60 లక్షల ఇళ్లకు ‘మరుగు’ లేదు
పంచాయతీరాజ్ శాఖ అధ్యయనంలో వెల్లడి
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి గ్రామానికి మంచినీరు కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నా.. ఆ దిశగా లక్ష్యం నెరవేరడం లేదని తేలిపోయింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల గృహాలకు మరుగు దొడ్లు లేవని తాజాగా పంచాయతీరాజ్ శాఖ అధ్యయనంలో గుర్తించింది.
90 లక్షల గృహాలకు గాను 30 లక్షల గృహాలకే మరుగు దొడ్లు ఉన్నాయి.
మిగతా 60 లక్షల గృహాలకు మరుగు దొడ్లు నిర్మించాలంటే రూ.పది వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
1,300 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ మరుగు దొడ్లు లేకపోవడం గమనార్హం.హా ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పథకాల ద్వారా ఏడాదికి జిల్లాకో లక్ష చొప్పున 13 జిల్లాల్లో 13 లక్షల మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం. హారాష్ట్రంలో 48,213 నివాస ప్రాంతాలుంటే.. అసలు మంచినీటి సౌకర్యం లేని నివాస ప్రాంతాలు 10 వేలు ఉన్నాయి.హా2,877 గ్రామ పంచాయతీ కేంద్రాలకు, 7వేల గ్రామాలకు బీటీ రోడ్లు లేవు.- సాక్షి, హైదరాబాద్