
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథాకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించడం సంతోషంగా ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో బుధవారం దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్టంలోని ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ నాలుగేళ్ళ క్రింద విషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. దీనికి 46 వేల 123 కోట్లు అంచనాతో చేపట్టినట్లు పేర్కొన్నారు. కానీ ఈ బడ్జెట్ కంటే తక్కువగా బడ్జెట్ ఖర్చు జరిగిందన్నారు. 33 వేల కోట్ల ఇప్పటికే ఖర్చు చేశామని, కేంద్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని మిషన్ భగీరథ పేరు మార్చి జలజీవన శక్తి మిషన్ పేరుతో ఈ పథకం అమలు చేస్తోందన్నారు. చదవండి: ‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం
‘మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వటం లేదు. కేంద్రానికి సీఎం లేఖలు రాశారు.. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథను అమలు చేస్తోంది. 40 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.. గుజరాత్ కంటే మంచి పథకం ఇది. దేశంలో మిగితా రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణలో మిషన్ భగీరథను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణను మార్చలన్న ఉద్దేశ్యంతో పెట్టింది. కేంద్రం బోర్ నీళ్లతో నీళ్లు ఇస్తోంది. ఇక్కడ కృష్ణ గోదావరి నీళ్లని మంచి నీటిని ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో నిధులు ఇస్తూ ఇక్కడ మాత్రం ఇవ్వటం లేదు. చదవండి: త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త
రాష్ట్రంలో 23 వేల 787 అవాసాలకు నీరు అందిస్తున్నాం. రెండేళ్లుగా అడుగుతున్న నిధులు రాలేదు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా కేంద్రం ప్రకటించింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో గొప్పగా తెలంగాణను పొగిడారు. మిగితా రాష్ట్రాలకు ఇచ్చే 2000 కోట్లు ఇక్కడ కూడా మెయింటనెన్స్ కోసమైన ఇవ్వాలని ఆడిగాం. మా ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారు. మా మిషన్ భగీరథను కాపీ కొట్టి పథకం అమలు చేస్తున్నారు.. నిధులు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment