Mission Bhagiratha Project
-
తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో తొలి ప్రాధా న్యం ప్రజల తాగునీటి అవసరాలకే ఇవ్వాలని ఇరి గేషన్ శాఖ నిర్ణయించింది. సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు చేరే వరకు తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తాగునీటి అవసరాలు తీరుస్తున్న ‘మిషన్ భగీ రథ’కు నీటికొరత లేకుండా చూడాలని, ఈ మేరకు కనీస నీటిమట్టాల నిర్వహణను పక్కాగా చేపట్టా లని ఆదేశించిన నేపథ్యంలో అందుకనుగుణం గానే ముందుకు వెళ్లాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గడంతో ఇక్కట్లు.. మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి ఏటా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నీటిని తీసుకునే క్రమంలో 37 ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలను కూడా నీటిపారుదల శాఖ నిర్ధారిం చింది. ఈ మేరకు మట్టాలను నిర్వహిస్తూనే ఆయ కట్టు సాగు అవసరాలకు నీటి విడుదల కొనసా గిస్తున్నారు. ప్రస్తుతం నీటి సంవత్సరం పూర్తి కావ డంతో కొన్ని రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గాయి. శ్రీశైలం జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి లోని ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. నిజానికి శ్రీశైలంలో కనీ సంగా 810 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే కల్వ కుర్తి పంపుల ద్వారా ఎల్లూరును నింపే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచే నాగర్‌కర్నూల్ జిల్లా తాగు అవసరా లకు ఏటా 7.13 టీఎంసీల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం శ్రీశైలంలో మట్టం 807 అడుగులకు పడిపోయింది. దీంతో ఇక్కడి నుంచి నీటిని తీసుకోవడం కష్టంగా మారింది. ఇదే పరిస్థితి కొన్ని రిజర్వాయర్లలో నెలకొంది. మరోవైపు జూన్ నుంచి పంటల సాగు మొదలైతే నారుమళ్లకు నీటి డిమాండ్ ఉంటుంది. దీంతో తాగునీటికి పక్కకు పెట్టాకే సాగు అవసరాలకు ఇవ్వాలని సీఎం ఇంజనీర్లకు సూచించారు. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, మిడ్ మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరులలో తాగుకు అవసరమైన నీటి లభ్యత ఉంది. సాగర్‌తో కొంత ఊరట సాగర్‌లో ప్రస్తుతం నీటిలభ్యత రాష్ట్రానికి ఊరట నిచ్చేలా ఉంది. ప్రస్తుతం సాగర్‌లో 533 అడుగుల మట్టంలో 174 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 45 టీఎంసీల మేర ఉంది. 2020–21లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోలేనందున, 45 టీఎంసీల నీటిని 2021–22 ఏడాదికి క్యారీఓవర్ చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో దీని పరిధిలో తాగునీటికి ఇక్కట్లు ఉండబోవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. -
టీఆర్ఎస్లో చేరడానికి అదే కారణం: ఎర్రబెల్లి
సాక్షి, గజ్వేల్: ‘మిషన్ భగీరథ’దేశంలోనే గొప్ప పథకమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నయా పైసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద నాలెడ్జ్ సెంటర్లో పథకం అమలు తీరుపై సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగీరథ పథకానికి నిధుల కోసం తాను, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.15 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. కానీ, గుజరాత్, వారణాసిలో తాగునీటి పథకాలకు కేంద్రం సాయం చేస్తుందని, అదే తెలంగాణ విషయమై వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ‘జల్‌జీవన్ మిషన్ పథకం’ కంటే కూడా భగీరథ గొప్పదన్నారు. అప్పులు తెచ్చి భగీరథ ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని విజయవంతంగా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. భగీరథ డిజైన్ చూశాకే మనసు మార్చుకున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మంచినీటి కోసం పడుతున్న గోస చూసి చలించిపోయానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ పక్ష నేతగా ఉన్న తాను ఈ ప్రాజెక్టు డిజైన్ చూసిన తర్వాతనే మనసు మార్చుకున్నానని, టీఆర్ఎస్లో చేరడానికి భగీరథ పథకమే కారణమని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వందశాతం ఆవాసాలకు తాగునీటిని అందిస్తున్నామని స్మితాసబర్వాల్ తెలిపారు. కాగా, ఉత్తమ సేవలందించిన ఇంజనీర్లను మంత్రి ఎర్రబెల్లి సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. కాగా, భగీరథ లేబుళ్లు ఉన్న వాటర్ బాటిళ్లను ప్రారంభించిన మంత్రి దయాకర్‌రావు, స్మితాసబర్వాల్.. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భగీరథ వాటర్ బాటిళ్లనే వినియోగించాలని, వీటిని ఉచితంగానే పంపిణీ చేస్తామని చెప్పారు. -
రూ. 38 వేల కోట్లతో పూర్తిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రూ.46 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామని, అయితే రూ.38 వేల కోట్లతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. బుధవారం మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23 వేల 787 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 18,175 వాటర్ ట్యాంకులలో, ఇప్పటికి 18,076 పూర్తయ్యాయని, మిగిలిన 99 ట్యాంకులు కూడా నవంబర్ 30 వరకు పూర్తి చేస్తామని వివరించారు. మిషన్ భగీరథ పథకం మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకం అని హడ్కో 3సార్లు అవార్డు అందజేసిందని, నీటి వినియోగ సామర్థ్యం 20 శాతం పెంచినందుకు, జాతీయ వాటర్ మిషన్–2019లో మిషన్ భగీరథకు మొదటి బహుమతి లభించిందని మంత్రి వెల్లడించారు. -
‘కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథాకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించడం సంతోషంగా ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో బుధవారం దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్టంలోని ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ నాలుగేళ్ళ క్రింద విషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. దీనికి 46 వేల 123 కోట్లు అంచనాతో చేపట్టినట్లు పేర్కొన్నారు. కానీ ఈ బడ్జెట్ కంటే తక్కువగా బడ్జెట్ ఖర్చు జరిగిందన్నారు. 33 వేల కోట్ల ఇప్పటికే ఖర్చు చేశామని, కేంద్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని మిషన్ భగీరథ పేరు మార్చి జలజీవన శక్తి మిషన్ పేరుతో ఈ పథకం అమలు చేస్తోందన్నారు. చదవండి: ‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం ‘మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వటం లేదు. కేంద్రానికి సీఎం లేఖలు రాశారు.. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథను అమలు చేస్తోంది. 40 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.. గుజరాత్ కంటే మంచి పథకం ఇది. దేశంలో మిగితా రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణలో మిషన్ భగీరథను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణను మార్చలన్న ఉద్దేశ్యంతో పెట్టింది. కేంద్రం బోర్ నీళ్లతో నీళ్లు ఇస్తోంది. ఇక్కడ కృష్ణ గోదావరి నీళ్లని మంచి నీటిని ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో నిధులు ఇస్తూ ఇక్కడ మాత్రం ఇవ్వటం లేదు. చదవండి: త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త రాష్ట్రంలో 23 వేల 787 అవాసాలకు నీరు అందిస్తున్నాం. రెండేళ్లుగా అడుగుతున్న నిధులు రాలేదు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా కేంద్రం ప్రకటించింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో గొప్పగా తెలంగాణను పొగిడారు. మిగితా రాష్ట్రాలకు ఇచ్చే 2000 కోట్లు ఇక్కడ కూడా మెయింటనెన్స్ కోసమైన ఇవ్వాలని ఆడిగాం. మా ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారు. మా మిషన్ భగీరథను కాపీ కొట్టి పథకం అమలు చేస్తున్నారు.. నిధులు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. -
కాళేశ్వరంపై చిన్నచూపే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 70 శాతం భూభాగా నికి తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం మరోమారు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టుకు లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా లేక కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలన్న వినతిని పెడచెవిన పెట్టింది. శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కాళేశ్వరం ప్రస్తావన కానరాలేదు. దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ఎంపీలు కోరినా పట్టనట్లే వ్యవహరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటిలో అధికభాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీక రించిన అప్పుల ద్వారానే పూర్తి చేస్తున్నా మని చెబు తున్నా, కేంద్రం ప్రాజెక్టుపై ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జల్‌జీవన్ తెచ్చినా.. మనకు దక్కేది శూన్యమే.. దేశంలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా నల్లా నీటిని అందించే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్‌కు కేంద్రం పెద్దపీట వేసింది. 2024 నాటికి సంపూర్ణ తాగునీటిని అందించే లక్ష్యంతో జల్ జీవన్‌కు ఈ ఏడాది బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ అప్పుల తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటికే పూర్తయిన పథకానికి జల్ జీవన్ మిషన్‌నుంచి నిధులు కేటాయిస్తారా? అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక పీఎంకేఎస్‌వై కింద బడ్జెట్లో కేంద్రం రూ.11,127 కోట్లు కేటాయించింది. అయితే గత బడ్జెట్లో రూ.9,682 కోట్లు కేటాయించినప్పటికీ దాన్ని తిరిగి రూ.7,896 కోట్లకు సర్దుబాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ఎంతమేర ఖర్చు ఉంటుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇక పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధులతో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేపట్టిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టు లకు మరో రూ.300 కోట్ల మేర రావాలి. క్యాడ్‌వామ్ కింద 18 ప్రాజెక్టులు గుర్తించగా, వాటికి రూ.2వేల కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది.వాటికి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. వీటిని పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. వీటికి ఈ ఏడాది ఏమైనా ఖర్చు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా కేంద్ర జల శక్తి శాఖకు కేటాయించిన రూ.30,478కోట్ల బడ్జెట్లో తెలంగాణకు దక్కే నిధుల వాటా అంతంతమాత్రమేనని సాగునీటి శాఖ ఇంజనీర్లు, నిపుణులు అంటున్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బుధవారం ఇక్కడ నిర్వహించిన సంప్రదింపుల సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు ప్రత్యేక సాయంగా ఇచ్చేలా 2020–21 కేంద్ర బడ్జెట్ రూపొందించాలని ఆయన నిర్మలా సీతారామన్‌కు విన్నవించారు. జీఎస్టీ అమలులో సమస్యలు పరిష్కరించాలి జీఎస్టీ ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తూ రాష్ట్రాలు కేంద్రంపై నమ్మకం పెట్టుకున్నాయని, జీఎస్టీ అమలులో ఉన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించి కేంద్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని హరీశ్‌రావు కోరారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ పరిహారం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సరీ్వసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) పంపకంలో తలెత్తిన సమస్యలను ఆయన ఆరి్థక మంత్రి దృష్టికి తెచ్చారు. ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావలసిన వాటాను, జీఎస్టీ కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహార పన్నులను నియమాలకు విరుద్ధంగా కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో, పబ్లిక్ అకౌంట్లో చేర్చి తన ఖర్చులకు వాడుకుంటోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయం కారణంగా తెలంగాణ లోని 10 జిల్లాలో 9 జిల్లాలు.. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంటు అందుకునే ప్రాంతాల కింద ఉండేవని హరీశ్ తెలిపారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద కేంద్రం సహాయం అందించాల్సి ఉంటుంద న్నారు. ఈ గ్రాంటు కింద తెలంగాణకు ఇవ్వాల్సిన రూ. 450 కోట్లను ఈ నెలలో విడుదల చేయాలని కోరారు. మిషన్ కాకతీయ, భగీరథలకు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దాదాపు కోటి ఎకరాల భూమికి నీరందించడం కోసం చేపట్టిన చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు సహాయం అందించాలని హరీశ్ కోరారు. మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు మూడేళ్లలో ప్రత్యేక సాయంగా ఇవ్వాల ని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని 2020–21 బడ్జెట్లో కేటాయించాలని కోరారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తగిన నిధులను రానున్న బడ్జెట్లో అందించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందే అర్హత కలిగిన కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రానున్న బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని హరీశ్ కోరారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మా గారం నెలకొల్పవలసి ఉందని ఈ దిశలో వేగిర చర్యలు చేపట్టాలని కోరారు. పన్ను మాఫీ పథకం ప్రకటించాలి రాష్ట్రాల పెట్టుబడి అవసరాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఆకర్షణీయమైన పన్ను మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని హరీశ్ సూచించారు. ఎగ్గొట్టిన పన్నుపై తక్కువ వడ్డీ పథకాన్ని ప్రకటించి ప్రకటిత సొమ్మును పదేళ్ల పాటు రాష్ట్రాలకు సహాయం అందించే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో ఉంచే పథకం ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి ఊతమివ్వవచ్చని హరీశ్‌రావు సూచించారు. ఆరి్థక వ్యవస్థ మందగమనాన్ని అరికట్టడం కోసం ఆరి్థక వనరుల పరంగా రాష్ట్రాలకు అధికారాన్ని, స్వేచ్ఛను కలి్పంచాలని హరీశ్‌రావు సూచించారు. భారీ ఆరి్థక విధానాలను పక్కనపెడితే ఇతరత్రా ఆరి్థక కార్యకలాపాలు ఎక్కువగా రాష్ట్రాల్లోనే జరుగుతాయని ఆయన తెలిపారు. -
మిషన్ భగీరథకు రూ.2,176 కోట్లు
సాక్షి, నల్లగొండ : జిల్లాలో 2015లో ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు వాస్తవానికి ఎన్నికల ముందే పూర్తి కావాల్సి ఉంది. కానీ, గడువులోగా భగీరథ పనులు పూర్తి కాలేదు. పదేపదే గడువులు పెంచారు. ప్రధాన పైప్‌లైన్ పనులు తీసుకున్న కాంట్రాక్టర్ ఆ పనులను విడగొట్టి సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో కూడా ఆలస్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్యాంకుల నిర్మాణం విషయంలో రేట్లు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తీవ్రజాప్యం జరిగినట్లు తెలుస్తోంది. భగీరథ పనుల కోసం జిల్లాకు రూ.2,176 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.590 కోట్లు ఇంట్రా పైప్లైన్ల నిర్మాణానికే ఇచ్చారు. మొత్తం బడ్జెట్లో ఇప్పటి వరకు రూ.1,563 కోట్లను ఖర్చు చేశారు. నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగర్ టెయిల్‌పాండ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, పనులు పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఉన్నతాధికారులు గ్రామీణ నీటిసరఫరా శాఖకు వంద రోజుల లక్ష్యం నిర్దేశించారు. ఇప్పుడు జిల్లాలో పనుల పూర్తి కోసం వంద రోజుల ప్రణాళిక మొదలైంది. పూర్తి కాని ప్రధాన పైప్‌లైన్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,100 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 3,800 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేయగా, మరో 3వందల కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయి. అసంపూర్తిగా ట్యాంకుల నిర్మాణం జిల్లాలో 1,710 ఆవాసాలకుగాను 1,536 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,430 ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. మరో 106 ట్యాంకుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు నుంచి మూడు ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ఒకటి పూర్తయి మరోటి అసంపూర్తిగా ఉన్న ఉదంతాలు ఉన్నాయి. పూర్తి కావొచి్చన ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ అన్ని ఆవాసాల్లో ‘ఇంట్రా విలేజ్’ పైప్లైన్లు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు బిగించే పనులు మాత్రం మందగించాయి. నల్లాలు దెబ్బతినకుండా పిల్లర్లు నిర్మించి బిగించే పనులు కొనసాగుతున్నాయి. పనుల పూర్తికి సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదు. మండలకేంద్రంలో మంచినీళ్లు ఏవీ ? గుర్రంపోడు మండలకేంద్రంలో ఇంతవరకు మిషన్ భగీరథ మంచినీళ్లు లేవు. ప్రక్క గ్రామాల్లో వాళ్లు మిషన్ భగీరథ నీళ్లు బాగా రుచిగా ఉంటున్నాయని, మాకు క్యాన్ల నీళ్లు కొనుక్కోనే బాధ తప్పిందని అంటున్నారు. మండలకేంద్రంలో ఉన్న మాకేమో ఇంతవరకు మంచినీళ్లు లేవు. ఓవర్‌హెడ్ ట్యాంకులకే ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు. అంతర్గత పైపులైన్లు కొంతవరకే వేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తే నీళ్లు కొనుక్కునే బాధ తప్పుతుంది. అధికారులను ఎప్పుడు అడిగినా పైపులైన్ల పనులు పూర్తి కాలేదని అంటున్నారు. – వనమాల పుష్పలత, గుర్రంపోడు అనేకమార్లు అధికారులకు విన్నవించా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందుతోంది. మా గ్రామానికి మాత్రం ఇంకా అందడం లేదు. ఇంటింటికీ నల్లాలు బిగించి తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు అనేకమార్లు విన్నవించా. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. 10 నెలలుగా అడుగుతున్నా మా గోడు వినే నాథుడే లేకుండా అయ్యారు. గ్రామ ప్రజలంతా నిత్యం నా వద్దకు వచ్చి నల్లాలు ఎందుకు పెట్టించడం లేదని ప్రశ్నిస్తున్నారు. – పంతంగి పద్మ, సర్పంచ్, జమస్థాపల్లి, మునుగోడు పనులు ఊపందుకున్నాయి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పనులు ఊపందుకున్నాయి. ప్రధాన పైప్‌లైన్ పూర్తి కావొస్తోంది. ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. 106 ట్యాంకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వంద రోజుల్లో పనులన్నీ పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు తగిన సూచనలు చేశాం. – పాపారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దశలవారీగా తొలుత నగరపాలక సంస్థల్లో, ఆ తర్వాత పురపాలక సంఘాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం శాసనసభలో పద్దులపై చర్చ అనంతరం సమాధానంలో భాగంగా కేటీఆర్ ఈ విషయం ప్రకటించారు. హైదరాబాద్‌లో పోగవుతున్న చెత్త నుంచి 48 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టు కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం భారీ చెత్త డంపింగ్‌ను తమకు అప్పగించి వెళ్లిందన్నారు. రూ. 359 కోట్ల వ్యయంతో దానికి క్యాపింగ్ చేసే పని పూర్తి దశకు చేరుకుందని వివరించారు. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతు న్న నేపథ్యంలో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42.6 శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే ఉంటున్నారని, మరో ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో అది 50 శాతానికి చేరుకుంటుందన్నారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలేనని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు.కొత్త మున్సిపల్ చట్టం ద్వారా జవాబుదారీతనం, పారదర్శక పాలన సాధ్యమవుతుందన్నారు. పురపాలక సంఘాల్లో ఇప్పటికే 3.47 లక్షల ఎల్ఈడీ లైట్లు అమర్చడం ద్వారా రూ. 35 కోట్ల విద్యుత్ బిల్లులను ఆదా చేశామని, హైదరాబాద్‌లో 4 లక్షల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో రూ. 35 కోట్ల విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో తమ పనితీరును అభినందించి కేంద్రం జాతీయ పురస్కారాలను ప్రకటించిందన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకునేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశామని, వాటిని విస్తరించే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటైన 106 బస్తీ దవాఖానాల సంఖ్య పెంచనున్నట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ రోడ్లకు రూ. 2,819 కోట్లు హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,819 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. గతేడాది ఈ పద్దు కోసం రూ. 1,542 కోట్లు ఖర్చు చేశామని, ఈసారి ఆ మొత్తానికి రూ. 1,300 కోట్ల మేర జత చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య పనులకు గతేడాది రూ. 807 కోట్లు ఖర్చు చేయగా ఈసారి రూ. 892 కోట్లు వ్యయం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి మూసీలోకి 1,800 ఎంఎల్డీ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ 700 ఎంఎల్‌డీని మాత్రమే శుద్ధి చేయగలుగుతుండటంతో మిగతా మురుగునీరు నల్లగొండ జిల్లాలోకి చేరుతోందన్నారు. పీపీపీ పద్ధతిలో కొత్తగా ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మొత్తం మురుగునీటిని శుద్ధి చేసి విడుదల చేస్తామన్నారు. భాగ్యనగర మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కాళేశ్వరం నీటిని తరలిస్తున్నామని, కేశవాపూర్ రిజర్వాయర్‌తో సిటీ ని అనుసంధానిస్తున్నామన్నారు. కృష్ణా నీటి సరఫరాలో ఇబ్బం ది ఉన్నా, రింగ్ మెయిన్ ద్వారా సిటీ అంతటికీ గోదావరి జలాలను సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో నిత్యం 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఎయిర్‌పోర్టుతో మెట్రోను అనుసంధానించబోతున్నామన్నారు. నగరంలో పాడయిన రోడ్లను త్వరలో బాగు చేస్తామని, ఎన్ఆర్సీఎం, గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయంతో జియాగూడ స్లాటర్ హౌస్‌ను వినియోగంలోకి తెస్తామని వెల్లడించారు. డ్రైనేజీలను శుభ్రపరిచే పనిని పూర్తిగా యాంత్రీకరించామని, దీనికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని గుర్తుచేశారు. -
13530 ఉద్యోగాలంటూ నకిలీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో ఉద్యోగాలు అనే వార్తలు అవాస్తవం అని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. సామాజిక మధ్యమాల్లో ప్రచారం అవుతున్న పోస్టు నకిలీదని పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారు. తప్పుడు వార్తను నమ్మి డబ్బులు కట్టి ఎవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. కాగ మిషన్ బగీరథలో ఉద్యోగాలు అంటూ ఓ నకిలీ నోటిఫికేషన్ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివిధ విభాగాల కింద మొత్తం 13530 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని అందులో పేర్కొన్నారు. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలను కూడా పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగులకు అర్హులని, అప్లికేషన్‌కు ఈ నెల 30 చివరి తేది అని నోటిఫికేషన్లో పేర్కొనబడింది. ఇందుకు గాను అభ్యర్థులు రూ.110 చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు పద్దతిని కూడా నోటిఫికేషన్లో ఉంది. అయితే అచ్చం ప్రభుత్వం విడుదల చేసినట్లుగా ఉన్న ఈ నోటిఫికేషన్‌ను చూసి చాలా మంది మోసపోతున్నారు. -
ఎంత ముందుచూపో!
సాక్షి, కామారెడ్డి: ఇంటింటికీ శుద్ధ జలాలను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ఆవాసాలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. అయితే కొందరు అధికారుల తీరుతో పథకం అభాసుపాలవుతోంది. ఇళ్లున్న కాలనీని నిర్లక్ష్యం చేసిన అధికారులు.. అసలు ఇళ్లే లేని రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ప్లాటు ప్లాటుకో నల్లా కనెక్షన్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. పట్టణంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎంత వెతికినా ఒక్క ఇల్లూ కానరాదు.. కానీ అధికారులు మాత్రం చాలా ముందుచూపుతో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేశారు. అంతటితో సరిపెట్టకుండా ప్లాటుప్లాటుకో నల్లా కనెక్షన్ కూడా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సమీపంలోనే జయశంకర్ కాలనీ ఉంది. ఈ కాలనీలో చాలా ఇళ్లున్నాయి. కానీ ఈ కాలనీకి మాత్రం నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. అసలు భగీరథ పైప్‌లైనే వేయలేదు. మిషన్ భగీరథ పథకంలో అధికారుల తీరుకు ఇవి మచ్చుతునకలు.. జిల్లాలో 834 ఆవాసాల పరిధి లో 2,44,673 ఇళ్లున్నాయి. వీటికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాకు శ్రీరాంసాగర్, సింగూ రు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు రూ.2,650 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. 600 ట్యాంకుల నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. 567 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంటింటికీ నీటిని అందించేందుకుగాను 2,123 కిలోమీటర్ల మేర అంతర్గత పైపులైన్ వేయాల్సి ఉండగా.. 2,053 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశా రు. అలాగే 2,44,673 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. 2,44,000 ఇళ్లకు నల్లాలు బిగించినట్టు పేర్కొంటున్నారు. జిల్లాలో 834 నివాసిత ప్రాంతాలకుగాను 811 ప్రాంతాల్లో వంద శాతం పనులు పూర్తి చేసి ఇంటింటికీ న ల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పట్టణాలు, పల్లెల్లో చాలా చోట్ల పైపులైన్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్నిచోట్ల పైపులైన్లు కూడా వేయలేదు. వెంచర్‌కు కనెక్షన్.. అన్ని ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం సంగతి అటుంచితే.. జిల్లా కేంద్రంలో విచిత్రంగా వెంచర్‌కు పైప్‌లైన్ వేయడమే కాకుండా నల్లా కనెక్షన్లు కూడా ఇవ్వడం ఆరోపణలకు తావిస్తోంది. అడ్లూర్ రోడ్డు లో ఉన్న జయశంకర్ కాలనీ నుంచి రామారెడ్డి రోడ్డుకు వెళ్లడానికి కొత్తగా వేసిన బీటీ రోడ్డుకు ఇరుపక్కల ఉన్న భూములను ఇటీవల వెంచర్ చేశారు. ఇది కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయాలకు సమీపంలో ఉంది. వెంచర్ చేసినపుడు అందులో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రియల్టర్లపైన ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా, అధికారులను మేనేజ్ చేసుకుని ప్లాట్లు చేసేశారు. ఇలా ప్లాట్లుగా చేసినవాటిని అమ్మాలంటే సౌకర్యాలు చూపాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా ఆ వెంచర్ మీదుగా బీటీ రోడ్డు వేయించారు. వెంచర్లో చేసిన ప్లాట్లకు తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకంలో పైపులైన్లు కూడా వేయించారు. అంతటితో ఆగకుండా ప్లాటుకో నల్లా పైపును తీసి పెట్టారు. ఒక ట్యాప్ బిగిస్తే చాలు.. అయితే ఆ వెంచర్లో ఒక్కటంటే ఒక్క ఇళ్లూ లేకపోవడం గమనార్హం. భగీరథ పైపులైన్లు వేయాల్సిన చోట వేయకుండా వెంచర్లలో వేయడమే గాకుండా నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చెలామణి అవుతుండడంతో అధికారులు వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వెంచర్లు చేసిన వారు వసతులు కల్పించాల్సి ఉండగా, ప్రభుత్వ నిధులతో పైపులైన్లు వేసి నల్లాలు బిగించడం ద్వారా ప్లాట్లు సులువుగా అమ్ముడుపోవడానికి అధికారులు తమవంతు సహకారం అందించారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు
సాక్షి, తాండూరు: మిషన్ భగీరథ బకాసురులు అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు నియోజకవర్గంలో సుమారు. రూ.500 కోట్లతో మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మిషన్ భగీరథ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌డబ్లుఎస్ శాఖకు అప్పగించారు. బషీరాబాద్ మండలం జీవన్గి, మైల్వార్, కంసన్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో కడప జిల్లాకు చెందిన గురువయ్య కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్నాడు. రూ.1.50 కోట్లకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రూ.70 లక్షల పనులకు సంబంధించి మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడంతో గురువయ్య రెండు నెలల క్రితం తాండూరులోని డీఈఈ కార్యాలయంలో బిల్లుల కోసం వచ్చారు. డీఈఈ గతంలోనే రూ.65 వేలు డిమాండ్ చేయడంతో బిల్లుల కోసం నగదును లంచంగా ఇచ్చారు. దీంతో రూ.70 లక్షల్లో కొంత బిల్లులు చెల్లించారు. అయితే మరో రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండటంతో గత నెలలో గురువయ్య డీఈఈ శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. రూ.30 వేలను చెల్లిస్తేనే బిల్లులు చేస్తామని డీఈఈ చెప్పాడు. చేసేది లేక గురువయ్య గతనెల 25వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అదును కోసం ఎదురు చూసిన ఏసీబీ అధికారులు 20 రోజుల పాటు పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని వేచి చూశారు. ఏసీబీ ట్రాప్‌కు చిక్కిన డీఈఈ శ్రీనివాస్... మిషన్ భగీ«రథ పనుల కోసం బిల్లులు చేయాలని అందుకు కావాల్సిన పర్సంటేజ్ సిద్ధం చేసుకున్నానని కాంట్రాక్టర్ గురువయ్య అధికారులకు నమ్మబలికాడు. దీంతో గురువయ్య ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రూ.30 వేలు తీసుకుని డీఈఈకి ఇచ్చేందుకు వచ్చారు. అయితే డబ్బులను వర్క్ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని చెప్పి పంపించారు. కార్యాలయ ఆవరణలో డబ్బులు తీసుకుంటుండగా మహేందర్‌ను.. రెడ్ హ్యాండెడ్‌గా డీఈఈ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి అధికారులను వదలం.. అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైన సరే ఆటకట్టిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్ గాజుల గురువయ్య నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని బాదితుడు సమాచారం అందించారు. ఈ మేరకు ఈనెల 25వ తేది నుంచి నిఘా పెట్టడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేసిన గురువయ్యకు బిల్లుల కోసం వెళితే లంచం డిమాండ్ చేశారని దీంతో గురువయ్య ఇప్పటి వరకు రూ.95 వేలు ఆర్‌డబ్లుఎస్ డీఈఈ శ్రీనివాస్‌కు లంచంగా ఇచ్చారని విచారణలో తేలిందన్నారు. లంచం తీసుకుంటు పట్టుబడిన డీఈఈ శ్రీనివాస్‌ను, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్‌ను అరెస్టు చేసి చంచల్‌గుడ జైలుకు తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నాగేంద్రబాబు, రాంలింగారెడ్డి, గంగాధర్, మజిద్‌లతో పాటు ఏసీబీ సిబ్బంది తదితరులున్నారు. -
సిద్ధమైన ‘మిషన్ భగీరథ’ నాలెడ్జి సెంటర్
సాక్షి, గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న గజ్వేల్ ఇక నాలెడ్జి సెంటర్‌గా మారబోతోంది. 2016 ఆగస్టు 7న ప్రధాని చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగిన గజ్వేల్ మండలంలోని కోమటిబండ హెడ్‌రెగ్యులేటరీ వద్ద నాలెడ్జ్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాన్ని సందర్శిస్తే చాలూ తెలంగాణ వ్యాప్తంగా గోదావరి, కృష్జా నదీ జలాలను శుద్ధి చేసి, గ్రావిటీ విధానంలో 26 సెగ్మెంట్ల పరిధిలోని అమలవుతున్న పథకం తీరు కళ్లకు కట్టినట్లు తెలిసే అవకాశమున్నది. ఇందుకు ఇక్కడ ఫోటో గ్యాలరీలు, ప్రొజెక్టర్ తదితర పరికరాలను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.50లక్షల నిధులతో ఇప్పటికే నాలెడ్జి సెంటర్ భవన నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే నిత్యం సందర్శకుల తాకిడితో సందడిగా మారిన హెడ్ రెగ్యులేటరీ ప్రాంతం ఇక మరింత ప్రాచూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్ మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్ తరహాలో అందించిన నీటిపథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 7న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి అతి తక్కువ కాలంలో ఇంతటి ప్రతిష్టాత్మక పథకాన్ని పూర్తి చేశారని దేశంలోనే చర్చనీయాంశంగా మారారు. పథకం నేపథ్యం ఇదీ దశాబ్ధాలుగా తాగునీటి తండ్లాటతో అల్లాడుతున్న గజ్వేల్‌లో కష్టాలు తీరుస్తానని చెప్పిన మాటకు కట్టుబడ్డారు. కొద్ది నెలల్లోనే గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తానని ప్రకటించి. ఆ మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ ‘మిషన్ భగీరథ’ (వాటర్ గ్రిడ్) పథకానికి (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్(హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీతోపాటు మరో 65 గ్రామాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, 2 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఈ పనులు 2016లో పూర్తి కావడంతో ఇదే తరహాలో రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో ఈ పనులను చేపట్టారు. మొత్తానికి పనులకు గజ్వేల్ సెగ్మెంట్ కేంద్రబిందువు. అన్ని సెగ్మెంట్ల సమాచారం కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్ రెగ్యులేటరీపై నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2018 జనవరిలో హెడ్‌రెగ్యులేటరీని సందర్శించిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అప్పటి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ ఇక్కడ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ సెగ్మెంట్ల సమాచారాన్ని అందించే విధంగా తీర్చి దిద్దాలని సీఎం ఆలోచనగా ఉందని చెప్పారు. దీంతో ‘మిషన్ భగీరథ’ ఈఎన్సీ వెంటనే సెంటర్ కోసం భవనం నిర్మాణం చేపట్టాలని రూ.50లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు భాగాలుగా పథకం అమలవుతున్నతీరు, కృష్టా నదీ జలాలతో 11సెగ్మెంట్లు, గోదావరి జలాలతో మరో 15 సెగ్మెంట్లలో అమలవుతున్న తీరు వివరించే దిశలో ఆయిల్ పేయింటింగ్ ఫొటో గ్యాలరీతో ప్రొజెక్టర్ ఇతర పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సీట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సందర్శకుల తాకిడితో పర్యాటక ప్రదేశంగా మారిన కోమటిబండ గుట్ట, నాలెడ్జి సెంటర్ అందుబాటులోకి వస్తే.. మరింత ప్రాయూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని మిషన్ భగీరథ అధికారులు ఆలోచనతో ఉన్నారు. గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దుతాం గజ్వేల్ మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే పథకంపై పూర్తి అవగాహన కలగాలన్నది సీఎం లక్ష్యం. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా కోమటిబండ హెడ్ రెగ్యులరేటరీ వద్ద నాలెడ్జి సెంటర్‌ను నిర్మించాం. భవిష్యత్‌లో ఇది గొప్ప కేంద్రంగా మారనుంది. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ -
ఎండిన సింగూరు...
సాక్షి, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పారిశ్రామిక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. పుల్కల్, అందోల్ మండలంలోని 35 గ్రామాలకు మాత్రమే ప్రస్తుతం పోచారం సత్యసాయి నీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పెద్దారెడ్డిపేట, బుసరెడ్డిపల్లి శివారుల్లో నిర్మించిన మిషన్ భగీరథ నీటి పంపింగ్ కేంద్రాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లావాసులు మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. అయితే వేసవిలోనే ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోవడంతో గత నెల నుంచి ప్రాజెక్టు లోపలి భాగంలో తాత్కాలిక కాల్వల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో తాగునీటి సరఫరా నిలిపివేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, మెదక్, నారాయణఖేడ్‌తోపాటు అందోల్ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని తరలిస్తున్నారు. మార్చిలో ఉన్న 5.21 టీఎంసీల నీటి మట్టం ఆధారంగా జూలై వరకు తాగు నీటిని సరఫరా చేస్తామని అంచాన వేశారు. కానీ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఎండిపోయింది. మిషన్ భగీరథ స్కీం ద్వారా ప్రతీ రోజు లక్ష మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా రోజుకు 50 వేల మిలియన్ లీటర్ల నీటినే సరఫరా చేశారు. సింగూరులో నీటి కొరత ఫలితంగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. జూలై నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకు సరైన వర్షాలు లేనందున నాలుగు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వర్షాకాలంలోనూ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అభివృద్ధిలో అగ్రస్థానం: ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రతీ అంశంలోనూ అభివృద్ధి సాధిస్తోందని... ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఇందులో అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి వేగంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరు జిల్లాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథ, హరితహారం, పంచాయతీరాజ్ చట్టం అమలు, ఓడీఎఫ్ పురోగతి, దేవాదుల భూసేకరణ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, విద్య, వైద్యం, డబుల్ బెడ్రూం గృహాలు, వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మిషన్.. బృహత్తర పథకం ‘మిషన్ భగీరథ’ బృహత్తర పథకం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భగీరథ కార్యక్రమం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ఒక్క మహిళ నెత్తిన బిందె పెట్టుకుని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదు. అధికారులు మంచిగ పని చేస్తున్నారు. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికీ వంద శాతం నీరు సరఫరా చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచితంగా నీరు సరఫరా చేసేలా పనులు పూర్తి చేయాలి. పనులు వంద శాతం పూర్తయినట్లుగా గ్రామపంచాయతీ గ్రామసభలో ఆమోదించి సర్పంచ్‌తో సంతకం చేయించాలి. ఈ పనులపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రోడ్లపై ఉన్న నల్లాల పైపులను ఇంటిలోపలి వరకు బిగించాలి. తాగునీరు వృథా చేస్తే గ్రామపంచాయతీలు జరిమానా విధించాలి. మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలి. మేడారం జాతర అవసరాలకు తగ్టట్లు నీరు సరఫరా చేసే పనులు జరిగేలా చూడాలి’ అని మంత్రి దయాకర్‌రావు సూచించారు. హరితహారం.. యజ్ఞం హరితహారంలో ఆరు జిల్లాలు అగ్రస్థానంలో ఉండాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ‘మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలి. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలి. హరితహారంలో ప్రభుత్వ లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలి. అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాల్సి ఉండగా పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించాలి. మొక్కలను నాటడంతోనే ఆగిపోకుండా సంరక్షణ ముఖ్యం. మండంలో పని చేసే అధికారుల ఒక్కో గ్రామానికి బాధ్యులుగా ఉండాలి. ఎవరెవరు ఎన్ని మొక్కలు నాటారో గ్రామపంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అలా అయితే అవి ఎండిపోకుండా జాగ్రత్త పడతారు. చెట్లను నరికితే కఠినంగా వ్యవహరించాలి. వాల్టా చట్టం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ముందున్న గ్రామపంచాయతీలకు అభివద్ధి పనుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తాం’ అని మంత్రి అన్నారు. గ్రామాలు.. స్వచ్ఛత గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ అధికారి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ‘ఉమ్మడి వరంగల్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలి. జిల్లాల పునర్విభజన తర్వాత గ్రామాలను బాగు చేసే సువర్ణ అవకాశం కలెక్టర్లకు దక్కింది. కలెక్టర్లు అన్ని శాఖలను సమన్వయం చేయాలి. అవసరమైన మేరకు చట్టాలను కఠినంగానే అమలు చేయాలి. అధికారులు చేసే మంచి పనులకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పటికీ ఉంటది. పని చేయని వారిపైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఎవరూ మీకు అడ్డు చెప్పరు’ అని స్పష్టం చేశారు. సాగునీరు.. రైతులకు భరోసా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వ్యవసాయంపై భరోసా కలుగుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవాదుల భూసేకరణ ప్రక్రియలో జాప్యంపై అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ముఖ్యంగా ఆర్డీఓ తీరు సరిగా లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరు జిల్లాల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని అన్నారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. దీని తొలి ఫలితం మన వరంగల్ జిల్లాకే అందుతోంది. కాళేశ్వరంతో వచ్చే నీరు ఎస్సారెస్పీ ద్వారా సాగు అవసరాలకు అందుతుంది. కాళేశ్వరం నీటితో ప్రతీ చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించారు. అవసరమైన ప్రతీచోట చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగాలి’ మంత్రి సూచించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే... ► పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. మంత్రి – ఎమ్మెల్యేల జల సంవాదం బీంఘనపూర్, చలివాగు ప్రాజెక్టుల నుంచి నిర్ధేశిత నీటి మట్టం కంటే ఎక్కువ నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎత్తిపోయాలని పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, నీరు ఎత్తిపోయకుంటే మిట్ట ప్రాంతాలకు సాగు, నీరు ఎలా అందుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ‘మీరు పాలకుర్తి, జనగామకు నీరు తీసుకుపోతే మా ప్రాంతాల్లో ప్రాజెక్టు ఉన్నా నీరు అందకపోతే రైతులు, ప్రజలు మమ్ముల్ని నిలదీస్తారు’ అని ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా ‘గతంలో నీటి కోసం మీరు చేసిందంతా నాకు తెలుసు’ అని మంత్రి అనడంతో ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతం కోసం వారు డిమాండ్ చేయడం సహజమేనని పేర్కొన్నారు. దీనిపై మంత్రి దయాకర్‌రావు స్పందిస్తూ ప్రాజెక్టుల్లో నీటి మట్టాల పర్యవేక్షణ, ఆయకట్టుకు విడుదల తదితర అంశాలను ఆ యా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలే పర్యవేక్షించాలని ఆదేశించారు. మంత్రిగా తాను కానీ ఎమ్మెలేలు కానీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. హాజరైంది వీరే... సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతిరాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు శంకర్‌నాయక్, వొడితల సతీష్‌కుమార్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి కమిషన్ నీతూకుమారి, మిషన్ భగీరథ అధికారి జి.కృపాకర్‌రెడ్డితో పాటు జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎం.హరిత, వినయ్కష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవీందర్, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్‌కు మెడికల్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం కలెక్టర్ నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ సమావేశంలో వెల్లడించారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి దయాకర్‌రావు ‘కలెక్టర్ గారూ.. మానుకోటలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.. సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించారు.. ఆ ఏర్పాట్లు కూడా చూడండి ’ అంటూ కలెక్టర్ శివలింగయ్యకు సూచించారు. -
‘భగీరథ’ భారం తగ్గించండి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన రూ.45 వేల కోట్ల అప్పుల భారా న్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేంద్ర జల శక్తి మం త్రిత్వ శాఖ తాగునీటి సంరక్షణ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌పై మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షత వహించగా, సదస్సుకు అన్ని రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా, స్వచ్ఛతకు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొనేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్రం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ బండా ప్రకాశ్, సంబంధిత శాఖాధికారులు హాజరయ్యారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును అన్ని రాష్ట్రాల అధికారులు పర్యవేక్షించి అభినందించారని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి వివరించారు. మంత్రి ఎర్రబెల్లి మంగళవారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో భేటీ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేయండి ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణకు కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రూ. 760 కోట్ల మెటీరియల్ కాంపోనెట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నరేంద్రసింగ్ తోమర్‌ను మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రిని కలసిన ఎర్రబెల్లి ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే రైతులకు వ్యవసాయాన్ని లాభాసాటి చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడాన్ని పరిశీలించాలని కోరారు. మరోవైపు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు 2017–18 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ రూ. 119 కోట్లు, 2018–19 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన రూ. 135 కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇక పాత వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలాన్ని రూర్బన్ క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మంత్రితోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ క్షేత్ర పర్యటనకు కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. దేశంలోని తాగునీటి సరఫరా పథకాల పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు డి.రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లాలోని ఎల్లూరు ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాలను పరిశీలించనుంది. గురువారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ కోమటిబండ, సిద్దిపేట గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. -
‘భగీరథ’ నీళ్లొచ్చేనా..!
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. నిండు వేసవిలో కరీంనగర్ నగర ప్రజలకు నీటి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే బోర్లు ఎండిపోయి నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో ఇబ్బందులతో తాగునీటి తండ్లాట మొదలైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 24/7 నీటి సరఫరాకు కరీంనగర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు వరప్రదాయినిగా ఉన్న లోయర్ మానేరు డ్యాంతోనే ఇది సాధ్యమవుతుందని భావించారు. తెలంగాణలోనే ఏ నగరానికి లేని తాగునీటి వనరులు కరీంనగర్‌కు ఉన్నాయి. ఎల్ఎండీలో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నగరానికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. నగరానికి నిరంతర నీటి సరఫరాకు కార్యాచరణ జరుగుతుండగా ఆశలన్నీ అర్బన్ మిషన్ భగీరథ పథకం మీదే ఉన్నాయి. పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిషన్ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరాకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, పైపులైన్ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.109 కోట్లతో పనులు... నగరంలో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ఓవర్‌హెడ్ ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల 8 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. గ్రామాలన్నింటికీ కార్పొరేషన్‌తో సమానంగా నీటి సరఫరా చేయాల్సి ఉంది. రెండు సార్లు గడువు పెంచినా... అర్బన్ మిషన్ భగీరథ పనులు 2017 మేలో ప్రారంభించారు. పూర్తిచేసేందుకు 18 నెలల కాల వ్యవధిని విధించారు. అంటే గతేడాది నవంబర్లోనే పూర్తిచేయాల్సి ఉన్నా పూర్తి కాలేదు. మరోమారు ఈ యేడాది మార్చి ఆఖరులోగా పనులు పూర్తిచేసి నీటిని సరఫరా చేయాలని గడువు పెంచారు. గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తికాలేదు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వంద శాతం పైపులైన్ల పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడా ఇంటర్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌజ్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. దీని పనులు చివరి దశలో ఉన్నాయి. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 60 శాతం మేర, హౌజింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ట్యాంకు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఎప్పటికి పూర్తవునో... ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పెంచిన గడువు ప్రకారం ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. ఆ గడువు కూడా ముగిసింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మిషన్ భగీరథ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరంతర నీటి సరఫరాకు అడ్డంకులు తొలగుతాయి. -
ఐదో విడత అంతేనా?
మెదక్‌జోన్: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుదని భావించిన ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలను మరమ్మతులను చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో చెరువుల పూడికతీత పనులు పూర్తి చేసింది. ఐదో విడతలోనూ వెయ్యి చెరువులకుపైగా మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఐదో విడతకు సంబంధించిన నిధులను కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్మాణాలకు మళ్లించారు. ఈ నిధుల మళ్లింపుతో చెరువుల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 2,681 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,05,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా ఇప్పటివరకు మిషన్ కాకతీయ పథకంలోని నాలుగు విడతల్లో 1,679 చెరువులు, కుంటలపునరుద్ధరణ పూర్తి చేశారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ. 467 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,002 చెరువులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మూడో, నాలుగో విడతకు సంబంధించి మిగిలిన 218 చెరువులు వివిధ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. కాల్వలకు ప్రతిపాదనలు.... కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నుంచి జిల్లాకు కాల్వల ద్వారా చెరువు, కుంటల్లోకి మళ్లించేందుకు ఎన్ని కిలోమీటర్లు? ఏ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఏ చెరువు నింపితే ఎంత ఆయకట్టుకు లాభం చేకూరుతుందనే వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులు జారీ చేయగానే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధ చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని హత్నూర, వెల్దుర్తి, నిజాంపేట,రామాయంపేట, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో కాల్వలకు సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యాయి. వాయిదా పడినట్లేనా..? ఇప్పటికే నిధులను మంజూరి చేయాల్సి ఉండగా నేటికి సాంక్షన్ చేయలేదు. ఐదో విడత చెరువులు, కుంటల మరమ్మతులకు ఉపయోగించే మిషన్ కాకతీయ నిధులను కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల ఏర్పాటుకు ఉపయోగిస్తునట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు మరమ్మతులు చేయనున్న చెరువులను ఎంపిక చేయలేదని జిల్లా ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 5వ విడతలో మిగిలిన చెరువులు, కుంటల మరమ్మతులు లేనట్టేనని పలువురు పేర్కొంటున్నారు. ఆదేశాలు అందలేదు.. ఇప్పటికే మిషన్ కాకతీయ పథకానికి సంబంధించి ఐదో విడత ప్రారంభం కావల్సింది. కానీ కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల పనులు పలు మండలాల్లో ప్రారంభమయ్యాయి. వాటి ద్వారా కాల్వలను తవ్వేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గైడ్‌లైన్స్ ఇంకా అందలేదు. ఆదేశాలు రాగానే ప్రతిపాదనలు తయారు చేస్తాం. ఐదో విడత మిషన్ కాకతీయకు సంబంధించి ఇప్పటి వరకు ఏలాంటి ఆదేశాలు అందలేదు. –ఏసయ్య, ఇరిగేషన్ జిల్లా అధికారి -
నల్లా ‘సౌ’లత్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లా కనెక్షన్ డిపాజిట్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణాలు, నగరాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పంపు కనెక్షన్ డిపాజిట్లను రూ.100కు తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం రేపో.. మాపో జారీ చేయనుంది. ఇప్పటివరకు జిల్లాలోని ఖమ్మంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నింట్లో.. 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పంపు కనెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉండడంతో ఇంటి యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం డిపాజిట్లు తగ్గించడంతో నూటికి నూరు శాతం మంది పంపు కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ కనెక్షన్లను సైతం సక్రమంగా మార్చుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పంపు కనెక్షన్లు తీసుకోవాలంటే డిపాజిట్‌గా చెల్లించే సొమ్ము ఎక్కువగా ఉంటోంది. అయితే ప్రజలందరికీ సురక్షితమైన, మంచినీటిని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పంపు కనెక్షన్లకు ఉన్న డిపాజిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పంపు కనెక్షన్ కావాలంటే రూపాయి డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోయేది. ఇతరులు పంపు కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.110 చెల్లించాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంపు కనెక్షన్ కావాల్సిన వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పంపు బిల్లు ప్రతినెలా రూ.110 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్లో.. నగరంలో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉన్నారు.. మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న పట్టణం తొమ్మిది విలీన గ్రామాలతో కార్పొరేషన్‌గా అవతరించింది. నగర పరిధిలో 63,304 గృహాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 31,500 మాత్రమే పంపు కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం డిపాజిట్‌ను రూ.100కు తగ్గించడంతో మధ్య తరగతి వర్గాలకు ఊరట లభించనున్నది. కేవలం నెలవారీ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్లో ఇప్పటివరకు 217 పంపు కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. డిపాజిట్ తగ్గడంతో వాటిని పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ పెరగనున్న కనెక్షన్లు.. జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో కూడా అనేక గృహాలకు పంపు కనెక్షన్లు లేవు. సెక్యూరిటీ డిపాజిట్ ఎక్కువగా ఉందనే కారణంతో అనేక మంది పంపు కనెక్షన్లు పెట్టించుకోలేదు. ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ రూ.100కు తగ్గించడంతో ఈ మున్సిపాలిటీల్లో కూడా పంపు కనెక్షన్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. మధిర మున్సిపాలిటీ పరిధిలో 9,048 గృహాలు ఉండగా.. 5,205 పంపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రూపాయి డిపాజిట్ కింద ఇవ్వాల్సిన కనెక్షన్లు 2,688 పెండింగ్‌లో ఉన్నాయి. వైరాను ఇటీవలే మున్సిపాలిటీగా ప్రకటించారు. ఇక్కడ 6,355 గృహాలు ఉండగా.. 2,500 పంపు కనెక్షన్లు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 7,321 గృహాలు ఉండగా.. 5,316 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైపులైన్ల పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి పంపు కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఆదేశాలు రాగానే.. పంపు కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే నగరంలో అమలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇస్తాం. నగరంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛమైన నీటిని పొందాలి. – జె.శ్రీనివాసరావు, కేఎంసీ కమిషనర్ -
రూ.92 వేల కోట్ల గ్రాంట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణ, విద్య, వైద్యం తదితర 13 అంశాలకు సంబంధించి రూ.92,809 కోట్లు అవసరమని, వీటిని గ్రాంట్స్–ఇన్–ఎయిడ్‌గా ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చేవారంలో తెలంగాణకు సందర్శించి ఆర్థిక పరిస్థితి అంచనా వేయనున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని బృందానికి సమర్పించేందుకుగాను నివేదిక తయారు చేసింది. 15వ ఆర్థిక సంఘం అక్టోబర్‌లో తన సిఫార్సుల నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఐదేళ్లపాటు అమలులో ఉంటాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణకు రూ.40,169 కోట్లు, మిషన్ భగీర థకు రూ.12,722 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లు.. ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులివ్వా లని కోరనుంది. నిర్మాణంలో ఉన్న 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నివేదికలో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉందని వివరించనుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయితే కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లందించే సామర్థ్యం ఏర్పడనుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితి లేనందున ఎత్తిపోతలపై ఆధారపడాల్సి వస్తోందని, వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని వివరించనుంది. భగీరథకు రూ.12,722 కోట్లు కావాలి మిషన్ భగీరథకు రూ.12,722 కోట్లు కావాలని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.44,979 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 23,968 ఆవాసాలకు తాగునీరందించనున్న ఈ వాటర్‌గ్రిడ్ నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో 2020 నుంచి 2025 మధ్యకాలానికి రూ.10,141 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,580 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. ప్రాజెక్టు నిర్వహణకు ఐదేళ్లకుగాను రూ.12,722 కోట్లు అవసరమని పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్య రంగాలకు ఇలా.. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాలు, కేన్సర్ కేర్ సెంటర్ల నిర్మాణం, వైద్య వర్సిటీల బలోపేతం.. ఇలా మొత్తంగా రూ.1,085 కోట్లు కావా లని కోరనుంది. 24 గంటల విద్యుత్తుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయని, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని నివేదికలో పే ర్కొంది. విద్యుత్తు అవసరాలకు రూ.4,442 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. పాఠశాల విద్యలో భాగం గా బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌కు రూ.549 కో ట్లు, ఆధార్ బయోమెట్రిక్ హాజరు యంత్రాలకు రూ. 201 కోట్లు, ఐసీటీ, డిజిటల్ విద్యకు రూ.1,741 కోట్లు అవసరమని ప్రతిపాదించ నుంది. పాఠశాల విద్యకు రూ.7,584 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయాలని కోరనుంది. స్థానిక సంస్థల విభా గం ద్వారా రూ.7,866 కోట్ల ప్రతిపాదనలు సమర్పించనుంది. జిల్లాల వర్గీకరణ, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల నియామ కం తదితర అవసరాలకయ్యే వ్యయాన్ని వివరించనుంది. హోంశాఖకు రూ.7,610 కోట్ల నిధులు కోరనుంది. కానిస్టేబుళ్ల నియామకం, ఇతర మౌలిక వసతుల కల్పన, కోర్టు భవనాల నిర్మాణం తదితర అవసరాలకూ ప్రతిపాదనలు సమర్పించనుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణం తదితర అంశాలను నివేదికలో పొందుపరిచింది. -
అమూల్యమైన ఆరోగ్యనిధి ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథతో రాష్ట్రంలోని భావితరాలకు వెలకట్టలేని ఆరోగ్యనిధిని ప్రభుత్వం అందిస్తోందని ఆ ప్రాజెక్టు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి ప్రతి ఇంటికి తీసుకొస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. మిషన్ భగీరథ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)పాలసీ, మార్గదర్శకాలపై రెండ్రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌లో స్మితా సబర్వాల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి శుద్ధిచేసి న తాగునీరు సరఫరా చేసే కృషి సాగుతోందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, స్థిరమైన తాగునీటి సరఫరా అంశాలపై చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 గంటలు తాగునీటిని సరాఫరా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ‘‘అస్కీ’’డైరెక్టర్ శ్రీనివాసాచారి ప్రజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ మేథ(ఏఐ) ఉపయోగించి రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను సమర్థవంతంగా లెక్కగట్టొచ్చని ‘స్కార్ట్ టెర్రా’ ప్రతినిధి గోకుల్ చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి సంబంధిత వ్యాధులపై తాము సర్వే చేసినట్లు యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. -
‘భగీరథ’ ఎందాకా..?!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులపై ఒత్తిడి పెరిగింది. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకుండా ఓట్లడగమని చెప్పినా.. ముందస్తు ఎన్నికలతో ఆ గడువు కాస్తా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి అన్ని అవాసాల్లోని ఇంటింటికి నల్లాల ద్వారా నీరివ్వాలనేది తాజా లక్ష్యం. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం వచ్చే జనవరి 5 వరకే ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ పథకం ప్రగతిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె తక్షణమే పనులు పూర్తి చేయాలని ఆదేశించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లోని 494 హాబిటేషన్లకు చెందిన సుమారు 8.50లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పనులను చేపట్టారు. 2017 డిసెంబర్ నాటికి జిల్లా వాసులకు ఇంటింటికి నల్లానీరు అందివ్వాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి కె.తారకరామారావు మిషన్ భగీరథ పనులకు జిల్లాలో అంకురార్పణ చేశారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) నుంచి మిషన్ భగీరథలో తాగునీటికి వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికి మొత్తంగా చూసుకుంటే 84 శాతం పనులు పూర్తయినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. మిషన్ భగీరథ పనులు గతేడాది డిసెంబర్ వరకు పూర్తి కావాల్సి ఉన్నా.. పెంచిన గడువు ప్రకారం గడిచిన మార్చిలో ఇంటింటికి నల్లానీరు ఇవ్వాల్సి ఉంది. అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇటీవలే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పనులు వచ్చే జనవరి నాటికి పూర్తయి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు వేగిరపడుతున్నా.. ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 494 హాబిటేషన్లకు బల్క్ వాటర్ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసినా... 385 హాబిటేషన్లకే ప్రస్తుతం సరఫరా అవుతోంది. ఇంటింటికి నల్లా కనెక్షన్లు 74.49 శాతంగా పేర్కొన్న అధికారులు 95.24 శాతం పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం 1750.22 కిలోమీటర్లకు గాను 1666.93 కిలోమీటర్లు వేశారు. 1,74,657 ఇండ్లకు నల్లా కనెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో 1,73,752 గృహాలకు ఇచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఓవర్‌హెడ్ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్)ల నిర్మాణమే అసలు సమస్యగా కనిపిస్తోంది. మొత్తం 380 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు 257 మాత్రమే పూర్తయ్యాయి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ), రా వాటర్ పైపులైన్లు, జీఎల్‌బీఆర్, సంపులు, కెమికల్ హౌజ్, ఫిల్టర్ హౌజ్, క్లోరినేషన్ హౌజ్, రా వాటర్ ఛానల్లు పూర్తిస్థాయిలో వాడకంలోకి తేవాల్సి ఉంది. వీటన్నింటిని చేసేందుకు అధికారులు కాంట్రాక్టు సంస్థలను తొందరపెడుతున్నా... ఆశించిన మేరకు వేగం అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 5 నాటికి అన్ని ఇండ్లకు నల్లానీరు సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేగవంతంగా పూర్తి చేయాలి – స్మితా సభర్వాల్ మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లంపల్లి, వరదకాలువ పనుల భూసేకరణ, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్షించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 2019 జనవరి 5వ తేదీ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లో మిషన్ భగీరథ పనులపై కలెక్టర్లు దృష్టి సారించాలని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించారు. ఇరిగేషన్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ పనులు నిలిచిపోవడం వల్ల మున్సిపల్‌కు నీరందంచిలేక పోతున్నారని, ఫిల్టర్ బెడ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్, వరద కాలువ పనులపై దృష్టిసారించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ శ్రీకాంత్‌రావు, మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, వరదకాలువ సీఈ అనిల్‌కుమార్, ఇరిగేషన్ శాఖల ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు పాల్గొన్నారు. -
భగీరథ గేట్వాల్ లీక్
సాక్షి, కురవి: మండల కేంద్రం శివారులోని పెద్దచెరువు కింది భాగంలో 365 జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేసిన భగీరథ గేట్‌వాల్వ్ విరిగిపోవడంతో నీళ్లు ఫౌంటెన్లా పైకి ఎగిసిపడుతున్నాయి. గురువారం సాయంత్రం 4.30గంటల సమయంలో గేట్వాల్ ఒక్కసారిగా విరిగి పక్కకు ఒరగడంతో నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. ఈ నీరంతా దారిపక్కన వృథాగా పారుతున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. -
బషీరాబాద్‌కు ‘భగీరథ’
బషీరాబాద్(తాండూరు) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ రానే వచ్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందించనున్న రక్షిత తాగునీరు ఇప్పటికే శ్రీశైలం నుంచి పరిగిలోని జాఫర్‌పల్లి డబ్ల్యూపీటీకి చేరింది. యాలాల మండలం పగిడ్యాల్ ఓహెచ్‌బీర్ ట్యాంకు నుంచి బషీరాబాద్ మండలం నవల్గ సంపు వరకు సుమారు 32 కి.మీ మేర నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ రక్షితè తాగునీరు కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలానికి చేరుకుంది. ఎక్కడ కూడా మోటార్లు ఉపయోగించకుండా కేవలం గ్రావిటీ మెథడ్తోనే (గురుత్వాకర్షణ పద్ధతి) పరిగిలోని జాఫర్‌పల్లి నుంచి బషీరాబాద్ మండలం నవల్గకు కృష్ణమ్మ నీరు పైపుల్లో పరుగులు పెట్టింది. పగిడ్యాల్ నుంచి నవల్గ వరకు నిర్వహించిన తొలి ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు మిషన్ భగీరథ సివిల్ ఇంజినీరు రాములు ప్రకటించారు. అయితే నీటి ఒత్తిడి కారణంగా యాలాల మండలంలోని హాజీపూర్ గేటు వద్ద పైపులైన్ జయింట్లో స్వల్ప లీకేజీ కావడంతో వరి పొలాల్లోకి నీళ్లు చేరాయి. తాండూరు మండలంలోని గోనూరు గేటు సమీపంలో ఎయిర్ వాల్వ్ ద్వారా నీళ్లు బయటకు చిమ్మాయి. అటు నుంచి నేరుగా నవల్గ చెరువు కట్ట సమీపానికి నీళ్లు చేరాయి. అయితే పైపులైన్లో ఉన్న మట్టితో ఒండ్రు నీళ్లు రావడంతో నవల్గ చెరువు కట్టకింద ఉన్న ఎయిర్ షవర్ వద్ద ఆ నీటిని వదిలేశారు. నవల్గ సమీపంలోని ప్రధాన సంపునకు కి.మీ దూరంలోకి రాగానే అధికారులు ట్రయల్ రన్‌ను నిలిపేశారు. తుదిదశకు ట్యాంకుల నిర్మాణం బషీరాబాద్ మండలంలోని రెండు ప్రధాన ఓహెచ్‌బీర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. మర్పల్లి దగ్గర 40వేల లీటర్ల ట్యాంకు ఇప్పటికే పూర్తికాగా, మాసన్పల్లి దగ్గర గల 60వేల లీటర్ల ట్యాంకు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. దీంతో పాటు నవల్గ సమీపంలో గల 1.5 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన సంపు, వాటర్‌ట్యాంకు నిర్మాణం కూడా పూర్తయ్యింది. తాండూరు నియోజక వర్గంలో రెండు ట్యాంకులకు మాత్రమే పంపుల ద్వారా నీటిని ఎక్కిస్తారు. వీటిలో మర్పల్లి దగ్గర ఉన్న 40 వేల లీటర్ల ట్యాంకుకు నవల్గ సంపు నుంచి 3 మోటర్ల ద్వారా నీటిని పంపిస్తారు. సెప్టెంబర్ 15వరకు గ్రామాలకు.. ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న మిషన్ భగీరథ పథకం నీళ్లు ఈ నెలాఖరు వరకు గ్రామాలకు చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. బషీరాబాద్ మండలంలో 39 గ్రామాల్లో రూ.24.51కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్ పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల పక్షం రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 15వరకు గ్రామాల్లోని ట్యాంకులకు నీళ్లను చేర్చాలని యంత్రాంగం పనుల్లో వేగాన్ని పెంచింది. ఇదిలా ఉండగా కృష్ణ వాటర్ బషీరాబాద్ మండలంలోని నవల్గకు చేరడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
దసరా నాటికి ‘భగీరథ’ నీళ్లు
హన్మకొండ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులు మొత్తం సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి చేసి దసరా పండగ నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు అధికారులు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుబేదారి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలూ.. హరితహారం లక్ష్యం చేరుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో నాటిన మొక్కలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు చేయడంతోపాటు ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్ చేయాలన్నారు. ఎంపీడీఓల స్థాయిలో ప్రతి వారం లక్ష మొక్కలు నాటేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ధేశించిన నర్సరీల నుంచి మొక్కలు తెప్పించుకోవాలన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకం కోసం నర్సరీలు సిద్ధం చేసుకోవాలన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో 75లక్షలు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో 60లక్షలు, డీఆర్డీఓ ద్వారా 60లక్షలు, అటవీ శాఖ ద్వారా 23లక్షల మొక్కలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం నిర్ధేశించిన 62లక్షల మొక్కల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. డీఎఫ్ఓ అర్పణ, డీఆర్డీఓ రాము, అర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆగస్టు 14 అర్ధరాత్రే డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్ : ‘‘మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి. ఆగస్టు 14 అర్థరాత్రిని డెడ్ లైన్‌గా పెట్టుకుని, ఆలోగా అన్ని గ్రామాలకూ బల్క్‌గా నీరందించేలా పనుల్లో వేగం పెంచండి’’అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. 60 నుంచి 80 రోజుల్లో మిగతా పనులు కూడా నూటికి నూరు శాతం పూర్తయేలా పని చేయాలని నిర్దేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిని గురువారం ప్రగతి భవన్లో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టులో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, వేలాది గ్రామాలకు ఇప్పటికే నీరు వస్తోందని సీఎం అన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు, మరికొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. పనులు పూర్తయిన చోట బాలారిష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్‌డబ్లు్యఎస్ శాఖను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు. సమాంతరంగా అంతర్గత పనులు భగీరథ అంతర్గత పనులు కూడా సమాంతరంగా కొనసాగాలని, మరో నెలన్నరలో అవీ పూర్తవాలని సీఎం సూచించారు. ‘‘1.5 లక్షల కి.మీ. పొడవైన పైపులైను, 1,400 మోటార్లు, 180 మెగావాట్ల విద్యుత్, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పెద్ద ప్రాజెక్టు కావడంతో అక్కడక్కడ వాల్వ్‌ల లీకేజీ వంటి సమస్యలు సహజం. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలి. పనుల్లో నిర్లక్ష్యం చూపే ఏజన్సీలు, అధికారులపై కఠినంగా వ్యవహరించండి’’అని ఆదేశించారు. ‘‘ఆర్‌డబ్లు్యఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డిని మిషన్ భగీరథ సలహాదారుగా, సీఈ కృపాకర్ రెడ్డిని ఈఎన్సీగా నియమించండి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్న సీఈల సంఖ్యను 4 నుంచి 9కి పెంచండి. వారి పరిధి నిర్ణయించడంతో పాటు, సెగ్మెంట్లవారీగా పనుల షెడ్యూల్‌ను శుక్రవారం మధ్యాహ్నానికల్లా నిర్థారించండి. భగీరథ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీలకు బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ పెట్టొద్దు. పనులను రోజూ పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేయండి. పనులు ఎక్కడ పూర్తయితే అక్కడ నీరు సరఫరా చేస్తూ వెళ్లండి. విద్యుత్ శాఖ సబ్ స్టేషన్లు, పంపు హౌజుల నిర్మాణానికి సిబ్బందిని నియమించండి. లో వోల్టేజీ సమస్య రాకుండా చూసుకోండి. విద్యుత లైన్లను ప్రాజెక్టుకు అనుసంధానం చేయడంపై విద్యుత్ శాఖ, భగీరథ అధికారులు సమన్వయంతో తుది చర్యలు తీసుకోండి’’అని ఆదేశించారు. సమీక్షలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గడువుకు ముందే పూర్తయిన విద్యుత్ పనులు మిషన్ భగీరథ పథకానికి విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్ణీత గడువుకు ముందే విద్యుత్ సంస్థలు వంద శాతం సిద్ధం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా భగీరథ పంపుసెట్లు నడవడానికి రూ.280 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, పవర్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థలు చేసిన ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఆయన కేసీఆర్‌కు అందజేశారు. ‘‘భగీరథ విద్యుత్ వ్యవస్థలన్నీ 2018 ఆగస్టు 15 నాటికి పూర్తవ్వాలని సీఎం గడువు విధించారు. అంతకు నెల ముందే జూలై 15 నాటికే పనులన్నీ పూర్తి చేసి భగీరథ పథకానికి అప్పగించాం. 180 మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికి ఏర్పాట్లు చేశాం. డెడికేటెడ్ లైన్లు కూడా వేశాం. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా గౌరిదేవిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరులో 220/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాం. 44 సబ్స్టేషన్లు, 603.57 కి.మీ. మేర 33 కేవీ లైన్లు, 603.3 కి.మీ. 11 కేవీ లైన్లు, 46 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 314 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో రెండు 220/11 కేవీ స్టేషన్లు, పదహారు 33/11 స్టేషన్లు, 249.94 కి.మీ. 33 కేవీ లైన్లు, 254.94 కి.మీ. 11 కేవీ లైన్లు, 126 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 33/11 కేవీ స్టేషన్లు 26, 353.63 కి.మీ. 33 కేవీ లైన్లు, 348.36 కి.మీ. 11 కేవీ లైన్లు, 46 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 188 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. ఇవన్నీ 24 గంటల పర్యవేక్షణతో నిరంతరాయంగా పనిచేస్తాయి’’అని పేర్కొన్నారు. -
కనీస నీటి మట్టాలు తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో తీవ్ర నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో లభ్యత నీటిని జాగ్రత్తగా వినియోగించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. గతేడాది కనీస నీటి మట్టాల నిర్వహణలో వైఫల్యంతో తాగునీటికి కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది ఆ పరిస్థితులు పునరావృతం కావొద్దని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మిషన్ భగీరథ అవసరాల కోసం ఇప్పటికే ఏయే ప్రాజెక్టులో ఎంత కనీస నీటి మట్టాలు ఉండాలో స్పష్టం చేసిన నీటి పారుదల శాఖ, వాటి నిర్వహణలో విఫలమైతే సంబంధిత ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు (ఈఈ)లపై సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ శుక్రవారం అన్ని ప్రాజెక్టుల అధికారులకు సమాచారం పంపింది. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల నిర్ధారణ మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరాలకు ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది మే నెల వరకు మొత్తంగా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించారు. దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15 రిజర్వాయర్లు, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను నిర్ధారించారు. సింగూరు ప్రాజెక్టు వాస్తవ నీటి మట్టం 523.60 మీటర్లయితే ఇక్కడ కనీస నీటి మట్టాన్ని 520.50 మీటర్లుగా నిర్ధారించారు. ఈ కనీస నీటి మట్టాన్ని నిర్వహిస్తేనే భగీరథ అవసరాల కింద 5.70 టీఎంసీల నీటిని ఏడాది పాటు తీసుకునే వీలుంది. అలాగే ఎల్లంపల్లి వాస్తవ నీటి మట్టం 148 మీటర్లు కాగా కనీస నీటి మట్టాన్ని 146.40గా నిర్ణయించారు. ఈ నీటి మట్టాన్ని నిర్వహిస్తేనే 2.82 టీఎంసీలను తాగునీటికి తీసుకునే అవకాశముంది. ఇలా అన్ని రిజర్వాయర్ల పరిధిలో కనీస నీటి మట్టాలపై ఇదివరకే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని చోట్ల దిగువకు నీరు.. కొన్ని చోట్ల నీటి లోటు కారణంగా ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు నీటి నిల్వలు చేరాయి. ముఖ్యంగా కల్వకుర్తి పరిధిలోని ఎల్లూర్ కింద 7.12 టీఎంసీల నీటి అవసరాలుండగా అక్కడ మట్టాలు తగ్గడంతో 0.50 టీఎంసీ కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల మిషన్ భగీరథ అవసరాలపై సమీక్షించిన సీఎం కేసీఆర్ తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎస్కే జోషి నీటి పారుదల శాఖకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కనీస నీటి మట్టాలకు దిగువన నీటిని విడుదల చేయరాదని ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు పంపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే కచ్చితంగా ప్రాజెక్టుల అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఎక్కడైనా కనీస నీటి మట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంబంధిత ఈఈలను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటే పెనాల్టీ సైతం విధిస్తామని పేర్కొంది. మిషన్ భగీరథకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఈ ఆదేశాలను పాటించేలా అన్ని ప్రాజెక్టుల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
ట్రయల్ రన్‌లోనే లీక్.. ఉవ్వెత్తున జలపాతం!
సాక్షి, హుస్నాబాద్: మిషన్ భగీరథ ట్రయల్ రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణం నడిబొడ్డున శుక్రవారం భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంత వరదమయమైంది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది. ఒక్కసారిగా నీరు పైకి ఎగజిమ్మడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత సన్నగా మొదలైన నీటి ధార చూస్తుండగానే ఉధృతమైన వరదలా మారింది. ట్యాంకర్ల కొలది నీరు రోడ్ల వెంట పరుగులు పెట్టింది. అధికారులకు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఓ యువకుడు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. -
మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ
-
‘భగీరథ’కు నీటి కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ ఏడాది జూన్, జూలై నుంచి ‘భగీరథ’ద్వారా తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలంలలో నీటి మట్టాలు పడిపోవడం, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూర్ రిజర్వాయర్‌లో అత్యంత కనిష్టానికి నీరు చేరడం, ఈ రిజర్వాయర్‌కు నీరు అందకుండా శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తోడేస్తుండటం భగీరథ కష్టాలను మరింత పెంచుతోంది. అంచనాలు తలకిందులు.. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి ఏడాది వరకు 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో కృష్ణా బేసిన్‌లోని జూరాల నుంచి 1.22 టీఎంసీలు, ఎల్లూర్ రిజర్వాయర్ నుంచి 7.12, కోయిల్‌సాగర్ నుంచి 1.3 టీఎంసీలతో పాటు సాగర్ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి, ఉదయసముద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో నీటి కొరతతో నీటి సరఫరా గగనంగా మారింది. ముఖ్యంగా శ్రీశైలం జలాలపై ఆధారపడిన ఎల్లూర్ రిజర్వాయర్ కింద 7.12 టీఎంసీల అవసరం ఉండగా లభ్యత 0.3 టీఎంసీలే ఉంది. ‘పాలమూరు’కు ఇక్కట్లే.. శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే 800 అడుగులకు చేరగా, పవర్‌హౌజ్‌ల ద్వారా ఏపీ మరింత నీటిని వాడుకోవడంతో 799.90 అడుగులకు చేరింది. మరింత నీరు వాడుకుంటే మోటార్లు అమర్చినా నీరు తీసుకోవడం సాధ్యపడేలా లేదు. బీమా ప్రాజెక్టు పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్‌లోనూ అనుకున్న స్థాయిలో మట్టాలు లేనందున పాలమూరు జిల్లాలో జూన్ నుంచి భగీరథకు నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. వైరా రిజర్వాయర్ కింద కనీస నీటిమట్టం 94.65 మీటర్లుగా నిర్ణయిస్తే ఇప్పటికే 94.29 మీటర్లకు పడిపోయింది. పాలేరు రిజర్వాయర్ పరిధిలో కనీస నీటిమట్టం 133.29 మీటర్లు కాగా 132.94 మీటర్లుకు చేరడంతో భగీరథకు నీరెలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమీక్షించనున్న ప్రభుత్వం భగీరథ ద్వారా జూన్ నుంచి నీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రిజర్వాయర్లలో నీటి కొరతతో ఆందోళన చెందుతోంది. నీటి విషయమై పూర్తిస్థాయిలో సమీక్షించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రిజర్వాయర్లలోని మట్టాలు, జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి లభ్యత, ఆవిరి నష్టాలపై నివేదిక కోరింది. -
మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి
అశ్వాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేగవంతం చేయాలని సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మండల పరిధిలోని మిట్ట గూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న 40 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, రథంగుట్టపై నిర్మిస్తున్న 900 కేఎల్, 3900 కేఎల్ రిజర్వాయర్ల పనులను మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి స్మితాసబర్వాల్ శుక్రవారం పరిశీలించా రు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం వాటర్ ట్రీట్మెం ట్ ప్లాంటు ఆవరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల మిషన్‌భగీరథ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ నెల 25 నాటికి మిట్టగూడెం రథంగుట్ట పైన నిర్మిస్తున్న రిజర్వాయర్ల ద్వారా రావాటర్‌ను పాల్వంచ మండలం తోగ్గూడెంలో నిర్మిస్తున్న 140 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వరకు నీరు విడుదల చేయాలన్నారు. ఈ నెల చివరి కల్లా కుమ్మరిగూడెం ఇంటెక్ వెల్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంటు ప్లాంటు, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేసి మే నెలలో ఇంటింటికి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల్లో అలసత్వం తగదు.. ఇప్పటికే పనులను మూడు సార్లు పరిశీలించామని పనుల్లో పురోగతి లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌లు, పైపులైన్ల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలస త్వం వహించవద్దని పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లా ద్వారా ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అధికారులు పనుల వేగవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, భద్రాచలం సబ్‌కలెక్టర్ పమెలా సత్పథి, మిషన్‌భగీరథ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు సదాశివరావు, రవీందర్, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కే.విజయ్‌కుమార్, రెండు జిల్లాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ సిద్ధం
సాక్షి, ఆదిలాబాద్ : మిషన్ భగీరథ ప్రయత్న ఫలితం ఆసన్నమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి సెగ్మెంట్‌గా తీసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరా పనులు తుది దశకు వచ్చాయి. ఈ నెల చివరి వరకు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ట్రయల్‌రన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్వెల్, దిలావర్పూర్ మండలం మాడెగాంలో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. పైమూడు నియోజకవర్గాలకు ఈ ఇంటెక్వెల్, నీటిశుద్ధి ప్లాంట్ నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ఇదే సెగ్మెంట్లో గడ్డన్న వాగు వద్ద ఇంటెక్వెల్ నిర్మాణం పూర్తయింది. ఈ ఇంటెక్వెల్ నుంచి భైంసా పట్టణంలోనిæ శుద్ధి ప్లాంట్‌కు నీళ్లు చేరుకుంటాయి. ఈ ప్లాంట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఇంటెక్వెల్, నీటి శుద్ధిప్లాంట్ నుంచి ముథోల్ నియోకవర్గానికి నీటి సరఫరా జరుగుతోంది. మొదట నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ ట్రయల్‌రన్ తర్వాత భైంసా ట్రయల్‌రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. మాడెగాంలో ప్రారంభమైన నీటిశుద్ధి పనులు.. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్ ఇంటెక్వెల్ నుంచి దిలావర్పూర్ మండలం మాడెగాం శుద్ధి ప్లాంట్(డబ్ల్యూటీపీ)కు నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ శుద్ధి తర్వాత పైపులైన్ల ద్వారా నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు(జీఎల్‌బీఆర్)లు, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్/బీపీటీ)లు, అంతర్గత సంప్‌లకు నీళ్లు చేరుకుంటాయి. ఈ నెల చివరిలోగా ఈ మూడు నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే ట్రయల్‌రన్ ప్రారంభించిన తర్వాత మూడు నెలలపాటు అది కొనసాగుతుంది. మాడెగాంలో శుద్ధి అయిన నీళ్లు నియోజకవర్గాల్లో నిర్మించిన జీఎల్బీఆర్లు, ఓహెచ్‌బీఆర్‌లు, అంతర్గత సంప్ల సామర్థ్యం మేరకు పంపిణీ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ ట్రయల్‌రన్ ద్వారా అధికారులు నిర్ధారించుకుంటారు. ఈ నీటి పథకాల నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లోని 869 ఆవాసాలకు నీటిని సరఫరా చేస్తారు. గ్రామాల్లో ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు జూన్‌లోగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఆ తర్వాతే భగీరథ నీళ్లు గ్రామాల్లో ఇంటింటికి చేరే పరిస్థితి ఉంది. గడ్డన్న వాగు వద్ద ఇంటెక్వెల్ నిర్మాణం పూర్తయింది. భైంసా వద్ద నిర్మిస్తున్న నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం 95శాతం పూర్తయింది. ఈ నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. ముథోల్ నియోకజవర్గానికి శుద్ధ జలం అందుతుంది. ఇక్కడి నుంచి 245 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుంది. రూ.1778 కోట్ల అంచన వ్యయంతో... ఎస్సారెస్పీ, గడ్డన్నవాగు జలాశయాల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్ నియోజకవర్గాలకు శుద్ధ జలం అందించే మిషన్ భగీరథ పనులు రూ.1778 కోట్ల అంచన వ్యయంతో కొనసాగుతున్నాయి. ఈ మార్చి వరకు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రెండు ఇంటెక్వెల్లు నిర్మిస్తుండగా, అందులో సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఒకటి, గడ్డన్నవాగు వద్ద మరొకటి నిర్మాణం పూర్తి చేశారు. నీటిశుద్ధి ప్లాంట్లు రెండు నిర్మిస్తుండగా, అందులో దిలావర్పూర్ మండలం మాడెగాం వద్ద ఒకటి, భైంసా పట్టణంలో మరొకటి నిర్మిస్తున్నారు. మాడెగాం నుంచి రోజూ 130 మిలియన్ లీటర్లు, భైంసా నుంచి రోజూ 50 మిలియన్ లీటర్లు శుద్ధజలం సరఫరా చేయనున్నారు. ఈ రెండింటి కింద భూస్థాయి బ్యాలెన్సింగ్, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్ల నిర్మాణాలు పూర్తయ్యే దశకు వచ్చాయి. పైపులైన్ పనులు కూడా తుది దశకు వచ్చాయి. ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు మాత్రం జూన్ వరకు పూర్తయ్యే పరిస్థితి ఉంది. ప్రధాన గ్రిడ్ నుంచి నీటి పథకాల వరకు నీటిని మాత్రం ఈ ట్రయల్‌రన్ ద్వారా చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మోటార్లతో పరిశీలన.. లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్వెల్ వద్ద 1274 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్ల ద్వారా నీటిని మాడెగాంలోని నీటి శుద్ది ప్లాంట్‌కు పంపిస్తారు. మాడెగాంలో 1207 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్లు, 74 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటార్ల ద్వారా ఈ జలాలను శుద్ధి చేస్తారు. అక్కడి నుంచి నీరు ఆదిలాబాద్ జిల్లాకు నేరడిగొండ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)కు చేరుకుంటుంది. గుట్ట ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి నుంచి పైపులైన్ల ద్వారా నీరు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకుండానే ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్‌లకు సరఫరా చేస్తారు. ట్రయల్‌రన్‌కు ఏర్పాట్లు.. మిషన్ భగీరథ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్ నియోజకవర్గాలకు నీరందించేందుకు ట్రయల్‌రన్‌ను ఈ నెలలో నిర్వహిస్తాం. 15వ తేదీ తర్వాత నిర్మల్‌లో, 25వ తేదీ తర్వాత ఆదిలాబాద్‌లో ట్రయల్‌రన్ నిర్వహించే అవకాశం ఉంది. మాడెగాంలో ఇప్పటికే నీటిశుద్ధి ప్లాంట్‌లో నీటిశుద్ధి జరుగుతుంది. అక్కడి నుంచి ట్రయల్‌రన్ ద్వారా నీటి పథకాల సామర్థ్యం మేరకు రోజు నీరు సరఫరా అవుతుందో లేదో పరిశీలిస్తాం. మూడు నెలలపాటు ట్రయల్‌రన్ చేస్తాం. – యూఎస్‌ఎన్ మూర్తి, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
ఎక్కడివి అక్కడే..
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. పైప్లైన్ల ఏర్పాటుకు తీస్తున్న గుంతలను సరిగా పూడ్చకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.. గుంతలకోసం తవ్వే క్రమంలో తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన నెల రోజుల క్రితం తీసిన భగీరథ గుంతలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ పైపు లెన్ల నిర్మాణం కోసం గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న ఇళ్లను సైతం కూల్చారు. గ్రామంలో ఈ పైపులైన్‌ను ఇష్ట రాజ్యంగా వెశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. అవసరం లేకున్నా చాలా చోట్ల ఇల్లు కూల్చినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 9 మీటర్లు దూరంలో పైపు లైన్ నిర్మాణం చేయాలని నిబంధన ఉన్నా కొన్ని చోట్ల 11 మీటర్లు దూరంలో వేశారు . దీంతో చాలా చోట్ల ఇల్లు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. అన్నపురెడ్డిపల్లి నుండి మాదారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పైపులు, మట్టి కుప్పలు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భగీరథ పైపు లైన్లు నిర్మాణానికి సూమరు 6 అడుగుల లోతుతో గుంతలను తీసి ఉంచడంతో చిన్న పిల్లలు, జంతువులు ప్రమాదవ శాత్తు పడిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరలో గ్రామంలో జరిగే శివరాత్రి పండగ నాటికి గుంతలను పూడ్చకపోతే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆలయ సిబ్బంది అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వేడుకుంటున్నారు. త్వరగా పూడ్చాలి పైపులైన్ కోసం తీసిన గుంతలను త్వరగా పూడ్చాలి. ఈ గుంతల్లో చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. శివాలయంలో త్వరలో జాతర జరగనుంది. జాతరకు వేలలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలి. – యాదాల జమలయ్య పరిహారం ఇవ్వాలి భగీరథ పైపులైన్ నిర్మాణాల్లో పాడైపోతున్న ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. నెల క్రితం గ్రామంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చాం. అయినా స్పందన కనిపించడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. – నరసింహారావు -
'ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ భగీరథపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతుందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికలలోపే నీళ్లిచ్చి ఎన్నికలు వెళ్తామన్న హామీ మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మిషన్ భగీరథ కోసం డిక్రింగ్ వాటర్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని కోసం రిక్రూట్మెంట్ కూడా చేశామని తెలిపారు. ఇంట్రా విలేజ్ పైపులైన్స్‌ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యలయాలు, పాఠశాలలకు మంచినీటిని అందిస్తామని చెప్పారు. క్లోరైడ్‌తో అతలాకుతలమైన ప్రాంతాలకు తప్పకుండా మంచినీటిని అందించి సమస్యను తీరుస్తామని స్పష్టం చేశారు. అవసరమున్న చోట కొత్త పైపులైన్లు వేస్తామని మంత్రి హామీనిచ్చారు. -
రెండు దశల్లో మిషన్ భగీరథ
-
రెండు దశల్లో మిషన్ భగీరథ
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులను రెండు దశలుగా విభజించి తొలి దశను వచ్చే డిసెంబర్ చివరిలోగా.. రెండో దశను తర్వాత మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా నీటి సరఫరా ప్రారంభించిన తర్వాత కొద్దినెలల పాటు పైపులైన్లు లీక్ కావడం, నీటి ఒత్తిడి తట్టుకోలేక పగలడం, వాల్వుల వద్ద సమస్యలు తలెత్తడం వంటి సహజమైన బాలారిష్టాలు ఎదురవుతాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోవాలని సూచించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని, ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయనుండడం అందరికీ గర్వకారణమని చెప్పారు. నీతి ఆయోగ్‌తో పాటు అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకున్నాయని, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి అధ్యయనం చేశాయని తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి తొలుత తాగునీరు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీటిలో అక్టోబర్ చివరి నాటికే పైప్‌లైన్ పూర్తి చేసి.. అంతర్గత పనులను కూడా చేపట్టాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని గిరిజన తండాలు, దళితవాడలు, గోండు గూడేలన్నింటికీ మంచినీరు అందించాలని స్పష్టం చేశారు. ‘పాలేరు’కు ప్రత్యేక బృందం పాలేరు నియోజకవర్గం పరిధిలోని పాత వరంగల్ జిల్లా మండలాల్లో భగీరథ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని íసీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు ద్వారా పాత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో ఓ ప్రత్యేక బృందం పాలేరు సెగ్మెంట్‌ను సందర్శించి పనులను సమీక్షించాలని సూచించారు. పరిశ్రమలకు కూడా తాగునీరు.. మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు కూడా శుద్ధి చేసిన నీటిని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీరు అవసరమున్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు అహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథకు కేటాయించిన దాదాపు 80 టీఎంసీల నీటిలో పది శాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందన్నారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం 10 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నందున.. అక్కడి నుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు అభినందన భగీరథ పనుల్లో విద్యుత్ శాఖ లక్ష్యానికి రెండు నెలల ముందే పనులు పూర్తి చేస్తోందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దీనిపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 2 నాటికే పనులన్నీ పూర్తవుతాయని.. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తిచేసినట్లు సీఎంకు ప్రభాకర్‌రావు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలొస్తాయి.. భయపడొద్దు నీటి ప్రవాహ ఒత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు లీకేజీ కావడం, వాల్వుల వద్ద లీకేజీల వంటి సమస్యలు తలెత్తుతాయని.. దాంతో భయపడిపోవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పథకం ప్రారంభమైన గజ్వేల్‌లో కూడా రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎం గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తోందని అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్‌బీఆర్‌లు, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మోటార్ పనుల పురోగతిని సమీక్షించారు. మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు అందిస్తున్నామని.. అక్టోబర్ చివరి నాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్ చివరి నాటికి ఇంకో 6,006 గ్రామాలకు, డిసెంబర్ చివరి నాటికి మిగతా 9,345 గ్రామాలకు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పైపులైన్ల నిర్మాణంతో పాటు మోటార్లు బిగించే పనులు కూడా వేగంగా చేస్తున్నట్లు వివరించారు. -
భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు
► గుప్త నిధులుగా ప్రచారం రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో మిషన్ భగీరథ పైపులైను తవ్వకాల్లో గుప్త నిధులు బయట పడ్డాయన్న ప్రచారం మండలంలో దాహనంలా వ్యాపించింది. వాటిని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. పైపులైన్ తవ్వకాలు జరుగుతుండగా మంగళవారం గ్రామంలోని బస్టాండ్ çవద్ద పురాతన కాలం నాటి రాగి కూజ, చెంబు, పాత్రలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలియడంతో రఘునాథపల్లి ఎస్సై రంజిత్‌రావు వచ్చి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిలో గుప్త నిధులు లభ్యమయ్యాయా.? బయటపడిన సమయంలో వాటిని ఎవరైనా తీసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇదే ప్రాంతంలో గతంలో గుప్త నిధులు లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయమై తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని వివరణ కోరగా తమకు ఆలస్యంగా సమాచారం అందిందని తమ వీఆర్వో శ్రీహరిని స్వాధీనం చేసుకోమని పంపగా అప్పటికే ఎస్సై తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. పాత కాలం నాటి రాగి చెంబు, పాత్రలు మాత్రమే ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వాటిని బుధవారం పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు. -
మిషన్ భగీరథపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిని కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథకు అవసరమైన విద్యుత్ పనులను సమాంతరంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సహకారం అవసరమైన రైల్వే, జాతీయ రహదారుల క్రాసింగ్లను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. -
త్వరలో అగ్ర రాష్ట్రంగా తెలంగాణ
ఎన్నారైలతో సీఎం కేసీఆర్ - రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది - పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ - ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని వెల్లడి - పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎన్నారైలు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశంలో అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం తిరుగులేని అభివృద్ధిని నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆది వారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులు, ఎన్నారైలతో కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కొత్తగా తలపెట్టే కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందని వివరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రత్యేకతలను విశదీకరించారు. భగీరథ పైపులతో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్లను వేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పల్లె డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకుంటుందని కేసీఆర్ తెలిపారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని.. నగరానికి ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ఇక్కడి మానవ వనరులు, భాష, సంస్కృతి, సాంప్రదాయాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని.. తాగునీరు, సాగునీటి రంగాల్లో మరింత పురోగతి సాధిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ ప్రాంతాలకతీతంగా స్వాగతిస్తామన్నారు. పెట్టుబడులకు సిద్ధమన్న ఎన్నారైలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఎన్నారైలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక్కడ టెక్నా లజీ రంగం అభివృద్ధికి సహకరించే దిశగా పెట్టుబ డులు పెడతామని వారు పేర్కొన్నారు. టీ బ్రిడ్జి పేరిట ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికలోని వాషింగ్టన్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నా రని.. అదే పద్ధతిలో వాషింగ్టన్ డీసీ ఈస్ట్‌కోస్ట్ ప్రాం తం నుంచి తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీంతో త్వరలో మరోసారి సమావే శమై దీనిపై నిర్దిష్ట కార్యచరణ సిద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎన్నారైలు రవి పల్లా, రామ్ మట్టపల్లి, జై చల్లా, నర్సింహా కొప్పుల, వేణు కడారి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథకు రూ.4,287 కోట్ల రుణం
టీడీడబ్ల్యూఎస్‌సీకి ప్రభుత్వ అనుమతి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ (టీడీడబ్ల్యూఎస్‌సీ) రూ.4,287 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రుణంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టు పనులకు గాను రూ.2,428 కోట్లను కెనరా బ్యాంకు అందజేయనుంది. అలాగే ఆసిఫాబాద్ సెగ్మెంట్ కోసం ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.635 కోట్లు, ఎస్సార్ఎస్పీ-అదిలాబాద్ సెగ్మెంట్ కోసం రూ.1,224 కోట్లను కార్పొరేషన్ బ్యాంకు నుంచి తీసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనల మేరకు ఆయా బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని టీడీడబ్ల్యూ ఎస్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌ను సర్కారు ఆదేశించింది. -
‘భగీరథ’కు మరో రూ.1,350 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు మరో రూ.1,350 కోట్ల రుణమిచ్చేందుకు యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్‌తో సమావేశమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ బజాజ్.. వివిధ జిల్లాల్లో జరుగుతున్న భగీరథ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై చర్చించారు. మిషన్ భగీరథకు సాయమందించేందుకు దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామమని స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. నాబార్డ్, హడ్కో వంటి సంస్థలు సహా 13 వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.28,938 కోట్ల పనులకు రుణ ఒప్పందం కుదిరిందన్నారు. -
‘భగీరథ’ బిల్లు చెల్లింపులు ఇక చకచకా!
నిబంధనలను సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఇకపై కొనుగోలు చేసిన పైపులకు వెంటనే 45 శాతం, లైనింగ్ వేశాక 20 శాతం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొనుగోలు చేసిన స్టీల్ పైపులను భూమిలో వేసి లైనింగ్ చేసిన తర్వాతే బిల్లులు చెల్లిస్తుండటం, భూమిలో వేయని పైపులకు చెల్లించక పోవడటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించడంతో తాజాగా నిబంధనలు సవరించింది. అలాగే మరికొన్ని రకాల చెల్లింపుల్లోనూ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించింది. గతంలో రెండో విడత పైపులను కొనుగోలు చేశాకే తొలి విడత భూమిలో వేసిన పైపులకు 50 శాతం చెల్లించాలని నిబంధన ఉండగా, తాజాగా 10 శాతం పైపుల విలువను అట్టిపెట్టుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అలాగే ప్రతి అర కిలోమీటరుకు వేయాల్సిన వాల్వ్‌లను పైపులకు బిగించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉండగా, తాజాగా సరఫరా చేసిన 400 డయామీటర్ల సైజు వాల్వ్‌లకు 50 శాతం, ఆపై సైజు వాల్వ్‌ల విలువలో 65 శాతం చెల్లించాలని ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది. -
‘భగీరథ’కు రూ.6,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.6,750 కోట్ల రుణాన్ని అందజేసేందుకు ఆంధ్రా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బ్యాంకుల కన్సార్షియం అంగీకరించింది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయితే ఈనెల 29న రుణ మొత్తాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కన్సార్షియంలోని బ్యాంకుల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కన్సార్షియం ప్రతినిధులతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ డెరైక్టర్లు సమావేశమయ్యారు. కార్పొరేషన్ ఎండీగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి బ్యాంకులు ఆర్థికంగా సహకరిస్తుండడం ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగిస్తోందని అన్నారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు కన్సార్షియం అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. ఆంధ్రాబ్యాంక్ ఎండీ సురేశ్ మాట్లాడుతూ కన్సార్షియం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు అన్ని బ్యాంకుల మేనేజింగ్ కమిటీల నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. -
నల్లాతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్
పైప్లైన్లు, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుపై స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌తో ఇంటింటికీ నల్లాతో పాటు ఇంటర్నెట్ కనె క్షన్ కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అందుబాట్లోకి రానుందని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ అన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటుగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేసే పనులపై శనివారం అన్ని జిల్లాల ఎస్ఈలతో స్పెషల్ సీఎస్ సమీక్షించారు. తొలిదశలో మంచి నీరందించే 9 నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ వదలకుండా నల్లా, ఇంటర్నెట్ కనెక్షన్లను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌తో పాటుగా కేబుల్స్ వేసే విషయమై ఐటీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించడంలో ఐటీశాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్లకు ఐటీశాఖ నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ సమావే శంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్‌కుమార్, జగన్మోహన్రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, ఐటీ శాఖ డెరైక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాల్లో ‘భగీరథ’కు గ్రీన్ సిగ్నల్
పీపీపీ విధానంలో 35 పురపాలికల్లో పనులు సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ మినహాయిస్తే.. రాష్ట్రంలోని 35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో మిషన్ భగీరథ పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. సీఎం కేసీఆర్‌తో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత ప్రతిపాదనపై సంతకం పెట్టడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. రాష్ట్రంలోని మొత్తం 68 నగరాలు, పట్టణాలకుగాను జీహెచ్ఎంసీ, నగర శివారు ప్రాంతాల్లో జలమం డలి ఆధ్వర్యంలో... సిద్దిపేట మునిసిపాలిటీ సహా కొత్తగా ఏర్పడిన 32 నగర పంచాయతీల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కింద పనులు జరుగుతున్నాయి. మిగిలిన 35 నగరాలు, పట్టణాల్లో పనులను మాత్రమే పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టబోతోంది. పీపీపీలో పనులు... 35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ పనులు చేపట్టనుండగా.. అందులో రూ.636 కోట్లు కేంద్రం నుంచి రానున్నా యి. ‘అమృత్’ పథకం కింద ఎంపికైన 10 పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మా ణం కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. మిగిలిన రూ.1,660.38 కోట్ల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుంది. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకునే సంస్థే తొలుత పెట్టుబడి పెట్టి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలి. ఆతర్వాత 6 ఏళ్లలో ప్రభుత్వం ఆరు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్నీ సదరు సంస్థకు చెల్లిస్తుంది. మూడు ప్యాకేజీలుగా పనులు పట్టణ మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ప్యాకేజీ-1 కింద కరీంగనర్ జిల్లాలోని కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి మునిసిపాలిటీలతోపాటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాల్వంచ, ఇల్లెందు మునిసిపాలిటీల్లో రూ.701.52 కోట్లతో పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్యాకేజీ-2 కింద ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, మం చిర్యాల మునిసిపాలిటీలు, వరంగల్ జిల్లాలోని వరంగల్ కార్పొరేషన్, జనగాం మునిసిపాలిటీల్లో రూ.874.3 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-3 కింద తాండూరు, వికారాబాద్,నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, సదాశివపేట,సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్ మునిసిపాలిటీల్లో రూ.720.56 కోట్లతో పనులు చేపట్టనున్నారు. -
‘భగీరథ’ తొలిదశ ఆగస్టుకు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు మొదటి దశ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. తొమ్మిది నియోజకవర్గాల్లో ఏప్రిల్ 30లోగా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించాలని తొలుత సర్కారు భావించినా వీలు కాలేదు. ఆ తర్వాత వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా.. ఆచరణలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆగస్టు 31 నాటికైనా మొదటిదశ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం తాజాగా డెడ్‌లైన్ విధించినట్లు తెలిసింది. ఒకట్రెండు నియోజక వర్గాల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహిం చినా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆశించిన మేరకు నీటి లభ్యత లేకపోవడంతో ఇప్పటికిప్పుడు మొదటిదశను ప్రారంభించాలనే ప్రతి పాదనను ప్రభుత్వం విరమించుకుంది. మరోవైపు యంత్రాంగమంతా సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌పైనే దృష్టి సారించడంతో మిగతా నియోజకవర్గాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌కు సరఫరా చేసే నీటిని మధ్య లో ట్యాపింగ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తే నగరంలో మంచినీటి సమస్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మొదటి దశను ప్రారంభించడంపై సర్కారు వెనుకడు గు వేసినట్లు సమాచారం. సకాలంలో వర్షా లు కురిస్తే హైదరాబాద్‌లో తాగునీటి ఇబ్బం దులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిదశలో ఈ నియోజకవర్గాలకు.. మిషన్ భగీరథ తొలిదశ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పైప్లైన్ల నుంచి మూడు పాయింట్ల వద్ద నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. కొండపాక ట్యాపింగ్ పాయింట్ నుంచి వరంగల్ జిల్లా జనగాం, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు... ప్రజ్ఞాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాలకు... ఘన్పూర్ పాయింట్ నుంచి భువనగిరి, ఆలేరు, మేడ్చల్ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించారు. కూలీలు దొరక్క పనుల్లో జాప్యం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. -
గజ్వేల్, దుబ్బాకలకు ‘భగీరథ’
తొలి దశలో 484 గ్రామాలకు నీరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం తలకెత్తుకున్న ‘భగీరథ’ ప్రయత్నం ఫలిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లాలోని గజ్వేల్ సెగ్మెంట్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్కారు సిద్ధమవుతోంది. కోమటిబండ రిజర్వాయర్ నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు అధికారులు ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టారు. దీన్ని అధికారికంగా ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలి దశలో 9 నియోజకవర్గాలకు ఏప్రిల్ నెలాఖరుకల్లా మంచి నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రస్తుతానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని 484 గ్రామాలకు ఇంటింటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పైప్‌లైన్ పనులను జూన్ నెలాఖరుకు పూర్తిచేస్తామంటున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి జెట్స్పీడ్తో పనులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ప్రధాన పైప్లైన్ల నుంచి మూడు పాయింట్ల వద్ద భగీరథ ప్రాజెక్టు తొలి దశకు నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. కొండపాక ట్యాపింగ్ పాయింట్ నుంచి వరంగల్ జిల్లా జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాములపర్తి నియోజకవర్గాలకు, ప్రజ్ఞాపూర్ ట్యా పింగ్ పాయింట్ నుంచి గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట్ నియోజకవర్గాలకు, ఘన్పూర్ పాయింట్ నుంచి భువనగిరి, ఆలేరు, మే డ్చల్ నియోజకవర్గాలకు నీరందించాలని నిర్ణయించారు. తొలి దశ కింది మంచి నీరందించే నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ కూడా ఉండడంతో ప్రజ్ఞాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి నీరందించే గ్రామాల్లో పనులపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిం చారు. ప్రజ్ఞాపూర్ పాయింట్ నుంచి నీటిని కోమటిబండ బ్యా లెన్సింగ్ రిజర్వాయర్‌కు చేర్చి అక్కడ్నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోకవర్గాల గ్రామాలకు నీరందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. శరవేగంగా ఇంటింటికీ నల్లా... గజ్వేల్ సెగ్మెంట్ నుంచి మూడు నియోజకవర్గాల్లోని 590 గ్రామాలకు మంచినీటిని ఇవ్వా ల్సి ఉండగా ప్రస్తుతానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని 484 గ్రామాల వద్దకు ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. దీని నుంచి నీరు గ్రామాలకు చేరువగా రావడంతో గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనె క్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సు మారు 150 గ్రామాల్లో 11వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ గంటసేపు నల్లా ద్వారా నీటిని(ట్రయల్న్)్ర సరఫరా చేస్తున్నారు. పక్షం రోజుల్లో మిగిలిన గ్రామాల్లోనూ ఇంటిం టికీ నల్లా పనులు పూర్తవుతాయంటున్నారు. -
నెలాఖరుకల్లా మిషన్ భగీరథ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ మంచినీటిని అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలి ఫలాలను ఈ నెలాఖరులోగా అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం మిషన్ భగీరథ, ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులపై ఆర్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు వచ్చే వేసవికల్లా తాగునీరు అందిస్తామని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని... అయినా మరింత వేగంగా పనులను జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ఇంటేక్ వెల్స్‌ను భద్రమైన స్థితికి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలుసుకునేందుకు నీతి ఆయోగ్ బృందం ఈనెల 12న రాష్ట్రానికి రానుందని కేటీఆర్ తెలిపారు. ఆర్నెల్లలో ఇంటింటికీ ఇంటర్నెట్! నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్నెల్లలోగా ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ మొదటి దశలో నీరిచ్చే నియోజకవర్గాల్లో తాత్కాలికంగా ఫైబర్‌గ్రిడ్ పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్ పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథలో భాగంగా త్వరలోనే నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని గ్రామాలకు రెండో దశలో నీటి సరఫరాతో పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. -
మూడేళ్లలో ఇంటింటికీ నీళ్లు
శాసనసభలో మంత్రి కె.తారకరామారావు వెల్లడి మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం అవసరమైతే జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల తలుపుతడతాం హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఇంటింటికీ రక్షిత తాగునీటిని అం దించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 చివరి నాటికి 99 శాతం గ్రామాలకు చేరుస్తామని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో 24,224 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాలు, 2017-18 చివరికల్లా 15,872 గ్రామాలు, 2018-19 నాటికి 22వేల పైచిలుకు గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందిస్తామని, మిగతా గ్రామాలకూ అప్పటికల్లా నీటిని అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మిషన్ భగీరథపై సభ్యులు పుట్ట మధు, గాదరి కిశోర్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అజ్మీరా రేఖ, సున్నం రాజయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు బదులిచ్చారు. మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని, రెండో దశ పనులను కూడా ప్రారంభించామన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గోదావరి పైపులైను ద్వారా నికరమైన నీటి సరఫరాపై ఆధారపడి రూపొందించిన నాలుగు ప్యాకేజీలలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లోని కొంత భాగం, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిల్లోని కొన్ని భాగాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ భాగస్వామ్యం ఉందని, వారి నియోజకవర్గాల్లో ప్రాజెక్టు తీరును వివరించే బుక్లెట్లను ఈ సమావేశాల్లోనే అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు సకాలంలో జరిగేలా చూడాలని సూచించారు. పథకాన్ని కేంద్రం మెచ్చుకున్నా.. నిధుల సమీకరణ, తదుపరి నిర్వహణ ఖర్చుల ప్రణాళికపై బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నలకు కేటీఆర్ విపులంగా జవాబిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రాజెక్టును సమీక్షించారని, పథకాన్ని పలువురు కేంద్ర మంత్రులు అభినందించటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఈ పథకానికి రూ. 36,976.54 కోట్లు అవసరమని, అది రూ. 40 వేల కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే నాబార్డు, హడ్కోల నుంచి రూ. 20 వేల కోట్ల రుణం కోసం కమిట్మెంట్ వచ్చిందని కేటీఆర్ సభకు చెప్పారు. ఈ నిధులతో 70 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోనూ రుణ చర్చలు సాగుతున్నాయన్నారు. జైకా లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. పన్నులతోనే ప్రాజెక్టు నిర్వహణ మంచినీటి కోసం గ్రామ పంచాయతీలు పన్నులు చెల్లిస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ఈ పన్నులను పక్కాగా వసూలు చేసి ఆ మొత్తంతోనే నీటి సరఫరా ఖర్చును భరిస్తామన్నారు. మెరుగైన సేవలందిస్తే పన్నులు పక్కాగా చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తారని, గుజరాత్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కమిటీలు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ నీటి సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. పథకాన్ని నిర్వహించేందుకు గ్రామ పంచాయతీల్లో రూ. 875 కోట్లు, పట్టణాల్లో రూ. 900 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. -
ప్రతిఇంటికి సురక్షిత మంచినీరు
పుల్కల్/పెద్దశంకరంపేట: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. 2017 మార్చిలోగా 275 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుగు సాగుతున్నామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట శివారులో జరుగుత్ను భగీరథ పనుల పరిశీలన, పెద్దశంకరంపేట మండలం జంబికుంట నుంచి నిజామాబాద్ జిల్లాకు నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.75 లక్షల కిలోమీటర్ల మే పైప్లైన్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 26 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రూ.1,350 కోట్లతో సింగూరు- జూకల్, రూ.1400 కోట్లతో శ్రీరాంసాగర్- కామారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. సింగూర్-జూకల్ ప్రాజెక్టును నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జూకల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతానికి ఈ పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు రెండు ప్యాకేజీల ద్వారా రూ. 1000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు ఉన్నారు.