పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు అనేక సంవత్సరాలుగా నిర్మల్ గ్రామాలుగా ఎంపిక కాలేకపోతున్నాయి. స్వచ్ఛత, పర్యావరణం లాంటి అంశాలను పాటించడం తదితర ప్రాతిపదికన నిర్మల్ గ్రామ పథకానికి ఎంపిక అవుతాయి. ఇలాంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సదరు గ్రామాలకు లక్షలాది రూపాయలు పారితోషికంగా ఇస్తోంది.
అర్హతలేని 994 గ్రామాలు
జిల్లాలో మొత్తం 1,404 గ్రామాలుండగా, 2014 వరకు జిల్లాలోని 994 గ్రామాలు ఈ పోటీలకు కనీస అర్హత కూడా సాధించలేకపోయాయి. ఖేడ్ తాలూకాలో అత్యధికంగా 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందాపూర్ తాలూకాలో 98, జున్నార్‌లో 90, శిరూర్‌లో 78, హవేలిలో 72, ముల్షీలో 69, పురంధర్‌లో 66, భోర్‌లో 63 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలలో సరైన నీటి వసతి, డ్రైనేజీ, మరుగుదొడ్లు, చెత్త కండీలు లాంటి కనీస సదుపాయలు కూడా లేకపోవడంతో నిర్మల్ గ్రామాలకు అర్హత సాధించలేకపోయాయి.
ఇక బారామతి తాలూకాలో 54, దౌండ్‌లో 57, వేల్హా తాలూకాలో 45 గ్రామాలదీ ఇదే దుస్థితి. భోర్ తాలూకాలో 92 గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామాల సరసన చేరేందుకు కనీసం ప్రయత్నం చేయగా, ఇందులో 59 గ్రామాలు నిర్మల్ గ్రామాలుగా అర్హత సాధించాయి. ఖేడ్‌లో 32, బారామతి తాలూకాలో 44 గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారాలు అందాయి.
తాలూకాల వారీగా.. నిర్మల్ గ్రామ పంచాయతీలు ఇవే..
ఆంబేగావ్ 103, (40 గ్రామాలు నిర్మల్ గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించాయి), బారామతి 97 (44), భోర్ 155 (59), దౌండ్ 79 (28), హవేలి 100 (28), ఇందాపూర్ 113 (13), జున్నార్ 142 (37), ఖేడ్ 163 (32), మావల్ 104 (24), ముల్షీ 95 (27), పురంధర్ 90 (27), శిరూర్ 93 (16), వేల్హే 70 (36) ఉన్నాయి.
‘నిర్మల్’ సాధించేదెప్పుడు?
Published Mon, Jul 7 2014 11:33 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
Advertisement
Advertisement