సాక్షి, సంగారెడ్డి: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏడాది కాలానికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ ఒక్కసారీ ట్రెజరీ కార్యాలయాకు వెళ్లాయి. ఎప్పటిలాగే చివర్లో బిల్లుల చెల్లింపు నిలపివేత(ఫ్రీజింగ్) అమలు చేస్తారేమోనని 15 రోజులుగా కుప్పలు తెప్పలుగా బిల్లుల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, హాస్టళ్ల వార్డెన్లు, చోటాబడా కాంట్రాక్టర్లు అందరూ ట్రెజరీ కార్యాలయాల ముందూ క్యూకట్టారు. ఎప్పటిలాగే అక్కడి అధికారులు, సిబ్బందికి పర్సెంటేజీలు చెల్లిస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు. లేకుంటే కొర్రీలు వేసి బిల్లులను వెనక్కి పంపిస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..
కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో ఉద్యోగ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ట్రెజరీలో వసూళ్లు బాగోతంపై ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. కలెక్టర్ హెచ్చరించినా ట్రె జరీల అధికారులు, ఉద్యోగుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. సాక్షాత్తు కలెక్టర్, డీఆర్వో, ఏఓలు మంజూరు చేసిన బిల్లులకు సైతం పర్సెంటేజీలు అడుగుతుండడం గమనార్హం.
టోకెన్లకు టోకరా
నిబంధనల మేరకు ట్రెజరీలకు వెళ్లే ప్రతి బి ల్లును మూడు రోజుల్లో మంజూరు చేయా లి. ఒక వేళ తిరస్కరించాల్సి వస్తే ఆ మేరకు కారణాలు చూపుతూ మూడు రోజుల్లోపే తిరస్కరించాలి. ఈ మేరకు బిల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఓ టోకెన్‌ను అందజేయా లి. కానీ, ఈ నిబంధనలు ప్రస్తుతం ఎక్కడా అమలు కావడం లేదు. బిల్లు ఫైలు అకౌంటెంట్, ఆడిటర్, ఎస్టీఓ.. ఇలా ఒకరి నుంచి ఇంకొకరి వద్దకు చేరాలంటే చేతులు తడపాల్సిన వస్తోంది. లేకుంటే వారాల తరబడి మోక్షం లభించడం లేదు. కోరిన పర్సెం టేజీ ఇవ్వలేని వ్యక్తులు బేరసారాలకు దిగి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది.
అందరూ బాధితులే..
{పభుత్వ అధికారులు, ఉద్యోగులు టీఏ, డీఏ, జీపీఎఫ్ అడ్వాన్స్, రిటైర్మెంట్ బెనిఫి ట్స్, జీఐఎస్ సేవింగ్స్, మెడికల్ రీయింబ ర్స్‌మెంట్, కాంటిజెన్సీ నిధులు, ఇంక్రిమెంట్ అరియర్స్, పే ఫికేజషన్, సరేండర్ లీవ్, వాహనం అద్దె, బిల్డింగ్ గ్రాంట్ బిల్లు లకు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే 5 నుంచి 10 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తోంది.
{పభుత్వ వసతి గృహాల సంక్షేమ అధికారుల బాధలైతే వర్ణణాతీతం. విద్యార్థుల మెస్ చార్జీలు, మెయింటనెన్స్ బిల్లుల్లో 5 శాతం వరకు వదులుకోవాల్సి వస్తోంది.
మునిసిపాలిటీలు, పంచాయతీలతో పాటు ఆయా ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంలో 3 నుంచి 5 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నారు.
ట్రెజరీలో వసూళ్ల దందా
Published Sat, Mar 1 2014 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement