పంచాయతీలు, వార్డు స్థానాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో సోమవారం
పంచాయతీలు, వార్డు స్థానాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో సోమవారం ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల వివరాలను అన్ని పంచాయతీల్లో ప్రచురిస్తారు. దీనికి సంబంధించి శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి, డీపీఓ ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఖాళీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.