
మోక్షమేది..?
ఈ పంచాయతీలకు గ్రహణం
సాక్షి, మహబూబ్‌నగర్: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో పరిపాలన పారదర్శకంగా మార్చేందు కోసం తలపెట్టిన ఈ పంచాయతీలకు గ్రహణం పట్టింది. జిల్లాలోని 320 గ్రామాలను సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పంచాయతీల ద్వారా పరిపాలనను మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించింది. ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాలు.. తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. అందుకు అనుగుణంగా గ్రామాల ఎంపిక, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, ఆపరేటర్లు తదితర చర్యలన్నీ పూర్తయ్యాయి.
అయితే రోజులు, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వీటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలో మొత్తం 1310 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల ఎంపికకు గ్రామ పంచాయతీ పరిధిలోని జనాభా, ఆదాయం, ఇంటర్‌నెట్ సౌకర్యం తదితరాల ఆధారం చేసుకొని ఈ పంచాయతీలను ఎంపికచేశారు. వీటిలో మొదటి విడతగా నాలుగు డివిజన్ల పరిధిలోని 320 గ్రామ పంచాయతీలను ఈ కంప్యూటరీకరణ చేయాలని తెలంగాణ సర్కారు భావించింది.
అందుకోసం కంప్యూటర్లు కూడా మంజూరయ్యాయి. జిల్లా అవసరాల నిమిత్తం మొత్తం 392 కంప్యూటర్లు వచ్చాయి. వీటిని గ్రామ పంచాయతీలతో పాటు పరిపాలన అవసరాల నిమిత్తం వినియోగించేలా ప్రణాళిక రచించారు. కంప్యూటర్లను కూడా పంచాయతీలకు పంపించారు. ఈ కంప్యూటర్లకు ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 205 కంప్యూటర్లకు నెట్ సౌకర్యం కల్పించారు. మిగతా వాటికి బీఎస్‌ఎన్‌ఎల్ సదుపాయం కల్పించడం కోసం సర్వం సిద్ధం చేశారు.
ఈ పంచాయతీల నిర్వాహణ కోసం రాష్ట్రస్థాయిలో కార్వి అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. కంపెనీ కూడా బాధ్యత నిర్వహించడం కోసం ఆపరేటర్లకు శిక్షణనిచ్చింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సర్కారు నుంచి ఆదేశాలు అందకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు.
అందనున్న సేవలు: ఈ పంచాయతీల సేవలు ప్రారంభమైతే సకల సమాచారాన్ని ఒక క్లిక్‌తో తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు సేవలు కూడా మరింత సరళతరంగా, పారదర్శకంగా అందుతాయి. పన్నుల వసూలు, వ్యాపార లెసైన్స్‌లు, లేఅవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ పత్రాలు, గ్రామంలోని భూములు, సరిహద్దులు, మన ఊరు- మన ప్రణాళికలతో పాటు పంచాయతీ పరిధిలో తీసుకునే పలు కీలక పనుల వివరాలు, వ్యయ నిర్వహణతో సహా సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ సేవ ద్వారా అందే సేవలన్నింటినీ అందజేయనున్నారు. అలాగే గ్రామసభల్లో చేసిన తీర్మానాలను కూడా పౌరులు తీసుకునేలా వీలు కల్పించనున్నారు.
ఈ పంచాయతీకి ఎంపికైన గ్రామాలు
డివిజన్ \u3149?ట్చఛగ్రామాలు
మహబూబ్‌నగర్ 93
గద్వాల 81
నారాయణపేట 77
నాగర్‌కర్నూలు 69
మొత్తం 320
మంజూరైన కంప్యూటర్లు 392