పంచాయతీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ | Panchayat Secretaries to the end of the training | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ

Published Wed, May 27 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

Panchayat Secretaries to the end of the training

హైదరాబాద్: గ్రామ పరిపాలనలో ఒడిదుడుకులు ఎదురైనా నిరుత్సాహ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీఎస్‌ఐపార్డ్)లో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన 187 మంది కార్యదర్శులకు ట్రైనింగ్ సర్టిఫికేట్లను కమిషనర్ అందజేశారు. కార్యక్రమంలో కోర్సు డెరైక్టర్లు స్వామి, కుసుమ మాధురి, పరిపాలనాధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement