సత్యం కాదు... పాణి
వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు
‘‘నేను రజనీగారి గురించి వ్రాసిన వ్యాసంలో ఒక తప్పు దొర్లింది. నేను రజనీగారి సంగీతంలో అరేబియా పోకడల గురించి వ్రాస్తూ జానకి ‘భూలోకంలో యమలోకం’ లో పాడిన ‘ఏదో వింత పులకింత’కు అలా వరస కట్టింది సంగీత దర్శకుడు సత్యం అన్నాను. పొరపాటు. అది - ఎస్‌పి కోదండపాణి. ఈ విషయం తెలిపిన పాఠకులు చిరంజీవి దేశిరాజు భాస్కరరావు, చైతన్యపురి, హైదరాబాద్. ‘సత్యం మొదటి చిత్రం ఆ తరువాత వచ్చిన ‘పాలమనసులు’ అని’ ఆయన విశదపరిచారు. వారికి కృతజ్ఞతలు. తలంబ్రాలు వేసిన చేతితోనే అక్షింతలు వేయాలి బాధ్యతలు ఎరిగిన పాఠకులు. ఆ వ్యాసం నేను హైదరాబాదులో ఉండగా వ్రాసినది. పూర్తిగా జ్ఞాపకాల మీదనే ఆధారపడితే నాలాంటి ధీమంతులూ యిలా ముక్కుపగిలేలా నేల కరవగలరు.
మరొక విషయం, యిది రంగనాయకమ్మగారు ఉదాహరించిన పాట గురించి శ్రీమతి వెలుగోటి లీలా రంగమన్నారు గారు తెలిపింది. ‘‘ ‘గాలి వాన వెలిసే’ అన్న ముక్క ‘గృహమేకదా స్వర్గసీమ’న్న పాటలోనిది కాదు. ‘చలో చలో సైకిల్’ అన్న మంగళాంతాని సన్నివేశ గీతంలోనిది’’. అయితే యిది స్వరపప్పులో రచయిత్రి వేసిన రెండవకాలన్న మాట!