
గజ్వేల్, దుబ్బాకలకు ‘భగీరథ’
తొలి దశలో 484 గ్రామాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం తలకెత్తుకున్న ‘భగీరథ’ ప్రయత్నం ఫలిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లాలోని గజ్వేల్ సెగ్మెంట్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్కారు సిద్ధమవుతోంది. కోమటిబండ రిజర్వాయర్ నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు అధికారులు ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టారు. దీన్ని అధికారికంగా ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలి దశలో 9 నియోజకవర్గాలకు ఏప్రిల్ నెలాఖరుకల్లా మంచి నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రస్తుతానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని 484 గ్రామాలకు ఇంటింటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పైప్‌లైన్ పనులను జూన్ నెలాఖరుకు పూర్తిచేస్తామంటున్నారు.
ప్రజ్ఞాపూర్ నుంచి జెట్‌స్పీడ్‌తో పనులు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ప్రధాన పైప్‌లైన్ల నుంచి మూడు పాయింట్ల వద్ద భగీరథ ప్రాజెక్టు తొలి దశకు నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. కొండపాక ట్యాపింగ్ పాయింట్ నుంచి వరంగల్ జిల్లా జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాములపర్తి నియోజకవర్గాలకు, ప్రజ్ఞాపూర్ ట్యా పింగ్ పాయింట్ నుంచి గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట్ నియోజకవర్గాలకు, ఘన్‌పూర్ పాయింట్ నుంచి భువనగిరి, ఆలేరు, మే డ్చల్ నియోజకవర్గాలకు నీరందించాలని నిర్ణయించారు. తొలి దశ కింది మంచి నీరందించే నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ కూడా ఉండడంతో ప్రజ్ఞాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి నీరందించే గ్రామాల్లో పనులపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిం చారు. ప్రజ్ఞాపూర్ పాయింట్ నుంచి నీటిని కోమటిబండ బ్యా లెన్సింగ్ రిజర్వాయర్‌కు చేర్చి అక్కడ్నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోకవర్గాల గ్రామాలకు నీరందించే పనులు వేగంగా జరుగుతున్నాయి.
శరవేగంగా ఇంటింటికీ నల్లా...
గజ్వేల్ సెగ్మెంట్ నుంచి మూడు నియోజకవర్గాల్లోని 590 గ్రామాలకు మంచినీటిని ఇవ్వా ల్సి ఉండగా ప్రస్తుతానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని 484 గ్రామాల వద్దకు ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. దీని నుంచి నీరు గ్రామాలకు చేరువగా రావడంతో గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనె క్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సు మారు 150 గ్రామాల్లో 11వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ గంటసేపు నల్లా ద్వారా నీటిని(ట్రయల్న్)్ర సరఫరా చేస్తున్నారు. పక్షం రోజుల్లో మిగిలిన గ్రామాల్లోనూ ఇంటిం టికీ నల్లా పనులు పూర్తవుతాయంటున్నారు.