సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.6,750 కోట్ల రుణాన్ని అందజేసేందుకు ఆంధ్రా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బ్యాంకుల కన్సార్షియం అంగీకరించింది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయితే ఈనెల 29న రుణ మొత్తాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కన్సార్షియంలోని బ్యాంకుల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కన్సార్షియం ప్రతినిధులతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ డెరైక్టర్లు సమావేశమయ్యారు.
కార్పొరేషన్ ఎండీగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి బ్యాంకులు ఆర్థికంగా సహకరిస్తుండడం ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగిస్తోందని అన్నారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు కన్సార్షియం అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ఆంధ్రాబ్యాంక్ ఎండీ సురేశ్ మాట్లాడుతూ కన్సార్షియం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు అన్ని బ్యాంకుల మేనేజింగ్ కమిటీల నుంచి ఆమోదం లభించిందని తెలిపారు.
‘భగీరథ’కు రూ.6,750 కోట్లు
Published Sat, Sep 24 2016 3:05 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement