panchayats
-
పంచాయతీల బలోపేతంలో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలకు స్వయంపాలన కల్పించి, సామర్థ్యం పెంచటంలో (కెపాసిటీ ఎన్హాన్స్మెంట్) తెలంగాణ రాష్ట్రం అత్యధిక పాయింట్లు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్ (పీడీ ఐ)పై విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు ప్రకటించింది. పంచాయతీలకు అధికారాలు, బాధ్యతల బదలాయింపుతోపాటు జవాబుదారీతనం పెంచటంలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది.ఇందులో వివిధ విభాగాలుంటాయి. సామర్థ్యం పెంపు విభాగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తం 100 పాయింట్లకుగాను 86.19 పాయింట్లతో ప్రథమ స్థానం దక్కించుకుంది. తమిళనాడు 84.29 పాయింట్లతో రెండో ర్యాంక్, గుజరాత్ 83.96 పాయింట్లతో మూడో ర్యాంక్ సాధించాయి. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఈ నివేదికను రూపొందించింది. 2013–14 నుంచి 2021–22 వరకు దేశవ్యాప్తంగా పంచాయతీలకు అధికారాలు, బాధ్యతల బదలాయింపు 39.9 శాతం నుంచి 43.9 శాతానికి పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. -
ఇక పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకమండళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం పూర్తయి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, సోమవారం నుంచి పట్టణాలు, నగరాల్లోనూ అధికారుల పాలనే సాగనుంది. రెండు రోజులు ఆలస్యంగా ఎన్నిక జరిగిన కరీంనగర్ నగరపాలక సంస్థ పాలక మండలి పదవీ కాలం మాత్రం ఈనెల 28తో ముగియనుంది. కాగా, పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో శనివారమే పాలకమండళ్ల సభ్యులు సంబరాలు జరుపుకొన్నారు. కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు, మునిసిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. అవినీతి ఆరోపణలు 2020 జనవరి 22న రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 24న కరీంనగర్ ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంది. ఏకంగా 77 మునిసిపాలిటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటింది. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో చాలా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ‘అవిశ్వాస’తీర్మానాల ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ పరమయ్యాయి. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సహా పలువురు మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.మరో నాలుగురోజుల్లో పదవీ కాలం ముగుస్తుండగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు శనివారం బీజేపీలో చేరారు. కాగా, చాలాచోట్ల పాలక మండళ్లు డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఐదేళ్ల పాలన సాగిందన్న ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఇంకా ఏడాదిన్నర.. రాష్ట్రంలోని హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) కార్పొరేషన్ పదవీ కాలం మరో ఏడాది మిగిలి ఉండగా, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏర్పాటైన మరో ఐదు మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 డిసెంబర్ 1న జరగగా, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మునిసిపాలిటీల ఎన్నికలు 2021 ఏప్రిల్ 30న జరిగాయి. ఈ 8 పురపాలికల పాలక మండళ్ల పదవీ కాలం ఇంకా ఏడాదిన్నర వరకు మిగిలి ఉంది.ఎన్నికల నాటికి ఇంకా మార్పులు కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే, పదవీ కాలం మిగిలి ఉన్న పాలక మండళ్లను కూడా రద్దు చేసి ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా మహబూబ్‌నగర్, మంచిర్యాల మునిసిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు కొత్తగా 12 మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం చట్టం చేసింది.ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు ఉన్న 50కి పైగా గ్రామాలను పక్కనున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపింది. కాగా మునిసిపల్ ఎన్నికల నాటికి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసి, మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మార్చే యోచనతో ఉంది. -
పంచాయతీలకు ప్రభుత్వం ట్విస్ట్
-
నారీ అదాలత్ ఏం చెబుతోంది?
భారతీయ న్యాయ సంహిత తాజాగా అమలులోకి వచ్చింది. అలాగే స్త్రీలకు సత్వర న్యాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నారీ అదాలత్’ పేరుతో ప్రత్యేక పంచాయతీ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. పైలట్‌ప్రాజెక్ట్‌గా అసోం, జమ్ము–కశ్మీర్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఇది కోర్టులా న్యాయం చేస్తుందా? లేదా ‘ఖాప్ పంచాయతీ’లా పంచాయతీ పెడుతుందా? అసలు ‘నారీ అదాలత్’ ఏంటి?నళిని ప్రైవేట్ టీచర్. తమ ఊళ్లోనే ఉన్న కాన్వెంట్లో పని చేస్తోంది. వృత్తి అంటేప్రాణం. వాళ్లది గ్రామ పంచాయతీ. వ్యవసాయ కుటుంబం. ఇంట్లోనే పాడి. భార్యగా, ఇంటి కోడలిగా ఆ బాధ్యతలన్నీ నళినే చూసుకోవాలని ఆమె మీద ఒత్తిడి.. భర్త, అత్తగారి నుంచి! ఆఖరికి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసే పనినీ నౌకరుతో చేయిస్తోందని భర్త కంప్లయింట్. ఆ ఒత్తిడి హింసగా మారి నళిని మానసిక ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుడంటంతో ఆమె గృహ హింస చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో భర్త మీద ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలిద్దరికీ రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా నళిని భర్తది ఒకటే మాట.. ఆమె ఉద్యోగం మానేయాలని! దానికి నళిని ససేమిరా అన్నది. దాంతో ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్’(తాము కౌన్సెలింగ్ చేసిన విధానం, అయినా ఫలితం రాని వైనాన్ని రాసిన నివేదిక) ను కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా గృహ హింస చట్టం కింద కోర్ట్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. గృహ హింస చట్టంలో ఆరోపణ రుజువైతే బాధితులకు ఆర్థిక భద్రత కల్పించాలి. వాళ్లకున్నప్రాథమిక హక్కుని గౌరవించాలి. ఇది మహిళలకు ఆ యాక్ట్ ద్వారా కోర్టులు అందించే న్యాయం. నళిని ఉండే ఊర్లో ‘నారీ అదాలత్’ అమలయితే ఆ పంచాయతీ ఎలా ఉండొచ్చు?‘నారీ అదాలత్’లోని సభ్యుల్లో సగం మంది గ్రామ పంచాయత్ నుంచి ఉంటారు. మిగిలిన సగంలో టీచర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారుంటారు. వీళ్లను గ్రామస్థులే నామినేట్ చేస్తారు. ఈ కమిటీ అంతా మహిళలతోనే ఉంటుందా? లేక స్త్రీ, పురుషులతో కలసి ఉంటుందా అనేదాని మీద ఎక్కడా పూర్తి వివరం లేదు. సరే.. నళినీ కేసు నారీ అదాలత్ స్వీకరించినప్పుడు అదాలత్ సభ్యులపై నళిని అత్తగారి కుటుంబం పలుకుబడి ప్రభావం చూపదా? అలాగే పురుషస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల అదాలత్‌లోని సభ్యులకు కుటుంబం, స్త్రీ, ఆమె విధుల పట్ల సంప్రదాయ ఆలోచనలు, కచ్చితమైన అభి్రపాయాలు ఉండొచ్చు.ఈ నేపథ్యంలో నళిని విషయంలో ఎలాంటి తీర్పు వెలువడవచ్చు? ఆమె హక్కులు, వ్యక్తిత్వాన్ని గుర్తించే, గౌరవం లభించే అవకాశం ఎంత వరకు ఉంటుంది? దీనివల్ల దళిత, గిరిజన మహిళల మీద వేధింపులు పెరగవచ్చు, రాజకీయ ప్రయోజనాలూ మిళితమవచ్చు. కరప్షన్‌కి చాన్స్ ఉండొచ్చు. అసలు ఇది ఊళ్లల్లో పెద్ద మనుషుల పంచాయతీకి ఏ రకంగా భిన్నమైనది? దాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.. ఈ అదాలత్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది అనే భేదం తప్ప! దీన్ని ఆసరాగా చేసుకుని నారీ అదాలత్ సభ్యులు నిందితుల లేదా వాళ్ల తరఫు పెద్ద మనుషుల ప్రలోభాలకు లొంగి బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రమాదం మెండు.స్థానిక పోలీసులూ రెచ్చిపోయే అవకాశమూ అంతే అధికం. రే΄÷్పద్దున లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ లాంటి సమస్యలను తీసుకుని మహిళలు పోలీస్ స్టేషన్‌కి వెళితే నిందితుల ప్రలోభాలకు తలొగ్గి స్టేషన్‌కి ఎందుకు వచ్చారు? నారీ అదాలత్లున్నాయి కదా అక్కడే తేల్చుకు΄పొండి అనే చాన్సూ ఉంటుంది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఈ క్రమంలో మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాల ఉనికే దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఏదేమైనా ఇలాంటి ప్రయోగాలు లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలతో, ఒక నిర్దిష్ట రూపం దాల్చాకే అమల్లోకి వస్తే మంచిది అని అభి్రపాయపడుతున్నారు పలువురు న్యాయప్రముఖులు, సామాజిక కార్యకర్తలు! – సరస్వతి రమట్రయల్ అండ్ ఎర్రర్గానే... కోర్టులకు పనిభారం తగ్గించేందుకే కేంద్రం ఖాప్ పంచాయత్‌లను పోలిన నారీ అదాలత్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఏ రకంగానూ విమెన్ ఫ్రెండ్లీ కాదు. ఇప్పటివరకు విన్న, చదివిన దాన్ని బట్టి ఇదో ట్రయల్ అండ్ ఎర్రర్‌గా మిగిలిపోనున్నది. ఎందుకంటే గ్రామస్థాయిలో న్యాయవాదులచే శిక్షణ ΄పొందిన లీగల్ వలంటీర్ వ్యవస్థ ఉంది.మండల, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్రాలు, సఖీ సెంటర్లున్నాయి. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న కౌన్సెలింగ్ సెంటర్స్ వల్ల పోలీసులు ఫిర్యాదులే తీసుకోవట్లేదు. ఎంత తీవ్రమైన సమస్యలనైనా కౌన్సెలింగ్ సెంటర్స్‌కే రిఫర్ చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిష్కారం అయ్యి కొన్ని కాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రచ్చబండను పోలిన ఈ నారీ అదాలత్‌లు ఏం న్యాయం చేయగలవు! – ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్అసంబద్ధమైన ఆలోచన‘నారీ అదాలత్’ లాంటి అఫీషియల్ ఖాప్ పంచాయత్‌లు మహిళల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి. వీటివల్ల మహిళల ప్రైవసీ, డిగ్నిటీ, మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. అంతేకాదు పరువు పేరుతో వాళ్లప్రాణాలకూ ముప్పు ఉండొచ్చు. ఇదొక అసంబద్ధమైన ఆలోచన. జూన్ 30 వరకు అమలులో ఉన్న క్రిమినల్ చట్టాల ప్రకారం.. కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులు ఇంకా చె΄్పాలంటే ఏడేళ్లలోపు శిక్షలు పడ్డ అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అంటే బాధితులకు న్యాయాన్ని అందించడంతో పాటు నిందితుల హక్కులనూ గుర్తిస్తుందన్నమాట. కుటుంబ కలహాలు, గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ ఫెయిలైతే సదరు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిపోర్ట్ పంపిస్తారు. దాని ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో కొత్త శిక్షాస్మృతీ దాన్నే ఫాలో కావాలి. కానీ కొత్త క్రిమినల్ చట్టాలు, ముఖ్యంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్నెస్సెస్) లోని కొన్ని రూల్స్ వల్ల అలా జరగకపోవచ్చు. సాధారణంగా ఏ ఫిర్యాదు అందినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే కుటుంబ కలహాల కేసులు, ఆర్థిక నేరాలు వంటి కొన్ని ఆరోపణలలో ఏడు రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చు. కానీ అది నిజనిర్ధారణకు కాదు. కాగ్నిజబుల్ కేసు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి. కానీ బీఎన్నెస్సెస్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ పవర్ పోలీసులకు వచ్చింది. కాబట్టే వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆస్కారం తక్కువుంటుంది. ఇదివరకైతే పోలీసులు సహకరించకపోతే ఎఫ్ఐఆర్ వేయమని జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బీఎన్నెఎస్సెస్లోని సెక్షన్ 223 (1) ప్రకారం నిందితుడి పక్షం వినకుండా మెజిస్ట్రేట్.. ఎఫ్ఐఆర్ కోసం పోలీసులకు ఆదేశాలిచ్చే అవకాశం లేదు. దాంతో బలవంతులైన పురుషులకు బయటపడే మార్గాలను వెదుక్కునే చాన్స్ దొరుకుతోంది. వీటివల్ల 498 వంటి కేసుల్లోనూ ఎఫ్ఐఆర్ ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలా కోర్టు పరిధిని తగ్గించే ఇలాంటి ప్రయత్నాలేవీ సమాజానికి మంచివి కావు. – శ్రీకాంత్ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
పంచాయతీల్లో..ఆన్ లైన్ పేమెంట్
-
27 ఉత్తమ పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 27 గ్రామ పంచాయతీలను రాష్ట్రస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే వేడుకల్లో ఆయా పంచాయతీలకు పురస్కారాలను అందజేస్తారు. పరిపాలనలో కొన్ని అంశాల్లో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యంగ సవరణ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున ప్రతి పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చిస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 26 జిల్లాల్లోను ఆ జిల్లా పరిధిలో కూడా తొమ్మిది ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడేసి పంచాయతీల చొప్పున 27 పంచాయతీలకు జిల్లాస్థాయి పురస్కారాలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు సూచించింది. 30 ఏళ్లు పూర్తి.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని కార్యక్రమం 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించనుంది. మధ్యప్రదేశ్‌లోని రేవ గ్రామ పంచాయతీలో జరిగే జాతీయ పంచాయతీరాజ్ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర బాధ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ప్రధాని కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఎకనమిక్ అడ్వయిజర్ బిజయకుమార్ బెహరా లేఖ రాశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికైన గ్రామాలు.. విభాగాల వారీగా (బ్రాకెట్లో ఆ పంచాయతీ ఉన్న మండలం, జిల్లా పేరు) పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాలు కల్పన 1. గంగిరెడ్డిపల్లి (వీఎన్‌పల్లి, వైఎస్సార్), 2. రాచర్ల (రాచర్ల, ప్రకాశం), 3. మల్లూరు (ముత్తుకూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) హెల్దీ పంచాయతీ 1. తరువ (దేవరపల్లి, అనకాపల్లి) 2. భీమవరం (హుకుంపేట, అల్లూరి సీతారామరాజు), 3. నడింపాలెం (పత్తిపాడు, గుంటూరు) చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. కసిపాడు (పెదకూరపాడు, పల్నాడు), 2. నేలమూరు (పెనుమట్ర, పశ్చిమగోదావరి), 3. కుంతముక్కల (జి.కొండూరు, ఎన్టీఆర్) వాటర్ సఫిషియెంట్ పంచాయతీ 1. ఇల్లూరు కొత్తపేట (బనగానపల్లి, నంద్యాల), 2. వి.వి.కండ్రిక (కోడూరు, అన్నమయ్య), 3. ధూపాడు (త్రిపురాంతకం, ప్రకాశం) క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ 1. కడలూరు (తడ, తిరుపతి), 2. బిల్లనందూరు (కోటనందూరు, కాకినాడ), 3. జోగింపేట (సీతానగరం, పార్వతీపురం మన్యం) సెల్ప్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ 1. నందిగాం (నందిగాం, శ్రీకాకుళం), 2. కట్టకిందపల్లి (అనంతపురం రూరల్, అనంతపురం), 3. సూరప్పగూడెం (భీమడోలు, ఏలూరు) సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ 1. వెస్ట్ పెద్దివారిపాలెం (యద్దనపూడి, బాపట్ల), 2. మందగేరి (ఆదోని, కర్నూలు), 3. రామభద్రాపురం (రామభద్రాపురం– విజయనగరం) పంచాయతీ విత్ గుడ్‌గవర్నెన్స్ 1. సఖినేటిపల్లిలంక (సఖినేటిపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ), 2. నగరపాలెం (భీమునిపట్నం, విశాఖపట్నం), 3. చోరగుడి (పమిడిముక్కల, కృష్ణా) ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. మేడాపురం (సీకేపల్లి, శ్రీసత్యసాయి), 2. జేగురపాడు (కడియం, తూర్పు గోదావరి), 3. మార్టూరు (అనకాపల్లి, అనకాపల్లి) -
పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ నం.1.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ విధానంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ప్రభుత్వం ఆన్లైన్ ఆడిటింగ్‌ను 100 శాతం పూర్తి చేసింది. అలాగే ఆయా నివేదికలను ఆన్లైన్లో కేంద్రానికి సమర్పించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియ ఇప్పటివరకు 13 శాతమే పూర్తవగా మరో 16 రాష్ట్రాల్లో ఇది ఇంకా మొదలుకాలేదు. దేశంలోని 2,56,561 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటివరకు 32,820 పంచాయతీల్లోనే ఆన్లైన్ ఆడిటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,549 గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా 5,560 పంచాయతీల్లో ఆడిటింగ్‌తో తమిళనాడు మూడో స్థానం నిలిచింది. మరోవైపు మండలాలవారీ ఆడిటింగ్‌లోనూ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోని 540 మండలాలకుగాను ఇప్పటివరకు 156 చోట్ల ఆడిట్ పూర్తిచేసింది. కేంద్రం గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు సూచనలతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వేంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఆడిట్ శాఖ ఇప్పటికే ఆన్లైన్ ఆడిటింగ్‌లో 2,10,781 అభ్యంతరాలను నమోదు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతూనే 100 శాతం ఆన్లైన్ ఆడిటింగ్‌ను పూర్తి చేశారన్నారు. ఆన్లైన్ ఆడిటింగ్‌లో తమకు సహకరించాలని ఇతర రాష్ట్రాలు కోరాయన్నారు. -
ఆ పల్లెది విచిత్ర కథ: ఇద్దరు సర్పంచ్‌లు..రెండు మండలాలు
అర్వపల్లి: అదో మారుమూల పల్లె. ఈ పల్లె మూసీనది వెంట ఉంది. కానీ ఈ పల్లెకు ఓ విచిత్ర కథ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామానికి సమస్య వచ్చి పడింది. ఈ ఆవాస గ్రామానికి రెండు గ్రామ పంచాయతీలు, రెండు మండలాలు ఉన్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. ఆ కథాకమామీషు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామమేర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం–నాగారం రెండు మండలాల మద్య ఈ గ్రామం నలిగిపోతుంది. అదే కంచుగట్లగూడెం గ్రామం. జాజిరెడ్డిగూడెం ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, వర్ధమానుకోట రెండు గ్రామపంచాయతీలు ఉండేవి. గ్రామంలో రెండు ప్రధాన వీధులు ఉండగా ఓ వీధి జాజిరెడ్డిగూడెం, మరో వీధి వర్ధమానుకోట గ్రామపంచాయతీలలో ఉండేవి. దీంతో ఏ గ్రామపంచాయతీ సరిగా పట్టించుకోకపోవడంతో ప్రజలు సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఒకే పంచాయతీ కిందకు ఈ గ్రామాన్ని తేవాలని అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా కొత్తమండలాలు ఏర్పడ్డాక ఈ గ్రామానికి మరో సమస్య వచ్చిపడింది. ఇది వరకు ఈ గ్రామం రెండు పంచాయతీల మద్య ఉండగా ఇప్పుడు రెండు పంచాయతీలతో పాటు రెండు మండలాల పరిధిలోకి వెళ్లింది. ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, నాగారం రెండు మండలాలు అయ్యాయి. కొన్ని ఇళ్లు ఇటు.. కొన్ని అటు కంచుగట్లగూడెంలో 70 ఇళ్లు ఉన్నాయి. 200 జనాభా, 150 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలోని ప్రధాన వీధి వెంట ఓ వైపు ఇళ్లు నాగారం మండలం పేరబోయినగూడెం పంచాయతీ పరిధికి, మరో వైపు ఇళ్లు జాజిరెడ్డిగూడెం మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధికి వెళ్లాయి. 55 ఇళ్లు పేరబోయినగూడెం జీపీకి, 15 ఇళ్లు జాజిరెడ్డిగూడెం జీపీకి వచ్చాయి. 150 మంది ఓటర్లకు గాను 100 మంది ఓటర్లు పేరబోయినగూడెం, 50 మంది ఓటర్లు జాజిరెడ్డిగూడెం పరిధికి వచ్చారు. దీంతో ఈ ఆవాస గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు ఇద్దరు సర్పంచ్‌లకు ఓట్లు వేయాల్సి వస్తుంది. దీంతో పరిపాలన పరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతో ప్రజల పాట్లు ఈ గ్రామానికి ఇంత వరకు పక్కా రోడ్డు లేదు. ఇంకా గుంతల మయమైన ఫార్మేషన్రోడ్డే. గ్రామంలో ఇప్పటి వరకు జానెడు సీసీరోడ్డు నిర్మించలేదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా అనేక సమస్యలు నెలకొన్నాయి. సరైన మురుగు కాల్వలు లేవు. ఇలా అనేక మౌళిక సమస్యలు గ్రామంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాన్ని ఒకే పంచాయతీ, ఒకే మండలం కిందకు చేర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు మా గ్రామ విచిత్రమేమిటంటే రెండు పంచాయతీలు, రెండు మండలాల పరిధిలో గ్రామం ఉండటంతో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామానికి ఇంత వరకు పక్కారోడ్డు లేదు. సీసీరోడ్డు నిర్మాణం జరగలేదు. రోడ్డు సరిగా లేక ఆటోలు, బస్సులు కూడా రావడం లేదు. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. ఇప్పటికైనా ఒకే పంచాయతి, ఒకే మండలం కిందకు చేర్చాలి. -కంచుగట్ల లింగయ్య, వార్డు సభ్యుడు, కంచుగట్లగూడెం 70 ఏళ్ల నుంచి గ్రామం పరిస్థితి ఇలాగే 70 ఏళ్ల నుంచి చూస్తున్నా మా గ్రామ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంత వరకు డాంబర్ రోడ్డు లేదు. ఇప్పుడున్న మట్టిరోడ్డుపై గుంతలు పడి నడిచిపోవాలంటే కూడా సాధ్యం కావడం లేదు. మా ఊరు సగం పేరబోయినగూడెం, ఇంకో సగం జాజిరెడ్డిగూడెం కిందికి పోయాయి. దీంతో మా ఊరును ఎవరూ పట్టించుకోవడం లేదు. నా చిన్నప్పటి నుంచి డాంబర్రోడ్డు కావాలని కొట్లాడుతున్నాం. -కోడి రాజమ్మ, వృద్దురాలు, కంచుగట్లగూడెం -
రోడ్డుకు అటు.. ఇటు: జోడు పంచాయతీలు
ఆళ్లగడ్డ రూరల్: ఎక్కడైనా రెండు పంచాయతీలు కనీసం రెండు కి.మీ. దూరంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం రోడ్డుకు అటు, ఇటు ఉండటం విశేషం. ఆళ్లగడ్డ మండలంలో గోపాలపురం, పేరాయిపల్లె పంచాయతీలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. గోపాలపురం గ్రామం నల్లగట్ల రెవెన్యూ పరిధిలో, పేరాయిపల్లె జంబులదిన్నె రెవెన్యూ పొలిమేర పరిధిలో ఉండటంతో వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఒకే ఊరులా కనిపించే ఈ గ్రామాలు వేర్వేరు పంచాయతీలు. పేరాయిపల్లె గ్రామం 1995 వరకు జి.జంబులదిన్నె గ్రామ పంచాయతీలోనే ఉండేది. తర్వాత జనాభా 500 పైగా పెరగడంతో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గోపాలపురం సర్పంచ్‌గా రామలక్ష్మమ్మ, పేరాయిపల్లె గ్రామ సర్పంచ్‌గా నాగలక్ష్మమ్మ ఎన్నికయ్యారు. (చదవండి: ఆ కుటుంబం ఓటమి ఎరగదు..) హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
రోడ్డుకు అటూ.. ఇటూ.. రెండు పంచాయతీలు
ఆళ్లగడ్డ /ప్రత్తిపాడు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది గానీ.. అక్కడ రెండు పంచాయతీలున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె, గోపాలపురం పంచాయతీలను విభజించేది ఓ వీధి రోడ్డే. పేరాయిపల్లెలో 859, గోపాలపురంలో 563 మంది ఓటర్లున్నారు. గోపాలపురం మొదట్నుంచీ ప్రత్యేక పంచాయతీగానే ఉంది. పేరాయిపల్లె మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిజమ్మలదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఒకే ఊరిలా ఉన్న ఇక్కడ విడివిడిగా పాఠశాలలు, ఆలయాలు ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండల పరిధిలోని నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేలను ఒకే రోడ్డు విడదీస్తుంది. అయితే నన్నపనేనివారిపాలెం తిమ్మాపురం పంచాయతీలో, గింజుపల్లివారిపాలెం పాతమల్లాయపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. రెండు గ్రామాల్లో కలిపి సుమారుగా 153 మంది ఓటర్లున్నారు. గుంటూరు జిల్లాలో నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేల మధ్య రహదారి -
పల్లెకూ ఉంది ఓ బడ్జెట్
సత్తెనపల్లి: బడ్జెట్ అంటే బోలెడు లెక్కలు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అవసరాలకు తగిన నిధులు కేటాయించాలి. రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాలి. అది కేంద్ర బడ్జెట్ అయినా.. పల్లె పద్దు అయినా లెక్క పక్కాగా ఉండాల్సిందే. పంచాయతీల ఆదాయ మార్గాలు, పల్లెల ప్రగతికి ఉపకరించే నిధులు, వాటి పద్దుల బడ్జెట్ ఎలా ఉంటుందంటే.. కేంద్ర సహకారమే కీలకం పల్లెలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులే కీలకంగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలయ్యాయి. ఒక్కో వ్యక్తికి సగటున రూ.550 నుంచి రూ.600 వరకు వస్తోంది. ప్రస్తుతం ఈ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం, మండలాలకు 20 శాతం, జెడ్పీకీ 10 శాతం వంతున కేటాయిస్తారు. ఈ నిధుల్లో 50 శాతం టైడ్ ఫండ్స్ రూపంలో పంచాయతీలు కేంద్ర నిబంధనల ప్రకారం వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం అన్‌టైడ్ ఫండ్స్‌ను ఒక్క జీతభత్యాలకు కాకుండా ఏ ఇతర పనికైనా వెచ్చించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిధులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయ భవనాలు, రహదారులు, ఇతర నిర్మాణాలు, భూగర్భ జల వనరుల పెంపు తదితరాలను ఈ పథకం కిందే అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పంచాయతీలకు సమానంగా డబ్బులు ఇస్తారు. సాధారణ నిధుల వినియోగం ఇలా.. మొత్తం 47 రకాల పన్నులు విధించడానికి పంచాయతీ పాలకవర్గాలకు అధికారం ఉంది. పన్ను విధింపు, అమలుకు గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి పన్ను, వృత్తి, వినోదం, భూమి రిజిస్ట్రేషన్, వేలం, కాటా రుసుము తదితరాలు ఉన్నాయి. పన్నేతర ఆదాయం కింద చెరువుల వేలం, పరిశ్రమలు, మార్కెట్ యార్డు ప్రకటనలు, సెల్‌ఫోన్ టవర్లు తదితరాల నుంచి ఆదాయం లభిస్తుంది. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర పన్నుల శాఖ వసూలు చేసిన మొత్తంలో 95 శాతం తిరిగి పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. పంచాయతీలో తలసరి రూ.4 అందిస్తుంది. వినోదపు పన్నును 60:40 నిష్పత్తిలో ఇస్తారు. గనుల తవ్వకానికి సంబంధించి వసూలయ్యే సీనరేజిలో 25 శాతం చెల్లిస్తుంది. ఖర్చులకు ఉందో ఆడిట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఆడిట్ రూపంలో లెక్క సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ లెక్క మాత్రం తప్పకూడదు. వ్యయ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర, పంచాయతీరాజ్ నిబంధనలు పాటించి తీరాలి. -
పంచాయతీలకు ‘పవర్ షాక్’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలకు ప్రభుత్వం ‘పవర్’షాక్ ఇచ్చింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించింది. ఈ నిర్ణయంతో స్థానిక పాలకవర్గాలు.. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పంచాయతీల నిర్ణయాధికారాలపై ప్రభుత్వ పెత్తనమేంటని మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన పంచాయతీరాజ్ శాఖ.. మున్సిపాలిటీల మాదిరి పంచాయతీల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ దీపాల సరఫరా, నిర్వహణలో సమర్థంగా పనిచేస్తున్న ఇంధన పొదుపు సేవా సంస్థ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్)తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామపంచాయతీల్లో ఏడేళ్ల పాటు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), గ్రామ పంచాయతీలు, ఈఈఎస్ ఎల్ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించింది. బల్బు మొదలు టైమర్ వరకు ఒప్పంద కాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. బల్బుల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపులో భాగంగా టైమర్లను కూడా సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కరెంట్ బిల్లులను మాత్రం స్థానిక పంచాయతీలు చెల్లించాలి. నిధుల కొరతతో బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ ఉంటే బిల్లులను డీపీవో సర్దుబాటు చేయాలి. ఈఈఎస్ఎల్ సంస్థ పనితీరును క్రమం తప్పకుండా గ్రామపంచాయతీలు మదింపు చేయాలని, నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారో లేదో పరిశీలించాలని స్పష్టం చేసింది. పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు.. ఈఈఎస్ఎల్ సంస్థకు పంచాయతీల్లోని వీధి దీపాల బాధ్యతలను కట్టబెట్టడాన్ని గ్రామపంచాయతీలు తప్పుపడుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–32 ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్‌లకు ఉంటాయని, ఆ అధికారాలకు కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈఈఎస్ఎల్ సంస్థ ఈ పనులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ తీర్మానాలు చేసేందుకు పంచాయతీలు ససేమిరా అంటున్నాయి. దీంతో తీర్మానాల కోసం సర్పంచ్‌లకు నచ్చజెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా, ఈ నెల 28లోపు ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ డెడ్‌లైన్ విధించింది. అయితే ఇప్పటివరకు సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట, జనగామ జిల్లాలు మాత్రమే ఈ మేరకు ఒప్పంద పత్రాలు పంపాయి. మిగతా జిల్లాల్లో ఇప్పటికీ పంచాయతీల్లో తీర్మానాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీరాజ్ అధికారులు తలపట్టుకుంటున్నారు. -
పంచాయతీలకు ఊరట
సాక్షి, అనంతపురం: నిధుల్లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2018 నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2019–20 సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు కలిపి మొత్తం మూడు విడతలుగా రావాల్సి ఉండగా 2018–19 సంవత్సరానికి సంబంధించిన ఒక విడత నిధులు రూ.72,25,71,000 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గత టీడీపీ సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిరీ్వర్యం చేసింది. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లించగా.. గ్రామాల్లో రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులే రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు కావడంతో పంచాయతీలకు ఊరట వచ్చింది. నిధుల వ్యయం ఇలా.. జిల్లాలో మొత్తం 1,003 (ప్రస్తుతం 1,044) పంచాయతీలకు గాను జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. కాగా ఈ మొత్తం నిధులన్నీ తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 13,386 చేతిపంపులుండగా..చేతిపంపుల నిర్వహణకు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో చేతిపంపు నిర్వహణకు రూ.వెయ్యి కేటాయించారు. ఇక రక్షిత తాగునీటి అవసరాలకు రూ.42.27 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జిల్లా పరిషత్ ద్వారా ఖర్చు చేయనున్నారు. అంటే ఈ నిధులను పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. తక్కిన నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు. -
ఏళ్లనాటి కల ఫలించిన వేళ
రావికమతం(చోడవరం): ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శివారు గిరిజన గ్రామాలవి. ఏ చిన్న పని కావాలన్నా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సిందే. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. మా పరిస్థితిని పట్టించుకోండి.. అంటూ ఎన్నో మార్లు వినతులు.. విజ్ఞప్తులు.. విసిగి పోయి ధర్నాలు కూడా చేశారు ఆయా గ్రామాల ప్రజలు. అయినా నేతలు, అధికారుల్లో మార్పు రాలేదు. హామీలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మండలంలో... ►రావికమతం మండలంలో గ్రామ పంచాయతీలు 24 ►24 పంచాయతీల పరిధిలో శివారు గ్రామాలు 62 ►పంచాయతీ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ►ప్రస్తుతం మండలంలో పంచాయతీల సంఖ్య 28కి చేరింది. వమ్మవరం: కన్నంపేట పంచాయతీ శివారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వమ్మవరం గ్రామం పంచాయతీగా ఏర్పాటైంది. జనాభా: 969, ఓటర్లు: 713 రిజర్వేషన్: జనరల్ కె.కొట్నాబిల్లి: టి.అర్జాపురం పంచాయతీ శివారు ఐదు గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో కె.కొటా్నబిల్లి, గదబపాలెం, డోలవానిపాలెం గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 766, ఓటర్లు: 593 రిజర్వేషన్: ఎస్టీ మహిళ కేబీపీ అగ్రహారం: కొమిర పంచాయతీ శివారు 4 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న కేబీపీ ఆగ్రహారం గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో యర్రబంద గ్రామాన్ని కలిపారు. జనాభా: 991 ఓటర్లు: 634 రిజర్వేషన్: జనరల్ మహిళ ధర్మవరం: పి.ధమ్రవరం, కె.ధర్మవరం గ్రామాలు జెడ్.కొత్తపట్నం పంచాయతీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏ పని కావాలన్నా సర్పానది దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్ని కలిపి ధర్మవరం పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా: 429, ఓటర్లు: 327 రిజర్వేషన్: జనరల్ మహిళ సమస్య తీరింది టి.అర్జాపురం శివారుగా మా ఐదు గిరిజన గ్రామాలుండేవి. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సరిగ్గా వినియోగించక మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. –గొలుముల రాములు, కె. కొట్నాబిల్లి ఆనందంగా ఉంది మాది కన్నంపేట శివారు వమ్మవరం గ్రామం. ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికకు సిద్ధమవ్వడం ఆనందంగా ఉంది. మా కష్టాలు తీరినట్టే. – గల్లా వెంకటలక్ష్మి, వమ్మవరం నది దాటక్కర్లేదు మాది ధర్మవరం. జెడ్.కొత్తపట్నం శివారుగా ఉండేది. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే సర్పానది దాటాల్సి వచ్చేది. భయం భయంగా వెళ్లేవాళ్లం. ఇకపై ఆ ఇబ్బంది లేదు. – గోరా చిరంజీవి, ధర్మవరం -
ఐదు పంచాయతీలు విలీనం
సాక్షి, విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాల కిందట నగర పాలక సంస్థగా ఏర్పడిన విశాఖ తొలి నుంచి రాజకీయపరంగా సంచలనంగానే ఉంటోంది. 1981లో జరిగిన తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 1987లో టీడీపీ, 1995, 2000లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. 2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నగర రూపు రేఖలు మారిపోయాయి. ఆర్థిక రాజధానిగా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో చేరాయి. గాజువాకను విలీనం చేసిన తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రానికి, నగరానికి మహానేత వైఎస్సార్ చేస్తున్న అభివృద్ధికి ఓటేస్తూ నగరవాసులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. దీంతో.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారి పాలనలోనే గ్రేటర్ విశాఖ కాలం గడపాల్సి వస్తోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 5 పంచాయతీలు విలీనం చెయ్యండి అటు భీమిలిజోన్కు, ఇటు గ్రేటర్‌కు మధ్యలో ఉన్న ఐదు పంచాయతీలను విలీనం చేయకుండా గతంలో 81 వార్డుల విభజన పూర్తి చేశారు. అయితే.. గ్రేటర్ స్వరూపాన్ని పరిశీలిస్తే.. భీమిలి మున్సిపాలిటీకీ, జీవీఎంసీకి మధ్యలో విలీనం కాని కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, నగరపాలెం,జేవీ అగ్రహారం పంచాయతీలు ఉన్నాయి. దీంతీఓ గ్రేటర్ పరిధిలో ఈ పంచాయతీలో ద్వీపంలా కనిపిస్తాయి. అయితే.. వీటిని కలపాలని ప్రభుత్వ భావించి.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయా పంచాయితీలన్నీ విలీనానికి అంగీకారం తెలపడంతో దానికి సంబంధించిన నివేదికను కొద్ది నెలల కిందట సీడీఎంఏకి జీవీఎంసీ పంపించింది. తాజాగా వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఐదు పంచాయతీలను కలుపుతూ వార్డు విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు టౌన్‌ప్లానింగ్ సి బ్బంది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23లోగా ప్రక్రియ పూర్తి చేసి సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించనుంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 30 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. రెండు వార్డుల సరిహద్దుల్లో మార్పులు? భీమిలి మండలంలోని ఐదు పంచాయతీలు విలీనం కానున్న నేపథ్యంలో ఆ జనాభా 50 వేలు దాటితేనే కొత్త వార్డు జత చెయ్యాలి. కానీ ఐదు పంచాయతీల మొత్తం జనాభా 19,116 మాత్రమే. దీంతో చుట్టు పక్కల వార్డుల్లో విలీనం చెయ్యనున్నారు. ఈ లెక్కన కేవలం రెండు వార్డుల సరిహద్దులు మాత్రమే మారనున్నాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఒకటో వార్డుతో పాటు 81 వార్డు సరిహద్దులు మారే అవకాశాలున్నాయని సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం... జీవీఎంసీ కమిషనర్ 2016 నవంబర్ 11న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు గ్రేటర్ పరిధిలో ప్రస్తుత జనాభా వివరాలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని పంపించారు. అందులో వివరాల ప్రకారం వార్డుల విభజన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ లెక్క ప్రకారం జీవీఎంసీ అధికారులు వార్డుల స్వరూపాలకు సంబంధించిన మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు వార్డుల విభజన, పంచాయతీల విలీన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎన్ని పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు.. వాటికోసం ఎన్ని ఈవీఎంలు అవసరం, అదనంగా ఎన్ని ఈవీఎంలు సిద్ధం చెయ్యాలి.. మొదలైన వాటన్నింటిపైనా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు చినగదిలిలోని ఈవీఎం గోదాముల్లో ఉన్న ఈవీఎం మెషీన్లని పరిశీలించే ప్రక్రియకు రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నాం. జనవరి 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈవీఎం మెషీన్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తెలిపారు. -
‘విలీనం’ రాజ్యాంగబద్ధమే..
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీల్లో పలు పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. మునిసిపాలిటీ లేదా మునిసిపల్ కార్పొరేషన్ల్లో విలీనం చేయడానికి ముందు ఓ గ్రామ పంచాయతీని డీ నోటిఫై చేసే అధికారం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 3(2)(ఎఫ్) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది. విలీనం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో వాటిని కొట్టేయజాలమని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల వ్యక్తిగత హక్కులు ప్రభావితం కావని తేల్చి చెప్పింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు లేదా పరిధి దాటి అధికారాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఓ చట్టాన్ని కొట్టేయడానికి వీలవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారానికి లోబడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేసింది. చిన్న లేదా పెద్ద పట్టణ ప్రాంతాలుగా మార్చేందుకు వీలుగా గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసే నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రాజ్యాంగంలోని అధికరణలు 14, 73, 74లకు ఎంతమాత్రం విరుద్ధం కాదంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 100కు పైగా వ్యాజ్యాలు... రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు గ్రామపంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. విలీనం నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం (యాక్ట్ 4 ఆఫ్ 2018)లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం వాదనలు విని గత నెల 4న తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే. విధి విధానాలన్నీ పూర్తి గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియలో చట్టప్రకారం చేయాల్సిన విధివిధానాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపింది. సవరణ చట్టం అధికరణ 243 క్యూ(2)కు అనుగుణంగానే ఉందని స్పష్టం చేసింది. చట్టం లేదా చట్ట సవరణ చేసే విషయంలో శాసనసభకున్న అధికారం గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారంకన్నా మిన్న అని తెలిపింది. వాస్తవానికి ఈ సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర కూడా వేశారని గుర్తు చేసింది. ఏకపక్ష చట్టంగా చెప్పజాలం మునిసిపాలిటీలు లేదా మునిసిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికే పంచాయతీలను విలీనం చేశారని, అది కూడా ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే సవరణ చట్టం తీసుకొచ్చారని తెలిపింది. అందువల్ల ఈ సవరణ చట్టాన్ని ఏ రకంగా చూసినా ఏకపక్షంగా తీసుకొచ్చిన చట్టంగా చెప్పజాలమంది. రాజ్యాంగంలో ఎక్కడా నిషేధం లేదు... చిన్న లేదా పెద్ద పట్టణ ప్రాంతాలుగా చేసేందుకు గ్రామపంచాయతీలను మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్లలో విలీనం చేయరాదని రాజ్యాంగంలో ఎక్కడా నిషేధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకో కుండా ఏకపక్షంగా విలీన నిర్ణయం తీసుకున్నారన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్న వాదనను సైతం తోసిపుచ్చింది. పంచాయతీలను విలీనం చేసి మునిసిపాలిటీలు, మునిసి పల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడమన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. -
పల్లెలకు పచ్చని శోభ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళికను విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన గ్రామసర్పంచ్‌లంతా సమగ్ర కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం ఆదేశాలు.. గ్రామపంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ కొన్ని ఆదేశాలిచ్చారు. వీటిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ, జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీచేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు చేపట్టడంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి ద్వారా రెగ్యులర్‌గా వీధులు, కాల్వలు శుభ్రం చేయడానికి పంచాయతీ కార్యదర్శి వెంటనే కార్యకలాపాల పట్టిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతో పాటు ఈఓపీఆర్డీ, ఎంపీడీవోలు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించింది. 100 శాతం పన్నుల వసూలు.. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కల్పనకు 3 నెలల పాటు వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 100 శాతం పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రతి గ్రామసర్పంచ్ చర్యలు తీసుకోవాలని సూచించింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నెలకు కనీసం ఒకసారి శ్రమదానం నిర్వహించి, ఇందులో గ్రామస్తులు కొన్ని గంటల పాటు పాల్గొనేలా కార్యక్రమాలు చేపట్టాలి. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. - ప్రతి గ్రామంలో కనీసం ఒక కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తంతా తీసుకొచ్చి కంపోస్ట్‌గా మార్చాలి. - గ్రామాల్లోని ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను విడివిడిగా పెట్టేందుకు వీలుగా గ్రామపంచాయతీ నిధులతో డబ్డాలు సరఫరా చేయాలి. - ఉపయోగించని, పనికి రాకుండా పోయిన అన్ని బోర్‌వెల్స్‌ను, ఓపెన్ వెల్స్ మూసేయాలి. - ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం (శ్మశానం)ఏర్పాటు కోసం తగిన స్థలం ఎంపికచేయాలి. పంచాయతీ భూములను మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఇవేమి అందుబాటులో లేనపుడు గరిష్టంగా రూ.5 లక్షల వరకు గ్రామపంచాయతీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధి, తదితరాల నుంచి కేటాయించవచ్చు. - ఉపాధి హామీ నిధులతో శ్మశానాల నిర్మా ణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. పట్టణాల్లో మాదిరిగా కనీస సౌకర్యాలు.. నగరాలు, పట్టణాల్లో మాదిరిగా పంచాయతీల్లోనూ పారిశుధ్యం, వీధి దీపాలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ విధులు, బాధ్యతలు, అధికారాలు, చట్టంలో పొందుపరిచిన ఆయా అంశాల గురించి పూర్తిస్థాయి అవగాహన సాధించేందుకు జిల్లా స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
అలా తీర్పిస్తే 21 రోజుల్లో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే విలీన గ్రామ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు... పంచాయతీలను విలీనం చేస్తూ దాఖలైన దాదాపు 100 పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ పంచాయతీలను డీనోటిఫై చేసి వాటి పరిధిలో వ్యవసాయేతర రంగాలపై ఆధారపడిన వారి జనాభా, వారి స్థితిగతులు, తలసరి ఆదాయం వంటి విషయాలపై అధ్యయనం చేయాల్సి ఉండగా అవేమీ చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గ్రామ పంచాయతీల స్వతంత్రతకు భంగం కలుగుతోందన్నారు. గ్రామ పంచాయతీల విలీనం విషయంలో ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారని, దీంతో ఆ విలీన పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా? చట్ట నిబంధనల మేరకు అధ్యయనం చేశాకే పంచాయతీలపై విలీన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు పేర్కొన్నారు. పలు పంచాయతీలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలన్నీ మున్సిపాలిటీల ద్వారానే అందుతున్నాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మున్సిపాలిటీలను విస్తరించే పరిధి ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించే అధ్యయం చేశారా అంటూ సందేహం వ్యక్తం చేసింది. జీన్స్ వేసుకొని కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే పట్టణీకరణ పేరిట పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా? అంటూ నిలదీసింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ పంచాయతీల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఐదేళ్లపాటు వారిని ఏమీ చేయలేం... ఈ సమయంలో ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ పిటిషనర్ల అభ్యర్థనల మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీల కాల పరిధి ఐదేళ్లని, ఒకసారి చట్టబద్ధంగా పంచాయతీలకు ఎన్నికైన వారిని ఐదేళ్లపాటు తప్పించడం సాధ్యం కాదని రామచంద్రరావు వివరించారు. దీనివల్ల మున్సిపాలిటీల నుంచి అందే సౌకర్యాలు అందక ప్రజలు ఐదేళ్లపాటు ఇబ్బంది పడుతారని తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చి, పంచాయతీల విలీనం చెల్లదని హైకోర్టు ప్రకటిస్తే ఆ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో ఈ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21న చేపడతామని స్పష్టం చేసింది. -
టీఆర్ఎస్లో పెద్దపల్లి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనం తరం టీఆర్ఎస్లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్కు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఎమ్మెల్యే లు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై పలువు రు ఎమ్మెల్యేలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), బాల్క సుమన్(చెన్నూరు), సోమారపు సత్యనారాయణ(రామగుండం) గురువారం తెలం గాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, తమకు ఇబ్బంది కలిగించేలా వివేక్ వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఇద్దరూ కలిసి, సోమారపు సత్యనారాయణ వేరుగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారని... బెల్లంపల్లిలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు వినోద్‌కు సహకరిం చారని కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కృతజ్ఞత సభలోనూ పలువురు ద్వితీయశ్రేణి నేతలు ఎంపీ వివేక్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ధర్మపురి, బెల్లంపల్లి, చెన్నూరులో బహిరంగంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్ సైతం గురువారం కేటీఆర్‌ను కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల పరిస్థితులపై కేటీఆర్‌తో మాట్లాడారు. తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని వివేక్ కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసిం ది. ఫిర్యాదులు, వివరణ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎంపీ వివేక్‌తో కేటీఆర్ శుక్రవారం మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది. -
రాష్ట్రంలో కొత్త పంచాయతీలు
-
అధికారులకే పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వచ్చే సందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి విచక్షణాధికారాలను వినియోగించేందుకు జిల్లాకు కోటి చొప్పు న రూ.30 కోట్లు అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తుండటంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సర్పంచ్‌లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యం లో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో 8 గంటల పాటు సమీక్షించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వివేకానంద, కాలె యాదయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ అధికారులు వికాస్‌రాజ్, అరవింద్‌కుమార్, నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పదవీకాలం ముగుస్తున్న సర్పం చ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని సీఎస్ నాయకత్వంలోని సీనియర్ అధికారుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించడం చట్ట ప్రకారం సాధ్యం కాదని, అందుకు న్యాయస్థానాలు అంగీకరించవని వెల్లడించారు. ప్రత్యేక అధికా రుల నియామకానికి చేస్తున్న కసరత్తును ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అధికారులనే ప్రత్యేక అధికారులుగా ఎందుకు నియమించాలో, చట్టం ఏం చెబుతుందో తెలిపారు. ఆ వివరాలివీ.. ♦ రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,751కు చేరాయి. అసెంబ్లీలో చేసిన చట్టం ద్వారా కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రస్తు్తతం ఉన్న గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త చట్టం అమల్లోకి వస్తుందని చట్టంలోనే పేర్కొ న్నారు. దీని ప్రకారం ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. ప్రస్తుతమున్న పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. సర్పంచుల పరిధి మారుతుంది. ♦ ఎస్టీలకు ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,500 గ్రామాల్లో ఎస్టీలే సర్పంచ్‌లు అవుతున్నారు. ఇప్పుడున్న సర్పంచ్‌లనే మళ్లీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తే, ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలనే కొనసాగించినట్టవుతుంది. ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు మనుగడలోకి రావు. చట్టం సైతం ఇందుకు అంగీకరించదు. ♦ ప్రస్తుతం ఉన్న గ్రామాల స్వరూపం పూర్తిగా మారి పోయింది. మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలు 300 వరకు ఉన్నాయి. ఈ గ్రామాలకు సర్పంచ్‌లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కొన్ని గ్రామాల శివారు పల్లెలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా అవతరించాయి. అవన్నీ ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలుగా మనుగడ సాగిస్తాయి. ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలు య«థావిధిగా ఉన్నవి ఐదు శాతం లోపే. ఇప్పుడున్న సర్పంచ్ల పరిధి ఇక ముందు ఉండదు. కాబట్టి వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడం కుదరదు. ♦ ఇప్పుడున్న సర్పంచ్‌లు ఎన్నికైంది ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలకే. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు వారి అధికార పరిధిలో ఉండవు. వారు ఎన్నికైన గ్రామ స్వరూపానికి, ఇప్పుడున్న గ్రామ స్వరూపానికి సంబంధం లేదు. ఇప్పుడున్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా చేస్తే.. వారు పాత పంచాయతీల పరిధి మొత్తానికి ప్రత్యేక అధికారి అవుతారు. అప్పుడు ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలుగానీ, కొత్తగా ఏర్పడిన ఇతర పంచాయతీలుగానీ మనుగడలోకి రావు. ఇది చట్టానికి విరుద్ధం. అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ♦ తండాలు, గూడేలతోపాటు కొత్తగా ఏర్పాటయిన పంచాయతీలు మనుగడలోకి రావాలని, కొత్త పాలక వర్గం వచ్చి, కొత్త పాలన ప్రారంభం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వ హించడానికి సిద్ధపడింది. అయితే కోర్టు కేసుల వల్ల సాధ్యం కాలేదు. కోర్టు తీర్పు వచ్చేలోపు కొత్త పంచాయతీలను మనుగడలోకి తేవడం ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతమున్న సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తే కొత్త పంచాయతీలు మనుగడలోకి వచ్చినట్లు లెక్కకాదు. అది చట్టాన్ని ఉల్లంఘించినట్టే. ♦ ఈ కారణాల నేపథ్యంలో సర్పంచ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించలేని అసహాయ పరిస్థితి ప్రభుత్వానిదని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అధికారులకే పగ్గాలు అప్పగించడం ప్రభుత్వానికున్న ఏకైక మార్గమని అధికారులు స్పష్టం చేశారు. సర్పంచ్‌కు సీఎం ఫోన్ పంచాయతీలను బలోపేతం చేయడమెలా? గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శుల సేవలను ఎలా వినియోగించుకోవాలి? గ్రామ పంచాయతీలకు ఉండే ఖర్చు లేమిటి? ఆదాయాలేమిటి? తదితర విషయాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ సర్పంచ్ నర్సింహగౌడ్‌కు సీఎం స్వయంగా ఫోన్ చేసి గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం, కట్టే కరెంటు బిల్లు, సిబ్బందికి చెల్లించే వేతనాలు తదితర వివరాలను సేకరించారు. పంచాయతీరాజ్ సంస్థలు ఏటా కట్టే కరెంటు బిల్లులు ఎంతుంటాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని ఆరా తీయగా.. ఏటా రూ.600 కోట్ల బిల్లులు కడతారని ఆయన చెప్పారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. -
‘చట్టం’తో కొత్త పట్నం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 63 నగర పంచాయతీలు, 5 మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణతో పనిలేకుండా.. నేరుగా చట్ట సవరణ ద్వారా పురపాలికలను ఏర్పాటు చేసేదిశగా కసరత్తు చేస్తోంది. కొత్త, పాత పురపాలక సంస్థల్లో 350 గ్రామ పంచాయతీలు, ఆవాసాలను విలీనం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం, రాష్ట్ర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ చట్టాలను సవరిస్తూ ముసాయిదా బిల్లులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తోంది. 141కి చేరనున్న పురపాలికలు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 68 కొత్త పురపాలికలు ఏర్పాటైతే.. రాష్ట్రంలో మొత్తం పురపాలికల సంఖ్య 141కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1,24,90,739 కాగా.. కొత్త పురపాలికలతో ఈ సంఖ్య 1,46,47,857కు పెరగనుంది. శాతాల వారీగా చూస్తే.. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 శాతం నుంచి 45 శాతానికి పెరగనుంది. ఇప్పుడున్న చట్టాలకే సవరణలు! కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పేర్లతో పాటు ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేసే గ్రామ పంచాయతీల పేర్లను చేర్చుతూ రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నారు. అటు జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమయ్యే గ్రామాల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చుతూ సవరణలు చేయనున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే.. వాటికి మున్సిపాలిటీ/నగర పంచాయతీ హోదా అమల్లోకి రానుంది. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే.. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్, పురపాలక చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడం, లేదా ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ముందు ఆయా స్థానిక సంస్థల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై సంబంధిత గ్రామ ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను పరిష్కరించి రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. అనంతరం గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాలి. అప్పుడు సంబంధిత గ్రామానికి పంచాయతీ హోదాను ఉపసంహరిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అదే సమయంలో ఆ గ్రామాని మున్సిపాలిటీ హోదా/మున్సిపాలిటీలో విలీనం చేస్తూ పురపాలక శాఖ జీవో జారీ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకుండానే కొత్త పురపాలికల ఏర్పాటుకు ముందుకు వెళ్లడం, దానిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో కొత్త పురపాలికల ఏర్పాటు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియలేమీ లేకుండా నేరుగా పురపాలికల ఏర్పాటు కోసం ప్రభుత్వం చట్టాల సవరణకు నిర్ణయం తీసుకుంది. -
మాది ధర్మ పోరాటం
న్యూఢిల్లీ: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రత్యర్థి పార్టీ బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్, ప్రధాన ప్రత్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆదివారం పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మహాభారతాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికార దాహంతో ఉన్న కౌరవులుగా, కాంగ్రెస్ పార్టీ వారు సత్యం కోసం ధర్మపోరాటం చేస్తున్న పాండవులుగా అభివర్ణించారు. బీజేపీ ఆరెస్సెస్ గొంతుక అయితే.. తమది ప్రజావాణి అని చురకలంటించారు. ఎన్డీయే ప్రభుత్వ పలు నిర్ణయాలనూ రాహుల్ తప్పుబట్టారు. దాదాపు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ.. తీర్మానాన్ని ఆమోదించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. మోదీ.. నిలువెల్లా అవినీతి! ‘ప్రధాని వాస్తవ సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తూ.. సన్నిహితులైన పెట్టుబడిదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ మోదీ పేరుతోనే ఇద్దరు (నీరవ్, లలిత్) తీవ్రమైన అవినీతి కేసుల్లో దోషులుగా ఉన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేశారు. కాంగ్రెస్ 126 రాఫెల్ యుద్ధ విమానాలకోసం చర్చలు జరిపితే.. బీజేపీ అదే మొత్తంతో కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మేం ఒక్కో విమానానికి రూ. 570 కోట్లు పెడితే.. మోదీ అదే విమానానికి రూ.1670 కోట్లు పెడుతున్నారు. మోదీ అవినీతిపై పోరాడటం లేదు. అవినీతికి పాల్పడుతున్నారు’ కురుక్షేత్రను తలపించేలా..: ‘శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగా కాంగ్రెస్ పార్టీది సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం’ ‘సుప్రీం’ తిరుగుబాటుపై..: ‘బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య చాలా తేడా ఉంది’ ఆ మోదీ, ఈ మోదీ కలిసి..: ‘నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు’ రైతులు, మైనార్టీలు, గౌరీ లంకేశ్‌పై..: ‘గౌరీలంకేశ్, కల్బుర్గీలు ప్రశ్నించినందుకే చనిపోవాల్సి వచ్చింది. ఒకవైపు రైతులు సరైన గిట్టుబాటులేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పదండి యోగా చేద్దామని మోదీ పిలుపునివ్వటం సిగ్గుచేటు కాదా? పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడక ఇక్కడే ఉండిపోయిన వారిని వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. తమిళులను వారి భాషను మార్చుకోవాలని బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారం తమకు నచ్చదంటున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తున్నారు’ యువత గురించి: ‘భారత్‌లోని ప్రతి యువతకూ మేం ఓ ఆయుధం. కాంగ్రెస్ పార్టీ మీది. మీ మేధస్సు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మేం ద్వారాలు తెరుస్తాం. దేశానికి మీ (యువత) అవసరం చాలా ఉంది. ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అచ్ఛేదిన్, మీ అకౌంట్లలోకి రూ.15లక్షలు ఇవన్నీ బూటకమే’ యూపీఏ పాలనపై..: ‘ యూపీఏ–2 చివరి రోజుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం కూడా మనుషులమే. పొరపాట్లు చేస్తాం. బీజేపీతో పోలిస్తే మేం విభిన్నం. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకే ఉంది. మోదీ తను దేవుని ప్రతిరూపం అని భావిస్తున్నారు’ కాంగ్రెస్ పునరుత్తేజంపై..: ‘మనం కాంగ్రెస్‌లో మార్పు తీసుకురావాలి. నాయకులు, కార్యకర్తల మధ్యనున్న అడ్డుగోడలను తొలగిస్తాను. ఇందుకోసం సీనియర్ల సలహాలతో ముందుకెళ్దాం. మన మధ్యనున్న విభేదాలు, గ్రూపు తగాదాలను పక్కనపెడదాం. 2019లో కాంగ్రెస్ ఆలోచనవిధానానిదే విజయం. అవసరమైతే రైతు రుణమాఫీ చేస్తాం’ నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, అసమర్థ ఆర్థిక నిర్వాహకుల చేతి నుంచి దేశాన్ని కాపాడినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే మార్గమని ఇందులో పేర్కొన్నారు. ఆర్థికం.. సర్వనాశనం: మన్మోహన్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లీనరీలో తీవ్రంగా విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ.. భ్రమలు కల్పించి మోసం చేసిందన్నారు. ‘ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేకపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి మందగించింది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఆరేళ్లలో రైతు రాబడి రెండింతలు కావాలంటే ఏడాదికి వృద్ధి రేటు కనీసం 12 శాతం ఉండాలి. ఇది ప్రస్తుతం అసాధ్యం’ అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యకు మోదీ ప్రభుత్వం అతితక్కువ ప్రాధాన్యం ఇస్తోందనీ, దాంతో ఈ అంశం ఎన్నడూ లేనంత జటిలంగా తయారైందని మండిపడ్డారు. సరిహద్దులు సురక్షితంగా లేవనీ, సీమాంతర, అంతర్గత ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులపై ప్రతిపౌరుడూ ఆందోళన చెందుతున్నాడని అన్నారు. -
వ్యవసాయాధికారులపై సమితుల పెత్తనం!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయాధికారులపై రైతు సమన్వయ సమితి సభ్యుల పెత్తనం మొదలు కానుందా? సమితుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ కార్యకర్తలే ఉండటంతో వారి నియంత్రణలో అధికారులు పనిచేయాల్సి రానుందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ‘పెట్టుబడి’పథకం చెక్కుల పంపిణీ మొదలుకొని పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు సమితి సభ్యుల పర్యవేక్షణే కీలకం కానుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిధిలో కిందిస్థాయిలో ఎవరూ రాజకీయ కార్యకర్తలు ఉండేవారు కాదు. అధికారులే కిందిస్థాయిలో పనులు చక్కబెట్టేవారు. రైతు సమన్వయ సమితిలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సభ్యులు 1.61 లక్షల మంది ఉన్నారు. వాటికి సమన్వయకర్తలున్నారు. గ్రామస్థాయిలో 15, మండల, జిల్లా స్థాయిలో 24, రాష్ట్రస్థాయిలో 42 మంది చొప్పున సభ్యులున్నారు. ప్రతీ గ్రామ, మండల, జిల్లా సమితులకు సమన్వయకర్త ఉన్నారు. రాష్ట్రస్థాయి సమితి ఇంకా ఏర్పడాల్సి ఉంది. రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఇప్పటికే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒత్తిళ్లు తప్పవా? రాష్ట్ర వ్యవసాయశాఖలో కిందినుంచి పైస్థాయి వరకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. రెండు మూడు గ్రామాలకు కలిపి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) ఉంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి (ఎంఏవో) ఉంటారు. నియోజకవర్గం స్థాయిలో సహాయ వ్యవసాయాధికారి (ఏడీఏ), జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) ఉంటారు. ఏఈవోపై గ్రామ రైతు సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు తలెత్తుయని అంటున్నారు. మండల సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఎంఏవోలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఏడీఏ, డీఏవోలకు జిల్లా సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవసాయ యంత్రాల సరఫరాకు ఎంఏవో నుంచి అనుమతి అవసరం. అక్కడి నుంచే ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పంపిణీ చేసే వరి నాటు యంత్రాల విషయంలోనూ ఇదే జరగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సమితి సమన్వయకర్తల నుంచి కూడా పైరవీలు పెరగనున్నాయి. అనధికారిక ప్రొటోకాల్ వ్యవసాయ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమం తమకు చెప్పాలని అనేకచోట్ల రైతు సమితి సమన్వయకర్తలు అంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకరకంగా గ్రామస్థాయి సమితి నుంచి పైస్థాయి వరకు ప్రొటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నుంచి ప్రొటోకాల్ సమస్య ఉంటుందన్న భయాందోళనలను అధికారులు వెళ్లబుచ్చుతున్నారు. నిరంతరం కింది నుంచి పైస్థాయి వరకు గుత్తా పరిధిలోకే వ్యవసాయ విస్తరణ వ్యవస్థ వెళుతుందని అంటున్నారు. వ్యవసాయశాఖ చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలు రైతు సమన్వయ సమితుల ద్వారానే జరుగనుండటంతో వాటికి అత్యంత ప్రాధాన్యం నెలకొంది. దీంతో రైతు సమన్వయ సమితి మరో అధికార కేంద్రంగా ఏర్పడనుందంటున్నారు. ఇది అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుందని అంటున్నారు. -
కొత్త పంచాయతీలు 4,122
సాక్షి, హైదరాబాద్ : మెరుగైన గ్రామ పరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదనలను మ్యాపులతో సహా రూపొందించి పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదికలు సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రతిపాదనలు కూడా అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,806కు చేరనుంది. ఇక కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు గ్రామ పరిపాలనలో పలు విధి విధానాలు, మార్గదర్శకాలతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా.. రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్న హామీ మేరకు ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ప్రధాన పంచాయతీలకు దూరంగా, నిర్ణీత సంఖ్యకు మించి జనాభా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించి.. వాటి ప్రకారం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు 4,122 కొత్త గ్రామ పంచాయతీలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో అత్యధికంగా నల్లగొండలో 309, మహబూబ్‌నగర్‌లో 265, కొత్తగూడెంలో 258, మహబూబాబాద్‌లో 253, వికారాబాద్‌లో 221, ఆదిలాబాద్‌లో 209 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా 110కుపైగా తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఇక ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 31తో పూర్తవుతోంది. దానికి రెండు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. ఆ లోగా కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తి చేసి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక ప్రయోజనాల ప్రాతిపదికనే కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వ తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కార్యదర్శులపై భారం రాష్ట్రంలో ప్రస్తుతమున్న 8,684 గ్రామ పంచాయతీలను పాలనా సౌలభ్యం కోసం 5,500 క్లస్టర్లుగా నిర్వహిస్తున్నారు. కొత్త పంచాయతీలకు అనుగుణంగా వీటిని కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్రామ కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉండడంతో క్లస్టర్‌తోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలను కూడా వారికి అప్పగించారు. తాజాగా కొత్త పంచాయతీలు ఏర్పాటు కానుండడంతో.. మూడు నాలుగు గ్రామాలకు ఒకే కార్యదర్శి ఉండే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పంచాయతీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో కార్యదర్శులను నియమిస్తేనే పాలనా సౌలభ్యం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా కొత్త పంచాయతీలతో కలిపి 4,560 మంది వరకు కార్యదర్శులు అవసరమని కలెక్టర్లు తేల్చారు. ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలు - 8,684 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు - 4,122 పంచాయతీలుగా మార్చే తండాల - 2,243 పంచాయతీలుగా మారే ఆవాసాలు - 1,879 ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రంలో మొత్తం పంచాయతీలు - 12,806 -
అతిక్రమించి కడితే... సర్కారుకే!
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత ప్రదేశంలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను అతిక్రమించి అదనపు స్థలాల్లో నిర్మించిన భవనాలు ప్రభుత్వానికే చెందేలా కఠిన చట్టాలు చేయాల్సిన అవసరముందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకమారారావు పేర్కొన్నారు. లక్ష చదరపు అడుగుల ఏరియాలో భవన నిర్మాణానికి అనుమతులిస్తే.. లక్షా 20 వేల చదరపు అడుగుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అలా అదనంగా నిర్మించిన 20 వేల చదరపు అడుగుల కట్టడాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అలా అదనంగా నిర్మించిన వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ మేరకు అడ్డగోలుగా భవన నిర్మాణాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకొస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ప్రారంభమైన ‘నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రణాళికాయుత అభివృద్ధే పరిష్కారం పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పారు. రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా.. 41 శాతం జనాభా వాటిల్లోనే నివసిస్తోందని పేర్కొన్నారు. 2050 నాటికి సగానికి పైగా దేశ జనాభా పట్టణ ప్రాంతాల్లో నివస్తుందని.. గత ఐదు వేల ఏళ్లలో జరిగిన పట్టణీకరణతో పోల్చితే వచ్చే ఐదేళ్లలో అంతకు మించి పట్టణీకరణ జరుగనుందని చెప్పారు. టౌన్ ప్లానర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య, ట్రాఫిక్, వరదలు, కాలుష్య సమస్యలకు సరైన పరిష్కారాలు చూపాలని సూచించారు. కొత్తగా నగర పంచాయతీలు రాష్ట్రంలో 15 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని.. ఇలా ఇప్పటివరకు 29 నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేసి చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరమైన చిక్కులతో సాధ్యం కావడం లేదని వెల్లడించారు. పారిశుధ్యం విషయంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని.. ఇందుకోసం జపాన్‌లోని క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో సంస్థ తరహాలో క్లీన్ అథారిటీ ఆఫ్ హైదరాబాద్ సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో సంస్కరణలు తెచ్చాం దేశంలో మరెక్కడ లేనట్లుగా రాష్ట్ర పురపాలన విభాగంలో సంస్కరణలను తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతిని నిర్మూలించేందుకు ‘డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం’ను అమల్లోకి తెచ్చామని, ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. మరింత పారదర్శకత కోసం అనుమతుల జారీకి 21 రోజుల గడువు విధించామని, ఆలోగా స్పందన లేకపోతే అనుమతించినట్లే పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సదస్సులో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్‌ప్లానర్స్ ఇండియా అధ్యక్షుడు కేఎస్ అకోడెతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానర్లు పాల్గొన్నారు. -
పంచాయతీల వివరాలు తెలపాలి
ఆదిలాబాద్ అర్బన్: జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న, ప్రస్తుత గ్రామపంచాయతీల వివరాలు ఈ నెల 25లోగా అందజేయాలని జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో జితేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ కలెక్టర్లు, డీపీవోలతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను సీఈవో అధికారులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న పంచాయతీల వారీగా జనాభా, పంచాయతీ సరిహద్దులు, సంవత్సరాల వారీగా పంచాయతీలకు వస్తున్న ఆదాయం, పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములు, పంచాయతీ ల్యాండ్‌మార్క్ తదితర వివరాలు పంపాల్సిందిగా సూచించారు. కొత్తగా ఏర్పడే గ్రామపంచాయతీలో ఎంతమంది జనాభా ఉన్నారు.. పాత దానికి, కొత్తదానికి ఎంత దూరముంది.. పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన 500 జనాభా ఎన్ని గ్రామ పంచాయతీలకు ఉంది.. 500 జనాభా కన్నా తక్కువగా ఎన్ని గ్రామ పంచాయతీలున్నాయనే వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సుమారు ఒక జీపీ నుంచి మరో జీపీకి 1.5 కిలోమీటర్ల దూరం ఉండాలనే ఆదేశాలు పాటించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో కొత్తగా 225 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సీఈవో తెలిపారు. డీపీవో ఏవో రమేశ్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. కొత్త ప్రతిపాదనలు పంపాలి : కలెక్టర్ దివ్యదేవరాజన్ ఎదులాపురం(ఆదిలాబాద్): కొత్త గ్రామపంచాయతీల కోసం తండాలు, శివారు గ్రామాలను ఎంపిక చేసి ఈనెల 25లోగా ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన తండాలు, గూడేలు, హ్యాబిటేషన్ల పరిధిలో 500 జనాభా కలిగి రెండు కిలో మీటర్లు, అంతకన్న ఎక్కువ గల దూరంలో ప్రస్తుత గ్రామపంచాయతీలే కాకుండా కొత్త గ్రామపంచాయతీకి ప్రతిపాదించాలని సూచించారు. గుట్టలు, నదులు అడ్డుగా ఉన్న ప్రాంతాలు, అసౌకర్యాలు గల ప్రాంతాల్లో 500 జనాభా కంటే తక్కువ కలిగి ఉండి, 300 జనాభా ఉన్న గ్రామాలను కొత్త గ్రామపంచాయతీగా ప్రతిపాదించాలన్నారు. గ్రామపంచాయతీగా ప్రతిపాదించే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఏవైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈనెల 19న జరిగే కేస్లాపూర్ నాగోబా దర్బార్‌కు తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఉదయం 9గంటలకు హాజరుకావాలని, దర్బార్‌లో వచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించేలా చూడాలన్నారు. జేసీ కృష్ణారెడ్డి, డీపీవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. -
పంచాయతీలకు ఎల్ఈడీ షాక్!
సాక్షి, అమరావతి: కాదేదీ కవితకనర్హం అని కవి చెప్పిన మాట. కానీ కాదేదీ అవినీతికనర్హం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రుజువు చేస్తున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, సోలార్ టెండర్ల నుంచి బొగ్గు కొనుగోళ్ల వరకు.. చివరకు గుడి భూములను కూడా వదలకుండా అన్నిటినీ అవినీతిమయం చేసిన సర్కారు పెద్దలు చివరకు గ్రామ పంచాయతీలనూ వదల్లేదు. ఎల్ఈడీ వీధి దీపాల పేరుతో పంచాయతీలపై మోయలేని గుదిబండను మోపి అందులో కమీషన్లను కొట్టేస్తున్నారు. గ్రామాల్లోని వీధి దీపాలుగా ఇప్పుడున్న ట్యూబ్‌లైట్లు, సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకోవాలంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ జారీ చేసిన ఉత్తర్వులు పంచాయతీల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ ఎల్ఈడీ బల్బుల కుంభకోణం.. పంచాయతీలపై అప్పుల భారాన్ని మోపుతూ.. ప్రయివేటు కంపెనీలకు కాసులను, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లను కురిపిస్తోంది. రూ.900 బల్బుకు రూ. 4,570 గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసినందుకు ఆయా గ్రామ పంచాయతీ ప్రతి నెలా కరెంట్ బిల్లులు యదావిధిగా చెల్లిస్తూనే లైట్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టరుకు ఒక్కొక్క బల్బుకు ప్రతి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు అంటే రూ. 4,570 చెల్లించాలట. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ గుదిబండను మోపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏడాదిలోగా అన్ని గ్రామ పంచాయతీలలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పూర్తి కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.900 పెట్టుబడి పెట్టి ఒక్క ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేస్తే ఏడాదికి రూ.457 చొప్పున రేండేళ్లలోనే ఆ కాంట్రాక్టరు చేతికి పెట్టుబడి వచ్చేస్తుంది. మరో 8 ఏళ్లపాటు లాభాలందుకుంటారు. అలా పదేళ్లలో కాంట్రాక్టరు చేతికి రూ.4,570లు చేరతాయి. సర్కారు పెద్దలకు భారీగా కమీషన్.. మార్కెట్లో ఒక్కొక్క 24 వాట్ల ఎల్ఈడీ బల్బు ధర సుమారు రూ.900 ఉంది. టోకున కొంటారు కాబట్టి ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. 38 లక్షల బల్బులకుగాను పదేళ్లలో రూ. 1,736 కోట్లు పంచాయతీలు చెల్లిస్తాయి. ఇందులో పెట్టుబడి, వడ్డీలు, నిర్వహణ ఖర్చులు అన్నీ రూ.736 కోట్లు తీసేసినా పదేళ్లలో ప్రయివేటు కాంట్రాక్టర్లకు మిగిలేది రూ.1,000 కోట్లకు పైమాటే. అందులో పెద్దమొత్తంలో సర్కారు పెద్దలకు దశలవారీగా కమీషన్ల రూపంలో చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని పంచాయతీరాజ్ శాఖలో వినిపిస్తోంది. మొత్తం 38 లక్షల బల్బులు రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 29,89,630 విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. గ్రామాల్లో కొత్తగా మరో 8 లక్షల విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, మొత్తం 38 లక్షల స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్న గ్రామ పంచాయతీలో కూడా రెండు వందలకు పైనే విద్యుత్ స్తంభాలు ఉండే పరిస్థితి. నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్లతో ఒప్పందం ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ప్రక్రియ కోసం... నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్ సంస్థలతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్ సంస్థలు ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమించుకొని, అన్ని గ్రామాల్లో ఏడాది కాలంలోనే ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలివిడతగా తూర్పుగోదావరిలో సూర్య కంపెనీ, విశాఖ జిల్లాలో తేజ కంపెనీ ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసే 24 వాట్ల ఎల్ఈడీ బల్బు ఒక్కో దానికి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు క్రమం తప్పుకుండా గ్రామ పంచాయతీ చెల్లించాల్సి ఉంది. (గ్రామ కూడలి ప్రాంతాల్లో 75 వాట్ల ఎల్ఈడీ బల్బు ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క బల్బుకు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది.) ఒక్కో పంచాయతీకి ఏటా రూ.లక్ష అప్పే ఒక్కొక్క స్తంభానికి ఎల్ఈడీ బల్బు ఏర్పాటు చేసినందుకు రూ.457 చొప్పున 200 స్తంభాలకు సంబంధిత పంచాయతీ ఏటా రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు పంచాయతీ ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో 10,500 గ్రామ పంచాయతీలు మైనర్ పంచాయతీలే. కేంద్రం 14వ ఆర్థిక సంఘం పేరిట గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను కలుపుకొన్నా కూడా ఒక్కొక్క మైనర్ పంచాయతీ ఏడాది ఆదాయం ఐదారు లక్షలకు ఆటు ఇటుగానే ఉంటుంది. -
పల్లెల్లో ప్రథమ పౌరులేరీ?
విలీన కొర్రీతో పద కొండేళ్లుగా ఎన్నికలు నిల్ నాలుగేళ్లుగా ప్రత్యేక పాలనలోనే 42 పంచాయతీలు రెండున్నరేళ్లుగా అనపర్తిలో ప్రత్యేక పాలన అడుగు పడని అభివృద్ధి క్షీణిస్తున్న పారిశుద్ధ్యం మండపేట : పంచాయతీల్లో సర్వాధికారం ప్రథమ పౌరులదే. పల్లెల ప్రగతికి బాటలు వేసేది అక్కడి పాలకవర్గాలే. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిలా ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గ సభ్యులది కీలకపాత్ర. అటువంటి పాలకులు లేని పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలో మగ్గుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విలీన కొర్రీతో 42 పంచాయతీలకు ఎన్నికలు జరిగి 11 ఏళ్లు కావస్తుండగా, సర్పంచ్ల మరణాలతో ప్రథమ పౌరులు లేని పంచాయతీలు 14 వరకు ఉన్నాయి. పనిచేయని కుళాయిలు, డ్రైన్లో పారని మురుగునీరు, వెలగని వీధిలైట్లు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారుశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగు పడని అభివృద్ధి, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్లుగా ఎన్నికలకు నోచుకోక ప్రత్యేక పాలనలోనే ఆయా పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు ఎప్పుడు వస్తారో తెలీదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. 2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీకాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకు గాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలుపై కోర్టు వివాదాలు నేపధ్యంలో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 28 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4తో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. కోర్టు ఆదేశాలిచ్చినా విలీన ప్రతిపాదనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన నేతలు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఎంపీటీసీ ఎన్నికలు జరిపి చేతులు దులిపేసుకుంది. పంచాయతీ ఎన్నికల జరిపించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కారు ఎన్నికలు జరపకుండా తమ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. మరణాలు, రాజీనామాలతో మరో 14 ఖాళీ పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 14 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆయా కారణాలతో జి.మామిడాడ, ఎస్.యానాం, వెంగాయమ్మపురం, పాతర్లగడ్డ, లొల్ల, ఈస్ట్ లక్ష్మీపురం, మెగ్గళ్ల, నామవాని పాలెం, అన్నాయిపేట, లింగాపురం, ఇరుసుమండ, టీజే నగరం, దొండపాక, గంగనాపల్లి పంచాయతీలు ఇన్చార్జిల ఏలుబడిలో ఉన్నాయి. వెంటాడుతున్న సమస్యలు గ్రామ పంచాయతీల్లో సర్వాధికారం సర్పంచ్‌లదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నుంచి గ్రామాభ్యుదయానికి పాటు పడటంలోను వారిదే కీలకపాత్ర. పాలవర్గాలకు ఎన్నికలు జరగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వార్డు సభ్యులు లేకపోవడం, అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో సంవత్సర కాలంలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, ఇప్పట్లో పాలకులు లేని పంచాయతీల్లో ప్రభుత్వం ఎన్నికలు జరిపే దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. కనీసం ఆయా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పట్టించుకునే వారు లేరు దీర్ఘకాలంగా పాలకవర్గం లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీలో కలిస్తే ఉపాదిహామీ వర్తించదన్న వాదన బలంగా ఉంది. విలీనం అనివార్యమైతే ప్రజలకు వివరణ ఇవ్వాలి. - రుద్రాక్షల శ్రీనివాస్, మాజీ సర్పంచ్, నేలటూరు ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరగక పాలకవర్గం లేదు. ప్రత్యేక పాలన కావడంతో మండలంలోని రెండు పంచాయతీలకు అనపర్తి ఈఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కరువై పాలన కుంటుపడుతోంది. పారిశుద్ధ్యం లోపిస్తోంది. ఎన్నికలు జరిపి పాలకవర్గాన్ని ఏర్పాటుచేయాలి. - సత్తి వెంకటరెడ్డి, అనపర్తి కొత్తూరు -
ఐదు గ్రామాలకు పట్టణ హోదా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పెనుగొండ, మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు గ్రామాలను కలిపి పెనుగొండ నగర పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిని నగర పంచాయతీలుగా గుర్తిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. ఇప్పటికే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు ఆ గ్రామాల నైసర్గిక స్వరూపం, జనాభా వివరాలను పేర్కొంటూ నగర పంచాయతీలుగా మార్చేందుకు నివేదికలు పంపారు. ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూ రు మున్సిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీతో కలుపుకుని 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరో 5 నగర పంచాయతీలు ఏర్పాటైతే.. జిల్లాలోని మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరుతుంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్తగా ఏర్పడే అత్తిలి, ఆకివీడు, వీరవాసరం, పెనుగొండ, చింతలపూడి నగర పంచా యతీలుగా ఏర్పాటవుతాయని మున్సి పల్ వర్గాలు తెలిపాయి. మున్సిపాలిటీల్లో కలవనున్న గ్రామాలు పట్టణాలను ఆనుకుని ఉండే ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 32 గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీ నం కానున్నాయి. ఇలా విలీనమయ్యేవి వ్యవసాయేతర గ్రామాలై ఉండాలి. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలను మాత్రం మున్సిపాలిటీల్లో విలీనం చేయరు. పట్టణాలను ఆనుకుని కొంతమేర పట్టణ, పారిశ్రామిక, వాణిజ్య వాతావరణం కలిగిన గ్రామాలను మాత్రమే విలీనం చేస్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో 10 గ్రామాలను, భీమవరం మున్సిపాలిటీలో 6 గ్రామాలను, పాలకొల్లు మున్సిపాలిటీలో 3 గ్రామాలను, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 9 గ్రామాలను, తణుకు మున్సిపాలిటీలో 4 గ్రామాలను విలీనం చేయనున్నారు. దీనివల్ల జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గుతుంది. జిల్లాలో ప్రస్తుతం 928 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో కలిసే 32 పంచాయతీలు, ఐదు నగర పంచాయతీల ఏర్పాటుతో పంచాయతీల సంఖ్య ఆ మేరకు తగ్గిపోతుంది. జిల్లాలో కొత్త నగర పంచాయతీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం విషయాన్ని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పి.సాయిబాబ ధ్రువీకరించారు. -
పంచాయతీలకు షాక్
► కరెంట్ బిల్లులు రూ.34 కోట్లు ►ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇప్పటికే పది శాతం చెల్లింపు ►రెండో విడతలో 30 శాతం చెల్లించాలంటున్న విద్యుత్ అధికారులు ►నోటీసులు జారీ ఆదిలాబాద్ : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కరెంట్ బిల్లు బకాయిల షాక్ తగులుతోంది. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పది శాతం చెల్లించగా.. రెండో విడత నిధుల్లో 30 శాతం చెల్లించాలని విద్యుత్‌శాఖ పట్టుబడుతోంది. ఆ శాఖ ఏఈల ద్వారా గ్రామ పంచాయతీలకు నోటీసులూ జారీ చేసింది. దీంతో పనుల నిర్వహణ కోసం ఉపయోగించే నిధులను కరెంటట్ బిల్లులకు చెల్లించాల్సి రావడంతో సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గ్రామపంచాయతీలకు కరెంట్ బిల్లు గుదిబండగా మారింది. గ్రామపంచాయతీల్లో పనుల కోసం జనవరిలో 14వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతలో రూ.10 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నుంచి పది శాతం పంచాయతీల కరెంట్ బిల్లులు చెల్లించారు. జనవరిలో రూ.9.91 లక్షలు, ఫిబ్రవరిలో 24.33 లక్షలు కరెంట్ బిల్లు చెల్లించినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో విడత ఆర్థిక సంఘం నిధుల్లోంచి 30 శాతం నిధుల చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను పంచాయతీ అధికారులకు అందజేశారు. విద్యుత్‌శాఖ ఏఈల ద్వారా గ్రామపంచాయతీలకు నోటీసులు కూడా అందించారు. రూ.34 కోట్ల బకాయిలు.. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో విద్యుత్ బకాయి బిల్లులు రూ.కోట్ల లో పేరుకుపోయాయి. గ్రామాలకు తగినన్ని నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదు. గ్రామపంచాయతీల్లో వీధి దీపాలు, నీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాలకు కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా రూ.34.80 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. వీటిని చెల్లించాలని విద్యుత్ శాఖ నుంచి జనవరిలోనే నోటీసులు అందాయి. కానీ నిధులు లేకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. జిల్లాలో 18 మండలాల్లో 243 గ్రామçపంచాయతీలు, 508 గ్రామాలున్నాయి. అంతర్గత ఆదా య వనరులు లేకపోవడం.. ప్రభుత్వ పరంగా అవసరాలకు సరిపడా నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో పాలన కత్తిమీద సాములా మారింది. తాగునీటి పథకాలు, వి ద్యుత్ బిల్లుల భారం గ్రామపంచాయతీ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బిల్లులు భారంగా మారుతున్నాయి. పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడానికి నియంత్రణ లేకపోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ బల్బులు నిరంతరం వెలుగుతుంటాయి. దీని వల్ల విద్యుత్తు వృథా కావడంతో బిల్లులు పేరుకుపోతున్నాయి. సిబ్బంది ద్వారా గ్రామాల్లో పర్యవేక్షణ ఉంటే విద్యుత్ వృథాను అరికట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రతీనెల ఎంతో కొంత చెల్లించ డం ద్వారా భారం తగ్గే అవకాశముంది. 30 శాతం చెల్లించాల్సిందే.. గ్రామపంచాయతీల్లో పేరుకపోయిన విద్యుత్ బిల్లులు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి చెల్లించాలి. మొదటి విడత నిధుల్లో 10 శాతం మాత్రమే చెల్లించారు. రెండో విడతలో 30 శాతం చెల్లించాలి్సందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను డీపీవోకు అందజేశాం. ఏఈల ద్వారా పంచాయతీలకు నోటీసులు ఇచ్చాం. – సి.శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, విద్యుత్‌శాఖ -
వర్మీ కంపోస్ట్ యూనిట్లతో పంచాయతీలకు ఆదాయం
కరప (కాకినాడ రూరల్) : గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చెత్త సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం రీసోర్స్ పర్స¯ŒS ఎ.రవిశంకర్ సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన మండల గ్రామకార్యదర్శులతో సమావేశమై వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. యూనిట్ నిర్మాణానికి ఉపాధి నిధులు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 100 వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్మాణలో ఉన్నాయని ఆయన తెలిపారు. కరపలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి మండలానికి 5 యూనిట్లు నిర్మిస్తామన్నారు. 42 యూనిట్లు పూర్తికాగా 40 యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంతవరకు వర్మీకంపోస్ట్ యూనిట్ల ద్వారా 35 టన్నుల సేంద్రియ ఎరువు తయారైందన్నారు. ఒక టన్ను సేంద్రియ ఎరువు అమ్మితే రూ.8 వేలు వస్తుందన్నారు. గ్రామంలో చెత్త సేకరణకు హరిత రాయబారుల (ఉపాధి కూలీల)ను నియమిస్తామని చెప్పారు. వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారి ఉంటారన్నారు. ఇ¯ŒSచార్జ్ ఎంపీడీఓ గుత్తుల భీమశంకరరావు, ఈఓపీఆర్డీ సీహెచ్ వెంకటబాలాజీ, ఎఫ్డీసీ టి.రవికాంత్ పాల్గొన్నారు. -
గట్టెక్కేదెలా!
చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలు కార్యదర్శులకు గుదిబండగా మారాయి. మార్చి 15వ తేదీలోగా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు హుకుం జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక కార్యదర్శులు, సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. తలకు మించిన పనులతో ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు పన్నుల వసూలు సాధ్యం కావడం లేదు. పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలతో పాటు ఇతర పనులు కూడా చేయడం వల్ల పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టలేక పోతున్నారు. మరోవైపు ఒక్కొక్క కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు. పన్నులను తక్షణమే వసూలు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఈఓపీఆర్డీలు, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారుల దీనిపైనే కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్‌తోపాటు కార్యాలయ సిబ్బందిని సైతం పన్నుల వసూలు కోసం కేటాయించారు. అయినా ఆశించినమేర వసూలు కావడం లేదని తెలుస్తోంది. పంచాయతీల్లో పోస్టులు ఖాళీ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో పాటు బిల్లు కలెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, కార్యదర్శుళు దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా పాలన కష్టంగా మారింది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులన్నీ కార్యదర్శులే చూడాలి. దీంతో వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్యదర్శి, బిల్లు కలెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే పంచాయతీల్లో పాలన గాడిన పడుతుంది. 40 శాతం మించని వసూళ్లు జిల్లాలో 48 మండలాల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 908 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నోటిఫైడ్ పంచాయతీలు 204, నా¯ŒS నోటిఫైడ్ పంచాయతీలు 704. డివిజన్ వారీగా చూస్తే ఒక్కొక్క డివిజన్లో ఇప్పటివరకు 40 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్లో 177 పంచాయతీలు ఉండగా, రూ.10.50 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 34 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఏలూరు డివిజన్ పరిధిలో 272 పంచాయతీలు ఉండగా, రూ. 19.72 కోట్లకు గాను, 41శాతం మాత్రమే వసూలయ్యాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో 209 పంచాయతీలు ఉండగా, రూ.20.75 కోట్లకు గాను 41శాతం పన్నులు వసూలయ్యాయి. నరసాపురం డివిజన్ పరిధిలో 250 పంచాయతీలు ఉండగా, రూ.12.90 కోట్లకు గాను 45శాతం పన్నులు వసూలయ్యాయి. 34 శాతం మాత్రమే వసూలు చేసి జంగారెడ్డిగూడెం డివిజన్ చివరి స్థానంలో ఉంది. మార్చి 31 నాటికి పన్నులు వసూలు చేయాలంటే.. 44 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులతో సమావేశమై పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతం చేశాం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. గత ఏడాది 97శాతం వసూలు చేశాం. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకోసం అధికారులు , సిబ్బందిని అప్రమత్తం చేశాం. – కె.సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
చుక్కలు చూపిస్తున్నారు
- విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో ఇంటి ప్లాన్ నిబంధనలు కఠినతరం - భవన నిర్మాణదారులకు సరికొత్త ‘చెక్‌లిస్ట్’ - అవినీతి, అక్రమాలకు తావుండదంటున్న అధికారులు - ఇబ్బందులు పడుతున్న సామాన్యులు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించిన పంచాయతీల్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్యులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇంటి ప్లాన్ అనుమతుల కోసం నిబంధనలు కఠినతరం చేస్తూ సరికొత్తగా ఇచ్చిన ఉత్తర్వులే ఇందుకు కారణం. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతూండగా, ఈ విధానంలో అక్రమాలకు తావుండదని అధికారులు అంటున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం, బొమ్మూరు, రాజవోలు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు; కోరుకొండ మండలం గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి; రాజానగరం మండలం రాజానగరం, హౌసింగ్ బోర్డు కాలనీ, పాలచర్ల, చక్రద్వారబంధం, నామవరం, నరేంద్రపురం, వెలుగుబంద పంచాయతీలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ 21 పంచాయతీల్లో ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. రాజమహేంద్రవరంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో 2012 నుంచి ఈ 21 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు పాలన సాగిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీలను నియమించింది. ఈ కమిటీల కనుసన్నల్లోనే విలీన ప్రతిపాదిత 21 పంచాయతీల్లో పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం, కుళాయి మంజూరు తదితర అనుమతుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఇందులో భాగంగానే కాతేరులో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీల్లో పాలన గాడి తప్పుతుండడంతో ప్రత్యేక అధికారులను తప్పించి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజును ప్రత్యేక అధికారిగా నియమించారు. ఐఏఎస్ అధికారి కావడంతో పాలన గాడిన పెడతారన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతుల మార్గదర్శకాలను కమిషనర్ సవరించారు. 11 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్ తయారు చేసి, ఆ వివరాలు సమర్పించిన తర్వాతే నిర్మాణ అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ స్థలం హక్కు పత్రాలు, లైసెన్స్డ్ సర్వేయర్ వద్ద భవన నిర్మాణ ప్లాన్ తీసుకువచ్చి, నిబంధనల మేరకు ఫీజు చెల్లిస్తే పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారుల సంతకాలతో అనుమతులు ఇచ్చేవారు. ఇందులో అనేక అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిబంధనలను కఠినతరం చేశారు. ఈ సమాచారం ఉంటేనే అనుమతి భవన నిర్మాణదారుడు ఎంత స్థలంలో ఇల్లు కట్టాలనకుంటున్నారు, ఆ స్థలం సర్వే నంబర్, బ్లాక్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం, రిజిస్టర్డ్ దస్తావేజు, అడంగల్, ఎ-రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్, డి-ఫారం పట్టా, స్థలం అభివృద్ధి వివరాలు (గ్రామకంఠమా లేక అప్రూవ్డ్ లే అవుట్ అయితే సర్వే నంబర్, ప్లాట్ నంబర్), ల్యాండ్ కన్వర్షన్ అయితే ఆ ఉత్తర్వుల నంబర్, జారీ చేసిన తేదీ, సబ్ రిజిస్ట్రార్ ప్రకారం భూమి ధర, ఆ స్థలంలో హెచ్‌టీ విద్యుత్ వైర్లు, వాటర్ బాడీ (నది, చెరువు, వాగు), రైల్వే లైను, గ్యాస్ పైప్‌లైను, పురాతన కట్టడాలు, మత సంబంధిత నిర్మాణాలు ఉన్నాయా, ప్రతిపాదిత స్థలం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో ఉందా, ఉంటే ఆ స్థలం వివరాలను భవన నిర్మాణదారుడు సమర్పించాలి. దీంతోపాటు బెటర్మెంట్ చార్జీ, ఖాళీ స్థలంపై పన్ను, అభివృద్ధి చార్జీ, బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, పబ్లికేషన్ చార్జీ, ఇతర చార్జీలను పంచాయతీకి చెల్లించాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి భవన నిర్మాణదారు సమర్పించిన ప్లాన్‌ను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఆ వివరాలు సరిపోల్చాలి. దీంతోపాటు జీవో ప్రకారం నిర్మాణం చేపట్టాల్సిన భవనం చుట్టూ వదలాల్సిన సెట్‌బ్యాక్స్ ఉన్నాయా అన్నది పరిశీలించాలి. చివరిగా ఏమైనా రిమార్కులు ఉన్నాయేమో పేర్కొంటూ, కార్యదర్శి ధ్రువీకరించిన తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. ఈ నిబంధనలతో సామాన్యులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఏ ఒక్క వివరం లేకపోయినా అనుమతులు రాకపోవడంతో పంచాయతీల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. బిల్డర్లు, పెద్ద నిర్మాణాలు చేపట్టే వారితోపాటు స్వతహాగా చిన్న ఇల్లు నిర్మించుకునేవారికి కూడా ఒకేలా నిబంధనలు విధించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు కొంతమేర వెసులుబాటు కల్పించాలని సొంతంగా చిన్న ఇళ్లు నిర్మించుకునేవారు కోరుతున్నారు. అక్రమాలకు తావుండదు ఇప్పటివరకూ కొన్ని విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో భవనాల అనుమతుల్లో అనేక అక్రమాలు జరిగాయి. గ్రామ ప్రజల మధ్య గొడవలు చెలరేగాయి. ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే చెక్‌లిస్ట్ పెట్టాము. అందులో అడిగినవి స్థల యజమానుల వద్ద తప్పక ఉంటాయి. వాటిని తీసుకురావడంవల్ల భవిష్యత్తులో ఆయా యజమానులు, ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. - వి.విజయరామరాజు, ప్రత్యేక అధికారి, విలీన పంచాయతీలు -
ఉపాధి పనులపై 20 నుంచి గ్రామ సభలు
– ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు నంద్యాలరూరల్: ఉపాధి పనులపై ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించి సామాజిక తనిఖీ జరపాలని ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు ఆదేశించారు. బుధవారం నంద్యాల సీఎల్ఆర్సీ భవనంలో ఏపీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో డీఆర్పీలు, విలేజ్ సోషల్ ఆడిటర్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక తనిఖీల అనంతరం ఈనెల 28వ తేదీన నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బహిరంగ సామాజిక విచారణ జరుగుతుందని చెప్పారు. పనుల వారీగా ఫిర్యాదులను నమోదు చేసి మండల స్థాయి ఓపెన్ ఫోరానికి తీసుకొని రావాలని సూచించారు. -
పంచాయతీ కార్మికులకు వేతనాలివ్వాలని వినతి
గుంటూరు వెస్ట్: ఆరు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు. సోమవారం యూనియన్ ప్రతినిధి బందం డీపీవో శ్రీదేవిని కలిసి సమస్యను విన్నవించారు. డీపీవోను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.హరిప్రసాద్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పుల్లారావు తదితరులు ఉన్నారు. -
నిధులొచ్చాయ్..
∙గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత పనులకు గ్రీన్‌సిగ్నల్ పంచాయతీల్లో పేరుకుపోయిన మురుగు తొలగనుంది. అయితే నిధులు విడుదలై ఐదు రోజులయినా ఏయే పంచాయతీకి ఎంత కేటాయిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేక పోవడంతో సర్పంచ్‌లు కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా నిధులను చెత్త, మురుగు కాల్వల పరి శుభ్రత, విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కార పనులకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిధుల విషయమై జిల్లా పంచాయతీ రాజ్ అధికారిణి పి.జగదీశ్వరి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం కింద రూ.53 కోట్ల నిధులు ఐదు రోజుల క్రితం విడుదలయ్యాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏయే గ్రామ పంచాయతీలకు ఎంత నిధులు కేటాయించలన్న దానిపై మరో మూడు రోజులో తెలియజేస్తామన్నారు. -
పంచాయతీల అభివృద్ధిలో కీలకం కావాలి
డీపీఆర్సీ సభ్యులకు అదనపు కమిషనర్ సుధాకర్ సూచన సామర్లకోట : పంచాయతీల అభివృద్దిలో జిల్లా పంచాయతీ రీసోర్సు సెంటర్(డీపీఆర్సీ) సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు కమిషనర్ కె.సుధాకర్ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలడీపీఆర్‌సీ సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పంచాయతీల సిబ్బంది పనిలో లోపాల్ని గమనించి, సవరించాల్సిన బాధ్యత డీపీఆర్సీ సభ్యులపై ఉందన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ పంచాయతీ, పన్నుల సవరణ, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తరువాత మండల స్థాయిలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీలల్లో 21 రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పించామని, ఆ వ్యవధి చాలక పోతే మరో వారం పొడిగిస్తామని తెలిపారు. ఈ సెంటర్లలో సిబ్బంది సక్రమంగా పని చేసేలా చూడవలసిన బాధ్యత విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లపై ఉందన్నారు. డీపీఆర్సీ సెంటర్లలో ండే డీఎల్పీఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేసి, ఆయా జిల్లాలకు మంచిపేరు తీసుకు రావాలని సూచించారు. ప్రిన్సిపాల్ తోట కైలాస్‌గిరీశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఫ్యాకల్టీలు కె.ప్రభాకర్, రామోహనరావు, ఇ.నాగలక్ష్మి, సిల్వియా, జె.రాంబాబు, గోపాలరావు, సత్యవాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు మరిన్ని అధికారాలు
- ఈ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దాం: సీఎం కేసీఆర్ - పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు - అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేస్తాం - మంత్రి ఆధ్వర్యంలో విధివిధానాలపై అధ్యయనానికి ఆదేశం - క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీలను పటిష్టం చేయాలని, వాటి బాధ్యతను మరింత పెంచేలా విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే దీనికి సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దామని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని, అన్ని గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. దీంతోపాటు గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, పోచారం, ఈటల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకమైందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పాటు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పిచ్చిమొక్కల తొలగింపు, పిచ్చికుక్కల నివారణ, మురికి గుంటలు లేకుండా చూడటం లాంటి కార్యక్రమాలు పంచాయతీలే నిర్వహించాలన్నారు. అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు అంటు వ్యాధుల బారినపడుతున్నారని, పరిశుభ్రత పాటిస్తే ఆ దుస్థితిని నియంత్రించవచ్చని సీఎం చెప్పారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు గ్రామాభివృద్ధిలో, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీలకు 25 వేల సైకిల్ రిక్షాలను వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని, క్లస్టర్ల వారీగా కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గ్రామాల్లో డంప్ యార్డుల ఏర్పాటు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంచాయతీల ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు, రావాల్సిన అనుమతులు సకాలంలో వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామ పంచాయతీలకు అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించే అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
నిధుల్లేక నీరసం!
పంచాయతీలు, మండలాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలన్నా జిల్లా పరిషత్ నిధులే ఆధారం. అయితే కొన్నాళ్లుగా నిధుల్లేక జెడ్పీ అభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడుతుండడం, వివిధ విభాగాల ద్వారా అరకొరగా వచ్చే నిధులు కూడా నేరుగా పంచాయతీలకే వెళ్లిపోవడం వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయి. విక్రయాల ద్వారా మరికొంత నిధులొచ్చేవి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరికొంత నిధులొచ్చేవి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏడాదికి రూ. 2.5 కోట్లు ఒక్క ఇసుక ద్వారా సెస్సు ద్వారా లభించేవి. ఒక్కోసారి ఆ నిధుల్ని జెడ్పీ సర్వసభ్య సమావేశాల ద్వారా తీర్మానాలు నిర్ణయించి జెడ్పీటీసీల పరిధిలో అభివృద్ధి కోసం వెచ్చించేవారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా పరిషత్‌కు సంబంధించి ఇసుక కొత్త పాలసీ ప్రకటించారు. దీంతో కొన్నాళ్లపాటు సెస్సు కూడా వసూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ పాలసీలోని కొన్ని లోపాలు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి జిల్లా పరిషత్‌కు ఆదాయం కుంటుపడే అవకాశం కనిపిస్తోంది. - 13వ ఆర్థిక సంఘం ఇలా.. జిల్లాలో రెండు మూడేళ్లపాటు మంచినీరు, తాగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం 13వ ఆర్థిక సంఘం నిధుల కింద సుమారు రూ. 32.58 కోట్లు వచ్చేవి. వాటిలో నాలుగైదు గ్రామాలను ఓ యూనిట్‌గా సీపీడబ్ల్యూ స్కీమ్‌ల కింద ఉపయోగించారు. ఇలా ఏడాదికి రూ. 7.5 కోట్లు ఖర్చుతో 24 పథకాలు పూర్తి చేశారు. ఇప్పుడు వాటిలో కూడా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను విడగొట్టి పంచాయతీల అభివృద్ధికి కృషిచేశారు. 13 ఆర్థిక సంఘం పూర్తయి 14వ ఆర్థిక సంఘం నిధులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ నిధులన్నీ నేరుగా పంచాయతీలకే జమ అవుతుండడంతో జిల్లా పరిషత్ ఖాళీ అయిపోవాల్సి వచ్చింది. జెడ్పీకి ఎలాంటి అనుమతులూ లేకుండా పోయింది. గ్రామ పంచాయతీలన్నీ జిల్లా పంచాయతీ అధికారి పరిధిలోకి వెళ్లిపోయాయి. వస్తున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుందామన్నా జెడ్పీలో నిధుల్లేవు. అదేవిధంగా సెస్సుల ద్వారా వసూలయ్యే సాధారణ నిధులనే జిల్లా పరిషత్‌లోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఆ అవకాశం కూడా లేకపోయింది. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ ద్వారా నివేదించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు జెడ్పీ ద్వారా మంజూరయ్యేలా చూడాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడాలంటే చట్ట సవరణల అవసరాన్ని కూడా గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకోనున్నారని తెలిసింది. తడి చెత్త, పొడిచెత్త నిర్వహణ కూడా గతంలో పంచాయతీల పరిధిలోని పరిశుభ్రతను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు నిర్వహణ నిధులు లేక జిల్లా పరిషత్ చేతులెత్తేస్తోంది. జిల్లాలోని 38 మండలాల్లో అభివృద్ధి పథకాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే జెడ్పీ తీసుకోగా ఆయా విభాగాల అధికారులు ఇతర అంశాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. తడి చెత్త, పొడిచెత్త సేకరణ, డంపింగ్, తడిచెత్త, పొడిచెత్తతో ఉత్పత్తుల తయారీపైన దృష్టి సారించిన అధికారులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు అప్పగించారని తెలిసింది. జిల్లా పరిషత్‌లో పరిపుష్టిగా నిధులుంటే అన్ని రకాల అభివృద్ధి జరిగేది. నిధులు లేకపోవడంతో వివిధ ప్రభుత్వ విభాగాలపైన ఆధారపడాల్సి వస్తోంది. -
పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ
పంచాయతీ ఆదాయానికి {పభుత్వం మోకాలడ్డు భూసేకరణ పేరుతో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు నాలుగేళ్లుగా జమకాని స్టాంప్‌డ్యూటీ భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ కారణంగా జిల్లాలో పలు పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ ఆగిపోయింది. నాలుగేళ్ల నుంచి భూముల క్రయవిక్రయాలు ఆగిపోయి రూపాయి ఆదాయం లేక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. జనరల్ ఫండ్స్‌కు జమ అయ్యే ఈ స్టాంప్‌డ్యూటీ నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణమని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. నక్కపల్లి : పంచాయతీల్లో సాధారణ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధిపనులు, పంచాయతీల నిర్వహణ భారమవుతోందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో జరిగే భూముల క్రయవిక్రయాలకు సంబంధించి మార్కెట్ విలువపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించే స్టాంపు డ్యూటీలో 24శాతం స్థానిక సంస్థలకు జమవుతుంది. 15శాతం పంచాయతీలకు, 5శాతం మండలపరిషత్‌లకు, 4.25శాతం జెడ్పీలకు చేరుతుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వారు ఈ నిధులను ట్రెజరీలకు పంపిస్తే ప్రతిమూడునెలలకు ఒకసారి స్టాంప్‌డ్యూటీ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో పీసీపీఐఆర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2013 ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీరప్రాంత పరిధిలో పీసీపీఐఆర్ కిందకు వచ్చే గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలను నిలిపివేసింది. జిరాయితీ భూములను సయితం అమ్ముకోవడం, కుదువ పెట్టడానికి వీలు పడని దుస్థితి. జిల్లాలో 7 మండలాల్లోని 82 గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పీసీపీఐఆర్ పరిధిలోకి వచ్చే గ్రామాలలో భూముల క్రయవిక్రయాలు చేయొద్దంటూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీతో లావాదేవీలు నిలిచిపోయాయి. నక్కపల్లి మండలంలో దాదాపు 8 గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఈ మండలంలో ఇండస్ట్రియల్పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఐదువేల ఎకరాలసేకరణకు ఐదేళ్లక్రితం 4(1)నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. వేంపాడు, అమలాపురం, నెల్లిపూడి, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, బంగారయ్యపేట, గునిపూడిగ్రామాల్లో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించింది. ఈ ఐదేళ్ల నుంచి భూముల లావాదేవీలు నిలిచిపోయాయి. క్రయవిక్రయాలు జరిగితే పంచాయతీలకు స్టాంప్‌డ్యూటీ ఆదాయం బాగానే లభించేది. రెవెన్యూ విస్తీర్ణంతక్కువగా ఉండి చిన్నపంచాయతీలకయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు, ఎక్కువ భూములు కలిగి పెద్దపంచాయతీలకు రూ.50వేల నుంచి రూ. 1.5లక్షల వరకు ఆదాయం లభించేది. నాలుగేళ్ల నుంచి స్థానిక సంస్థలు ఈ ఆదాయాన్ని కోల్పోయాయి. భూసేకరణకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడం అమానుషమని రైతులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా స్టాంప్‌డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా రాకుండా చేస్తోందంటూ పలువురు సర్పంచ్‌లు మండి పడుతున్నారు. పంచాయతీలకు స్టాంప్ డ్యూటీయే ప్రధాన ఆదాయమని ఈ నిధులను సిబ్బంది జీతాలు, పారిశుధ్య కార్యక్రమాలు, వీథిలైట్ల నిర్వహణ వంటి పనులకు ఉపయోగిస్తామని స్టాంప్ డ్యూటీ ఆదాయం నాలుగేళ్లనుంచి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్నారు. మూడేళ్లుగా స్టాంప్‌డ్యూటీ లేదు పంచాయతీల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం నిధులివ్వడం లేదు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులపైనా పెత్తనం చేస్తోంది. వాటిని విద్యుత్ చార్జీలకు మినహాయించారు. ఈ నిధులను కేవలం తాగునీరు, రోడ్ల నిర్మాణానికే వెచ్చించాలి. పంచాయతీల నిర్వహణకు స్టాంప్‌డ్యూటీ నిధులే అధారం. మా పరిధిలో భూముల క్రయవిక్రయాలు ఆపేయడంతో స్టాంప్‌డ్యూటీ రావడం లేదు. - సూరాకాసుల రామలక్ష్మి, సర్పంచ్, అమలాపురం -
‘దారి’ దోపిడీ..!
- ఏకగ్రీవ పంచాయతీల్లో ఇష్టారాజ్యం - ప్రభుత్వ ప్రోత్సాహక నిధులతో రోడ్ల నిర్మాణం - మండల పరిషత్, ఇంజినీరింగ్ అధికారుల సహకారం - నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌లు వినుకొండ : సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు దారి తప్పుతోంది. గ్రామాలభివృద్ధి కోసం జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులు దారి మళ్లుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షలు ప్రోత్సాహంగా ఇచ్చే విధానాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7లక్షలు నిధులు మంజూరు చేశారు. ఇక్కడ నుంచే అక్రమాల తంతు మొదలైయింది. కొంతమంది సర్పంచ్‌లు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టానుసారం నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు మండల పరిషత్, ఇంజినీరింగ్ అధికారుల సహకారం కూడా జత కలవడంతో వారి పని మరింత సులభం అయింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇం దుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో గతంలో చేసిన పనులకు, సీసీ రోడ్లు నిర్మాణాలకు, బోరింగ్ల ఏర్పాటుకు నిధులు డ్రా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు చేసిన అభివృద్ధి పనులకు బి ల్లులు మార్చుకుంటున్నారు. రెండు లక్షల రూపాయల వరకు చేసే పనులకు స్థానికంగా ఉండే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి పాదిత నిధులు గ్రాంట్ చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఒకే వర్క్‌ను ముక్కలు ముక్కలు గా విభజించి స్థానికంగానే రెండు లక్షలలోపు అంచనాలు వేస్తూ పనులు ముగిస్తున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు వేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలు ఇవే.. వినుకొండ మండల పరిధిలో భారతాపురం, చాట్రగడ్డపాడు, గోకనకొండ, గోనుగుంట్లవారిపాలెం, హస్సానాయునిపాలెం, పెరుమాళ్ళపల్లి, నూజండ్ల మండల పరిధిలో గుర్రప్పనాయుడుపాలెం, జంగాలపల్లి, భూమాయిపాలెం, పెద్దవరం, పమిడిపాడు. ఈపూరు మండల పరిధిలో వనికుంట, గోపువారిపాలెం, చిట్టాపురం. బొల్లాపల్లి మండల పరిధిలో రేమిడిచర్ల. శావల్యాపురం మండలంలో ఇర్లపాడు, చినకంచర్ల, శానంపూడి, పోట్లూరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా 15 వేలలోపు ఉ న్న పంచాయతీలు కావటంతో ఒక్కో పంచాయతీకి రూ.7లక్షలు నిధులు మంజూరయ్యాయి. నిబంధనలు ఇవీ.. పంచాయతీ పరిధిలో కనీసం 100 మీటర్లు వర కు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ఉపాధి హామీ నిధులు, 13వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలి. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలి, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే విడుదలైన నిధులు మొత్తం సీసీ రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది గతంలో వేసిన సీసీ రోడ్లకు బిల్లులు చేయించుకుంటున్నారు. రోడ్లను నాసిరకంగా నిర్మిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. - జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు : 138 - నరసరావుపేట డివిజన్ పరిధిలో : 46 - వినుకొండ నియోజకవర్గ పరిధిలో : 18 నియమావళి ప్రకారమే ఖర్చు .. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహంగా విడుదల చేసిన నిధుల ను నియమాళి ప్రకారం ఖర్చు చేస్తున్నారు. సిమెంటు రోడ్ల నిర్మాణాలకు ఎన్ఆర్ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులను కలిపి పనులు చేస్తున్నారు. గతంలో వేసిన రోడ్లకు బిల్లులు చెల్లించిన దాఖలా లేదు. నా దృష్టికి వస్తే పరిశీలిస్తా. - విజయభాస్కరరెడ్డి, నర్సరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి -
మాకేంటి?
- నాలుగున్నర లక్షలతో రోడ్డు వేస్తున్నావ్. నాలుగు వేలు ఇస్తే ఎలా? ఫైవ్ పర్సంట్ ఇవ్వాల్సిందే. లేదంటే రోడ్డు పనులు జరగనీయను. (కాంట్రాక్టర్‌కు ఓ అధికార పార్టీ కార్పొరేటర్ బెదిరింపు) - స్టాండింగ్ కమిటీ అంటే ఎంతో కొంత అందుతుంది - అనుకున్నాం. ఏడాది కావొస్తుంది ఒక్క రూపాయీ రాలేదు. అజెండాలోని తీర్మానాలను తల ఊపి వచ్చేందుకే ఈ పదవి ఉన్నట్లుంది. అబ్బే ఇదేం బాగోలా. స్టాండింగ్ కమిటీ చైర్మన్ నేనైతే ఇలా ఉండేది కాదబ్బా. (స్టాండింగ్ కమిటీ సభ్యురాలి అభిప్రాయం..) - టీడీపీలో కాసుల గోల - ఏడాదైనా రూపాయి సంపాదన లేదంటున్న కార్పొరేటర్లు - మేయర్‌కు తలనొప్పి - అభివృద్ధి పనులకు అడ్డంకి ఇలా.. టీడీపీలో కాసుల గోల మొదలైంది. పైసల కోసం అధికార పార్టీ కార్పొరేటర్లు రోడ్డెక్కుతున్నారు. నగరాభివృద్ధికి అడ్డుపడుతూ పంచాయితీలు పెడుతున్నారు. పాలన ఆరంభించి ఏడాది పూర్తయినా పైసా ముట్టలేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తుండగా.. ఈ పంచాయితీలను పరిష్కరించలేక మేయర్ తలపట్టుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు పైసలే పరమావధిగా అందినకాడికి దండుకుంటుంటే.. మరి కొందరు చేతికేమి అందక లబోదిబోమంటున్నారు. ‘లక్షలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చాం. కనీసం వాటినైనా సంపాదించుకోకపోతే ఎలా?’ అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే టౌన్‌ప్లానింగ్‌ను అడ్డం పెట్టుకుని నలుగురు కార్పొరేటర్లు దందా చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజ్‌ల కోసం చేయి చాస్తుండటంతో వసూళ్ల గుట్టురట్టవుతోంది. కార్పొరేషన్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. వీటితో 59 డివిజన్లలో 300 పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి నిర్మాణ దశలో ఉన్నాయి. పర్సంటేజ్ విషయంలో తేడా రావడంతో ఓ కార్పొరేటర్ రోడ్డు పనులు నిలుపుదల చేయాల్సిందిగా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సంబంధిత అధికారి చెబితే కానీ తాను నిలుపుదల చేయనని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాధానానికి ఫీలైన సదరు కార్పొరేటర్ మేయర్ కోనేరు శ్రీధర్ వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. అభివృద్ధి పనులు జరగనివ్వాలని, వ్యక్తిగత స్వార్థంతో అడ్డుకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని మేయర్ ఆ కార్పొరేటర్‌కు హితవు చెప్పినట్టు భోగట్టా. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇదే ధోరణి ప్రదర్శిద్దామనుకుంటున్న మరికొందరు కార్పొరేటర్లు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. పట్టించుకోకపోతే ఎలా.. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవినే ఓ మహిళా కార్పొరేటర్ టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం మేయరే స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలి. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోంది. నిబంధనలపై అవగాహన లేని ఆ కార్పొరేటర్ రూ.25 లక్షలు ఖర్చు చేసైనా స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతా.. అనడంతో తోటి కార్పొరేటర్లు ఆశ్చర్యపోయారు. భవానీపురం మహ్మదీయ కో-ఆపరేటివ్ సొసైటీ (దర్గా భూములు), శ్రీకనకదుర్గా లే అవుట్ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లకే మేయర్ ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ఆరోపణ. భారీ డీల్స్ చేసినప్పుడైనా తమను పట్టించుకోకపోతే ఎలా? అని వారు వాపోతున్నారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయాల్లో సైతం తమను డమ్మీలను చేసి మేయరే కథ నడిపించేస్తున్నారని కార్పొరేటర్ ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పదవులపై కన్ను ఏడాది పాలన పూర్తవడంతో ఆశావహులు కొందరు పదవులపై కన్నేశారు. డెప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశాలను దక్కించుకునేందుకు పొలిటికల్ గాడ్‌ఫాదర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తూర్పు నియోజకవర్గానికి మేయర్, సెంట్రల్‌కు డెప్యూటీ మేయర్, పశ్చిమకు ఫ్లోర్‌లీడర్ పదవుల్ని గతంలో కేటాయించారు. మేయర్‌ను ఇప్పట్లో మార్చే ఆలోచనలో అధిష్టానం లేదని సమాచారం. దీంతో మిగిలిన పదవుల్ని దక్కించుకోవడం కోసం కార్పొరేటర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 44వ డివిజన్‌కు చెందిన కాకు మల్లిఖార్జున యాదవ్ డెప్యూటీ మేయర్, 28వ డివిజన్‌కు చెందిన యదుపాటి రామయ్య ఫ్లోర్‌లీడర్ పదవుల్ని ఆశిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లిఖార్జున యాదవ్ మూడు నియోజకవర్గాల నుంచి కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం మాటెలా ఉన్నా అధికార పార్టీ కార్పొరేటర్లు కాసులు, పదవులపై దృష్టిసారించడం హాట్ టాపిక్‌గా మారింది. -
ఆ పత్రాల జారీ ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తీరును కేంద్రం ఆక్షేపించింది. జనన నమోదు లేదా మృతి చెందిన వారి తరఫు బంధువులకు పెన్షన్ లేదా భూముల బదలాయింపు తదిత రాలకు అవసరమైన డెత్ సర్టిఫికెట్లకోసం వస్తే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పడం దారుణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ (బర్త్స్ అండ్ డెత్స్)...రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పంచాయితీలు, మున్సిపాలిటీల్లో జారీ చేస్తారు. అయితే వాటికోసం సామాన్యులు వారంరోజులపాటు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ పత్రాల జారీలో తీవ్ర జాప్యంపాటు, ప్రతి పత్రానికి ఓ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. వాస్తవానికి జనన లేదా మరణ నమోదు జరిగాక తొలి కాపీని ఆర్బీడీ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. అయితే ఎక్కడా అలా జరగడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సామాన్యులు డబ్బు చెల్లించి అవసరమైన పత్రాలను తెచ్చుకుంటున్నారు. ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు పత్రాల జారీలో అవకతవకలపై రాష్ట్రం నుంచి ఫిర్యాదులందడంతో ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇది సామాన్యుడి సేవకు సంబంధించిన అంశమని, సవ్యంగా జరగకపోతే సంబంధితులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. సామాన్యుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని పేర్కొంది. జాప్యం కాకుండా చూడండి రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్యాలయాలు లేదా మున్సిపాలిటీల్లో ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం కాకుండా చూడాలని చీఫ్ రిజిస్ట్రార్ (బర్త్స్ అండ్ డెత్స్) ఆయా విభాగాలకు లేఖ రాశారు. బర్త్ రిజిస్ట్రేషన్ల విభాగంలో ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉద్యోగి పనిచేస్తుంటే బదిలీ చేయాలని, పత్రాల జారీకి డబ్బు అడిగితే ఆర్బీడీ చట్టంలోని సెక్షన్ 23(2) ప్రకారం జరిమానా విధించాలని లేదా చర్యలు తీసుకోవచ్చని సదరు లేఖలో పేర్కొన్నారు. సామాన్యులకు తక్షణమే అవసరమైన పత్రాలను జారీచేయాలని సూచించారు. -
నేడు ఓటరు జాబితా ప్రదర్శన
పంచాయతీలు, వార్డు స్థానాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో సోమవారం ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల వివరాలను అన్ని పంచాయతీల్లో ప్రచురిస్తారు. దీనికి సంబంధించి శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి, డీపీఓ ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఖాళీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
పంచాయతీలకూ వెబ్సైట్లు
- నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా ఏర్పాటు - సర్పంచులు, కార్యదర్శులకూ కంప్యూటర్ శిక్షణ హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమాచారం త్వరలోనే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికీ సాక్షాత్కారం కానుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వెబ్సైట్ రూపకల్పన బాధ్యతలను నేషనల్ పంచాయత్ పోర్టల్ విభాగానికి కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అప్పగించింది. www.panchayatportals.gov.in ద్వారా వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు తమ పంచాయతీలకు చెందిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేలా నేషనల్ పంచాయతీ పోర్టల్స్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. ప్రధానంగా గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలకమైన 13 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రామం గురించి, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గ్రామ సభ వివరాలు, బడ్జెట్, పంచవర్ష ప్రణాళిక-నిర్వహణ, కొత్త వార్తలు, అధికారుల టూర్ డైరీ, అధికారుల సమావేశాల్లో చేసిన తీర్మానాలు, చూడదగిన ప్రదేశాలు, మ్యాపులు, రవాణా సదుపాయాలు, పనుల టెండర్లు, ప్రజలకు తెలపాల్సిన సమాచారం.. తదితర అంశాలను పొందుపరిచేలా డిజైన్ చేశారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే ఉత్తర్వులు, సర్క్యులర్లు ఆయా గ్రామ పంచాయతీల వెబ్సైట్లలోనూ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులకు కంప్యూటర్ శిక్షణ గ్రామ పంచాయతీల వెబ్సైట్ నిర్వహణ, గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలను అప్లోడ్ చేయడం, పరిపాలనకు సంబంధించిన వివరాల నమోదు.. తదితర అంశాలపై గ్రామ సర్పంచులతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అందిస్తోన్న ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 10,994 మంది డిగ్రీ చదువుకున్న ప్రజాప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో 3,351 మంది సర్పంచులు, 3,300 మంది పంచాయతీ కార్యదర్శులు, 366 మంది జడ్పీటీసీలు, 4,277 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఈనెల 29న ప్రారంభమైన తొలివిడత శిక్షణకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తుండగా, మలివిడతలో ఎంపీటీ సీలకు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వనున్నారు. తమిళనాడుకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. గ్రామ పంచాయతీల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వెబ్సైట్(ఆన్లైన్) వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
పంచాయతీలకు విద్యుత్ షాక్
బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలన్న సర్కారు పాత బకాయిలు రూ.942 కోట్ల వరకు ఉన్నాయని డిస్కంల వెల్లడి బిల్లులన్నీ అశాస్త్రీయమైనవే అంటున్న సర్పంచులు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలపై విద్యుత్ పిడుగు పడనుంది. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులన్నీ విద్యుత్ బకాయిలకే వెళ్లిపోతున్నాయి. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతాన్ని విద్యుత్ బకాయిల చెల్లింపునకే వినియోగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ అటకెక్కనున్నాయి. మరోవైపు సర్కారు నిర్ణయంతో గ్రామ పంచాయతీల సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను ఇప్పటికిప్పుడు పంచాయతీలే భరించాలనడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ సర్కారే చెల్లించాలి.. పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇటీవల రూ.279 కోట్లు రాగా.. ఏప్రిల్, మే నెలల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.580 కోట్లు అందనున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.942 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని డిస్కంలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్కారు తాజాగా సర్క్యులర్ జారీచేసింది. దీనిపై సర్పంచులు మండిపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులన్నింటినీ ప్రభుత్వమే చెల్లించేదని.. ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే వెచ్చిస్తే.. పంచాయతీల నిర్వహ ణ ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు. బిల్లులు తప్పులతడకలు! గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కాజేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని.. వారు చూపుతున్న బిల్లులన్నీ అశాస్త్రీయమైనవని సర్పంచులు ఆరోపిస్తున్నారు. కొందరు సర్పంచులు తమ గ్రామాలకు విద్యుత్ అధికారులు ఇచ్చిన బిల్లులను ఇటీవల సచివాలయానికి తీసుకొచ్చి ఉన్నతాధికారులకు చూపారు కూడా. రూ.లక్షల్లో ఉన్న ఆ బిల్లులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలంలోని మింటపల్లి గ్రామానికి రూ.7.5లక్షలు, అంకూర్ గ్రామానికి రూ.17లక్షలు, చిట్యాల గ్రామానికి రూ.28 లక్షలు కరెంటు బిల్లు రావడం విశేషం. అసలు ఆయా గ్రామాల్లో జనాభా వెయ్యి నుంచి రెండువేల లోపే. అందులోనూ కేవలం మంచినీటి సరఫరాకు, రాత్రివేళ వీధిలైట్లకే విద్యుత్ వాడతారు. అయినా ఇంతగా బిల్లులు రావడమేమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో జరిగే విద్యుత్ చౌర్యం, సరఫరా నష్టాన్ని కూడా పంచాయతీల ఖాతాలోనే వేస్తామనడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, అవసరమైన చోట మీటర్లు అమర్చడం విద్యుత్ శాఖ బాధ్యత అని పేర్కొంటున్నారు. 80 శాతం ఇవ్వాలన్నాం గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చాం. పాత బకాయిలే అయినప్పటికీ వాటిని చెల్లించక తప్పదు. ఆర్థిక సంఘం నుంచి అందిన నిధుల్లో 80 శాతం బకాయిల చెల్లింపుకోసం వినియోగించాలని చెప్పాం. ఇక గ్రామ పంచాయతీలన్నింటికీ విద్యుత్ మీటర్లు తప్పనిసరిగా అమర్చాలని కూడా విద్యుత్ శాఖకు సూచించాం. ఇంటిపన్ను వసూళ్లు పెరిగినందున నిర్వహణ వ్యయానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. - అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్ మీటర్లు బిగించాలి గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు అని చెబుతూ డిస్కంలు అశాస్త్రీయమైన బిల్లులు చూపి సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 8,635 పంచాయతీల్లో కేవలం ఐదు శాతం వాటికే విద్యుత్ మీటర్లున్నాయి. డిస్కంలు చూపుతున్న పెండింగ్ బకాయిలను సర్కారే చెల్లించాలి. పంచాయతీలకు మీటర్లు బిగించాక వచ్చే బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. - పురుషోత్తమ్, మింటపల్లి గ్రామసర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆందోళన చేపడతాం పాత బకాయిల పేరిట లక్ష ల రూపాయల భారాన్ని పంచాయతీలపై మోపడం సరికాదు. గతంలో మాదిరిగానే పంచాయతీల కరెంటు బిల్లులను సర్కారే భరించాలి. రూ.లక్షల్లో వచ్చిన బిల్లులపై విచారణ చేయించి, వాస్తవాలేమిటో నిగ్గు తేల్చాలి. ఈ విషయమై సర్కారుకు నివేదిస్తాం. సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన చేపడతాం. - సత్యనారాయణరెడ్డి, తెలంగాణపంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు -
'సీఎంతో చర్చించి సర్పంచ్ ల గౌరవ వేతనం పెంచుతాం'
హైదరాబాద్: సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి, వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని, క చ్చితంగా గౌరవ వేతనాలను పెంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జిల్లా పరిషత్తు ఛైర్మన్లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పంచాయతీల్లో చెక్ పవర్‌ని కేవలం సర్పంచులకు పరిమితం చేస్తూ, జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సొమ్మును పారదర్శకంగా ఖర్చు చేయాలని, తాము కేవలం ధర్మకర్తలం మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాల్లో పన్నుల చెల్లింపులు పెరిగాయని, అయితే వాటిని మరింతగా పెంచి గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చాలన్నారు. ఈ ప్రయత్నంలో తన నియోజకవర్గం సిరిసిల్లాలో దాదాపు వందశాతం పన్నుల వసూలును పూర్తి చేసిన విషయాన్ని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా గౌరవ వేతనాలను పెంచుతామని, వారికి ప్రోటోకాల్ గౌరవాన్ని కల్పిస్తామన్నారు. నిధుల విషయంలో స్థానిక సంస్థలకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, 13వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకే ఇచ్చామన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామి, సీఎంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల విద్యుత్తు కనెక్షన్లను తీసేయకుండా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా పూర్తి చేసిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వ్యవస్థలను అధ్యయనం చేశామన్నారు. తాము స్థానిక సంస్థలు అధికారాలు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని, అయితే వారు కచ్చితంగా బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, తద్వారా నిజమైన గ్రామీణ ప్రగతిని సాధిస్తామన్నారు. స్థానిక సంస్థల ద్వారానే బంగారు తెలంగాణ సాధించాలన్న ముఖ్యమంత్రి కలను సాకారం చేస్తామని, ఇందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనిత రాంచంద్రన్, ఎంఎల్సీలు నరేందర్‌రెడ్డి, రాముల నాయక్ పాల్గొన్నారు. -
నత్తనడకన పన్నుల వసూళ్లు
మిర్యాలగూడ : పంచాయతీలలో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. రెండు మాసాలుగా జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిలతోపాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 20.09 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ రెండు మాసాల కాలంలో కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా రెండు, మూడు గ్రామాలకు ఒక్కే ఇన్చార్జ్గా వ్యవహరించడం వల్ల కూడా పన్నులు వసూలు కావడం లేవు. పన్నుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. 13వ ఫైనాన్స్ నిధులు రూ.88 కోట్లు మంజూరు గ్రామాలలో ఆస్తి పన్నులు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలకు గాను 13వ ఫైనాన్స్ నిధులు 88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోపాటు పన్నుల రూపంలో వసూలైన వాటిని కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించనుంది. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి గాను చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ భూమి ఉన్నచోట అదే భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలు, రోడ్లు చెత్త లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 31లోగా 80 శాతం పన్ను వసూళ్లకు ఆదేశాలు ఈ నెల 31వ తేదీ లోగా గ్రామ పంచాయతీలలో 80 శాతం ఆస్తి పన్ను వసూళ్లకు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఒక్కొక్క మండలంలో కనీసం ఐదు గ్రామాల చొప్పున 300 గ్రామాల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు గాను డివిజన్ స్థాయిలలో పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. -
పంచాయతీలుగా 1700 తండాలు: కేటీఆర్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల జనాభా గల 1700 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు తండాల్లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నేరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు. గిరిజనులకు విద్యా, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 13 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ వివరించారు. -
'పంచాయతీలుగా 1700 గిరిజన తండాలు'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల పైచిలుకు జనాభా ఉన్న 17వందల గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం, ఎర్రగడ్డ, బాబాయి చెరువు, వన్‌పల్లి తండాలలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన గిరిజన కమ్యూనిటీ భవనాలకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పెద్ద మొత్తంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మెనిపేస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నేరవేర్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. గిరిజనుల చిరకాల వాంఛ అయిన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్ల్లు పేర్కొన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి రంగాల్లో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలను పెళ్లికి ముందే ఇచ్చుటకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అర్హత గల వారందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నియోజకవర్గానికి రూ.25కోట్లు మంజూరు చేయగా.. అందులో ఎల్లారెడ్డిపేట మండలానికి రూ.8కోట్లు కేటాయించామన్నారు. వీటితో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. రూ.13కోట్లతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. (ఎల్లారెడ్డిపేట) -
60 పంచాయతీల్లో ఉపాధికి గండి !
- కొత్త ఎఫ్‌ఏలను నియమించకపోవడమే కారణం - సెప్టెంబర్ 2 నుంచి కొత్త నియామకాలు నిలిపివేసిన సర్కారు - వలసబాట పడుతున్న జిల్లా వాసులు - కొత్త నియామకాలకు వెల్లువెత్తుతున్న సిఫార్సులు విజయనగరం మున్సిపాలిటీ : వలసలను నివారించి ఉన్న ఊరిలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ హామీ పథకం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోతోంది. వ్యవసాయ పనులు ముగిసిన అనంతరం జిల్లావ్యాప్తంగా గత ఏడాది నవంబర్ నుంచి 34 మండలాల్లో ఉపాధి పనులు పునఃప్రారంభించినప్పటికీ 60 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు దొరకని పరిస్థితి నెలకొంది. కొత్తవారిని ఇంతవరకూ నియమిం చకపోవడంతో పనులు చూపేవారు లేక ఆయా పంచాయతీల వారు ఉపాధి కోసం వలసబాట పట్టే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలోని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం గమనార్హం. ఉపాధి పనుల్లో అవకతవకలకు, అక్రమాల కు పాల్పడినట్టు సామాజిక తనఖీల ద్వారా గుర్తించి, 60 గ్రామ పంచాయతీలకు చెందిన 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను గత ఏడాది విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తవారిని నియమించలేదు సరికదా.. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ నియామకాలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీల్లో వందలాది మంది వేతనదారులు ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో ఒక గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగిస్తే పక్క పంచాయతీలో వారు విధులు నిర్వహించే ఇన్‌ఛార్జి బాధ్యతలతో నెట్టుకొచ్చేవారు. అయితే ఉపాధిలో అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతుండడంతో అధికారులు ఆధునాత పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్‌కు కేటాయించిన సెల్‌ఫోన్ ద్వారానే ఆ వారంలో ఎంతమంది ఉపాధి పనులకు దరఖాస్తులు చేసుకున్నారు..వారికి కల్పించిన పని వివరాలు, ఉపాధి పనికి వచ్చిన వేలిముద్రలతో హైదరాబాద్‌లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వాహకులకు ప్రతి రోజు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పక్క పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ సెల్‌ఫోన్ సదరు గ్రామ పంచాయతీలోని వేతనదారుల సమాచారాన్ని అంగీకరించకుండా ఉండే విధంగా ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నియామకాలకు సిఫార్సుల వెల్లువ ఖాళీగా ఉన్న 60 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల నియామకాలకు అధికార పార్టీ నేతల సిఫార్సులతో డ్వామా అధికారులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష యంలో రాష్ట్ర మంత్రుల సంతకాలు చేసిన సిఫార్సులు లేఖలు అందుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 2 నుంచి కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, మళ్లీ ఆదేశాల వచ్చిన తరువాతనే నియామకాలు చేపడ తామని అధికారులు చెబుతున్నారు. -
మోక్షమేది..?
ఈ పంచాయతీలకు గ్రహణం సాక్షి, మహబూబ్‌నగర్: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో పరిపాలన పారదర్శకంగా మార్చేందు కోసం తలపెట్టిన ఈ పంచాయతీలకు గ్రహణం పట్టింది. జిల్లాలోని 320 గ్రామాలను సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పంచాయతీల ద్వారా పరిపాలనను మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించింది. ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాలు.. తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచనున్నారు. అందుకు అనుగుణంగా గ్రామాల ఎంపిక, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆపరేటర్లు తదితర చర్యలన్నీ పూర్తయ్యాయి. అయితే రోజులు, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వీటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలో మొత్తం 1310 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల ఎంపికకు గ్రామ పంచాయతీ పరిధిలోని జనాభా, ఆదాయం, ఇంటర్నెట్ సౌకర్యం తదితరాల ఆధారం చేసుకొని ఈ పంచాయతీలను ఎంపికచేశారు. వీటిలో మొదటి విడతగా నాలుగు డివిజన్ల పరిధిలోని 320 గ్రామ పంచాయతీలను ఈ కంప్యూటరీకరణ చేయాలని తెలంగాణ సర్కారు భావించింది. అందుకోసం కంప్యూటర్లు కూడా మంజూరయ్యాయి. జిల్లా అవసరాల నిమిత్తం మొత్తం 392 కంప్యూటర్లు వచ్చాయి. వీటిని గ్రామ పంచాయతీలతో పాటు పరిపాలన అవసరాల నిమిత్తం వినియోగించేలా ప్రణాళిక రచించారు. కంప్యూటర్లను కూడా పంచాయతీలకు పంపించారు. ఈ కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం కోసం బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 205 కంప్యూటర్లకు నెట్ సౌకర్యం కల్పించారు. మిగతా వాటికి బీఎస్ఎన్ఎల్ సదుపాయం కల్పించడం కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ పంచాయతీల నిర్వాహణ కోసం రాష్ట్రస్థాయిలో కార్వి అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. కంపెనీ కూడా బాధ్యత నిర్వహించడం కోసం ఆపరేటర్లకు శిక్షణనిచ్చింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సర్కారు నుంచి ఆదేశాలు అందకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. అందనున్న సేవలు: ఈ పంచాయతీల సేవలు ప్రారంభమైతే సకల సమాచారాన్ని ఒక క్లిక్‌తో తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు సేవలు కూడా మరింత సరళతరంగా, పారదర్శకంగా అందుతాయి. పన్నుల వసూలు, వ్యాపార లెసైన్స్‌లు, లేఅవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ పత్రాలు, గ్రామంలోని భూములు, సరిహద్దులు, మన ఊరు- మన ప్రణాళికలతో పాటు పంచాయతీ పరిధిలో తీసుకునే పలు కీలక పనుల వివరాలు, వ్యయ నిర్వహణతో సహా సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ సేవ ద్వారా అందే సేవలన్నింటినీ అందజేయనున్నారు. అలాగే గ్రామసభల్లో చేసిన తీర్మానాలను కూడా పౌరులు తీసుకునేలా వీలు కల్పించనున్నారు. ఈ పంచాయతీకి ఎంపికైన గ్రామాలు డివిజన్ \u3149?ట్చఛగ్రామాలు మహబూబ్‌నగర్ 93 గద్వాల 81 నారాయణపేట 77 నాగర్‌కర్నూలు 69 మొత్తం 320 మంజూరైన కంప్యూటర్లు 392 -
అభివృద్ధికి ‘షాక్’
జిల్లాకు రూ.192 కోట్లు ఆర్థిక సంఘం నిధులు కరెంటు బకాయిలు రూ.105 కోట్లు పాత బిల్లులకు జమ చేయాలని నిర్ణయం పంచాయతీల్లో అభివృద్ధికి మంగళం చిత్తూరు: పేరుకుపోయిన కరెంటు చార్జీల పాత బకాయిలు పంచాయతీలకు శాపంగా మారాయి. రెండు విడతలుగా జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు 192 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.105 కోట్లు కరెంటు చార్జీలు చెల్లించాలనే అధికారుల నిర్ణయంతో పంచాయతీల్లో అభివృద్ధి పడకేసే పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. ఎన్నికల అ నంతరం ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే మొదటివిడతలో జిల్లాకు కేటాయించిన *67.5 కోట్లలో *39.5 కోట్లు గతంలో విడుదల అయ్యాయి. తాజాగా మిగిలిన *28 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కొంతమేర విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడత కింద మరో *125 కోట్లు త్వరలో జిల్లాకు అం దే పరిస్థితి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలి పారు. ఒక్కో వ్యక్తికి *400 దామాషాన జిల్లాలో 31.5 లక్షల జనాభా ఉన్నం దున మొత్తం *125 కోట్ల నిధులు జిల్లాకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నిధులతో గ్రామపంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించాలి. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపారు. అభివృద్ధి సందేహమే జిల్లాకు రూ. కోట్లు నిధులు వస్తున్నా పంచాయతీలు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో 1,363 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో విద్యుత్ బకాయిలు * 105 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మేజర్ పంచాయతీలు మాత్ర మే కరెంట్ బిల్లులు చెల్లిస్తుండగా మిగిలిన పంచాయతీలు బిల్లులు చెల్లించక పోవడంతో పేరుకుపోయాయి. దీంతో అధికారులు 13 వ ఆర్థిక సంగం నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే బకాయిలు *105 కోట్లు ఉండడంతో దాదాపు ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలు చెల్లిం చేందుకు సరిపోయే పరిస్థితి నెలకొంది. కొంత చెల్లిస్తాం అధికారులు మాత్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో తొలివిడతలో కొంత మేర బకాయిలు చెల్లించి, మిగిలిన బకాయిలు రెండో విడత నిధులతో చెల్లించడం ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా చూస్తామని చెబుతున్నారు. కానీ విద్యుత్ బకాయిలు చెల్లించిన తరువాత అభివృద్ధికి నిధులు మిగిలేది నామమాత్రమే. మిగిలిన * 153 కోట్ల నిధుల్లో ఒక్కో పంచాయతీకి కేవలం * 11 లక్షల నిధు లు మాత్రమే వస్తాయి. ఈ లెక్కన 1,363 పంచాయతీల్లో నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు. అభివృద్ధి అటెకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నిధులు విద్యుత్ బకాయిలకే పరిపోతే మేము ఎలా పనిచేయాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి అయినా నిధులిచ్చి, విద్యుత్ బకాయిలు చెల్లించడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. -
పంచాయతీలకు ‘షాక్’
మొండి బకాయిలపై విద్యుత్ శాఖ దృష్టి 8 970 పంచాయతీలు.. రూ.56 కోట్ల బకాయి 8 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2.6 కోట్ల చెల్లింపు విజయవాడ/ గుడ్లవల్లేరు : జిల్లా విద్యుత్ శాఖ మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించింది. దాదాపు వేల సంఖ్యలో మొండి బకాయిదారులు విద్యుత్ శాఖ జాబితాలో ఉన్నారు. అలాగే జిల్లాలో 40కుపైగా ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని పంచాయతీల నుంచి కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. దీంతో పంచాయతీలకు ఇటీవల మంజూరైన 13వ ఆర్థిక సంఘం నిధులపై దృష్టి సారించి కొంత వసూళ్లు చేశారు. ఫలితంగా పది రోజుల వ్యవధిలో జిల్లాలోని పంచాయతీల నుంచి రూ.2.6 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. ఇటీవల జిల్లాకు 13వ ఆర్థికసంఘం మూడో త్రైమాసిక నిధులు రూ.12.96 కోట్లు మంజూరయ్యాయి. వాస్తవానికి ఈ నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీరోడ్ల నిర్మాణం, డైయిన్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి అవసరాల కోసం వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. అయితే గడచిన మూడేళ్లుగా జిల్లాలోని పంచాయతీల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు కావడం లేదు. ఈ క్రమంలో మొండి బకాయిలపై విద్యుత్ శాఖ కొంత సీరియస్‌గా స్పందించింది. దీంతో బకాయిలు చెల్లించాలని పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారులకు వరుస లేఖలు పంపారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అయితే విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేశారు. జిల్లాలో మొత్తం 970 పంచాయతీలున్నాయి. వీటిలో 720 మైనర్ పంచాయతీలు కాగా, 150 మేజర్ ఉన్నాయి. వీటిలో మైనర్ పంచాయతీల బకాయిలే అధికం. ఈ క్రమంలో పంచాయతీలకు మంజూరైన 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు కొంత చెల్లించాలని కోరారు. జిల్లా అధికారులు ఈవిషయంపై కలెక్టర్, ఇతర అధికారులతో చర్చలు జరిపి బకాయిలు చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతానికి 13 ఆర్థిక సంఘం నిధులతో బకాయిలు చెల్లించటానికి అంగీకారం రావడంతో కొన్ని పంచాయతీలు బకాయిలు చెల్లించాయి. మేజర్ పంచాయతీల్లో 60 శాతం బకాయిలు సక్రమంగానే చెల్లింపులున్నాయి. అదికూడా ప్రతినెలా కాకుండా ఏడాదికి ఒకసారి విద్యుత్ బిల్లు, పాత బకాయిలు చెల్లిస్తున్నారు. గడచిన ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగడం , నూతన పాలక వర్గాలు కొలువు తీరడంతో బకాయిల కోసం వరుస లేఖలు రాశారు. ఫలితంగా రూ.2.6 కోట్లు బకాయిలు రాబట్ట గలిగారు. ఈ నెలాఖరు నాటికి మరికొంత వసూలు అయ్యే అవకాశం ఉంది. రూ. 56 కోట్ల బకాయి! జిల్లాలో పంచాయతీల బకాయి రూ. 56 కోట్లు ఉంది. గడిచిన మూడేళ్ళుగా మైనర్ పంచాయితీలు 90 శాతం వరకు మేజర్ పంచాయితీలు 40 శాతం వరకు బకాయిలు చెల్లించలేదు. జిల్లాలో 720 మైనర్ పంచాయతీలు 40 కోట్లు బకాయిలు ఉన్నాయి. 150 మేజర్ పంచాయతీలు 16 కోట్లు బకాయిల రావాల్సి ఉంది. వీటిలో గడిచిన నెలలో మేజర్ పంచాయతీల నుంచి రూ.2.3 కోట్లు , మైనర్ పంచాయతీల నుంచి రూ.40 లక్షలు వసూలయ్యాయి. అసలు జిల్లాలో ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించని పంచాయతీల నుంచి కనీసం కొంతమొత్తం అయినా వసూళ్లు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరోమారు అన్ని పంచాయతీలకు నోటీసులు పంపాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ మోహనకృష్ణ సాక్షితో మాట్లాడుతూ బకాయిలు రూ.56 కోట్లు ఉంటే కేవలం రూ.2.6 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని, మిగిలిన బకాయిల వసూళ్లకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నెలాఖరు నాటికి మరికొంత బకాయి వసూలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
ఆ గ్రామ పంచాయతీల నోరునొక్కే యత్నం!
వ్యతిరేక తీర్మానాలను ‘మినిట్స్’లో రాయొద్దు! ‘భూ సమీకరణ’ గ్రామ పంచాయతీలకు సర్కారు హుకుం సాక్షి విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరపడానికి తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఎంపిక చేసిన 17 గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. భూ సమీకరణకు వ్యతిరేకంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తీర్మానం చేసినా ఆ విషయాన్ని మినిట్స్ బుక్‌లో రాయొద్దని పంచాయతీ ఈఓలకు ఆదేశాలు జారీచేసింది. భూ సమీకరణకు ఎంపిక చేసిన అనేక గ్రామాల్లో రైతులు తాము భూములు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటై తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పంచాయతీ చట్ట ప్రకారం ఏర్పడిన గ్రామం చట్ట సభ కావడంతో ఇందులో కూడా తీర్మానం చేసి.. వాటిని సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా నిడమర్రు పంచాయతీ పాలకవర్గ సమావేశంలో భూ సమీకరణను తమ గ్రామంలోని రైతులు వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీన్ని మినిట్స్ బుక్‌లో రాశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి మీద ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సమీకరణకు ఎంపిక చేసిన గ్రామాలతో పాటు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, అమరావతి, దుగ్గిరాల మండలాల్లోని అన్ని పంచాయతీల్లో ఇలాంటి తీర్మానాలను అధికారికంగా నమోదు చేయొద్దని మౌఖిక ఆదేశాలు జారీ ఆయ్యాయి. తుళ్లూరు మండలంలోని రాయపూడి పంచాయతీ సర్వసభ్య సమావేశం కూడా భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఆ పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మినిట్స్ లో రాయలేదు. పంచాయతీ సమావేశాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే ఎవరైనా న్యాయపోరాటానికి దిగితే చిక్కులు వస్తాయనే ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. -
‘పవర్’ పంచాయితీ
ఇందూరు: పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన కరెంటు బిల్లుల పంచాయితీ ముదురుతోంది. బిల్లులు కట్టకుంటే గ్రామాలలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన విద్యుత్ శాఖను తప్పుబట్టాలో, లేదా బకాయిలు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలో తెలియక 718 గ్రామాల సర్పంచులు అయోమయంలో పడిపోయారు. విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఏ ఒక్క పంచాయతీ పరిధిలో విద్యుత్ కనెక్షన్ తొలగించినా ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పరిష్కారం లభించకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఏం జరిగింది ఎప్పటి మాదిరిగా కరెంటు బిల్లుల బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని సర్పంచులు భావించారు. కానీ, ప్రభుత్వం బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో జిల్లాలో రూ.117 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. చాలా రోజులు వేచి చూసిన విద్యుత్ అధికారులు, వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే కనెక్షన్లు తొ లగిస్తామని 718 పంచాయతీల సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కనెక్షన్లు తొలగిస్తున్నారు కూడా. మీటర్ రీడింగ్ ప్రకారం కాకుండా అడ్డగోలుగా బిల్లులు వేశారని, విద్యుత్ చౌర్యం బిల్లులు కూడా అందులో కలిపారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాల్సిన అధికారులు తమను తాము తప్పించుకోవడానికి పంచాయతీలపై భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు. ఇపుడు ఏకంగా కనెక్షన్లు తొలగిస్తే, గ్రామాలు అంధకారంలో మునిగిపోతా యని, మంచినీటి పథకాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఆదాయం లేదు... ఆసరా లేదు జిల్లాలో 718 పంచాయతీలున్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీలు రూ.53 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.63.88 కోట్లు బకాయి పడినట్లుగా విద్యుత్ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బకాయిలు చెల్లించేది. రెండు సంవత్సరాలుగా కట్టకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఆ మధ్య మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన బకాయిలు తామే చెల్లిస్తామని, మైనర్ పంచాయతీలు వారే కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, ఆధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదు. రోజులు గడిచిన కొద్దీ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓసారి బిల్లు లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సాయంతో విద్యుత్ అధికారులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ఎవరి మాటా వినడం లేదు. ఫలితంగా పంచాయతీలకు బకాయిల సమస్య తీవ్రమైంది. పంచాయతీల నుంచైన చెల్లిద్దామంటే అంతగా ఆదా యం లేదు. వచ్చిన నిధులు, పన్నులు కార్మికుల జీతాలు, పంచాయతీ నిర్వహణ, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయి. నేడు కలెక్టర్ చెంతకు పంచాయితీ బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి తేవడం, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్‌ను కలవాలని నిర్ణయించుకున్నామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోర్త రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం 80ని ఆయన దృష్టికి తెస్తామన్నారు. అందులో పేర్కొ న్న విధంగా బకాయిలను సర్కారు చెల్లించే విధంగా చూడాలని కోరతామన్నారు. -
చిమ్మచీకటి
పల్లెలు, పట్టణాల్లో కరెంట్ కట్ * భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు * చెల్లించాల్సిందేనంటున్న ట్రాన్స్‌కో * ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటున్న పంచాయతీలు * తాగునీటికీ తప్పని తిప్పలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 671 గ్రామ పంచాయతీలు సుమారు రూ.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయనే కారణంతో ఐదు రోజుల క్రితం జిల్లా పంచాయతీ కార్యాలయం సహా అన్ని పంచాయతీలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలకు ప్రాణవాయువుగా ఉన్న తాగునీటి సరఫరాకు సైతం ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి దృష్టికి జిల్లాలోని సర్పంచులు తీసుకెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు మంచినీటిని సరఫరా చేసే మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వీధిదీపాలకు కావాల్సిన విద్యుత్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. పూర్తి బకాయిలతో బిల్లులు చెల్లిస్తే తప్ప తాము చేసేదేమీ లేదని ట్రాన్స్‌కో అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులు కలెక్టర్ ఇలంబరితిని మంగళవారం కలిశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ట్రాన్స్‌కో అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని విన్నవించారు. సర్పంచులుగా తాము పగ్గాలు చేపట్టి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ప్రభుత్వం నుంచి టీఎఫ్సీ నిధులు అరకొరగా ఒక్కసారి మాత్రమే వచ్చాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవి తప్ప పంచాయతీల నిర్వహణకు మరే రకమైన నిధులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికే తాగునీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాల నిర్వహణ తదితర ఖర్చులను అతి కష్టంగా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాము పూర్తి బకాయిలను చెల్లించలేమని సర్పంచుల సంఘం కలెక్టర్‌కు విన్నవించింది. నిధుల్లేక కష్టాలు గతంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన టీఎఫ్సీ నిధులను ప్రభుత్వమే విద్యుత్ బకాయిల కింద నేరుగా ట్రాన్స్‌కోకు జమ చేసింది. దీంతో గ్రామ పంచాయతీలపై విద్యుత్‌భారం పడకుండా కొంతకాలం నెట్టుకువచ్చారు. అయితే మూడు, నాలుగేళ్లుగా విద్యుత్ బకాయిలపై ట్రాన్స్‌కో ఒత్తిడి చేయకపోవడం, పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గత పాలక వర్గాల హయాంలోని విద్యుత్ బిల్లులను కట్టడానికి అనేక మంది సర్పంచులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అధికార వర్గాలే ఉటంకిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో స్వయం పాలన ఉన్నప్పుడే నిధుల సమీకరణ సైతం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి పన్ను వేయడం ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు రూ.18 కోట్లు ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ. 5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వసూలు కాకపోవడంతో పంచాయతీల నిర్వహణపై ఇటు అధికారులు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇవేవీ తమ పరిధిలోని అంశాలు కానట్టు బకాయిల కోసం ట్రాన్స్‌కో కొరడా ఝుళిపించడంతో పరిస్థితి అయోమయంగా మారింది. సర్పంచుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కలెక్టర్ ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌ను ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుని విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని, అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేని పంచాయతీలు కొన్ని నెలల విద్యుత్ బిల్లులు చెల్లించి, మిగతావి చెల్లించేందుకు కొంత సమయం వెసులుబాటును ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ట్రాన్స్‌కో అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ఏర్పడిన ఈ విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆగాధం గ్రామీణ ప్రాంతాల్లో అంధకారానికి దారితీస్తోంది. రాత్రి 7 దాటితే చాలు అనేక గ్రామాల్లో వీధి దీపాలు లేక చిమ్మచీకట్లు కమ్ముకుని చిట్టడువులను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పంచాయతీ జిల్లా కార్యాలయానికి సైతం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సుమారు రూ.లక్షకు పైగా బకాయి ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ కార్యాలయ భవనం తొలుత ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉండేది. నగరపాలక సంస్థ ఆవిర్భావం అనంతరం అందులో విలీనం కావడంతో మున్సిపల్ డివిజన్ కార్యాలయంగా కొద్దికాలం పనిచేసింది. ఆ సమయంలో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం ఇప్పుడు డీపీఓ కార్యాలయానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. కార్పొరేషన్, గ్రామ పంచాయతీల మధ్య నలుగుతున్న ఈ బిల్లుల పంచాయిని ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు ఒక పట్టాన అర్థం కావడం లేదు. రెండు రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి బకాయిలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తే తప్ప విద్యుత్ సరఫరా ఇవ్వలేమని ట్రాన్స్‌కో తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడానికి తమ వద్ద నిల్వ ఉన్న నిధులు, ఇంకా కావాల్సిన నిధులను సేకరించే పనిలో పడ్డాయి. -
అంతటా అప్రమత్తం
తొమ్మిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ప్రత్యేకాధికారుల నియామకం కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శనివారం తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తుపాను పరిస్థితులను అంచనా వేసి రక్షణ చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్, బందరు ఆర్డీవో కార్యాలయంతోపాటు అన్ని ప్రభావిత మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మండలాలకు నియమించిన ప్రత్యేకాధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తీరప్రాంతంలోని 53 పంచాయతీలు, వాటిలోని 130 శివారు గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 88,257 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే 78 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో బియ్యం, కిరోసిన్‌తో పాటు నిత్యావసర సరుకులను సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. గ్రామ స్థాయిలో టీమ్‌లను ఏర్పాటు చేసి ఇన్‌చార్జ్‌లను నియమించామని, సెల్ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారం సేకరిస్తామన్నారు. తుపాను ప్రభావంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావటంతోపాటు పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను నింపామని, పారిశుద్ధ్య చర్యల కోసం బ్లీచింగ్ నిల్వ చేసినట్లు వివరించారు. హుదూద్ తుపాను తీరం దాటే వరకు సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంటుందని, మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్‌లకు పర్యాటకులను అనుమతించబోమని ఆయన చెప్పారు. ఈ బీచ్‌ల వెంబడి పోలీసు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రప్పించామని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నంలో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక హుదూద్ ప్రభావం పెరగడంతో మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ వద్ద శనివారం ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. గిలకలదిండి హార్బర్, మంగినపూడి బీచ్‌లలో చేపల వేటకు ఉపయోగించే బోట్లను నిలిపి ఉంచారు. తుపాను పరిస్థితులపై పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఎస్పీ జి.విజయకుమార్ కృత్తివెన్ను తదితర గ్రామాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపలవేటకు ఉపయోగించే వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ అధికారులు అప్రమత్తం హుదూద్ తుపాను వల్ల తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో విజయవాడ నుంచి ఐదుగురు ఏఈలు, 50 మంది సిబ్బందిని విశాఖపట్నం పంపారు. అవసరమైతే సోమవారం ఉదయం మరికొందరిని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తుపాను కారణంగా మచిలీపట్నంతోపాటు జిల్లాలోని తీరప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని, సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోహన్‌కృష్ణ ‘సాక్షి’ కి తెలిపారు. -
పంచాయతీల అధికారాలకు కత్తెర
‘వీజీటీఎం’పై పురపాలక తాజా ఉత్తర్వులు 826 గ్రామాల్లోనూ నిలిచిపోనున్న భవన నిర్మాణాల అనుమతులు రాజధాని నిర్మాణంలో భాగంగానే నిర్ణయమని సర్కారు వెల్లడి ఇప్పటికే లేఔట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్: విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) పరిధిలో గ్రామ పంచాయతీలు ఇకపై ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి విధించింది. భవనాలు, కట్టడాలకు సంబంధించి అనుమతులిచ్చే అధికారం గ్రామ పంచాయతీల నుంచి తొలగించి వీజీటీఎంకు బదలాయించింది. విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపధ్యంలో.. ఉడా పరిధిలో కొత్త లేఔట్లకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేస్తూ ఇటీవలే సర్కారు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వీజీటీఎం పరిధిలో భూములకు సంబంధించిన ఎలాంటి క్రయవిక్రయాలు ఉండకూడదని రిజిస్ట్రేషన్ల శాఖకూ ఆదేశాలు వెళ్లాయి. తాజాగా ఉడా పరిధిలోని గ్రామ పంచాయతీల అధికారాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణ అవసరాల నిమిత్తం ఈ జీవో జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉడా పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాల్లోని పంచాయతీల గ్రామ కంఠాల ప్రాంతాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ గ్రామాల్లో అభివృద్ధి, భూముల వినియోగం, భవనాల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో పంచాయతీలకు అధికారాలు ఉండవని తెలిపారు. ఇకపై అక్కడి భూముల వ్యవహారాలను ఉడా పర్యవేక్షిస్తుంది. 2009లో వీజీటీఎం ఉడా పరిధిలోని గ్రామాలకు కొన్ని అధికారాలను బదలాయించారు. ఇప్పుడు ఆ అధికారాలను మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి భూములు సేకరించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. మొత్తం 826 గ్రామాలకు కత్తెర... వీజీటీఎం పరిధిలో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 52 మండలాల్లో మొత్తం 826 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయా గ్రామ పంచాయతీలే నిర్ణయించేవి. అధికారాల్లో భాగంగా.. 3,000 చదరపు గజాల లోపు లేఔట్లకు అనుమతులు పంచాయతీలే నిర్ణయించేవి. బైఫర్కేషన్ ఆఫ్ ల్యాండ్.. అంటే ఉదాహరణకు 400 గజాల లోపు స్థలం ఒకరి పేరు మీదనే ఉంటే దాన్ని రెండుగా విభజించి అనుమతులు ఇచ్చే అధికారం ఉండేది. 1,000 చదరపు మీటర్ల లోపు స్థలాలకు రెండస్థుల (జీ ప్లస్ టు) వరకూ భవనాలకు పంచాయతీలే అనుమతులు ఇచ్చేవి. ఇకపై ఈ అధికారాలకు కత్తెర పడింది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ పూర్తయి, ఉడా తిరిగి అధికారాలు బదిలీ చేసేవరకూ ఆయా పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి పనులకూ నిర్ణయాలు తీసుకోలేరు. కేవలం వీజీటీఎం ఉడా పరిధిలో మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయంతో పంచాయతీల పరిధిలోనూ భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్ల అనుమతులు భారీగా ఆగిపోనున్నాయి. ఓవైపు అధికారాలు వికేంద్రీకరించాలని, పంచాయతీలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి వాటి బలోపేతానికి కృషి చేయాలని కేంద్రం చెప్తోంది. అయితే వీజీటీఎం పరిధిలో గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలు భవన నిర్మాణాలకు గానీ, లేఔట్లకు గానీ అనుమతులు ఇస్తే రాజధాని నిర్మణానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
పంచాయతీలపై పిడుగు
సాక్షి, గుంటూరు : వీజీటీఎం ఉడాకు రాష్ట్ర ప్రభుత్వం సర్వాధికారాలను కట్టబెట్టింది. ఉడా పరిధిలోని పంచాయతీలకు ఇప్పుడున్న భూ లావాదేవీలు, భూ బదిలీలు, అనుమతుల మంజూరు.. ఇలా అనేక అధికారాలను రద్దుచేసి వాటిని ఉడాకు బదలాయించింది. ఈ మేరకు బుధవారం సర్కారు జీవో జారీ చేసింది. ఇకపై ఉడా పరిధిలోని పంచాయతీలో నిర్మించే ప్రతి భవనం, లేఅవుట్‌కు ఉడా నుంచే అనుమతి పొందాలి. వాస్తవానికి ఆవిర్భావం నుంచే ఉడాకు ఈ అధికారాలున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 2009లో గ్రామ పంచాయతీలకు అప్పగించారు. మళ్లీ ఇప్పుడు రద్దు చేశారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. వీజీటీఎం ఉడా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 826 గ్రామాలున్నాయి. 52 మండలాల పరిధిలో 7067 చదరపు ిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి, పొన్నూరు, నూజివీడు, గుడివాడ మున్సిపాలిటీలు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాలు కూడా ఉడా పరిధిలోకి వస్తాయి. ఈ క్రమంలో ఉడా పరిధిలోని గ్రామాల్లో వేసే లేఅవుట్లు (రియల్ ఎస్టేట్ వెంచర్లు), భారీ భవన సముదాయాలకు ఉడా నుంచి అనుమతులు తప్పనిసరి. ఉడాకు ఉన్న సిబ్బంది కొరత, ఇతర కారణాలతో 2009 జనవరి 21న జీవో నంబర్ 45 ద్వారా కొన్ని పరిధుల పరిమితులు విధించి వాటి అనుమతులు మంజూరు చేసే అధికారాలను పంచాయతీలకు అప్పగించారు. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తులోపు నిర్మించే జి ప్లస్ 2 భవనాలకు పంచాయతీల అనుమతి సరిపోతుంది. ఆ పరిధి దాటితే ఉడా నుంచి పొందాలి. గ్రామకంఠంలో మూడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే లేఅవుట్లకు పంచాయతీ అనుమతి సరిపోతుంది. అలాగే స్థలాల పేరు బదలాయింపు, రెండుగా విభజించే అధికారం గ్రామ పంచాయతీకి ఉండేది. - తాజాగా వెలువడిన జీవో ఆ అధికారాలన్నీ రద్దయ్యాయి. ఈ ఉత్తర్వు ప్రతిని ఉడా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పంపనుంది. రాజధాని భూసేకరణ నేపథ్యంలో.. రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా పంచాయతీల అధికారాలను రద్దు చేశారు. భూసేకరణకు కొన్ని ఇబ్బందులు ఉండడం, ల్యాండ్ పూలింగ్ నిర్వహించాల్సి ఉండడంతో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికే ఉడా పరిధిలో అనుమతులన్నీ నిలిపివేశారు. మెగా సిటీగా ఆవిర్భవించనున్న 50 గ్రామ పంచాయతీ కార్యదర్శులతో గత నెలలో కృష్ణా జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావు సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని భవనాలు, లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. వాటి ప్లాన్తోసహా సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో అనుమతులు నిలిపివేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పుడు ఉడా పరిధిలోని అన్ని గ్రామాలకు దీనిని వర్తింపజేశారు. ఆదాయం గోవిందా.. సర్కారు తాజా ఉత్తర్వులతో గ్రామ పంచాయతీలు తమ అధికారాలను కోల్పోయాయి. ఇంటి ప్లాన్ల వల్ల ఆదాయం పుష్కలంగా వస్తుంది. కొత్తగా కట్టిన ఇళ్లకు పన్నుల రూపేణా ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. పాలకవర్గాలకు అధికారాలు ఉండడంతో ఇళ్ల ప్లాన్లు ప్రజలు సులువుగా పొందుతున్నారు. ఇకమీదట పంచాయతీలు నిస్సారంగా మారే ప్రమాదం ఏర్పడింది. పాలకవర్గాల ఆగ్రహం టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా అధికారాలకు కోత పెట్టడంపై పాలక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రభుత్వ పనితీరు ఉందని గ్రామ పాలకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో నాయ్య పోరాటం చేస్తామని పాలక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. -
‘మరుగు’ ఉంటేనే పథకాలు
20 మండలాల్లో ఐపీపీఈ అమలు 476 పంచాయతీలకు ప్రయోజనం ఐదేళ్ల ప్రణాళిక అమలుకు కేంద్రం సిద్ధం డ్వామా పీడీ శ్రీరాములు కంఠారం(కొయ్యూరు) ప్రతి ఇంటా మహిళలు వ్యక్తిగత మరుగుదొడ్లను విధిగా నిర్మించుకుంటేనే, ఆ ఇంటికి సంబంధించి మిగిలిన ఏ అభివృద్ధి పథకానికైనా కేంద్రం నిధులిస్తుందని, లేకుంటే భవిషత్తులో ప్రభుత్వ సాయం అందే అవకాశం లేదని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములు స్పష్టం చేశారు. మండలంలోని కంఠారంలో నిర్వహించిన సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ 2014-15పై నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రణాళిక అమలుకు జిల్లాలో 20 మండలాలను ఎంపిక చేశారని, ఇందులో మన్యంలోని 11 మండలాలనూ ఎంపిక చేయడం ద్వారా చాలావరకు పేదరిక నిర్మూలన అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 పంచాయతీల్లో ఐదేళ్లపాటు ఇది అమలవుతుందన్నారు. అభివృద్ధి పనుల ఎంపిక ఇలా! ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ మూడు రోజులపాటు సిబ్బంది ఉండి ప్రణాళికలను రూపొందిస్తారని డ్వామా పీడీ శ్రీరాములు తెలిపారు. వాటిని చిత్రాల రూపంలో ఉంచి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. రోడ్లు, భవనాలు, పంట పొలాలకు రోడ్లు లేదా కాలువలు లాంటి వాటిని ప్రణాళికలో పెట్టవచ్చన్నారు. పంచాయతీకి అవసరమైన అన్ని అభివృద్ధి పనులనూ దీనిలో చేర్చవ చ్చన్నారు. వ్యక్తులు, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బహిరంగ విసర్జన కారణంగా ప్రతి వెయ్యి మందిలోనూ 30 మంది పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో చేపట్టాల్సిన పనులను అదనపు పీడీ ఆనందరావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు గాడిశ్రీరామమూర్తి గ్రామ సమస్యలను వివరించారు. ఎంపీడీవో గోపాలరావు, ఏపీవో పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు మంజే సత్యవతి, సర్పంచ్ గంగాభవాని, గాడి సత్తిబాబు, పైల గంగరాజు, సాంబశివరావు పాల్గొన్నారు. -
ఇక.. ఈ-పంచాయతీలే
తొలివిడతగా 320 గ్రామాల్లో అమలు - రెండో విడతలో 1011 పంచాయతీలు - గ్రామాల పూర్తి సమాచారం ఆన్లైన్లోనే... - ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాల వివరాలు కూడా అందులోనే జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ పంచాయతీ’ కార్యక్రమానికి జిల్లాలో 320 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ మేరకు తొలిదశలో మేజర్ గ్రామపంచాయతీలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మలి, తుదిదశల్లో జిల్లాలోని మిగతా గ్రామాలను ఈ పంచాయతీలుగా చేయాలని యోచిస్తున్నారు. ఏదైనా ఆన్లైన్లోనే.. ఈ పంచాయతీ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయిలో సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. గ్రామంలో పన్ను వసూలు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. ఆ గ్రామానికి వివిధ పన్నుల ద్వారా స్థానికంగా వస్తున్న ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు అవుతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృ ద్ధి కోసం గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారు? రోడ్లు, నల్లాలు, బోర్లు, చే తిపంపులు...ఇలాప్రతి అంశాన్ని ఆన్లైన్ చేస్తారు. వీటితో పా టు గ్రామంలో జనన, మరణాలనమోదుకు సంబంధించిన బా ధ్యతను పంచాయతీ కార్యదర్శికి అప్పగించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రక్రియ మొదలు... జిల్లాలో తొలి విడతగా 320 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను సమకూర్చారు. వీటిలో 114 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనె క్షన్ ఇచ్చారు. మిగతా వాటికి బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్ల ఎంపికను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వీరిని ఎంపిక చేసి శిక్షణను కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే 176 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. వీరు మూడు రోజులకు ఓ గ్రామంలో చొప్పున రెండు గ్రామపంచాయతీల్లో పని చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో 1011 గ్రామ పంచాయతీలను ఆన్లైన్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామ పంచాయతీలను గుర్తించే పనిని బీఎస్ఎన్ఎల్కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. ఏఏ గ్రామాల్లో ఇంటర్నెట్ ఉందనే విషయాన్ని గుర్తించాలని ఆశాఖకు అప్పజెప్పినట్లు సమాచారం. -
‘సబ్‌ప్లాన్’ నిధులు వెనక్కి!
40 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉండాలనే నిబంధన ఫలితం రద్దయిన రూ.30లక్షల రహదారుల పనులు లబోదిబోమంటున్న ఆరు పంచాయతీలు డీలాపడుతున్న సర్పంచులు కూచిపూడి : గ్రామాల్లో 40 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీలుంటేనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలంటూ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆంక్షలపై పలువురు సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్లాను కింద విడుదల చేసిన నిధులను... 40 శాతం మంది ఆయా సామాజిక వర్గాలు లేరనే సాకుతో రద్దు చేయడం దారుణమని సంబంధిత సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలంలోని 9గ్రామాలకు సిమెంటు రహదారుల కోసం రూ.45లక్షలు (ఒక్కక్క పంచాయతీకి రూ.5లక్షల చొప్పున) కేటాయించారు. తాజాగా ఇంజినీరింగ్ అధికారులు జారీచేసిన ఉత్తర్వుల (మౌఖికం)తో మండలంలోని కూచిపూడి, పెదపూడి, పాలంకిపాడు, మొవ్వపాలెం, అవురుపూడి, యద్ధనపూడి గ్రామాలకు రూ.5లక్షల చొప్పున మంజూరయిన రూ.30లక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ ఏఈ పీ చంద్రశేఖర్ ఆయా పంచాయతీలకు వెల్లడించటంతో వారందరూ హతాశులయ్యారు. ఈ నిధులతో రహదారులు వేయించేందుకు పంచాయతీ తీర్మానాలు చేసి సభల ఆమోదం పొంది అంచనాలు వేయించారు. ఆఖరి నిముషంలో ఈ కబురు అందడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే విషయాన్ని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన జెడ్పీడెప్యూటీ సీఈవో ఎం కృష్ణమోమన్ దృష్టికి ఆయా సర్పంచుల తరపున మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏనుగుమోహనరావు తెలిపినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విధులు నిర్వహించడం మినహా తామేమీ చేయలేమని చేసినట్లు తెలిసింది. అయితే బార్లపూడి, కొండవరం, గూడపాడు గ్రామాలలో నిబంధనల ప్రకారం 40 శాతంపైగా దళితులుండటంతో ఆ పంచాయతీలకు మంజూరయిన నిధులతో సీసీ రోడ్లు వేసే అవకాశముందని పీఆర్ ఏఈ స్పష్టం చేశారు. రద్దయిన ఆ ఆరింటి స్థానంలో ప్రస్తుతం మొవ్వ, భట్లపెనుమర్రు, చినముత్తేవి, పెదముత్తేవి గ్రామాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లువేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రద్దయిన తమ గ్రామ రహదారుల నిధులను పునరుద్ధరించి చేయూత ఇవ్వాలని సర్పంచులు కందుల జయరాం (కూచిపూడి), తాతా రజని (పెదపూడి), యద్ధనపూడి రాఘశేఖర్ (యద్ధనపూడి), ఏనుగు మోహనరావు (అవురుపూడి), యార్లగడ్డ సునీత (పాలంకిపాడు), ఊసా సుబ్బమ్మ (మొవ్వపాలెం) కోరుతున్నారు. -
కాసులు లేకవిల విల
నిధులు లేక అల్లాడుతున్న పంచాయతీలు ఏడాది దాటినా విడుదల కాని ‘ఏకగ్రీవం’ సొమ్ము సకాలంలో రాని కేంద్ర, రాష్ట్ర నిధులు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం... స్మార్ట సిటీలు, మెగా సిటీలతో మొత్తం సీన్ మార్చేస్తాం.. ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మిస్తాం... ఆ విధంగా ముందుకు పోదాం అని హామీలిచ్చే నేతలు వెనుకబడుతున్న పల్లెలను పట్టించుకోవడం లేదు. నిధులు లేక పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేని దుస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అంతంత మాత్రంగా నిధులు విడుదల చేస్తుండడంతో అవి ఏ మూలకూ చాలడం లేదు. విశాఖ రూరల్ : రకరకాల హామీలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు పల్లెలను మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామ ఖజానాలు నిండుకున్నా.. ఆర్థికంగా ఆదుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాక.. పన్నులు సక్రమంగా వసూలు కాక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఏడాదైనా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్‌లు నామమాత్రంగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు. ప్రతి గురువారం నిర్వహించాలని తలపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో తొలి వారమే స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీయడంతో అధికారులు కంగుతిన్నారు. ప్రత్యేక నిధులెక్కడ : జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేదు. సాధారణంగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఆ నిధులు తమ ఊరి అభివృద్ధికి దోహదపడతాయని ప్రజలు భావించడంతో 70 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దఫా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు అదే పద్ధతిలో నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేక నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని భావించిన వారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆదాయం అంతంత మాత్రమే ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు కొలువు తీరాక భారీగా నిధులు వస్తాయని భావించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15.78 కోట్లు, ఎస్ఎఫ్సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. అయితే గత రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఈ నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలకు ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
పంచాయతీలుగా 239 తండాలు
పెద్దవూర మండలంలోనే ఎక్కువ తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఈ మండలంలో సుమారు 45 గిరిజన తండాలు ఉండగా ప్రస్తుతం 23 తండాలు పంచాయతీలు కానున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోనే తండాలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో తండాలు లేకపోవడంతోపాటు మరికొన్నింటిలో ఒక్కొక్క తండా కూడా ఉన్నాయి. వేములపల్లి, నాంపల్లి, అర్వపల్లి, ఆలేరు, చౌటుప్పల్, మునగాల, నడిగూడెం మండలాల్లో ఒక్కొక్క తండా గ్రామపంచాయతీగా మారనుంది. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామని గత పాలకులు ఇచ్చిన ఎన్నో హామీలు కాలంతో పాటే కరిగిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీ అర్హత గల తండాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని గ్రామీణ అభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ 2014 జూలై 23వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. దాంతో 500 జనాభా కలిగి ఉండి, పంచాయతీకి 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న తండాలపై సమగ్ర సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం 239 తండాలను గుర్తించింది. కాగా ఈ నెల 15 తేదీ లోగా పంచాయతీల ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నప్పటికీ సమగ్ర కుటుంబ సర్వే కారణంగా ఆలస్యమైంది. దీంతో సోమవారం జిల్లా పంచాయతీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు. పెరగనున్న పంచాయతీలు.. 500 మంది జనాభాతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు గిరిజన తండాలను పంచాయతీలుగా గురిస్తే జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుతం జిల్లాలో 1176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గుర్తించిన 239 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే వీటి సంఖ్య 1415 కానుంది. అదే విధంగా పంచాయతీలలో గిరిజన తండాల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. జిల్లాలో మొత్తం గిరిజన తండాలు 905. వీటిలో 324 తండాలు గతంలోనే పంచాయతీలుగా గుర్తించారు. కొత్తగా మరో 239 తండాలు పంచాయతీలుగా ఏర్పడితే జిల్లాలోని 1415 పంచాయతీలలో 563తండాలు పంచాయతీలుగా కానున్నాయి. సర్వేలో సేకరించిన వివరాలు గుర్తించిన గిరిజన తండా ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గిరిజన తండాలోని జనాభా వివరాలు. గ్రామ పంచాయతీగా గుర్తించడానికి ప్రతిపాదించే తండాల సంఖ్య. పస్తుత గ్రామ పంచాయతీకి తండా ఎంత దూరంలో ఉంది. గిరిజన తండాకు ఏ గ్రామ పంచాయతీగా గుర్తించాలో పేరు ప్రతిపాదన. గ్రామ పంచాయతీ నుంచి తండాను తొలగించగా అక్కడ ఉన్న జనాభా వివరాలు. -
పాలన దారిలోకి తెస్తున్నాం
మంత్రి అయ్యన్నపాత్రుడు చోడవరం టౌన్: గడచిన పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, దాన్ని గాడిలో పెడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం చోడవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. లక్షన్నర మాఫీతో 86 శాతం మంది లబ్ధిపొందనున్నారని చెప్పారు. రాష్ట్రం లో 13 వేల పంచాయతీలకుగాను 3 వేల పంచాయతీల్లో స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని సరఫరా చేస్తున్నాయని, మిగలిన వాటిలో 5 వేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రా రంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మండలానికి ఐదు పంచాయతీలు ఎంపిక చేస్తామని, విశాఖ జిల్లాలో మాత్రం పది పంచాయతీలు చొ ప్పున ఎంపిక చేయన్నుట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ప్రోగ్రాం వివరించారు. 30న చోడవరంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతులతో సమావేశం, అనంతరం అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. 31న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశాలుంటాయన్నారు. ఆ తర్వాత కశింకోటలో జరిగే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాళ్లపాలెంలో ప్రజాసదస్సు, తర్వాత యలమంచిలిలో రోడ్‌షో, మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం ఉంటుందన్నారు. 3 గంటలకు నక్కపల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం, 5 గంటలకు ఉపమాక వేంకటేశుని దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణమవుతారని చెప్పారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం పరిశీలించారు. చోడవరం హైస్కూల్ ఆవరణను పరిశీలించాక కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల వెంట ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలాగోవింద, కె.ఎస్.ఎన్.రాజు, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు ఉన్నారు. -
తీరనున్న తండ్లాట
పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వ నిర్ణయం * ఎంపీడీఓల ఆధ్వర్యంలో వివరాల సేకరణ పూర్తి * 500పైన జనాభా కలిగినవి 163...నెరవేరనున్న గిరిజనుల కల గ్రామాలకు సుదూరంగా అడవుల్లో, గుట్టల్లో, గుడ్డి దీపాలతో కాలం వెళ్లదీస్తున్న గిరిజన బతుకుల్లో వెలుగులు రానున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన వారి జీవితాలకు బంగారు బాటలు పడనున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి కల సాకారమయ్యే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి. చిలుకూరు : జిల్లాలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. తండాలను పంచాయతీలుగా మార్చాలని ఏళ్ల తరబడి గిరిజనులు వినిపిస్తున్న డిమాండ్ త్వరలో నెరవేరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధిక జనాభా కలిగిన తండాల వివరాలు సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలకు ఉత్తర్వులు పంపించారు. ఈ మేరకు ఎంపీడీఓలు తమకు అప్పగించిన పనిని పూర్తిచేసి ఉన్నతస్థాయి అధికారులకు అందజేశారు. 500 జనాభా ఉన్న తండాలు 163 జిల్లా వ్యాప్తంగా 905 తండాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 500, ఆపై జనాభా కలిగిన తండాలు 163 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలుగా మార్చేందుకు గుర్తించిన తండాలను కొన్ని షరతుల మేరకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీకి, కొత్తగా పంచాయతీగా మార్చేందుకు గుర్తించబడిన తండాలకు మధ్య ఉన్న దూరం, ఆదాయం తదితర అంశాల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గిరిజనులు అధికంగా ఉన్న మండలాలివే... మఠంపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, మేళ్లచెర్వు, చివ్వెంల, చందంపేట, పెదవూరు, పీఏపల్లి, కోదాడ మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఉన్న తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాం : కృష్ణమూర్తి, డీపీఓ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపీడీఓల సహకారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న తండాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. ప్రభుత్వం ఏ క్షణంలో సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నూతన గ్రామ పంచాయతీలను గుర్తిస్తాం. -
60 తండాలు ఇక పంచాయతీలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా 60 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన తండాలను పంచాయతీలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో తండాలవారీగా వివరాలు సేకరించింది. ఇం దులో తండా పరిధితో పాటు జనాభా, కుటుంబాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని పంచాయతీలు చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 328 గిరిజన తండాలున్నాయి. వీటిలో ఐదువందల కంటే ఎక్కువ జనాభా ఉన్న తండాలు 60 ఉన్నాయి. ఇవి కాకుండా 268 తండాల్లో ఐదువందల కంటే తక్కువ జనాభా ఉన్నట్లు జిల్లా పంచాయతీ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఏర్పాటు చేస్తే జిల్లాలో 60 పంచాయతీలు ఏర్పాటయ్యే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. సామాజిక పింఛన్ల పెంపుతో లబ్ధిదారులకు మరింత సాయం అందనుంది. జిల్లాలో 2,63,145 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 1,30,496 మంది వృద్ధులున్నారు. అదేవిధంగా 31,757 మంది వితంతువులున్నారు. తాజా పెంపుతో వీరికి లబ్ధి చేకూరనుంది. వీరు కాకుండా వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు తీసుకునే పింఛన్లు సైతం పెరిగే అవకాశం ఉంది. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో ఆరువందల కుటుంబాలకు 1,800 ఎకరాల భూమి పంపిణీ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో 28,810 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరికి తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ వేతనాలు అందనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1060 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సర్కారు ప్రకటనతో వీరి ఉద్యోగాలు క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో 18 మంది అమర వీరులున్నట్లు యంత్రాంగం గుర్తించింది. తాజా ప్రకటనతో ఈ 18 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. -
‘నిర్మల్’ సాధించేదెప్పుడు?
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు అనేక సంవత్సరాలుగా నిర్మల్ గ్రామాలుగా ఎంపిక కాలేకపోతున్నాయి. స్వచ్ఛత, పర్యావరణం లాంటి అంశాలను పాటించడం తదితర ప్రాతిపదికన నిర్మల్ గ్రామ పథకానికి ఎంపిక అవుతాయి. ఇలాంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సదరు గ్రామాలకు లక్షలాది రూపాయలు పారితోషికంగా ఇస్తోంది. అర్హతలేని 994 గ్రామాలు జిల్లాలో మొత్తం 1,404 గ్రామాలుండగా, 2014 వరకు జిల్లాలోని 994 గ్రామాలు ఈ పోటీలకు కనీస అర్హత కూడా సాధించలేకపోయాయి. ఖేడ్ తాలూకాలో అత్యధికంగా 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందాపూర్ తాలూకాలో 98, జున్నార్‌లో 90, శిరూర్‌లో 78, హవేలిలో 72, ముల్షీలో 69, పురంధర్లో 66, భోర్‌లో 63 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలలో సరైన నీటి వసతి, డ్రైనేజీ, మరుగుదొడ్లు, చెత్త కండీలు లాంటి కనీస సదుపాయలు కూడా లేకపోవడంతో నిర్మల్ గ్రామాలకు అర్హత సాధించలేకపోయాయి. ఇక బారామతి తాలూకాలో 54, దౌండ్‌లో 57, వేల్హా తాలూకాలో 45 గ్రామాలదీ ఇదే దుస్థితి. భోర్ తాలూకాలో 92 గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామాల సరసన చేరేందుకు కనీసం ప్రయత్నం చేయగా, ఇందులో 59 గ్రామాలు నిర్మల్ గ్రామాలుగా అర్హత సాధించాయి. ఖేడ్‌లో 32, బారామతి తాలూకాలో 44 గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారాలు అందాయి. తాలూకాల వారీగా.. నిర్మల్ గ్రామ పంచాయతీలు ఇవే.. ఆంబేగావ్ 103, (40 గ్రామాలు నిర్మల్ గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించాయి), బారామతి 97 (44), భోర్ 155 (59), దౌండ్ 79 (28), హవేలి 100 (28), ఇందాపూర్ 113 (13), జున్నార్ 142 (37), ఖేడ్ 163 (32), మావల్ 104 (24), ముల్షీ 95 (27), పురంధర్ 90 (27), శిరూర్ 93 (16), వేల్హే 70 (36) ఉన్నాయి. -
కరెంటుకు ఓకే..
పంచాయతీలు పరేషాన్ జిల్లాలో 700 పంచాయతీలకు అందిన ఆదేశాలు నాడు బిల్లులు కట్టొద్దని జీవో.. నేడు చెల్లించాలని ఉత్తర్వులు సాక్షి, మచిలీపట్నం/ ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ యంత్రాంగం తీరుతో పంచాయతీలు పరేషాన్ అవుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించక్కర్లేదని గతంలో జీవో ఇస్తే.. ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో వినియోగించే కరెంటుకు బిల్లులు కట్టక్కర్లేదని గతంలో వెసులుబాటు ఇవ్వటంతో ఆ డబ్బుతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని పంచాయతీ పాలకవర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. బిల్లుల బకాయిలపై పంచాయతీలు, ట్రాన్స్‌కో అధికారులకు సైతం పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీలకు విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. జిల్లాలో రూ.45 కోట్ల బకాయిలు... జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు సుమారు రూ.45 కోట్ల మేర కరెంటు బిల్లులు ట్రాన్స్‌కోకు బకాయిలు పడ్డాయి. వాటిలో 150 మేజర్ పంచాయతీలు రూ.12.26 కోట్లు బకాయిలు కాగా, 820 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.32.43 కోట్ల బిల్లు మొత్తాలను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలను ట్రాన్స్‌కోకు చెల్లించనక్కర్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం 2009 జనవరి 17న జీవో నంబరు 80ని జారీ చేసింది. దీంతో పంచాయతీల పాలకవర్గాలు కరెంటు బిల్లులు కట్టక్కర్లేకుండా ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భావించాయి. తాజాగా రెండు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కరెంటు బిల్లులు చెల్లించాలంటూ జిల్లా పంచాయతీ అధికారు(డీపీవో)లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పంచాయతీల సాధారణ నిధులు, 13వ ఆర్థిక సంఘం నిధులు, సర్‌చార్జ్, స్టాంపు డ్యూటీ నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించేలా పంచాయతీ నిధుల నుంచి తీసుకుని వెసులుబాటు కల్పించడంతో పంచాయతీల పాలకవర్గాలు ఆ దిశగా దృష్టి సారించాయి. దీంతో కరెంటు బిల్లుల వసూళ్లపై గ్రామ పంచాయతీలపై ట్రాన్స్‌కో ఒత్తిడి మొదలైంది. అన్ని పంచాయతీలకు సమాచారం : డీపీవో ఆనంద్ జిల్లాలోని అన్ని పంచాయతీలకు పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అందించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కె.ఆనంద్ ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో ఏ పంచాయతీ ఎంత కరెంటు బిల్లు బకాయి ఉంది, వాటిని ఏ నిధుల నుంచి చెల్లించవచ్చు అనే పూర్తి సమాచారంతో ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఆయా నిధుల నుంచి పంచాయతీలు కరెంటు బకాయిలు తక్షణం చెల్లించాలని ఆయన సూచించారు. -
ట్రెజరీలో వసూళ్ల దందా
సాక్షి, సంగారెడ్డి: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏడాది కాలానికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ ఒక్కసారీ ట్రెజరీ కార్యాలయాకు వెళ్లాయి. ఎప్పటిలాగే చివర్లో బిల్లుల చెల్లింపు నిలపివేత(ఫ్రీజింగ్) అమలు చేస్తారేమోనని 15 రోజులుగా కుప్పలు తెప్పలుగా బిల్లుల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, హాస్టళ్ల వార్డెన్లు, చోటాబడా కాంట్రాక్టర్లు అందరూ ట్రెజరీ కార్యాలయాల ముందూ క్యూకట్టారు. ఎప్పటిలాగే అక్కడి అధికారులు, సిబ్బందికి పర్సెంటేజీలు చెల్లిస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు. లేకుంటే కొర్రీలు వేసి బిల్లులను వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో ఉద్యోగ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ట్రెజరీలో వసూళ్లు బాగోతంపై ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. కలెక్టర్ హెచ్చరించినా ట్రె జరీల అధికారులు, ఉద్యోగుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. సాక్షాత్తు కలెక్టర్, డీఆర్వో, ఏఓలు మంజూరు చేసిన బిల్లులకు సైతం పర్సెంటేజీలు అడుగుతుండడం గమనార్హం. టోకెన్లకు టోకరా నిబంధనల మేరకు ట్రెజరీలకు వెళ్లే ప్రతి బి ల్లును మూడు రోజుల్లో మంజూరు చేయా లి. ఒక వేళ తిరస్కరించాల్సి వస్తే ఆ మేరకు కారణాలు చూపుతూ మూడు రోజుల్లోపే తిరస్కరించాలి. ఈ మేరకు బిల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఓ టోకెన్‌ను అందజేయా లి. కానీ, ఈ నిబంధనలు ప్రస్తుతం ఎక్కడా అమలు కావడం లేదు. బిల్లు ఫైలు అకౌంటెంట్, ఆడిటర్, ఎస్టీఓ.. ఇలా ఒకరి నుంచి ఇంకొకరి వద్దకు చేరాలంటే చేతులు తడపాల్సిన వస్తోంది. లేకుంటే వారాల తరబడి మోక్షం లభించడం లేదు. కోరిన పర్సెం టేజీ ఇవ్వలేని వ్యక్తులు బేరసారాలకు దిగి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. అందరూ బాధితులే.. {పభుత్వ అధికారులు, ఉద్యోగులు టీఏ, డీఏ, జీపీఎఫ్ అడ్వాన్స్, రిటైర్మెంట్ బెనిఫి ట్స్, జీఐఎస్ సేవింగ్స్, మెడికల్ రీయింబ ర్స్మెంట్, కాంటిజెన్సీ నిధులు, ఇంక్రిమెంట్ అరియర్స్, పే ఫికేజషన్, సరేండర్ లీవ్, వాహనం అద్దె, బిల్డింగ్ గ్రాంట్ బిల్లు లకు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే 5 నుంచి 10 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తోంది. {పభుత్వ వసతి గృహాల సంక్షేమ అధికారుల బాధలైతే వర్ణణాతీతం. విద్యార్థుల మెస్ చార్జీలు, మెయింటనెన్స్ బిల్లుల్లో 5 శాతం వరకు వదులుకోవాల్సి వస్తోంది. మునిసిపాలిటీలు, పంచాయతీలతో పాటు ఆయా ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంలో 3 నుంచి 5 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నారు. -
పంచాయతీలుగా తండాలు
లంబాడాల భేరిలో మంత్రి ఉత్తమ్ హామీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారమిక్కడ నిజాం కళాశాల మైదానంలో లంబాడాల రాజ్యాధికార సమరభేరి జరిగింది. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 200 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతుందన్నారు. గుడుంబా అమ్మకాలకు సంబంధించి అమాయక గిరిజనులపై మోపిన ఐదున్నర లక్షల కేసులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. తండాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మోడీని కోరతానన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో చెంచు జాతి పూర్తిగా అంతరించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాబోయే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కేలా చూడాలని టీజీవోల చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.. లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని కోరారు. మూడు లక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేస్తూ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో రెండు శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు గిరిజనులకు కేటాయించాలని కోరారు. తమ సమస్యల పరిష్కార సాధన దిశగా త్వరలో జింఖానా గ్రౌండ్స్‌లో మరో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, లంబాడీ హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు నాయక్, పలువురు నేతలు, సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనం పాల్గొన్నారు. -
పంచాయతీలపై ‘పవర్’ పిడుగు
సాక్షి, రాజమండ్రి :గ్రామ పంచాయతీలను కరెంటు కష్టా లు నీడలా వెంటాడుతున్నాయి. ఎన్నికల అనంతరం పంచాయతీలకు నిధులు విడుదలవడం తో తక్షణం కరెంటు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వచ్చే అరకొర నిధులతో కరెంటు బకాయిలు చెల్లిస్తే గ్రామాభివృద్ధి ఎలాగని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికలు జరగక పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో అప్పట్లో చాలా పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించలేదు. కొద్ది నెలల కిందట ఎన్నికలు జరి గాయి. సుమారు నెల కిందట 13వ ఆర్థిక సం ఘం, ఇతర నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలని పంచాయతీరాజ్ కమిషనర్ గత నెలలో ఆదేశించారు. ఇదే తడవుగా విద్యుత్తు అధికారులు బిల్లు బకాయిలు తక్షణం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. లేకుంటే మంచినీటి పథకాలు, వీధిదీపాల కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. తాము ఉత్పత్తి సంస్థల నుం చి విద్యుత్తు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని, ఇకపై కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లిం చకపోవడంతో కొన్ని పంచాయతీల్లో బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. ఇప్పుడొచ్చే అరకొర నిధులతో బకాయిల చెల్లింపు ఎలాగని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బకాయిల తీరిలా.. జిల్లాలో 1,011 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో గత నవంబర్ నాటికి వీధిలైట్లకు రూ.32.36 కోట్ల విద్యుత్తు బకాయిలున్నాయి. వీటిలో మైనర్ పంచాయతీల బకాయిలు రూ.12.25 కోట్లు, మేజర్ పంచాయతీల వాటా రూ.20.11 కోట్లుగా ఉంది. తాగునీటి పథకాలకు మైనర్ పంచాయతీ బకాయిలు రూ.12.15 కోట్లు, మేజర్ పంచాయతీ బకాయిలు రూ.11.14 కోట్లు ఉన్నాయి. మొత్తం నీటి పథకాలకు చెలించాల్సిన బకాయిలు రూ.23.29 కోట్లు కాగా, డిసెంబర్లో మరో రూ.2.5 కోట్లు అదనంగా చేరుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి పైసా వసూలు చేస్తాం పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిల్లో ప్రతి పైసా వసూలు చేస్తామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ అన్నారు. ఈమేరకు నోటీసులు ఇస్తున్నామన్నారు. గతంలో నిధుల్లేవం టూ బిల్లులు చెల్లించలేదన్నారు. ఇప్పుడు నిధులు వస్తున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చాక కూడా చెల్లించకపోతే కచ్చితంగా సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. -
‘అద్దె’ పంచాయతీలు
ఒంగోలు, న్యూస్‌లైన్: సొంత భవనాలు లేకపోవడంతో పంచాయతీలకు అద్దెల భారం తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలుండాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు చాలాచోట్ల నేటికీ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు. పంచాయతీ భవనాల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ జిల్లా వ్యాప్తంగా బుధవారం పరిశీలించింది. ఈ పరిశీలనలో అనేక సమస్యలు బహిర్గతమయ్యాయి. పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారడం, రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో లక్ష్యం నెరవేరలేదు. భారత్ నిర్మాణ్ రాజీవ్ గాంధీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పంచాయతీలకు కార్యాలయ భవనాలు నిర్మించడంతో పాటు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న పేదలకు పనిదినాలు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఆమేరకు ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. 2012 మే 4వ తేదీలోపు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు చేపట్టలేదు. 357 పంచాయతీ భవనాలకు రూ. 35.70 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 97 భవనాలు మాత్రమే పూర్తికాగా..అసలు పనులు మొదలు పెట్టనివి 181 ఉన్నాయి. మిగిలినవి వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో సర్పంచ్ల గృహాలే కార్యాలయాలుగా మారాయి. నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేసిన కాంటాక్టర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించకపోవడం కూడా మరో కారణం. తాజాగా ఈ పథకం పేరును రాజీవ్‌గాంధీ పంచాయత్ శక్తికారణ్ అభియాన్‌గా మార్చారు. దీని ప్రకారం సొంత భవనాలు లేని పంచాయతీల జాబితా పంపాలని ఇటీవల పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ పథకం కింద గతంలో మంజూరై ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాని వాటిని చూపించవచ్చా.. నిధుల కొరతతో ఆగిన వాటిని పేర్కొనవచ్చా అనే సమస్య ప్రస్తుతం పంచాయతీ అధికారులను పట్టి పీడిస్తోంది. -
ఏకగ్రీవ నిధులేవి?
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ ఏకగ్రీవాలను ప్రొత్సాహించింది. కానీ, పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై ఐదు నెలలు గడుస్తున్నా నజరానా డబ్బులు రాలేదు. దీంతో పారితోషికంతో చేపట్టాల్సిన పనులు జరగడం లేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. ఏకగ్రీవమైన పంచాయతీలను రెండు కెటగిరీలుగా చేసి ప్రభుత్వం పారితోషకం కింద నిధులు విడుదల చేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేయాల్సి ఉన్నందున అందుబాటులో బడ్జెట్ లేకనే కొంత ఆలస్యం జరుగుతుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. రూ. 5 కోట్లపైనే.. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు జూలై 23,27,31 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు మొదటి వారంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఏకగ్రీవం పంచాయతీలకు నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను మొదట పర్మినెంట్ పనులకు వినియోగిస్తారు. పంచాయతీ భవనం, స్థలానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిరా్మాణం, మురికివాడల్లో సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. ఏకగ్రీవ పంచాయతీలు ఇవే.. బజార్హత్నూర్ మండలంలో రెండు, జైనథ్‌లో ఏడు, తానూర్, తాంసిలలో ఐదు జీపీల చొప్పున 10, తలమడుగు, నేరడిగొండ, భైంసా, ఖానాపూర్‌లలో నాలుగు జీపీల చొప్పున 16, దండేపల్లి, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, కుంటాల, లోకేశ్వరం, మామాడలో మూడు జీపీల చొప్పున 18, బేల, బోథ్, గుడిహత్నూర్, కుభీర్, లక్సెట్టిపేట, నెన్నెల మండలాల్లో రెండు చొప్పున 10 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతోపాటు బెజ్జూర్, చెన్నూర్, దిలావర్పూర్, జైపూర్, కడెం, నార్నూర్, సిర్పూర్(టి), వాంకిడి గ్రామ పంచాయతీలు ఎన్నికయ్యాయి. పనులకు ఉపయోగపడుతాయి గ్రామాల్లో తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం పనులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మా గ్రామ పంచాయతీకి రూ.2.60 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టలేకపోతున్నాం. గ్రామ పంచాయతీ భవనం కొత్తది ఉన్నప్పటికీ ఇంకా పర్మినెంట్‌గా ఉండే పనులకు ఉపయోగపడుతాయి. ప్రభుత్వం విడుదల చేస్తే పనులు చేపట్టవచ్చు. - శంకర్, బేల మండలం డొప్టాల సర్పంచ్ త్వరలో వచ్చే అవకాశం ఏకగ్రీవ పంచాయతీలకు అందజేయాల్సిన పారితోషకాల నిధులను ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఎంటైర్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఈ నిధులు వస్తాయి. గతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పారితోషకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాల్సి ఉంది. త్వరలో జీపీలకు కేటాయించే బడ్జెట్లో రావచ్చు. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి -
సర్పంచ్‌లకు అప్పుల తిప్పలు
యాచారం, న్యూస్‌లైన్: మండలంలోని 20 గ్రామాల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి వందకు పైగా బోరుబావులున్నాయి. రెండు నెలల క్రితం 90 శాతం బోరుబావులు ఎండిపోగా, ఇటీవల కురిసిన వర్షాలతో ప్రస్తుతం బోరుబావుల్లో పుష్కలంగా భూగర్భజలాలు పెరిగాయి. కృష్ణాజలాలు వారం రోజులకు ఒకసారి సరఫరా అవుతుండడంతో అవసరాల కోసం బోరు బావులపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే, లో ఓల్టేజీ సమస్య, బోరుబావుల్లో ఇసుక చేరడం, ఆన్ ఆఫ్ సౌకర్యాం లేకపోవడంతో మోటార్లు తరుచూ కాలిపోతున్నాయి. సర్పంచ్‌లుగా గెలిచినప్పటి నుంచి అత్యధికంగా బోరుమోటార్ల మరమ్మతుల కోసం ఖర్చు చేయడం విశేషం. ప్రతి గ్రామంలో ఐదుకు పైగా బోరుబావులు ఉన్నాయి. వారానికి ఒక మోటారు కాలిపోతుండడంతో నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. యాచారం, గునుగల్, మాల్, నందివనపర్తి గ్రామాలు మినహా మిగితా గ్రామాల్లో పెద్దగా ఆదాయవనరులు లేవు. అయినా మరమ్మతులు చేయించకుంటే నీళ్లున్నా సరఫరా చేయడం లేదని ప్రజలు మండిపడే అవకాశముందనే భయంతో అప్పులు చేయక తప్పడం లేదు. గెలిచిన నాటి నుంచి నాలుగు నెలల కాలంలో ప్రతి గ్రామంలో రూ. 50 వేలకు పైగా మోటార్ల మరమ్మతులకు ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో పంచాయతీల్లో నిధులు లేక కాలిపోయిన మోటార్లు మోకానిక్ దుకాణాల్లోనే మూలుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మాయమైన మోటార్లు... మరమ్మతులు చేయిస్తున్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాల్లో ఎన్ని మోటార్లు ఉన్నాయనే విషయం రికార్డుల పరంగా సర్పంచ్‌లకు తెలియడం లేదు. కొన్నేళ్లుగా 20 గ్రామాల్లో బోరుమోటార్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ కొనుగోలు చేసిన మోటార్ల లెక్క మాత్రం కనిపించడం లేదు. గునుగల్, నక్కర్తమేడిపల్లి, మాల్, యాచారం, నందివనపర్తి, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన మోటార్ల వివరాల రికార్డులు అసలే లేవు. గెలిచిన సర్పంచ్‌లు మోటార్ల లెక్క చూపించాలని అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో బోరుబావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ మోటార్లు లేక నిరుపయోగంగా మారాయి. సరిపడా కృష్ణాజలాలైనా సరఫరా చేయండి.. లేదంటే మోటార్ల మరమ్మతులు నిధులైనా ఇప్పించాలని సర్పం చ్‌లు పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. రూ. 50 వేలు ఖర్చు చేశా... సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకూ బోరుమోటార్ల మరమ్మతుల కోసం రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. వారానికి ఒక మోటార్ కాలిపోతోంది. మరమ్మతులకే ప్రతీసారి రూ.4వేలకు పైగా ఖర్చవుతోంది. అయినా ప్రజల నుంచి విమర్శలు తప్పడం లేదు. - నర్సయ్య, సర్పంచ్, మంతన్‌గౌరెల్లి నిధులు మంజూరు చేయాలి... బోరుమోటార్ల మరమ్మతుల కోసం నాలుగు నెలల్లో రూ. 60 వేలకు పైగా ఖర్చు చేశా. స్టార్టర్లు కూడా తరుచూ కాలిపోతున్నాయి. రెండు రోజులకోసారి కృష్ణాజలాలు సరఫరా చేసేలా కృషి చేయాలి. లేదంటే మరమ్మతుల కోసం పంచాయతీలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. అప్పులు చేసి మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి ఉంది. -పాశ్ఛ భాష, సర్పంచ్, నక్కర్తమేడిపల్లి నిలదీతలు తప్పడం లేదు.. మోటార్ల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయడం లేదు. కనీసం కృష్ణాజలాలు సరిగా సరఫరా చేయడం లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నా ప్రజలు నీటిఎద్దడిని ఎదుర్కోక తప్పడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. నిత్యం ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. - బొక్క నారాయణరెడ్డి, సర్పంచ్, తాడిపర్తి -
ఆన్లైన్లో పంచాయతీల పద్దు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని పంచాయతీలకు సంబంధించిన జనాభా, ఆదా యం, ఖర్చులు, ఇతర వివరాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. దీనికోసం క్లస్టర్ స్థాయిలో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేసి ఆపరేటర్‌ను నియమిస్తారు. క్లస్టర్ పరిధిలోని పంచాయతీల వివరాలను ఆ ఆపరేటర్ ఆన్లైన్లో నమోదు చేస్తారు. జిల్లాలోని 565 క్లస్టర్ల పరిధిలో 1104 పంచాయతీలు వున్నాయి. ఆన్లైన్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారు. అనంతరం జనాభా, ఆదాయం, ఇతర వివరాలను పరిశీలించి దశల వారీగా పంచాయతీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తారు. సర్పంచ్ లు చేపడుతున్న పనులు, చేస్తున్న ఖర్చుల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఖర్చులు, పనుల్లో ఏ మాత్రం తేడా ఉన్నా సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తారు. పంచాయతీల కోసం 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతోపాటు, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, సీనరేజ్ నిధులు జిల్లాకు ఇప్పటికే చేరాయి. 2011 జనాభా ఆధారంగా వీటిని పంచాయతీల ఖాతాలకు జమ చేయనున్నారు. 100 రోజులు పూర్తి.. ఎన్నికల్లో గెలిచిన పంచాయతీ సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించి శనివారం నాటికి 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నిధులు లేకపోవడంతో వారెలాంటి అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇప్పుడు నిధులు పెద్దఎత్తున రానుండటం తో పనులు చకచకా జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పన్నుపోటు.. మరోవైపు.. పంచాయతీల ఆదాయం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం పన్నులను 30 నుంచి 40 శాతం వరకు పెంచాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచనలిచ్చింది. ఈ బాధ్యతను సర్పంచ్‌లకే అప్పగించాలని పేర్కొంది. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేశాక అన్ని పంచాయతీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఇది తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. జనవరి నుంచి మన జిల్లాలో కూడా అమలు చేయనున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే చిన్నచిన్న పల్లెల్లో సైతం పట్టణ స్థాయి మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తా యి. అదే స్థాయిలో పన్నులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. -
పంచాయతీలను బలోపేతం చేయాలి
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. నూతనంగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో గ్రామాలను పటిష్టం చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. తాగు,సాగునీరు, విద్యుత్‌దీపాలు, డ్రైనేజీ, రోడ్లు ఇతర సౌకర్యాలు లేని గ్రామాలను గుర్తించాలన్నారు. సర్పంచులతో ప్రణాళిక తయారు చేసుకుని సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీల అదాయం తక్కువగా ఉందని, దీంతో గ్రామాల అభివృద్ధికి నిధులు సరిపోవడంలేదన్నారు. ఇందుకు గ్రామాల వారీగా పన్నుల వసూళ్లు డిమాండ్ ఎంత ఉందో, ఎంత వసూలు చేశారు, ఇంకా ఎంత చేయాలి, గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమో తెలుసుకోవాలన్నారు. రాజీవ్ స్వశక్తి యోజన పథకం(ఆర్‌జీపీఎస్‌ఏ) కింద పంచాయతీలకు కొత్త భవనాలు, సిబ్బంది కొరత తీర్చడం, కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త ఏడాదిలో కంప్యూటర్లను ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ-పంచాయతీ ఆన్లైన్ ద్వారా మొత్తం వివరాలు అన్ని ఇందులో నమోదు అవుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శుల భర్తీకి.. జిల్లాల్లో ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేయాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ వరప్రసాద్ ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తు కాంట్రాక్టు కార్యదర్శులకు ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వీరికి 25శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాకు మంజూరైన బీఆర్జీ నిధులు,పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ సురేశ్‌బాబు, జెడ్పీ సీఈఓ రాజారాం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.