవల్ల గతంలో జరిగిన కీడును వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ జరగకుండా పరిశ్రమించాలి. నీళ్లవల్ల శరీరం శుభ్రపడుతుంది; సత్యంవల్ల మనస్సు శుభ్రపడుతుంది; జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది; విద్యవల్లా, తపస్సువల్లా స్వభావం శుభ్రపడుతుంది. నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. సత్యంతో మనస్సును శుభ్రంచేసుకోవడం మనం నేర్చుకోవాలి. జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది అన్న దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. విద్యవల్లా, తపస్సు(సాధన)వల్లా స్వభావం శుభ్రపడుతుందనడానికి మనమే ఋజువులుగా నిలవాలి. ముందటితరాల ద్వారా చింతన, చేష్టల పరంగా మనకు తప్పులు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు కొన్ని విషయాల్లో ఆ తప్పులే ఒప్పులుగా రూఢీ అయిపోయాయి. దానివల్ల జీవన, సామాజిక, కళల ప్రమాణాలు, ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ వాస్తవాన్ని ఇకనైనా అవగతం చేసుకోవాలి. ఈ అవాంఛనీయమైన పరిస్థితిని ఎదిరించి పోరాడి విజయం సాధించాలి. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాత వాళ్ల దగ్గర మేలు, మంచి ఈ రెండూ లేవు కాబట్టి వాళ్లు అవి జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జీవనవిధానంలోనూ, సామాజికంగానూ, కళలలోనూ నిర్దుష్టతను వీళ్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు సరైన దాన్ని స్వీకరిస్తే వాళ్లు తప్పుడు వాళ్లు అన్న నిజం స్థిరపడిపోతుంది కాబట్టి. చెడ్డవాళ్లకు సంస్కరణలతో శత్రుత్వం ఉంటుంది, ప్రతి సంస్కర్తా చెడ్డవాళ్లకు విరోధే! కల్మషమైన పాతనీరు బురద అవుతుంది. హానికరమైన పాత బురదను మినహాయించుకోవాలి. కొత్త నదులను ఆహ్వానించాలి. కొత్త సంస్కరణల్ని మిళితం చేసుకుంటూ మునుముందుకు సాగడమే మనిషికి మేలైన జీవితం అవుతుంది. మూర్ఖత్వాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందడానికి ప్రపంచంలోకి ప్రవహించాలి మనం. సంస్కరణలు మనతో మొదలవ్వాలి. ‘తమతో మొదలుపెట్టేవాళ్లే ఈ ప్రపంచం చూసిన ఉత్తమ సంస్కర్తలు‘ అని జార్జ్ బెర్నాడ్ షా అన్నారు. మనల్ని మనం సంస్కరించుకుంటూ కచ్చితత్వాన్ని సాధించుకుంటూ సరైన, ఉన్నతమైన మనుషులమౌదాం. పాతుకుని పోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. – రోచిష్మాన్ -
'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన
ప్రభుత్వాధికారులతో పనిపడినా లేక ఏదైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఒక పట్టాన పని అవ్వదు. మన పనులన్ని పక్కన పెట్టుకుని వారి చుట్టు కాళ్లు అరిగేలా తిరిగితే గానీ పనవ్వదు అందరికి తెలిసిందే. అందువల్లే ప్రజలు ప్రభుత్వాధికారులంటేనే చాలా భయపడతారు. అచ్చం అలానే ఒక వ్యక్తి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోయేసరికీ విచిత్రమైన రీతిలో నిరసనలో అధికారుల వెంట తిరిగి అనుకున్నది సాధించాడు. వివరాల్లోకెళ్తే....బెంగాల్‌లోని శ్రీకాంత్ కుమార్ దత్తా అనే వ్యక్తికి తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులు శ్రీకాంత్ మెండల్ అనే పడింది. దీంతో సదరు వ్యక్తి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంతో దత్తా అని మార్చారు. దీంతో అతను మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఈసారి ఏకంగా శ్రీకాంతి కుమార్ కుత్తాగా మార్చారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో సదరు వ్యక్తి వినూత్నంగా కుక్కలా మొరుగుతూ...దురే సర్కార్ ప్రభుత్వా కార్యాలయంలోని అధికారుల చుట్టు ఆ రేషన్ కాగితాలతో తిరుగుతూ వివరిస్తాడు. అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధికారుని చూసి అతన్ని వెంబడించి....తన కాగితాలను కారు విండోలోంచి ఇచ్చి తన సమస్యను కుక్కలా అరుస్తూ వివరించాడు. సదరు అధికారి రెండు రోజుల్లో పేరు సరిచేస్తామని తనకు హామి ఇచ్చారని తెలిపాడు శ్రీకాంత్. తన పేరు రేషన్ కార్డులో పదేపదే తప్పుగా ప్రింట్ అవుతుండటంతో తో విసిగిపోయి ఇలా విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తన సమస్యను వివరించినట్లు చెప్పాడు. అంతకుముందు ఒక అధికారికి తన మొర వినిపించానని, అతను భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్ సంగతేంటి?) -
ఫెయిలైనట్టు యువతికి తప్పుడు మెసేజ్.. అంతా అయిపోయిందంటూ..
సాధారణంగా పొరపాట్లు జరుగుతుండడం సహజం. అయితే ఆ పొరపాట్లు చిన్నవైనా, లేదా సరిదిద్దుకునేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వాటి వల్ల ఓ నిండు ప్రాణం బలైన విషాద ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ యువతికి పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు పొరపాటున మెసేజ్ వచ్చింది. దీంతో ఆ బాధను భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక మీడియా తెలపిన వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్‌లో నార్త్ వేల్స్‌లోని ఏంగ్లెసేకు చెందిన మేరెడ్ ఫౌల్కీ అనే 21 ఏళ్ల అమ్మాయి కార్డిఫ్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం ఫార్మాసూటికల్స్ చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసిన ఫౌల్కీకి కొన్ని రోజుల తరువాత యూనివర్సిటీ నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. అందులో.. తను సెకండ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని, ఈ కారణంగా మూడో సంవత్సరానికి వెళ్లేందుకు వీలు లేదని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఎంతో ఇష్టంగా ఆ కోర్సు చదువుతున్న ఫౌల్కీ ఆ బాధను తట్టుకోలేక బతకడం వ్యర్థంగా భావించింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలోని బ్రిటానియా బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫౌల్కీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అందులో ఆమె 62 శాతం మార్కులతో పాసైనట్లు తేలింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు తప్పుడు మెసేజ్ ఇచ్చిన యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది. చదవండి: Afghanistan: దేశంలో పరిస్థితి బాలేదు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్
-
అవన్నీ తప్పుడు కథనాలు : అదానీ
సాక్షి,ముంబై: ఎన్ఎస్డీఎల్ అదానీ గ్రూపునకు చెందిన మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలపై అదానీ గ్రూపుస్పందించింది. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని వివరించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు పెట్టుబడులకు , సంస్థలకు ఆర్థికపరంగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదని వెల్లడించింది. మైనారిటీ పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడేందుకే ఈ ప్రకటనను జారీ చేస్తున్నామని తెలిపింది. మైనారిటీ పెట్టుబడిదారులపై ఈ వార్తలు ప్రతికూల ప్రభావాన్ని చూస్తే, ఆయా డిమాట్ ఖాతాల స్టేటస్ కో పద్ధతిని పాటించాలని రిజిస్ట్రార్ , ట్రాన్స్ఫర్ ఏజెంట్లను ఇ-మెయిల్ ద్వారా కోరింది. కాగా ఖాతాల లావాదేవీల నిలిపివేత వార్తలతో సోమవారం నాటి మార్కెట్లో అదానీ గ్రూపు మొత్తం ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇంట్రా-డే ట్రేడ్‌లో 5నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. నాలుగు గ్రూప్ కంపెనీల్లో సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లను మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపజేసిందని మీడియాలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
వైద్యుడి నిర్లక్ష్యం: బిహార్‌లో మరో షాకింగ్ ఘటన
దర్బంగా : బిహార్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకవైపు మెదడువాపు వ్యాధితో వందల మంది పసిపిల్లలు చనిపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు అదే ఆసుపత్రిలో వందలాది పుర్రెలు, అస్తిపంజరాలు బహిరంగంగా దర్శనమివ్వడం సంచలనం రేపింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి, అపరిశుభ్రత తాండవిస్తుండటంపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది ఇలా కొనసాగుతుండగానే మరో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఒక బాలుడికి ఒక చేయి విరిగితే మరో చేతికి కట్టువేసి పంపించాడో డాక్టరు. బాలుడు, తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినకుండా..అతి నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం రేపింది. దర్భంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ వైనం చోటు చేసుకుంది. హనుమాన్ నగర్‌కు చెందిన ఫైజన్ మామిడి చెట్టు ఎక్కి అక్కడినుంచి కింద పడిపోయాడు. దీంతో అతని ఎడమ చేయి విరిగిపోయింది. ఆసుపత్రిలో ప్రాథకంగా పరీక్షలతోపాటు, ఎక్స్‌రేలో కూడా ఎడమ చేయి విరిగినట్టు స్పష్టంగా వుంది. అయితే ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యుడు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఎడమ చేతికి బదులు కుడిచేతికి సిమెంట్ కట్టు కట్టి పంపించాడు. దీంతో లబోదిబో మంటూ బాధితుడి తల్లిదండ్రులు ఆసుపత్రి సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను ఎంత చెబుతున్న వినకున్నా.. డాక్టరు హడావిడిగా కుడిచేతికి కట్టు కట్టారని బాధిత బాలుడు ఫైజన్ వాపోయాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైజన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మరోవైపు బాధితుల ఫిర్యాదును పరిశీలించిన పిదప తప్పు తమ సిబ్బందిదే అని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్ రంజన్ ప్రసాద్ అంగీకరించారు. తక్షణమే తదుపరి చికిత్సను అందిస్తామనీ, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం రాష్ట్ర వైద్య విభాగానికి చేరింది. అటు రాష్ట్ర మంత్రి మంగళ్ పాండే ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. దీనిపై నివేదిక అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. -
పథకం పక్కదారి
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకం కొందరికి కాసులపంట పండిస్తుంది. దళారులు లబ్ధిదారుల నుంచి యూనిట్‌కు రూ. 2వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు నాణ్యమైనవి పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నా అడ్డుకట్ట వేసే వారు కరువవుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొదటి దశలో 1105 మంది లబ్ధిదారులు, 2వ విడతలో 1104 మంది లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను అందించేందుకు అధికారులు ముందుకొచ్చారు. మొదటి విడతగా 13 గ్రామాలను ఎంపిక చేసి 395 మంది లబ్ధిదారులకు లా టరీ పద్ధతిలో ఎంపిక చేసి 8,295 గొర్రెలను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించాల్సి ఉంది. అధికారులు మాత్రం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి 15 గొర్రెలు, 5 పాలు తాగే వయసున్న గొర్రెలను అంటగట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గొర్రెలను ఇంటికి తెచ్చిన తర్వాత వయసు మీరిన చిన్న గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నాయి. ఇప్పటికే 900 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు సమాచారం. 200 యూనిట్లు మాయం.. మండలంలో మొదటి విడతలో 395 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పటికే 200 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పశువైద్య అధికారులు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేస్తే జీవాలు కనిపించకపోవడంతో కంగుతింటున్నారు. బయటి మార్కెట్లో గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. లబ్ధిదారులు రూ.31,250 చెల్లిస్తే 21 గొర్రెలను అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ. 80వేలకుపైగా వస్తుండడంతో మండలంలో అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇదే అదునుగా చేసుకుని దళారులకు ఒత్తాసు పలుకుతూ గొర్రెల విక్రయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రైతు వద్ద రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నెల రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అధికారులకు ఖంగుతినే పరిస్థితి కనిపించింది. విక్రయదారులు అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన సంఘటనలతో పాటు రెండు, మూడు గొర్రెల గుంపును అధికారులు వచ్చే ముందు వారి ఇంటి ముందు ఉంచుకుంటుండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. -
ఘోర తప్పిదం.. ఛానెల్ పరువును తీస్తున్నారు
ఇస్లామాబాద్ : ఘోర తప్పిందంతో ఓ ఉర్దూ న్యూస్ ఛానెల్ పరువు పొగొట్టుకుంది. పాప్ సింగర్ ఎడ్ షీరన్‌ను మహిళగా అభివర్ణిస్తూ ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో సదరు ఛానెల్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిమేల్ రీడర్‌తో గొడవ.. వైరల్ షేప్ ఆఫ్ యూ, కాసెల్ రాక్ ఆల్బమ్‌లతో ప్రపంచవ్యాప్తంగా యూత్‌ను ఉర్రూతలూగించాడు షీర్. నాలుగు సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న అతగాడి గురించి కనీస అవగాహన లేనట్లుగా ఇస్లామాబాద్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. అయితే ఈ క్రమంలో అతను ఫోటోలు, విజువల్స్‌ను ప్రదర్శిస్తూ మరీ పాప్ క్వీన్‌గా కింద స్క్రోలింగ్ వేయటం, బులిటెన్‌లో యాంకర్ న్యూస్ చదివి వినిపించారు. ఈ వార్తను ఓ వ్యక్తి వీడియోతోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘బ్రిటిష్ పాప్ క్వీన్ ఎడ్ షీరన్ 2017 బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఎంపికయ్యారు’... మొత్తానికి పాక్ న్యూస్ చానళ్లు లింగ సమానత్వం (జెండర్ ఈక్వాలిటీ) పాటిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ న్యూస్ వాళ్లకు ఆడా-మగా తేడా లేకుండా పోయింది. దయ చేసి ఈ విషయాన్ని షీరన్‌కు ఎవరూ చెప్పకండి, కనీస అవగాహన లేనివాళ్లు న్యూస్ ఛానెళ్లు ఎందుకు నడుపుతున్నారో అర్థం కావట్లేదు... ఇలాంటి రీ ట్వీట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. Ed Sheeran pop queen aur gulukara?😂 Express news thinks that Ed Sheeran is a female😂😂 pic.twitter.com/EloM0uHoXN — Imad Kazmi (@imadtweetss) 27 February 2018 -
ఎస్బీఐ ఘోర తప్పిదం
రాంచీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తప్పుడు, అనధికారిక లావేదేవీలు, వేల రూపాయల గల్లంతుతో ఖాతాదారులు లబోదిబోమంటుండగా స్వయంగా బ్యాంకే డిపాజిట్ విషయంలో తప్పులో కాలేసింది. సంక్షేమ పథకం కోసం కేటాయించిన కోట్ల రూపాయలను ఒక నిర్మాణ కంపెనీ ఖాతాలోకి జమ చేయడం కలకలం రేపింది. తాజా నివేదికల ప్రకారం.. ఈ నిధులను జమ చేయాల్సిందిగా విద్యాశాఖను ఎస్బీఐ కోరినపుడు ఈ తప్పిదాన్ని బ్యాంకు గుర్తించింది. జార్ఖండ్ రాష్రం మధ్యాహ్న భోజన పథకం కోసం కేటాయించిన రూ.100కోట్ల నిధులను పొరపాటున ఓ నిర్మాణ కంపెనీ ఖాతాలోకి డిపాజిట్ చేసింది. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రాంచీ జోన్) డీకే పాండా ప్రకారం, ఈ ఘటపై బ్యాంకు అంతర్గత విచారణ చేపట్టింది. అలాగే దీనికి బాధ్యతగా ఓ అధికారిని సస్పెండ్ చేసింది. కంపెని చెందిన సుమారు ఏడు ఎనిమిది ఖాతాల్లో ఈ మొత్తం జమ అయినట్టు తెలిపారు. దీంతోపాటు సీబీఐలోకూడా అధికారిక ఫిర్యాదును సమర్పించామని పాండా చెప్పారు. అయితే ఈ మొత్తం సొమ్ములో 70శాతం రికవరీ చేయగా, ఇంకా రూ.30కోట్లను స్వాధీనం చేసుకునేందుకు ఎస్బీఐ ప్రయత్నిస్తోంది. -
ఫూటుగా తాగి రైల్వే టీసీ వీరంగం
ప్రయాణికులను దుర్బాషలాడి, భయపెట్టిన వైనం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన రాజమహేంద్రవరం సిటీ : విధి నిర్వహణలోనే మద్యంమత్తులో తూగుతూ, రైల్వే ప్రయాణికులను దుర్బాషలాడి, జైలులో పెట్టిస్తానంటూ భయంకంపితులను చేసిన రైల్వే టీసీ ఉదంతమిది. ప్రయాణికులు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఆ టీసీ గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టీసీ గంగాప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. మద్యం తాగి, విధులు నిర్వహిస్తున్న అతడు రైలు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికులను దుర్బాషలాడాడు. జైల్లో పెట్టిస్తానంటూ భయకంపితులను చేశాడు. ఈ మేరకు ప్రయాణికులు 182 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. వికలాంగులు, మహిళలతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ ప్రయాణికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు రాజమహేంద్రవరం స్టేషన్‌కు చేరుకోగానే, గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తాను తప్పు చేశానంటూ ప్రయాణికుల కాళ్లపైపడి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయాణికులు అతడిని కనికరించలేదు. రాజమహేంద్రవరం స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అతడి వద్దనుంచి రిజర్వేషన్ చార్ట్‌ను స్వాధీనం చేసుకుని, రైలులో ఉన్న మరో టీసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. రైల్వే హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీఎస్ కుమారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా గంగాప్రసాద్‌కు పరీక్షలు నిర్వహించి, రక్తనమూనా సేకరించారు. అతడు ఇలా ప్రవర్తించడం రెండోసారి. జూలై నెలలో అతడు మద్యంమత్తులో ప్రయాణికులతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. తొలి తప్పుగా క్షమించాలని కోరడంతో, ప్రయాణికులు తమ ఫిర్యాదును రద్దు చేసుకున్నారు. -
సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే. -
ముస్లిం మహిళలకు కఠిన నిబంధనలు!
ముస్లిం మతాచారాలు కట్టుబాట్లలో ఇప్పటికే మహిళలకు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. బ్రిటన్ లోని ఓ మసీదు తాజాగా మరిన్ని నిబంధనలు విధించింది. భర్త అనుమతి లేకుండా ముస్లిం మహిళలు ప్యాంట్లు వేసుకోకూడదని, సామాజిక మాధ్యమాలు వాడకూడదని, ఒంటరిగా ఇంటినుంచి బయటకు వెళ్ళకూడదంటూ కఠిన నిబంధనలు జారీ చేసింది. టైమ్స్ పరిశోధన నివేదికలో తాజాగా.. విస్మయపరిచే ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్ లోని ముస్లిం సంఘాలు, మసీదులు ప్రచురించిన నిబంధనలను 'ద టైమ్స్' ఓ నివేదికలో ప్రస్తావించింది. లండన్ ఇస్లామిక్ సెంటర్, క్రోయ్ డాన్ మసీదు, సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ దేశంలో భర్త అనుమతి లేకుండా ఇంటినుంచి మహిళలు బయటకు రావడం ఎంతో ప్రమాదకరమని, అలాగే భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయొద్దని సూచించింది. ముఖ్యంగా మహిళలు ప్యాంట్లు ధరించకూడదని, ఫేస్ బుక్ వాడకూడదని, ఒక వేళ ఇప్పటికే అకౌంట్లు ఉన్నవారు వెంటనే డిలీట్ చేసేయాలని తెలిపింది. సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్.. డేంజర్స్ ఆఫ్ ఫేస్ బుక్ తన వెబ్ పోస్టులో మద్యపానం పాపం అనే ఖురాన్ సూక్తిని ప్రస్తావిస్తూ, ఇది మహిళలు సామాజిక మాధ్యమాల వినియోగానికి వర్తింస్తుందని, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని వివరించింది. అంతేకాక ముస్లిం మహిళలు మోడలింగ్, యాక్టింగ్ చేయడంతో పాటు, గర్భస్రావం చేయించుకోవడం కూడ అనైతిక చర్య అని, అది మహాపాపం అంటూ మరో పోస్టులో ప్రస్తావించింది. అయితే మసీదులు, ఇస్లామిక్ సంఘాలు వెబ్ సైట్లో జారీ చేసిన నిబంధనలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అనంతరం ముస్లిం మతపెద్ద, క్రాయ్డాన్ అండ్ ఇస్లామిక్ సెంటర్ ట్రస్టీ షుహైబ్ యూసఫ్ మాత్రం ఈ ఆంక్షలు తప్పని అంగీకరించారు. వెబ్ సైట్ లింక్ ను వెంటనే తొలగించామని, సాహిత్యాత్మక తప్పిదాలు జరిగినట్లు అభిప్రాయపడ్డారు. సైట్ లో రాసిన వివరాలను శుద్ధీకరించి, ప్రభావవంతమైన కథనాలను ప్రచురించాలని సూచించారు. అయితే ముస్లిం సంఘాల నిబంధనలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఆధునిక యుగంలోనూ వ్యక్తుల సంకుచిత ధోరణికి అద్దం పడుతున్నాయంటూ ఆరోపిస్తున్నాయి. -
ఆ మొక్కలు నాటితే నష్టమే..
అడవులు నరికేయడం సులభమే... కానీ పెంచడం అంత తేలిక కాదు అంటున్నారు యూరోపియన్లు. ఎందుకంటే వారు చేపట్టిన అడవుల పెంపకంవల్ల లాభం కన్నా నష్టాలే ఎదురైనట్లు కనుగొన్నారు. ఫ్రాన్స్ అల్సాస్ ప్రాంత అడవుల్లో పాతిన మొక్కలవల్ల తీవ్ర వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. రీ ఫారెస్టేషన్ తో మరింత భూ తాపం పెరిగినట్లు పరిశీలకులు చెప్తున్నారు. పర్యావరణంలో మార్పులు సంభవించడానికి అడవులు నరికేయడమే ప్రధాన కారణం అని ఇప్పటిదాకా మనకు తెలుసు. చెట్లు కార్పన్ ను పీల్చుకొని... ప్రాణవాయువును అందిస్తాయని... వాతావరణాన్ని, భూ తాపాన్ని సమతుల్యంగా ఉంచుతాయని తెలుసు. అందుకే చెట్లు నాటడం మంచిదని చెప్తారు. చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడ చేపడతాయి. అయితే అడవుల నిర్వహణ అంత సులభం కాదని ఇటీవల వెల్లడైన పరిశోధనలు చెప్తున్నాయి. అడవుల పెంపకంతో ఎన్నో తలనొప్పులు కూడ ఎదురౌతున్నట్లు అధ్యయనకారులు అంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే చెట్లు నాటకపోవడం, చెట్ల ఎంపికలో సమస్యల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, భూతాపం మరింత పెరిగిపోయిందని తెలుసుకున్నారు. యూరప్ లో అంతరించి పోతున్న అడవుల స్థానంలో తిరిగి పెంపకాన్ని చేపట్టి...2010 నాటికి 85 శాతం పూర్తి చేశారు. అయితే 250 ఏళ్ళలో ఎక్కువగా వాణిజ్యపరంగా విలువైన, త్వరగా పెరిగే, ప్రాణులకు అనువుగా ఉండే మొక్కలపైనే.. నిర్వహణాధికారులు దృష్టి పెట్టినట్లు చరిత్రను పరిశీలించిన అధ్యయన కారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా అడవుల పెంపకంలో వాడిన మూడు జాతుల్లో ఓ జాతి మొక్కలకు ఎక్కువ స్థానం కల్పించారని, వాటిని సుమారు 4 లక్షల చదరపు మైళ్ళలో నాటారని చెప్తున్నారు. కోనిఫర్ జాతికి చెందిన ఆ చెట్లు... అడవుల్లో లేతరంగు ఆకులున్న చెట్లుకన్నా ఎక్కువగా ఉండటమే కాక, చెట్లకు ఆకులకన్నా సూదుల్లాంటి ముళ్ళు కలిగి ఉన్నాయని....అవి సూర్య కాంతిని ఆకర్షించడంకంటే... వికిరణానికి తోడ్పడుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అడవులున్న ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, భూ తాపాన్ని తగ్గించే బదులు, పెరగడానికి కారణమౌతోందని ఓ సైన్స్ జర్నల్ లో పేర్కొన్నారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని, నాటే మొక్కలు పనికొచ్చేవా... కావా అన్నది తెలుసుకోవడం అవసరమని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. -
అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!
మొబైల్ ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాంగ్ కాల్స్ రావడం మామూలై పోయింది. ఒకరికి చేరాల్సిన కాల్ మరొకరికి చేరడమూ... ఒక కాల్ మాట్లాడుతుండగా మధ్యలో ఇంకొకరి మాటలు వినిపించడమూ సర్వ సాధారణమైపోయింది. అయితే ఇతర నగరాలు, రాష్ట్రాలు, దేశాలే కాదు... ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ అదే అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం... ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు. అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే. ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే... అది... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట. ''ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అని మరోసారి అడిగారట. తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట. పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని, ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్ ట్వీట్ చేశారు. 43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు. -
ప్రాణం పోయినా తప్పు చేయం
జేవీ నరసింగరావు శతజయంతి సభలో సీఎం కేసీఆర్ * నేడు రాజకీయ విలువలు దిగజారిపోయాయి * తంగమంటే జంగమంటున్నారు.. అసహన వైఖరి పెరిగిపోయింది * తెలంగాణ సమాజం తన వాళ్లను గౌరవించుకుంటుంది * ఎందరో ప్రతిభావంతులున్నా తెరమరుగు చేశారు * తెలంగాణ సాధనలో మేం పరోక్షపాత్ర పోషించాం: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభ్యున్నతి విషయంలో ప్రాణం పోయినా తప్పు చేయమని, ఇప్పుడేమైనా తప్పు జరిగితే రెండు తరాల వరకు ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. నేడు రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తంగమంటే జంగమంటున్నారని, అసహన వైఖరి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఇది సమాజానికి మంచిది కాదన్నారు. చర్చలు కూడా ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జేవీ నరసింగరావు శతజయంతి ఉత్సవాల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు టి.ఉడయవర్లు తెలుగులో రాసిన ‘తెలంగాణ ముద్దుబిడ్డ- జేవీ నరసింగరావు’ పుస్తకాన్ని, సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు, డా.సీజీకే మూర్తి ఆంగ్లంలో రాసిన ‘జేవీ నరసింగరావు-ఎ జెంటిల్మెన్ పొలిటిషియన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయితలను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఏదైనా విషయంలో అర్థం కాకపోతే ఆరునెలల ఆలస్యమైనా.. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలు తీసుకుని దీర్ఘకాలిక దృష్టితో సక్రమమైన మార్గంలో తెలంగాణను ముందు కు తీసుకెళ్తాం. సంస్థలు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సాధన కోసం సాగిన 60 ఏళ్ల పోరాటంలో అందరి కృషి ఉంది. ప్రాణం పోయిన తప్పు వైపు ఉండబోం. ఏదో చేయాలన్న ధోరణితో వ్యవహరించం’’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటుపోట్లు, ఇబ్బందులు వందశాతం పరిష్కారం కావాలన్నారు. తెలంగాణ సురక్షితంగా ఉంటుందన్న భావనతోనే ప్రజలు టీఆర్ఎస్ చేతిలో అధికారం పెట్టారని చెప్పారు. జేవీ నరసింగరావు విశిష్టతను ప్రభుత్వ పక్షాన ముందు తరాలకు తెలియజేసేందుకు వారి కుటుంబ సభ్యులు, సీనియర్ రాజకీయవేత్తలను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జేవీ విలక్షణమైన వ్యక్తి అని, ప్రజా సమస్యలపై స్పందించడం ఆయన ఔన్నత్యానికి, వ్యక్తిత్వానికి సూచిక అన్నారు. చరిత్రలోని గొప్ప విషయాలను ముందుతరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పీవీ.. తెలంగాణ ఠీవీ తెలంగాణ సమాజం తన వాళ్లను తాను గౌరవించుకుంటుందని, తెలంగాణలో ప్రతిభావంతులున్నా గతంలో తెర మరుగుచేశారని సీఎం అన్నారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ఠీవీ అని అన్నారు. ఆధునిక భారత్‌లో ఆర్థిక విధానాలు, సంస్కరణల ద్వారా ప్రగతిని తీసుకొచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు తగిన గౌరవం లభించలేదని పేర్కొన్నారు. ఈ గడ్డపై పుట్టినవారెవరైనా తెలంగాణ కోసం పరితపించారని, తెలంగాణ సమాజం రావాలని కోరుకున్నారన్నారు. అయితే కొన్ని శక్తులు తెలంగాణను, నాయకులను విభజించు పాలించు అన్న చందంగా నడిపించాయని విమర్శించారు. ప్రత్యక్ష, పరోక్ష పోరాటాల వల్ల తెలంగాణ: జానారెడ్డి ప్రత్యక్ష, పరోక్ష పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి చెప్పారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుందని, రాష్ట్ర సాధన కోసం పరోక్ష పోరాటం చేసి విజయవంతమైందని చెప్పారు. ‘‘అర్జునుడు రథాన్ని నడిపించినా, దాని వెనక ఉండి నడిపించిన వారు ఎందరో ఉన్నారు. దీన్ని సీఎం కాదు.. సభికులు గమనించాలి’’ అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ‘‘గతంలో జేవీ నరసింగరావు తెలంగాణ ఏర్పాటు కోసం పరోక్షంగా ఎంతో కృషి చేసినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా ఛీత్కారాలు, అవమానాలు ఎదురైనా మేం గతంలో జేవీ నిర్వహించిన పాత్రను నిర్వహించాం’’ అని అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా జేవీ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, అవసరాన్ని గుర్తించి ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక పంపించడంతోపాటు పార్టీ పరంగా తీర్మానించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేవీ నరసింగరావు కుమారుడు జేవీ నృపేందర్‌రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నరసారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్‌రావు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, జలగం వెంకటరావు, మాజీ ఎంపీ జి.వివేక్‌లు పాల్గొన్నారు. గాంధీ భవన్లో వేడుకలు జె.వి.నరసింగరావు శతజయంతి వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నర్సారెడ్డి తదితరులు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, ఒప్పందాల్లోనూ నరసింగరావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
అద్భుతం అంటే ఇదే....