- ∙గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత పనులకు గ్రీన్‌సిగ్నల్
పంచాయతీల్లో పేరుకుపోయిన మురుగు తొలగనుంది. అయితే నిధులు విడుదలై ఐదు రోజులయినా ఏయే పంచాయతీకి ఎంత కేటాయిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేక పోవడంతో సర్పంచ్‌లు కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా నిధులను చెత్త, మురుగు కాల్వల పరి శుభ్రత, విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కార పనులకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిధుల విషయమై జిల్లా పంచాయతీ రాజ్ అధికారిణి పి.జగదీశ్వరి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం కింద రూ.53 కోట్ల నిధులు ఐదు రోజుల క్రితం విడుదలయ్యాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏయే గ్రామ పంచాయతీలకు ఎంత నిధులు కేటాయించలన్న దానిపై మరో మూడు రోజులో తెలియజేస్తామన్నారు.