గ్రామ పంచాయతీ నిధులతో ఆయా గ్రామాల పరిధిలో ఉండే అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె, ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నప్పటికీ, అన్నింటిలో ఫ్యాను ఏర్పాటు చేసే బాధ్యతను పంచాయతీలకే అప్పగించారు. గ్రామాలకు కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఇందుకు ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థాయిలో జరిగిన ఈ నిర్ణయాన్ని కలెక్టర్లు అన్ని పంచాయతీల్లో అమలు చేసేలా చూడాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం మెమో నంబర్- 3431ను జారీ చేసింది.