కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల జనాభా గల 1700 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు తండాల్లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నేరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు. గిరిజనులకు విద్యా, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 13 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ వివరించారు.