పంచాయతీ కార్మికులకు వేతనాలివ్వాలని వినతి
గుంటూరు వెస్ట్: ఆరు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు. సోమవారం యూనియన్ ప్రతినిధి బందం డీపీవో శ్రీదేవిని కలిసి సమస్యను విన్నవించారు. డీపీవోను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.హరిప్రసాద్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పుల్లారావు తదితరులు ఉన్నారు.