Ministry of Panchayati Raj
-
'నేను ముందుగా సాక్షి పత్రికే చదువుతా'
-
'నేను ముందుగా సాక్షి పత్రికే చదువుతా'
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సాక్షి, విశాఖపట్నం: ‘నిద్ర లేవగానే నేను పేపర్లు చదవుతా.. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికనే ముందు చదువుతా.. మా పార్టీ వాళ్లు ఈనాడు, జ్యోతి చదవమంటారు. సాక్షి చదవొద్దంటారు. ఈ రెండు పత్రికలు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతే మా లోపాలు.. తప్పులు ఎత్తిచూపే ‘సాక్షి’ పత్రికనే ముందుగా చదవాలంటాను’ అని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సాక్షిలో వచ్చే కథనాల్లో వాస్తవాలుండొచ్చు.. లేకపోవచ్చు, లోపాలు, తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అవాస్తవాలైతే పట్టించుకోనవసరం లేదు. అలా చాలా తప్పులు, లోపాలను మా డిపార్ట్మెంట్ పరంగా సరిదిద్దుకోగలిగాం’ అని చెప్పారు. ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో గురువారం ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ప్రెస్‌ను ఎవాయిడ్ చేయడం సరికాదని చెప్పారు. సమగ్ర కథనాలు, విశ్లేషణలు కావాలంటే దినపత్రికలే ఉండాలన్నారు. పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఆ దిశగా పత్రికలు కృషి చేయాలని సూచించారు. -
పంచాయతీరాజ్‌లో పూర్తి నగదురహితం
జనవరి 10 నుంచి అమలు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో వచ్చేనెల పదో తేదీ నాటికి వంద శాతం నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం నగదు రహిత లావాదేవీల అమలుపై బుధవారం సచివాలయంలో బ్యాంకర్లు, పోస్టల్ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రతినెల 35.96 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందులో 17.81 లక్షల పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా, 13.63 లక్షల పింఛన్లు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నామన్నారు. మరో 4.52 లక్షల లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు. వీరికి ఈ నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బ్యాంకు రెండు గ్రామాలను దత్తత తీసుకుని, ఈ నెల 31లోగా అందరికీ ఖాతా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జనవరి పదిలోగా ఖాతాలను ఆధార్‌తో సీడింగ్ చేసి రూపే కార్డులు ఇవ్వాలన్నారు. ఇకపై ఆసరా పింఛన్‌దారులు, ఉపాధిహామీ కూలీలకు వచ్చేనెల పదినుంచి పూర్తిగా బయోమెట్రిక్ పద్ధతిలో డబ్బులు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల్లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు సూచించారు. -
గ్రామ పంచాయతీల్లో కేరళ తరహా పాలన
► స్థానిక సంస్థలకు విశేషాధికారాలను కల్పించాలని సర్కారు యోచన ► విధివిధానాలపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలను కేరళ తరహాలో స్థానిక ప్రభుత్వాలుగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పంచాయతీల అభివృద్ధికి కేరళ అవలంభిస్తున్న విధానాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ మేరకు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డెరైక్టర్ నీతూప్రసాద్ అక్కడి పలు గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలను సందర్శించిన సంగతి తెలిసిందే. కేరళ తరహాలోనే గ్రామ పంచాయతీలకు పలు విశేషాధికారాలను కల్పించడంతో పాటు, అభివృద్ధికి సూచికలుగా కనిపిస్తున్న కొన్ని కార్యక్రమాలను తెలంగాణలోనూ అమలు చేయాలని జూపల్లి భావిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి గ్రామాల్లో ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, విద్య, వైద్యం, ఆరోగ్య అంశాల్లో అనుసరిస్తున్న విధానాలపై కసరత్తు చేయాలని రాష్ట్ర అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విధివిధానాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వాస్తవానికి కేరళలో పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా తదితర అంశాల్లో రాష్ట్రంలోని పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉన్నా, సారూప్యత కలిగిన కొన్ని అంశాల్లోనైనా మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తొలుత కొన్ని గ్రామాను పెలైట్‌గా ఎంపిక చేసి, ఫలితాలను సమీక్షించాక రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కేరళ తరహా పాలన అంటే... కేరళలో ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన స్థానిక పంచాయతీ వార్డుల్లో జరిగే సభల ద్వారానే కావడం విశేషం. ఇక్కడ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ఉండగా... ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలున్నాయి. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండ దు. పంచాయతీల పరిధిలో పనిచేసే వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు, నిధుల వినియోగానికి జవాబుదారీగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్ప న మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీ లకు ఆదాయ వనరుల విషయానికి వస్తే.. ప్రధానంగా బిల్డింగ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన గ్రామీణాభివృద్ధికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాలకే జమవుతాయి -
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అన్నివర్గాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్డీవో)లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల నేపథ్యం లో నూతనంగా నియమితులైన డీఆర్డీవోలకు డీఆర్డీఏ, డ్వామా వంటి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని జూపల్లి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరికి సంక్షేమ ఫలాలను చేర్చడమే చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యమన్నారు. గ్రామాలు స్వయంసమృద్ధిని సాధించే విధం గా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి అన్ని జిల్లాల్లో అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఆర్డీవోలను ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు మహిళా, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన మహిళా సంఘాలను సంఘటిత శక్తిగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్డీవోలను ఆదేశించారు. 60 శాతం కుటుంబాలకు ఉపాధి ప్రతి గ్రామంలో కనీసం 60 శాతం కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కూలీ లకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సూచించారు. -
గ్రామాల్లో జాడలేని ‘స్వచ్ఛ పక్వాడ’
- జిల్లాల పునర్విభజన హడావుడిలో పట్టించుకోని అధికారులు - క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్ : ‘స్వచ్ఛ పక్వాడా(పరిశుభ్రత పక్షోత్సవాలు)’ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు. పరిశుభ్రత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికిగాను ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి 15 వరకు పంచాయతీల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి శారద మురళీధరన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో పరిశుభ్రత పక్షోత్సవాలు జరిగిన తీరు గురించి ఈ నెలఖారులోగా సమగ్ర నివేదికను కూడా పంపాలని కోరారు. అయితే, ‘స్వచ్ఛ పక్వాడ’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా తూతూమంత్రంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఏఏ కార్యక్రమాలు చేయాలో సూచిస్తూ షెడ్యూల్‌ను జిల్లా పంచాయతీ అధికారులకు చేతులు దులుపుకున్నారు. 15 రోజులపాటు పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన నిధులను ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కేటాయించలేదు. పక్షోత్సవాలను పర్యవేక్షించిన నాథుడు లేడు. ఈ నెల ఆరంభం నుంచే రాష్ట్రంలో అత్యంత వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు మొదలు కావడం, ఆపై దసరా, మొహర్రం పండుగలు రావడంతో ప్రజలంతా పండుగ ధ్యాసలో ఉన్నారని, పక్షోత్సవాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావడంతో ఆయా జిల్లాలకు పంచాయతీ అధికారుల నియామకం, ఉద్యోగుల విభజనతో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయామంటున్నారు. స్వచ్ఛ పక్వాడా జరగాల్సింది ఇలా.. అక్టోబర్ 1న గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు, పంచాయతీరాజ్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కో రకమైన కార్యక్రమం చేపట్టాలని కేంద్రం సూచించింది. వాటిల్లో ప్రధానంగా అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహించాల్సి ఉంది. పక్షోత్సవాల చివరి రోజైన అక్టోబర్ 15న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ మరోమారు గ్రామసభ నిర్వహించి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉంది. -
సెర్ప్‌లో ‘వేతన వేదన’పైసర్కారు సీరియస్
పంచాయతీరాజ్ శాఖను వివరణ కోరిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపోతుండటంపై సర్కారు సీరియస్ అయింది. ‘సెర్ప్ ఉద్యోగులకు వేతన వేదన’ శీర్షికన ఈనెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించారు. వేలాది మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోతుండటం, ఆగస్టు 1 నుంచి వేతన పెంపు అమలు కాకపోవడం తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈనెల 20న నోటీసు జారీ చేశారు. అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాచారం అందకపోవడంపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ అదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ శ్రీధర్ ..సెర్ప్ అధికారులకు 21న మెమో జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవారం వరకు సెర్ప్ అధికారుల నుంచి తనకు సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సెర్ప్ ఇంచార్జి సీఈవో అనితా రాంచంద్రన్, సీఎస్ నోటీసుకు వివరణ పంపించామని ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులకు వేతన పెంపు విషయమై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా వేతనాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
‘భగీరథ’కు రూ.6,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.6,750 కోట్ల రుణాన్ని అందజేసేందుకు ఆంధ్రా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బ్యాంకుల కన్సార్షియం అంగీకరించింది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయితే ఈనెల 29న రుణ మొత్తాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కన్సార్షియంలోని బ్యాంకుల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కన్సార్షియం ప్రతినిధులతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ డెరైక్టర్లు సమావేశమయ్యారు. కార్పొరేషన్ ఎండీగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి బ్యాంకులు ఆర్థికంగా సహకరిస్తుండడం ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగిస్తోందని అన్నారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు కన్సార్షియం అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ఆంధ్రాబ్యాంక్ ఎండీ సురేశ్ మాట్లాడుతూ కన్సార్షియం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు అన్ని బ్యాంకుల మేనేజింగ్ కమిటీల నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. -
పంచాయతీరాజ్ శాఖలో ‘సీన్ రివర్స్’
ఎంపీటీసీలకు పాత వేతనాలే మంజూరు చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ సీన్ రివర్స్ అయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాల్లో సర్కారు భారీగా కోతపెట్టింది. గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులకు రావాల్సిన గౌరవ వేతనం 9 నెలల బకాయి ఉండగా, మూడు నెలలకు సరిపడానే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదలా ఉంచితే ఎంపీటీసీ సభ్యులకు తిరిగి పాత వేతనాలనే మంజూరు చేసింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఎంపీటీసీల వేతనాన్ని నెలకు రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా నెలకు రూ.750 చొప్పున లెక్కకట్టి బడ్జెట్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ సభ్యులకు రూ.5వేల చొప్పున నెల వేతనం రూ.3,19,60,000 ఇవ్వాల్సి ఉండగా, రూ.750 చొప్పున మూడు నెలలకు లెక్కకట్టి రూ.1,27,73,000 మాత్రమే మంజూరు చేసింది. కాస్త ఆలస్యమైనా నెలకు రూ.5వేల వేతనం వస్తుంది కదా అనుకున్న ఎంపీటీసీలకు ప్రభుత్వం రూ.750 చొప్పున వేతనం ఇవ్వడం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. సర్పంచులకు గౌరవ వేతనం కింద రూ.26 కోట్లు రావాల్సి ఉండగా, రూ.7 కోట్లే మంజూరయ్యాయి. అయితే జడ్పీటీసీలకు రావాల్సిన 9 నెలల వేతన బకాయిల్లో ప్రస్తుతానికి మూడు నెలలే ఇచ్చినా, పెంచిన వేతనం ప్రకారమే మంజూరు కావడంతో కొంతమేర వారికి ఉపశమనం కలిగిం చింది. ఎంపీటీసీల ఫోరం ఆందోళన ఎంపీటీసీలకు పాత వేతనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ ఎంపీటీసీల ఫోరం శుక్రవారం సచివాలయంలో ఆందోళన వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను వాకబు చేయగా, కమిషనర్ కార్యాలయం నుంచి అందిన ప్రతిపాదనల మేరకే తాము ఉత్తర్వులు జారీ చే శామంటున్నారని ఎంపీటీసీల ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోళ్ల కరుణాకర్, మనోహర్‌రెడ్డి చెప్పారు. జరిగిన దాంట్లో తమ తప్పేమీ లేదని, తాము ప్రతిపాదనలను సక్రమంగానే పంపినా సచివాలయ అధికారులే తక్కువ మొత్తాన్ని మంజూరు చేసినట్లు కమిషనర్ కార్యాలయ సిబ్బంది చె ప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి విన్నవించనున్నట్లు తెలిపారు. -
కరువుపై అధికారులు స్పందించాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో 125 తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు విధులు నిర్వహించేందుకు స్పందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి హెచ్‌కే.పాటిల్ అధికారులను కోరారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ సభాంగణంలో తాగునీటి ఎద్దడి, కరువు ఆధ్యయన పరిస్థితిపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు శాఖల మధ్య సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన తాగునీటి పథకాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నీరందించాలని కోరారు. అవ సరం ఉన్న చోట్ల నీటి ట్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. రాయచూరు జిల్లాలో కరువు సహాయక పనుల కింద 27 లక్షల మానవ ఆహార పనులకు గానూ రూ.181 కోట్ల నిధులు ఖర్చు అయ్యాయన్నారు. 11 పశుగ్రాస కేంద్రాలను ప్రారంభించి 49,5978 మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచామన్నారు. 269 చెరువుల్లో తాగునీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. కరువు సహాయక అధికారులు సంబంధం లేని విధంగా వ్యవహరించడం తగదన్నారు. తాగునీటి సమస్యలున్న గ్రామాలను గుర్తించక పోవడంపై పంచాయితీరాజ్ ఇంజనీర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 185 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, 467 గ్రామాల్లో ఏ విధంగా అధికారులు పని చేశారనేది అర్థం కావడం లేదన్నారు. అధికారులు కరువు గ్రామాల్లో పర్యటించాలన్నారు. పశు గ్రాసాన్ని సబ్సిడీ రూపంలో లభించే విధంగా చూడాలన్నారు. లింగసుగూరు, మాన్వి, మస్కి, రాయచూరు గ్రామీణ, రాయచూరు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు సంబంధించి శాసన సభ్యులు మంత్రికి విన్నవించారు. సమావేశంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్, నగరాభివృద్ధి, మైనార్టీ శాఖా మంత్రి ఖమరుల్ ఇస్లాం, మహిళ శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉమాశ్రీ, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు వీరలక్ష్మి, ఉపాధ్యక్షులు గీత, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బోసురాజు, బాదర్లి హంపన గౌడ, ప్రతాప గౌడ పాటిల్, బసవరాజ పాటిల్ ఇటగి, అధికారి మౌనేశ, జిల్లాధికారి శశికాంత సింతల్, సీఈఓ కూర్మారావులున్నారు. -
పల్లెల అభివృద్ధికి కృషిచేస్తా: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశానని, ఇకపై పల్లెలను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో జూపల్లిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుపుకుపోతానని, పరిపాలనలో కొత్త ఒరవడితో ముందుకు వెళతానని జూపల్లి చెప్పారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా మహిళలు చదువు నేర్చుకునేలా కృషి చేస్తానన్నారు. గ్రామీణ పేదలకు వందశాతం ఉపాధి పనులు అందేలా చూస్తానన్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితారాం చంద్రన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు భూమన్న తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్ తప్పనిసరి
గ్రామ పంచాయతీ నిధులతో ఆయా గ్రామాల పరిధిలో ఉండే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలు అద్దె, ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నప్పటికీ, అన్నింటిలో ఫ్యాను ఏర్పాటు చేసే బాధ్యతను పంచాయతీలకే అప్పగించారు. గ్రామాలకు కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఇందుకు ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థాయిలో జరిగిన ఈ నిర్ణయాన్ని కలెక్టర్లు అన్ని పంచాయతీల్లో అమలు చేసేలా చూడాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం మెమో నంబర్- 3431ను జారీ చేసింది. -
మూస పద్ధతిలో ప్రతిపాదనలు వద్దు
పంచాయతీరాజ్ ‘బడ్జెట్’పై అధికారులతో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను మూస పద్ధతిలో కాకుండా అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడేళ్లకు సంబంధించిన విజన్‌పైనా సమీక్షించారు. గతేడాది బడ్జెట్లో కేటాయింపులు, వ్యయంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం, ప్రాధాన్యతలపై చర్చించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీని బీటీ రోడ్డుతో అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న పంచాయతీ రోడ్లను అవసరమైన చోట విస్తరించాలని, రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను డిజిటలైజ్ చేసేందుకు, పనులను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు టూల్ రూపకల్పన కోసం బడ్జెట్లో ప్రతిపాదించాలన్నారు. మిషన్ భగీరథకు అధిక నిధులు కేటాయిస్తామని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మంత్రి ఆరా తీశారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.55 లక్షల టాయిలెట్స్ నిర్మాణానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. గ్రామజ్యోతిలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడతామని ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తెలిపారు. 1,000 గ్రామ పంచాయతీ భవనాలు, 1,064 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు 2016-17 బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)-2016 డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో ఇంటిపన్ను రెట్టింపు!
చదరపు అడుగుల లెక్కన పన్నుధర పెంపు ప్రజలపై ఏటా రూ.120 కోట్ల అదనపు భారం త్వరలోనే బాదుడుకు సంబంధించిన ఉత్తర్వులు హైదరాబాద్ చంద్రబాబు సర్కార్ గ్రామీణ ప్రజలను పన్నుతో బాదడానికి రంగం సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో సొంతిళ్లు ఉన్న వారి నుంచి ఏడాదికొకసారి వసూలు చేసే ఇంటి పన్నును వంద శాతం పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రజలపై ఏటా రూ. 120 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం మైనర్ పంచాయతీల్లో ఇంటి విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూపాయి చొప్పున.. మేజరు పంచాయతీల్లో చదరపు అడుగుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. దీనిపై గ్రంధాలయ వసతి సెస్ కింద 8 శాతాన్ని అదనంగా కలిపి ఇంటి పన్నుగా వసూలు చేస్తున్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక వీధి దీపాల అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను ఆయా గ్రామ ప్రజల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి, ఇందుకు గాను ఆయా పంచాయితీల్లో విద్యుత్ వినియోగాన్ని బట్టి ఇంటి పన్నుపై ఐదు నుంచి పది శాతం మేర వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తాజాగా చదరపు అడుగు విస్తీర్ణానికి రూపాయి చొప్పున వసూలు చేసే చోట రెండు రూపాయలు, రెండు రూపాయలు వసూలు చేసే గ్రామాల్లో నాలుగు రూపాయలు వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగే మొత్తానికి సరిపడా గ్రంధాలయ సెస్, వీధి దీపాల విద్యుత్ చార్జీల భారం కూడా పెరుగుతాయి. రెట్టింపు కానున్న భారం..: పన్ను పెంచాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం కారణంగా.. రాష్ట్రంలో గ్రామాల్లోని ఒక్కో ఇంటి యజమానిపై కనీసంగా ఏడాదికి రూ.350 అదనపు భారం పడే అవకాశం ఉంది. మైనర్ పంచాయతీ పరిధిలోనే 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఉండే చిన్న ఇంటిలో ఉండే నిరుపేద కుటుంబం ఇప్పటి వరకు ఏటా సుమారు రూ. 350 రూపాయలు చెల్లించాల్సి ఉండగా పెంపుతో ఆ మొత్తం రూ. 700 అవుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం రెడ్డిపాలెం గ్రామంలో మొత్తం 1,200 వరకు ఇళ్లు ఉండగా.. ఇప్పుడు ఏడాదికి రూ. 1.53 లక్షల రూపాయలు ఇంటి పన్ను రూపేణా వసూలు చేస్తున్నారు. పన్ను పెంపు తరువాత ఆ ఒక్క గ్రామ ప్రజలపైనే ఏడాదికి మరో లక్షన్నర రూపాయల అదనపు భారం పడబోతుంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీల నుంచి ఏటా రూ.120 కోట్లు మేర ఇంటి పన్ను రూపేణా వసూలు చేస్తుండగా.. పెంపు తరువాత ఆ మొత్తం రూ.240 కోట్లు కానుంది. -
నిధులున్నా.. కదలరా!
వరంగల్ : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా రంగానిదే కీలక పాత్ర. రవాణా వసతులు మెరుగ్గా ఉంటే పరిశ్రమల స్థాపనకు వెసలుబాటు, ఆపై స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఈ ఉద్దేశంతోనే రవాణా వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ అలసత్వం అన్ని శాఖల్లో ఉన్నా.. పంచాయతీరాజ్(పీఆర్) శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరు మరీ అధ్వానంగా ఉంది. పెద్దమొత్తంలో నిధులు.. రోడ్ల నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులు అందుబాటులో ఉన్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పీఆర్ విభాగం ోడ్లు ఉండే తొమ్మిది జిల్లాల్లో మన జిల్లా ఏడో స్థానంలో ఉండడం చూస్తేనే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చు. పునరుద్ధరణకు రూ.416 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ తరఫున గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్)కు నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా రూ.416 కోట్ల నిధులు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని సూచించింది. అరుుతే, ఈ పనులు ఎప్పు డో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఘనత వహించిన మన ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి కావడం లేదు. 1676.37 కిలోమీటర్లలో కేవలం 484 కిలోమీటర్ల మేర రోడ్లనే పునరుద్ధరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నూతన రోడ్లు ఇక.. పాత రోడ్లను పునరుద్ధరించడమే కాకుండా జిల్లాలో కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.185.71 కోట్లు విడుదల చేసింది. పనుల అంచనా నివేదికలు రూపొందించడమే కాకుండా పూర్తయిన పనులకు బిల్లులు తయారు చేయడంలోనూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నూతన రోడ్ల పనుల పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లాలో ఇప్పటికి 57 కిలోమీటర్ల మేరకే కొత్త రోడ్లు నిర్మించడం గమనార్హం. మంచి సీజన్లోనూ.. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నవంబర్ నుంచి మే వరకు అనువైన సీజన్‌గా చెబుతారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో సెప్టెంబర్ నుంచే రోడ్ల పనులు చేసేందుకు అనువుగా ఉంది. అరుునా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం పనులపై దృష్టి పెట్టడం లేదు. వరంగల్ జిల్లాలో అనుభవం ఉన్న పెద్ద కాంట్రాక్టర్లే కాకుండా.. బీటీ రోడ్ల నిర్మాణంలో కీలకమైన 22 హాట్ మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. నిధులు కేటాయించి ఏడాది గడుస్తోంది. ఇలా వనరులు ఉన్నా రోడ్ల పనులు జరిగే తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఈ విషయూన్ని గుర్తించిన పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఈఎన్సీ వరంగల్ జిల్లా అధికారుల తీరు వల్ల తమ శాఖకు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే చెప్పినా జిల్లా అధికారుల తీరు మారకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అత్యున్నత అధికారి ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎం.సత్యనారాయణరెడ్డి ఈనెల 23న జిల్లాకు వచ్చారు. ఇంజనీరింగ్ శాఖలోని అందరు అధికారులతో పనుల తీరుపై సమీక్షించారు. నెల రోజులుగా జిల్లాలో ఒక్క కిలోమీటరు రోడ్డు పనులైనా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని వనరులు ఉన్నా పనులపై శ్రద్ధ చూపని అధికారులు.. ఈఎన్సీ ఆగ్రహంతోనైనా తీరు మార్చుకుంటారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ లో కలిశారు. స్థానిక సంస్థలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రిని కోరారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా నిధులన్నీ గ్రామ పంచాయితీలకే వెళుతున్నాయని.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఈ సందర్భంగా కేటీఆర్.. బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రులతో సమావేశం కానున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థలకు బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్... మిగతా రాష్ట్రాలు కూడా ఈ సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అందరికీ ఆదర్శప్రాయం అని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. -
ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు
మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : రాష్ర్టంలోని 329 ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రూ.13 కోట్లతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌లో రూ.350 కోట్లతో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేడతామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,400 కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో 2,400 పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ర్టంలో 13 వేల గ్రామ పంచాయతీలను ప్రణాళికపరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీ ఉపాధి నిధులు రూ.1680 కోట్లతో గ్రామాల్లో చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిర్మాణదశలో ఉన్న 789 పనులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో రూ.7.8 కోట్లతో ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో రోడ్లు వేస్తామన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో రూ.220 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.5కోట్ల 20 లక్షలతో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామన్నారు. రాష్ర్టంలో తొలి విడతగా 6 లక్షల తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పంచాయతీరోడ్ల మరమ్మతులకు రూ.150 కోట్లు మంజూరు కాగా, వీటిలో నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.35 కోట్లు కేటాయించామన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. -
నేడు జిల్లాకు కేటీఆర్
దేవరకొండ : రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు మొట్టమొదటిసారిగా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గతంలో జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలతో భాగస్వామ్యం పంచుకునే కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారి కావడం, అదీ మారుమూల మండలమైన చందంపేట మండలంలోనూ పర్యటించనుండటంతో దేవరకొండ ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ బాధ్యతలు వహిస్తుండటంతో మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూస్తున్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి బాలునాయక్ మంత్రి పర్యటించే చందంపేట, దేవరకొండ, చింతపల్లి మండలాల్లో గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో ఏర్పా టు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు దేవరకొండలో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా చందంపేటకు వెళ్తారు. మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో కేటీఆర్ కృషి అభినందనీయమని, ఆయన నియోజకవర్గంలో పర్యటించడం దేవరకొండ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పర్యటన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. -
సడక్ నిధులకు సడన్ గండి
పీఎంజీఎస్‌వై నిధుల్లో కేంద్రం కోత పంచాయతీరాజ్ రోడ్లపై ప్రభావం 106 వంతెనల నిర్మాణానికి అనుమతి నిరాకరణ హైదరాబాద్: సడక్ నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. అర్ధాంతరంగా నిధుల్లో కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణపనులపై ప్రభావం పడే అవకాశముంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కేంద్రం గండికొట్టింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.774.92 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను కేంద్రానికి పంపారు. ఈ మేరకు రాష్ట్రానికి రూ.544.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మొదట ఆమోదం తెలిపింది. కాని, అకస్మాత్తుగా కొర్రీ పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కూడా కేంద్రం కోత విధించింది. రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో 22 శాతం (రూ.122కోట్లు) నిధులనే మంజూరు చేసింది. దీంతో కేంద్ర నిధులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ రోడ్ల నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం పడనుంది. బ్రిడ్జిల నిర్మాణానికి బ్రేక్ గ్రామీణ రహదారుల మధ్య అవసరమైన చోట చేపట్టిన వంతెనల నిర్మాణాలకు కూడా కేంద్రం బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 106 వంతెనల నిర్మాణం కోసం రూ.132.52 కోట్ల అంచనాతో పంచాయతీరాజ్ విభాగం గతేడాది ఆగస్టులో కేంద్రానికి ప్రతిపాదనలను పం పింది. ఇంతవరకు అనుమతులు లభించలేదు. మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల సమీక్ష సందర్భంగా ఈ వ్యవహారాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తెచ్చారు. కేంద్రంతో చర్చించి నిధులు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
బది‘లీల’లు
ఎమ్మెల్యేల లేఖ ♦ ఒంగోలులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పట్టుమని పది నెలలు కూడా కాకముందే అతని స్థానంలో మరొకరిని సిఫార్సు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. చీరాలలో డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగికి అక్కడే స్థానం కల్పించాలంటూ మరో ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. దీంతో తనకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదనుకున్న ఆ ఉద్యోగికి కూడా బదిలీ తప్పనిసరి పరిస్థితైంది. ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తున్న స్థానాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కనీసం తమకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల అవకాశం కల్పించాలంటున్నా ససేమిరా అంటున్నారు. ♦ జెడ్పీలోలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్నవారిని మాత్రం బదిలీల పేరుతో బయటకు నెట్టాలని నిర్ణయించారు. వారి స్థానంలో అధికారపక్షం అండదండలున్న వారిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, : అధికార పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి సిఫార్సు లేఖ ఇస్తే పోస్టింగ్ ఖాయం. లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారో ఎవరికీ తెలియదు. జిల్లాలో బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండటంతో అడ్డతోవలు తొక్కడానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు ఇచ్చిన లేఖలు తీసుకుని అధికారులు, సిబ్బంది క్యూ కట్టారు. ఎంపీడీవో బదిలీలు, జెడ్పీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై వివాదం నెలకొంది. నిబంధనలను పక్కన పెట్టి సిఫార్సులకే పెద్ద పీట వేయడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించి మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గో తరగతి ఉద్యోగులు, రికార్డు అసిస్టెంట్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, అకౌంట్స్ ఆఫీసర్ ప్రారంభించారు. సాధారణంగా ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరవుతుండడం పరిపాటి. కానీ సంఘాల నాయకుల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పవని సూచించడంతో వారంతా దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది పరస్పరం బదిలీలు కోరుకున్నవారు కూడా తమ దరఖాస్తులను అధికారులకు పంపించారు. వారి విజ్ఞప్తుల మేరకు ముందస్తు బదిలీలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం నుంచి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు సూచించిన వారికి బదిలీలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పైరవీలు దందాకు తెరలేచింది. ఎమ్మెల్యేలు లేనిచోట: మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట అధికార పార్టీ ఇన్‌ఛార్జులు కూడా సిఫార్సు లేఖలు హవా సాగింది. సంతనూతలపాడులో ఒక ఉద్యోగికి ఆ స్థానం ఖాళీ చేయాలంటూ లేఖ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగిని ఎక్కడకు పంపిస్తారో మాత్రం తెలియని పరిస్థితి . ► పొదిలిలో ఒక ఉద్యోగిని మార్పు చేయాలంటూ ఒంగోలులో ఒక అధికార పార్టీ నాయకునితోపాటు మార్కాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి నుంచి కూడా ఉత్తర్వులు అధికారులకు అందాయి. ► శుక్రవారం రాత్రి వరకు నిర్వహించినా బదిలీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారం ఎంపీడీవో, సూపరింటెండెంట్లకు సంబంధించిన బదిలీలు నిర్వహించనున్నారు. వీటికి కూడా పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటే కనీసం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల విజ్ఞప్తి కూడా పరిగణనలోకి తీసుకోవాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఇప్పటికే జెడ్పీ సీఈవోను, జిల్లా పరిషత్ చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ► జిల్లాలో ముగ్గురు డివిజనల్ పంచాయతీ అధికారులు, 32 మంది ఈవోఆర్డీలు, మరో 500 మంది వరకు పంచాయతీ కార్యదర్శులున్నారు. కార్యదర్వులు ఇప్పటికే అధికార పార్టీ నుంచి లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు పక్కనే ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏకంగా 25 మంది కార్యదర్శులకు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ శాఖలో కూడా బదిలీల ఫీవర్ కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా సహకార అధికారితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. -
ఏప్రిల్ 1 నుంచే పెరిగిన గౌరవ వేతనాలు
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపుపై ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ జీవో జారీ చేశారు. పెరిగిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించారు. -
60 లక్షల ఇళ్లకు ‘మరుగు’ లేదు
పంచాయతీరాజ్ శాఖ అధ్యయనంలో వెల్లడి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి గ్రామానికి మంచినీరు కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నా.. ఆ దిశగా లక్ష్యం నెరవేరడం లేదని తేలిపోయింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల గృహాలకు మరుగు దొడ్లు లేవని తాజాగా పంచాయతీరాజ్ శాఖ అధ్యయనంలో గుర్తించింది. 90 లక్షల గృహాలకు గాను 30 లక్షల గృహాలకే మరుగు దొడ్లు ఉన్నాయి. మిగతా 60 లక్షల గృహాలకు మరుగు దొడ్లు నిర్మించాలంటే రూ.పది వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. 1,300 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ మరుగు దొడ్లు లేకపోవడం గమనార్హం.హా ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పథకాల ద్వారా ఏడాదికి జిల్లాకో లక్ష చొప్పున 13 జిల్లాల్లో 13 లక్షల మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం. హారాష్ట్రంలో 48,213 నివాస ప్రాంతాలుంటే.. అసలు మంచినీటి సౌకర్యం లేని నివాస ప్రాంతాలు 10 వేలు ఉన్నాయి.హా2,877 గ్రామ పంచాయతీ కేంద్రాలకు, 7వేల గ్రామాలకు బీటీ రోడ్లు లేవు.- సాక్షి, హైదరాబాద్ -
పంచాయతీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ
హైదరాబాద్: గ్రామ పరిపాలనలో ఒడిదుడుకులు ఎదురైనా నిరుత్సాహ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీఎస్‌ఐపార్డ్)లో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన 187 మంది కార్యదర్శులకు ట్రైనింగ్ సర్టిఫికేట్లను కమిషనర్ అందజేశారు. కార్యక్రమంలో కోర్సు డెరైక్టర్లు స్వామి, కుసుమ మాధురి, పరిపాలనాధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
కాగితాలపై కోట్లు.. కార్యాచరణకు తూట్లు
- టెండర్ దశలోనే 248 పనులు - ప్రారంభమైన వాటి విలువ రూ.20 కోట్లే - పంచాయతీరాజ్ శాఖ నిర్లిప్తత ఏలూరు (టూటౌన్) :జిల్లాలో మరో 90 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కుంభమేళ తరహాలో పుష్కరాలు నిర్వహిస్తామని ఒక పక్క ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేశారు. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గోదావరి పుష్కరాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని ప్రకటించినా వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. 278 పనులకు ప్రభుత్వం రెండు విడతలుగా అనుమతులు మంజూరు చేసినా ప్రస్తుతం 28 పనులు ప్రారంభమయ్యాయి. మరో 248 పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. టెండర్లు ఖరారై, ఒప్పందాలు పూర్తయి పనులు ప్రారంభించడానికి కనీసం మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏలూరు పంచాయితీరాజ్ ఎస్ఈ కార్యాలయం నుంచి మొదటి విడతగా రూ.20 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా, వాటికి టెండర్లు వేసి అగ్రిమెంట్ కూడా పూర్తయింది. కానీ 28 పనులను మాత్రమే కాంట్రాక్టర్లు ప్రారంభించారు. మరో రెండింటిని ప్రారంభించాల్సి ఉంది. రెండో విడతలో 248 పనులకు రూ.36 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆలస్యంగా అనుమతులు ఇవ్వడంతో ఇంకా టెండర్ల ప్రక్రియ దశలోనే ఈ పనులున్నాయి. అధికారులు 248 పనులకు టెండర్లు వేయగా రోజుకు 10 పనులు చొప్పున టెండర్లను తెరుస్తున్నారు. టెండర్లను తెరిచే ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందని, ఆ తరువాత రాబోయే 10 రోజుల్లో ఒప్పందాలు పూర్తి చేస్తామని చెబుతున్నా మొత్తం పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదని సమాచారం. వీటికి అధికారులు మరోసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఒక పక్క పుష్కరాల గడువు దగ్గర పడుతున్నా అధికారుల్లో వేగం కనిపించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖద్వారా పుష్కరాలు జరిగే అన్ని ఘాట్లకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా వీటిని ప్రారంభించడం ఆలస్యమైంది. పుష్కరాలకల్లా పూర్తవకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన స్పందించి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. పనుల పూర్తికి సత్వర చర్యలు పుష్కరాల నాటికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడత పనులకు అనుమతులు రావడం ఆలస్యం కావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే అగ్రిమెంట్ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. - సి.వేణుగోపాల్, ఎస్ఈ, పంచాయతీరాజ్ శాఖ -
గ్రామ కార్యదర్శులకు బదిలీ
కొత్త నిబంధనలు రూపొందించిన ఏపీ పంచాయతీరాజ్ హైదరాబాద్: గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నూతన నిబంధనలను రూపొందిం చింది. ప్రస్తుతం తాను పుట్టిన ఊరులోనో లేదంటే సొంత మండలంలోనే గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారిప్పుడు ఈ నిబంధనల మేరకు బదిలీ కాక తప్పదు. వాటిపై సంబంధిత శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తాను జన్మించిన రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఎంపీడీవోలను వేరొక రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని నిబంధన విధించారు. ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నప్పటికీ 11 నాటికే ఈ ప్రక్రియ ముగించాలని అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల విభాగాల్లోని జిల్లా ఎస్ఈలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారుల బదిలీల ఫైలుకు మంత్రి శనివారం ఆమోదం తెలిపారు. డిసెంబరు నాటికి .. ఎన్టీఆర్ సుజల ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటి వరకు 245 నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పన ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొన్నామని డిసెంబర్ ఆఖరు నాటికి ప్రతి మండలంలోనూ కనీసం ఒక ప్లాంటునైనా ఏర్పాటు చేస్తామన్నారు. కార్తీక వనమహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 17న విశాఖ రానున్నారని.. ఈ సందర్భంగా తుపాను సమయంలో బాగా పనిచేసిన అధికారులకు అభినందన కార్యక్రమం ఉంటుందన్నారు. -
కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?
కింది చిత్రంలో కనిపిస్తున్న వారు కలెక్టరాఫీసు వరండా వద్ద ఏదో దరఖాస్తు రాస్తున్నారనుకుంటే పొరపడినట్టే! శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు రాస్తున్నది హుద్‌హుద్ తుపాను నష్టాల అంచనాల జాబితా. వీరిద్దరూ రామభద్రపురం వ్యవసాయ శాఖకు చెందిన ఏఈఓలు. తుపాను తీరం దాటి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇంకా నష్టం అంచనాల ప్రతిపాదనలు పూర్తి చేయలేదు. త్వరగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీరిలా ఆదరాబాదరాగా కలెక్టర్ కార్యాలయం వరండా వద్ద నష్టం అంచనాలను రాసుకుంటున్నారు. విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ నష్టం అంచనాలను పదిహేను రోజుల క్రితమే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు నివేదిస్తామని కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఇంకా వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల 4న పూర్తి నివేదిక అందజేస్తామని వ్యవసాయ శాఖ చెప్పింది. కానీ శుక్రవారం నాటికి కూడా లెక్కలు కడుతూనే ఉన్నారు. ఒక్క వ్యవసాయ శాఖే కాదు పంచాయతీ రాజ్, ఉద్యాన వనాలు ... చాలా శాఖల పరిస్థితి ఇలాగే ఉంది. అంటే నష్టం అంచనాల తయారీలో ప్రభుత్వ శాఖలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ రోజూ... ఈ రోజు ఇస్తాం! రేపు ఇస్తాం అంటూ తుపాను నష్టాల నివేదికలు పంపడంలో ఆలస్యం చేస్తుండడంతో అవి ఎప్పుడు వెళతాయి? ఎప్పుడు కేంద్ర బృందం వస్తుంది? ఇంకెప్పుడు పరిహారం అందుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వీరు నివేదికలు ఇవ్వకముందే కేంద్ర బృందం వచ్చేలా ఉందని పలువురు ఆక్షేపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు కూడా జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం అంచనాలు పంపించడానికి మీకెన్ని రోజులు కావాలి? త్వరగా తేల్చండి!, ఇలా అయితే మన నివేదిక వెళ్లకుండానే కేంద్ర బృందంజిల్లాకు వచ్చేలా ఉందని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో తుపాను తరుముకొస్తున్నా హుదుహుదు నివేదికలు పూర్తి కాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవరణల మీద సవరణలు చాలా శాఖల్లో జరిగిన నష్టం ఇంతేనంటూ ముందు చెప్పి మళ్లీ కొన్ని రోజుల తరువాత ఆయ్యా.... చిన్న సబ్మిషన్! అంటూ మరికొన్ని నష్టాలను చూపెడుతున్నారు. దీంతో నష్టాల నివేదికలో సవరణలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో రూ.1197 కోట్లు నష్టం జరిగినట్టు గురువారం నాటికి అంచనా వేశారు. అయితే అంచనాలు పెరుగుతుండడంతో పూర్తి స్థాయి నివేదిక ఇంకా సిద్ధంకాలేదు. జిల్లాలో ఉన్న చిన్న చిన్న శాఖలన్నీ తమ నివేదికలను అందించేశాయి. కానీ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి ఇంకా నివేదికలు రాలేదు. ప్రతీ రోజూ ఈ శాఖల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నష్టం వివరాలు అందుతునే ఉన్నాయి. గురువారం నాటికి నష్టం వివరాలను పంపించేయాలని, దీనికి అనుగుణంగా పని చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం త్వరపడడం లేదు. జిల్లాలో వ్యక్తిగత ఆస్తులతో కలిసి రూ. 1197 కోట్లు నష్టం వచ్చినట్టు గురువారం సాయంత్రానికి అంచనా వేశారు. అయితే ఇందులో వ్యక్తిగత నష్టాలను తొలగించి శాఖాపరంగా వచ్చిన నష్టం రూ. 1097 కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇలా కూడికలు. తీసివేతలతో కాలహరణ చేస్తున్నారు తప్పా, పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించడం లేదు. నష్టం అంచానులు ఇంకా పెరిగే అవకాశముంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు తుపాను నష్టం అంచనాలు వేస్తారో అధికారులకే తెలియాలి!! -
కుంటుపడిన ‘పల్లె’ పాలన
డిచ్పల్లి : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించే పంచాయతీ రాజ్ శాఖలో మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శుల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇన్చార్జిల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖలో అధికారుల సంఖ్య నానాటికి పలుచబడిపోతోంది. జిల్లాలో 36 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్చార్జి ఎంపీడీఓలే విధులు నిర్వహిస్తున్నారు. 36 మండలాల్లో 718 గ్రామపంచాయతీలు ఉండగా పాలనా సౌలభ్యం కోసం 477 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. అయితే జిల్లాలో 148 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు, మూడు క్లస్టర్లకు ఇన్చార్జిగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ రాజ్ శాఖలో కీలక భూమిక పోషించే ఈఓపీఆర్డీలదీ ఇదే పరిస్థితి. 36 మండలాలకు గాను కేవలం 14 మంది ఈఓపీఆర్డీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన మండలాల్లో సూపరింటెండెంట్లు, ఈఓలు ఇన్చార్జి ఈఓపీఆర్డీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జిలుగా విధులు నిర్వహించడంతో పనిభారం అధికమై ఏ ఒక్క గ్రామానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు పలు గ్రామాల్లో బిల్‌కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పని భారాన్ని బట్టి గ్రామంలోని యువకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని పని చేయించుకుంటున్నారు. ఇన్చార్జిల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు సమస్యలతో సతమవుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వరాష్ట్రంలోనైనా పరిస్థితులు మారేనా.. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల భర్తీపై అప్పటి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ప్రస్తుతం మన రాష్ట్రం మనకు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా పంచాయతీ రాజ్ శాఖలో పెరుగుతున్న ఖాళీల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆశాభావంలో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు ఉండడం వల్ల అభివృద్ధి అస్తవ్యస్థంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పల్లెల అభివృద్ధి గురించి ఆలోచించి పంచాయతీ రాజ్ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇటు ప్రజలు, అటు శాఖలోని సిబ్బంది కోరుతున్నారు. -
ఏపీ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణకు వర్తింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పంచాయతీరాజ్ వేతనాలు, అలవెన్సులు-రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వీసు నిబంధనలను కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని అన్ని సెక్షన్లు, నిబంధనలు తెలంగాణకు వర్తిస్తాయని, ఏపీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని పేరున్నచోట తెలంగాణ అని మార్పు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. ఈ ముసాయిదాకు ముఖ్యమంత్రి ఆమోద ం కోసం పంపించలేదని, చట్టంలో మార్పులు చేయాలంటే ముందుగా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని అధికా వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. -
రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు..
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ పనులు మంజూరై రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మంజూరు పనులు, పూర్తైవి, వివిధ దశల్లో ఉన్నవి, ప్రారంభం కాని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు జిల్లాకు 34 మంజూరుకాగా, ఇప్పటి వరకు 21 పనులు పూర్తి చేశారని, ఇంకా 13 పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇందుకు గల కారణాలు అధికారులను అడిగారు. కుంటాల, సిర్పూర్, రెబ్బెన, కెరమెరి, వాంకిడి, నేరడిగొండ, బాబేర (బోథ్)లో ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 75 రోడ్డు పనులకుగాను 40 పనులు పూర్తి చేశారని, మిగతా 25 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇంకా ఆరు టెండర్ల స్థాయిలో ఉన్నాయని, అటవీ శాఖ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని పనులు నిలిచిపోయాయన్నారు. ఎక్కడెక్కడ ఆ పనులు నిలిచిపోయాయో వివరాలు తనకు పంపాలని మంత్రి సూచించారు. 13వ ఫైనాన్స్ కింద జిల్లాలో 18 పనులు ఉన్నాయని అన్నారు. అధికారులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ఈజీఎస్, గ్రామాల లింకురోడ్లు, మెటల్‌రోడ్లు తదితర పనులనూ వాకాబు చేశారు. ఐకేపీ, అంగన్వాడీ భవన నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లాలో 23 జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక డిప్యూటీ ఈఈ పోస్టు ఖాళీగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ అమీనోద్దీన్, డిప్యూటీ ఈఈలు ప్రకాష్, శైలేందర్, సురేష్, రవి ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు. విద్య, ఆర్డబ్ల్యూస్పై సమావేశం విద్య, ఆర్వీఎం, సాంఘిక సంక్షేమ శాఖల్లో పనుల తీరుపై ఆ శాఖల అధికారులతో మంత్రి జోగు రామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ఉపాధ్యాయులు విద్యావ్యవస్థను పటిష్ట పర్చడం లేదన్నారు. పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. అదనపు గదుల నిర్మాణం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టాలని, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డు తెగల వారికి అందిస్తున్న సంక్షేమం పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి 2013-14లో 3,631 మంది కి రూ.22.60 కోట్లు లక్ష్యం కాగా, రూ.20,71 కోట్లతో 2,831 మందికి బ్యాంకు రుణాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు అధికారులు తెలిపారు. 1991 నుంచి 2010 వరకు 3,911 మంది ఎస్సీ, ఎస్టీలకు 6,438.12 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. దళిత మహిళలకు ఆగష్టు 15న రూ. 18.37 కోట్లతో 106 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూములు పంపిణీ చేశామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన నిధుల ప్రతిపాదనలు పంపితే సీఎంతో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ.. మంత్రి సూచనలు పాటించి సంక్షేమ పథకాల అమలు బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణ, ఆర్వీఎం పీవో యాదయ్య, డీడీఎస్డబ్ల్యూ శంకర్, అధికారులు పాల్గొన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచిం చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో తాగునీటికి, వ్యవసాయానికి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. జిల్లాలో 14 ఏఈఈ, రెండు మం డలాలకు ఒక ఈఈ చొప్పున పదిహేను మండలాలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ మంత్రికి వివరించారు. హౌసింగ్ కాలనీలో విద్యుత్ సరఫరాకు కొన్ని కాల నీల్లో పనులు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పనులకు కలిపి మొత్తం 112 పనులకు గాను 100 పనులు పూర్తి చేశామని ఎస్ఈ తెలిపారు. సీఎల్డీపీ, ఇందిరా జలప్రభ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల కొరకు ప్రభుత్వ భూములు కేటాయించాలని ఎస్ఈ కోరారు. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వివరాలు సక్రమంగా ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోలార్ సిస్టంతో నీటి పథకాలు.. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంపై మంత్రి జోగు రామన్న సమీక్షించారు. సోలార్ సిస్టమ్ ద్వారా నీటి పథకాలు పనిచేసేలా ప్రతిపాదించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ పత్రికల్లో వస్తున్నా ప్రతికూల వార్తలపై స్పందించాలని, మంచినీటి ట్యాంకులను అధికారులు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, ఎస్ఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.18 వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజీ
చిత్తూరు(టౌన్): జిల్లాకు కరువు నివారణ పథకం కింద రూ. 18 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ప్రధానమైన 9 శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో శాఖలవారీగా జిల్లా స్థాయిలో సమీక్షలు జరగనున్నాయి. ముందుగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై బుధవారం ఆ శాఖ సమీక్షించి ప్రతిపాదనలు పంపడానికి సిద్ధమరుుంది. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలో భాగంగానే ప్రస్తుతం ఈ ప్యాకేజీని జిల్లాకు మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్యాకేజీ అమలయ్యే శాఖలివీ ఫారెస్టు, డ్వామా, ఇరిగేషన్, అగ్రికల్చర్, పశుసంవర్థకశాఖ, గ్రామీణనీటి సరఫరా, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, ఆర్అండ్బి శాఖల పరిధిలో ఈ స్పెషల్ ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు. ఈ ప్యాకేజీ కింద ఒక్కో శాఖకు రూ.2 వేల కోట్లు చొప్పున కేటాయించనున్నారు. వాటర్ రీసోర్స్ సెక్టార్ కింద ఇరిగేషన్ శాఖ పరిధిలో మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. డ్వామా పరిధిలో చెక్‌డ్యాములు, రాక్‌ఫిల్ డ్యామ్‌లు, వాటర్ షెడ్ల నిర్వహణ పనులు చేపడతారు. అటవీ శాఖ పరిధిలో అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టనున్నారు. వ్యవసాయశాఖ ద్వారా గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటు, తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే పంటల సాగు, మినీ వ్యవసాయ మార్కెట్లు, సీడ్ ప్రాసెసింగ్ యూని ట్లు, అగ్రికల్చర్ ఇన్పుట్ సెంటర్లను నెలకొల్పనున్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్హులైనవారందరికీ ఆవులు, గేదెల పంపిణీ, పశుదాణా తయారీ కేంద్రాల ఏర్పాటు, పశుగ్రాసం నిర్వహణ, కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేపడతారు. జిల్లాలో ప్రభుత్వ పరిధిలో పాల డెయిరీల ఏర్పాటు, గ్రామాల్లో పాల ఉత్పత్తిని బట్టి పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, బల్క్‌మిల్క్ చిల్లింగ్ కేంద్రాల నిర్వహణ తదితరాలను చేపడతారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన గ్రామీణరోడ్లు, తారురోడ్లు, సిమెంటు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో జిల్లాలోని ప్రధానమైన రోడ్ల నిర్వహణ, కొత్తగా రోడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. గ్రామీణ నీటిసరఫరా శాఖ పరిధిలో గ్రామాల్లో అవసరమైన తాగునీటి బోర్ల తవ్వకాలు, విద్యుత్ మోటార్ల ఏర్పాటు, రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణం తదితర పనులు చేస్తారు. మత్స్యశాఖ పరిధిలో ఫిష్ కల్చర్, మార్కెటింగ్ నిర్వహణ తదితర పనులను చేపడతారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రాక పంచాయతీరాజ్ శాఖ చేపట్టాల్సిన పనులకు సంబంధించి జిల్లాలోని పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్, లోకల్‌బాడీస్ విభాగాలకు చెందిన అందరు ఈఈలు, డీఈఈలు, ఏఈలతో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ సీవీ రామ్మూర్తి బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్యాకేజీ కింద చేపట్టనున్న పనులను ఎలా గుర్తించాలి, ఏఏ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అనే అంశాల గురిం చి ఆయన సమీక్షించనున్నారు. చీఫ్ ఇంజనీర్ మంగళవారం ముందుగా కుప్పం వెళ్లి అక్కడి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. -
రెవెన్యూ బదిలీల్లో రాజకీయ రంగు
ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల అనంతరం వివిధ శాఖల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరింది. ఇప్పటికే ఎంపీడీ ఓల బదిలీలు పూర్తయ్యాయి. రెవెన్యూలో బదిలీలకు రాజకీయ రంగు పులుముకుంది. రెవెన్యూలో పోస్టింగులకు పైరవీలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు పెద్దఎత్తున లాబీయింగ్‌కు తెర తీశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలలో సాధారణ బదిలీలు పెద్దఎత్తున జరిగాయి. ఎన్నికలు పూర్తవడంతో తమను యథాస్థానాలకు పంపాలని వీరు తమ ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ శాఖలో యథాస్థానాల్లో పోస్టింగ్ ఇస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఆ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెవెన్యూ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పైరవీల జాతరకు తెర లేచింది. అనువైన చోటుకు, నియోజకవర్గ కేంద్రాలకు వచ్చేందుకు తహశీల్దారులు పోటీ పడుతున్నారు. వారు ఇప్పటికే రాజకీయ నాయకులను ఆశ్రయించారు. జిల్లా నుంచి 31మంది తహశీల్దారులు ఇతర జిల్లాలకు వెళ్తుండటంతో నచ్చిన చోట పోస్టింగ్ కోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టుకు రూ.15లక్షలు.. రెవెన్యూ శాఖలో దగ్గర మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తే 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ముట్టజెబుతామని బాహాటంగాగానే ప్రకటిస్తున్నారు. రంగంలోకి దళారులు .. రాజకీయ నేతల అనుచరులు దళారుల అవతారమెత్తారు. ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా ఇప్పిస్తామని, భారీ మొత్తంలో ఖర్చవుతుందని చెబుతున్నారు. గతంలో జిల్లాలో పనిచేసి ఎన్నికల బదిలీల్లో బాగంగా 38 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వారిలో 31 మంది జిల్లాకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన వారు ఖమ్మం చుట్టుపక్కల పోస్టింగ్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. వీరికి దళారులు వల వేస్తున్నారు. డిమాండున్న మండలాలు ఇవే... ఆర్థిక వనరులు ఎక్కువగాగల మండలాలకు వెళ్లేందుకు తహశీల్దారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కొణిజర్ల, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, కూసుమంచి వెళ్లేందుకు తహశీల్దారులు తహతహలాడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఇక్కడే ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయనే ప్రకటనలతో హైదరాబాద్ స్థాయిలో జిల్లా అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారు. -
మంత్రి అవుతాననుకోలేదు
అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం టౌన్: తాను మంత్రి అయ్యేం దుకు కారకులైన నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా నర్సీపట్నం వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిని అవుతానని అనుకోలేదన్నారు. ఏరియా ఆస్పత్రి స్థాయిని 150 పడకలకు పెంచి ఫైవ్‌స్టార్ ఆస్పత్రిలా తీర్చిదిద్దుతానన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అయ్యన్న దయవల్లే ఎమ్మెల్యే అయ్యానని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ సింహాచలం అయ్యన్నకు జ్ఞాపికను అందించి అభినందించారు. సభకు చింతకాయల సన్యాసిపాత్రుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేచలపు శ్రీరామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక రాజధానిగా విశాఖ
మంత్రి అయ్యన్నపాత్రుడు సింహాచలం: విశాఖ ఆర్థిక రాజధాని గా అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయ ల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం నగరానికి వచ్చిన ఆయ న తొలుత సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్ట మంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాచ ల దేవస్థానం భూసమస్యతో పాటు రైల్వేజోన్, విమ్స్, ఫ్లైఓవర్ నిర్మాణం, కేజీహెచ్ అభివృద్ధి తదితర వాటి పై గురువారం జరిగే కేబినెట్ తొలి భేటీలో చర్చిస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని రాజధాని నిర్మాణం సిరిపురం: దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధానిని మన రాష్ట్రంలో నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. టీడీపీ నగర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుతో కలిసి మంత్రి అయ్య న్న విలేకరులతో మాట్లాడారు. విమ్స్ ఆస్పత్రికి రూ.60 కోట్లు కేటారుుంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పిస్తా మన్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరతారా అని విలేకరులు అడగ్గా తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. -
గీతం ఇస్తేనే జీతం
ప్రభుత్వ ఉద్యోగులను జలగల్లా పీలుస్తున్న చీరాల సబ్‌ట్రెజరీ అధికారులు పర్సంటేజీలివ్వనిదే బిల్లులు పాస్చేయని వైనం చీరాల, న్యూస్‌లైన్ : ‘తాడిని తన్నేవాడు ఒకడైతే.. వాడి తల తన్నేవాడు మరొకడు’... అన్నచందంగా ఉంది చీరాలలో ప్రభుత్వ ఉద్యోగులు.. సబ్‌ట్రెజరీ అధికారుల పరిస్థితి. లంచం లేనిదే ఒక్క పనీచేయని ప్రభుత్వ ఉద్యోగుల వద్దే లంచాలు తీసుకుంటున్నారు స్థానిక సబ్‌ట్రెజరీ అధికారులు. పర్సంటేజీలివ్వనిదే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు పాస్చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిత్యం లంచాలు వసూలు చేయడం ఇక్కడి సబ్‌ట్రెజరీ అధికారులకు పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ పెన్షన్ల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు, పంచాయతీల బిల్లుల్లో పర్సంటేజీల చొప్పున డబ్బు వసూలు చేస్తున్న సబ్‌ట్రెజరీ అధికారులు.. తాజాగా ఉద్యోగులను సైతం వదలడం లేదు. చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయం పరిధిలో చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు మండలాలున్నాయి. ఆయా మండలాల్లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తమ పరిధిలోకి రావడంతో చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయం అధికారులు, సిబ్బందికి కాసుల పంటగా మారింది. అంగన్వాడీలు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వరకూ ప్రతిఒక్కరి నుంచి ప్రతిపనికీ పర్సంటేజీలు లేనిదే బిల్లు చేయడంలేదు. వారు అడిగినంతా ఇవ్వకుంటే ఏదోక వంకతో బిల్లులు పాస్ చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం పంచాయతీరాజ్‌శాఖలో పంచాయతీ సెక్రటరీలుగా పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. చీరాలతో పాటు జిల్లాలోని అన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల అధికారులు వీరిని కూడా వదిలిపెట్టలేదు. మీకు జీతాలిస్తాం సరే.. మా గీతం సంగతేంటి..? అని బేరసారాలకు దిగారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి తమకు కేటాయించిన గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి బేసిక్ జీతంగా రూ.8,440, ఇతర భత్యాలు, అలవెన్సులతో కలిపి రూ.16,000 వస్తుంది. రెగ్యులర్ ఉద్యోగుల కింద వీరికి జీతాలు విడుదల కావడంతో సబ్‌ట్రెజరీ అధికారులు ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి మొదటి నెలలోనే రూ.2000 తీసుకున్నారు. ముందు అకౌంట్ తెరవాలంటూ వెయ్యి రూపాయల మామూలు తీసుకున్న ట్రెజరీ అధికారులు.. అనంతరం జీతాలు ఇచ్చేందుకు మరో వెయ్యి రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. మొదటిసారిగా వస్తున్న జీతంలో కూడా మామూళ్లు ఇవ్వాల్సి రావడంతో ఆ పంచాయతీల కార్యదర్శులంతా సబ్‌ట్రెజరీ అధికారుల తీరును చూసి విస్మయం వ్యక్తం చేశారు. పనిచేసినందుకు జీతం తీసుకోవాలంటే కూడా రూ.2000 ఇవ్వాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందారు. కానీ, చేసేది లేక ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ నెలకు రూ.2000 చొప్పున రెండు నెలల పాటు చెల్లించి జీతాలు తీసుకున్నారు. చీరాల సబ్‌ట్రెజరీ కార్యాలయంలో ఇలాంటి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. పంచాయతీ బిల్లులకు సంబంధించి ఈ కార్యాలయంలో భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పంచాయతీ నిధులకు ఫ్రీజింగ్ ఉండటంతో మంజూరైన నిధులు మొత్తం ఇవ్వడానికి వీలుండేది కాదు. ప్రస్తుతం ఫ్రీజింగ్ లేకపోవడంతో మొత్తం నిధులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో సబ్‌ట్రెజరీ అధికారుల మామూళ్ల వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. ఈ పరిస్థితిలో మార్పు కోసం ఏం చేయాలో అర్థంగాక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. -
పడకేసిన ప్రగతి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రగతి పడకేసింది. ప్రభుత్వ శాఖల, పథకాల వార్షిక లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ముద్రను దశాబ్దాలుగా చెరిపేసుకోలేకపోతోంది. జిల్లా ప్రగతి రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లడంలో అటు పాలకులు, ఇటు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా లక్ష్యాలు నీరుగారుతున్నాయి. పురోగతిలో ఉండాల్సిన గృహనిర్మాణం తిరోగమనంలో కొట్టుమిట్టాడుతోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనులు సక్రమంగా ముందుకు సాగడంలేదు. ఆర్అండ్బీ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పరిశ్రమల పురోగతీ అంతంత మాత్రంగానే ఉంది. నేటికీ పల్లెల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడంలేదు. అంతర్గత రోడ్లు లేని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది. పంచాయతీరాజ్ శాఖ: రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఏడాదిలోపే దెబ్బతింటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం *250.67 కోట్ల వ్యయంతో 504 కిలోమీటర్ల రోడ్లు వేయాలని ప్రణాళిక రూపొందిస్తే కేవలం 200 కిలోమీటర్ల లోపే వేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంపై గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 171 కోట్లు మంజూరు చేస్తే కేవలం 31 కోట్లే ఖర్చు చేశారని మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రహదారులతో పాటు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం వీరి పరిధిలోనే జరుగుతున్నా అవికూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పంచాయతీ, వెటర్నరీ భవనాలు కొన్ని నేటికీ స్థలాలు లేక ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్అండ్బీ బ్రిడ్జిల నిర్మాణం : ఆర్అండ్బీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో పురోగతి లేదు. కొత్తపట్నం రోడ్డులో అల్లూరు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే బాలినేని పోరాడి ఎన్సీఆర్ఎంపీ పథకం నిధులు 3.90 కోట్లు మంజూరు చేయించారు. గత ఏడాది పనులు ప్రారంభించినా పనులు నిదానంగా సాగుతున్నాయి. సూరారెడ్డిపాలెం మోటుమాల రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వేసిన రెండేళ్లకే దెబ్బతింది. మళ్లీ ఆ రోడ్డుకు * 10 కోట్లు మంజూరయ్యాయి.2013-14లో ఒంగోలు సబ్ డివిజన్లో పలు బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయానికి * 1.30 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు ప్రారంభించలేదు. ముందుకు సాగని మరుగుదొడ్ల నిర్మాణం: జిల్లాలో 2,07,026 మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. సగం కూడా పూర్తి కాని పరిస్థితి. పల్లెల్లో నేటికీ 70 శాతం మంది బహిర్భూమికి వెళ్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వలన కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పరిశ్రమలు కుదేలు : జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీనికి తోడు బ్యాంకులు రుణాలివ్వడంలో విముఖత చూపుతున్నాయి. జిల్లాలో 71 భారీ, 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలున్నాయని అధికారులు చెబుతున్నా వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కింద మంజూరు చేస్తున్న పథకాలకు బ్యాంకర్లు మొకాలడ్డుతున్నారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు. తిరోగమనంలో గ్రామ స్వరాజ్యం : గ్రామ స్వరాజ్యం కలగానే మిగులుతోంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా నేటికీ కొన్ని పంచాయతీ కార్యాలయాలకు భవనాలు లేవు. చెరువుగట్లు, సామాజిక భవనాల్లో సమీక్షలను సర్పంచ్‌లు నిర్వహించాల్సి వస్తోంది. మూడేళ్ల క్రితం 306 పంచాయతీ భవనాలు మంజూరైతే నేటికీ వాటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పునాదుల్లోనే కొన్ని మగ్గుతున్నాయి. ఇవిగాక సర్పంచులు అనేక సమస్యల తో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. కనీసం రోడ్లకు కూడా నోచుకోని గ్రామాలు కొల్లకొల్లలుగా ఉన్నా అవి పాలకులకు కనిపించడంలేదు. -
జెడ్పీ పీఠం ‘ఆమె’దే.
భూమి.. ఆకాశం.. తమకేదీ అడ్డుకాదని అన్నింటా సత్తాచాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిధ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరికి రిజర్వేషన్ల పుణ్యమా అని అవకా శాలు అందివస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజునే ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ‘ఆమె’ కు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చే సింది. ఎంపీపీల్లోనూ జిల్లాలో 52కు గాను 28 స్థానాలు మహిళలకే కేటాయించడం శుభపరిణామం. ఆదిలాబాద్ ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం ఈసారి బీసీ మహిళకు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీల రిజర్వేషన్లను శుక్రవారం రాత్రే ప్రకటిం చగా.. తాజాగా చైర్మన్ స్థానం రిజర్వేషన్ ఖరారైం ది. జిల్లా పరిషత్‌తోపాటు, అన్ని మండల పరిషత్ ల పాలకవర్గాల పదవీకాలం 2011 జూలైతో ముగి సింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనతోనే సరిపెడుతూ వచ్చింది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా దాదాపు మూడేళ్లుగా నాన్చుతూ వచ్చింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. పార్టీలకు ముచ్చెమటలు.. స్థానిక సంస్థల స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు జిల్లా పరిషత్‌పై దృష్టి సారించాల్సిన పరిస్థితి - ఏర్పడింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ముఖ్య నాయకులంతా ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల ప్రయత్నాల్లో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల నగరా కూడా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపులు వంటి అంశాలపై దృష్టి సారించాయి. ఇప్పుడు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. చైర్మన్ స్థానానికి రిజర్వేషన్‌పై స్పష్టత రావడంతో ఆయా పార్టీల్లో బీసీ మహిళా నేతలెవరున్నారనే అంశంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొందడం ఒకెత్తయితే, విజయం సాధించిన జెడ్పీటీసీల మద్దతు కూడగట్టుకుని చైర్మన్ పదవిని దక్కించుకోవడం మరోఎత్తు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలను కలుపుకుని పోగలిగే సత్తా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గ్రూపు విభేదాలున్నాయి. అన్ని గ్రూపుల మద్దతు కూడగట్టుకునే రాజకీయ చతురత కలిగిన మహిళా నేతలు ఎవరెవరుంటారనే విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొదట టిడీపీ.. తర్వాత కాంగ్రెస్... జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం గతసారి ఎస్టీలకు రిజర్వు అయింది. టీడీపీకి చెందిన రమేష్‌రాథోడ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో జెడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. అప్పట్లో వైస్ చైర్మన్‌గా ఉన్న జుట్టు అశోక్ ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. తర్వాత జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కౌటాల జెడ్పీటీసీగా గెలుపొందిన సిడాం గణపతి టీడీపీ జెడ్పీటీసీల మద్దతుతో జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోగలిగారు. -
సబ్ ‘ప్లాన్’ లేదు
సాక్షి,కడప: జిల్లాలో సబ్ ప్లాన్ పనులకు గ్రహణం పట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్సీపీ), ట్రైబల్ సబ్ ప్లాన్(టీఎస్పీ) నిధులతో ఎస్సీ,ఎస్టీ ఆవాసాలలో సిమెంట్, లింక్‌రోడ్లు, డ్రైనేజీ పనులకోసం పంచాయతీరాజ్‌శాఖ గత ఏడాది మే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపింది. 40 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన కాలనీల ప్రాతిపదికతో అంచనాలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎస్సీపీ కింద 1299 హ్యాబిటేషన్లల్లో రూ. 176.90 కోట్లు ,టీఎస్పీ ద్వారా 275 ఆవాసాల్లో రూ. 32 కోట్లతో పనుల జాబితాను రూపొందించి గత ఏడాది మే నెలలో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనలు అటకెక్కించి మళ్లీ అధిక ఎస్సీ,ఎస్టీ జనాభా కలిగిన గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి పనుల జాబితాను పంపాలని జూన్‌లో ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎస్సీపీ నిధుల కింద బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికంగా ఎస్సీలున్నప్పటికి ప్రభుత్వం వివక్ష చూపింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దాన్ని పక్కనపెట్టి బద్వేలు నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం గమనార్హం. బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలోని ఎస్సీ కాలనీల్లో రూ.7.82 కోట్లతో, జిల్లాలో అధిక జనాభా గల ఎస్టీ ఆవాసాల్లో రూ. 1.98 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి అప్పట్లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే ఇంత వరకు వీటి గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లోపు వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు మంజూరు చేయకపోతే సబ్ ప్లాన్ నిధులతో ప్రతిపాదించిన పనులకు గ్రహణం పట్టనుంది. బద్వేలు నియోజక వర్గానికి ప్రాధాన్యం బద్వేలు, మైదుకూరు నియోజక వర్గాలలోని ఆవాసాల్లో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 పనులను రూ. 7.84 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో అధిక శాతం ఎస్ వెంకటాపురంలో రూ. 1.14 కోట్లు, పెద్దులపల్లె రూ.35 లక్షలు, కవలకుంట్ల రూ. 30 లక్షలు, పుల్లారెడ్డిపల్లె రూ. 35 లక్షలు, కుంభగిరి రూ. 47.76 లక్షలు, వరికుంట్ల రూ.33.60 లక్షలు, రెడ్డిపల్లె రూ.33 లక్షలు, ఎస్ రామాపురం రూ.2.17 కోట్లు .. ఇలా బద్వేలు నియోజకవర్గంలోని అన్ని ముఖ్యమైన ప్రతిపాదనలతో కలిపి రూ. 7.17 కోట్లు ఉన్నాయి. మెదుకూరు నియోజకవర్గంలో రూ. 66.60 లక్షల నిధుల్లో అధికంగా బి.మఠం మడలంలోని గుండాపురంలో రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. టీఎస్పీ నిధులకు సంబంధించి.. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని గంగరాజుపోడు ఎస్టీ కాలనీలో రూ. 61.28 లక్షలు, కడప డివిజన్లో పెద్దబిడికి రూ. 30 లక్షలు, గాలివీడు మండలంలోని పందికుంట రూ. 12.50 లక్షలు, మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సుగాలితాండా రూ. 5.75 లక్షలు, ఖాజీపేట మండలంలోని సుగాలితాండ రూ. 7లక్షలు, మైలవరం మండలంలో కోన- అనంతపురం రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు, బి.మఠం ఎస్టీ హాస్టల్ వద్ద సీసీ రోడ్డు కోసం రూ. 10 లక్షలు, సుండుపల్లె ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 7.50 లక్షలు, మినీ గురుకులం మంగంపేట వద్ద రూ. 8.30 లక్షలు, పులివెందుల నగరి గుట్ట వద్ద రూ. 6 లక్షలు, ప్రొద్దుటూరు మండలం గోపవరం ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 1.45 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు నిధులు మంజూరు కాకపోతే ఈ పనుల ప్రతిపాదనలు అటకెక్కినట్లే. ప్రతిపాదనలు పంపాం సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి ఇప్పటికే రెండుమార్లు ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. - జగత్‌కుమార్, పీఆర్ ఎస్ఈ, కడప