జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బుధవారం ఇక్కడ నిర్వహించిన సంప్రదింపుల సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు ప్రత్యేక సాయంగా ఇచ్చేలా 2020–21 కేంద్ర బడ్జెట్ రూపొందించాలని ఆయన నిర్మలా సీతారామన్‌కు విన్నవించారు.
జీఎస్టీ అమలులో సమస్యలు పరిష్కరించాలి
జీఎస్టీ ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తూ రాష్ట్రాలు కేంద్రంపై నమ్మకం పెట్టుకున్నాయని, జీఎస్టీ అమలులో ఉన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించి కేంద్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని హరీశ్‌రావు కోరారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ పరిహారం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సరీ్వసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) పంపకంలో తలెత్తిన సమస్యలను ఆయన ఆరి్థక మంత్రి దృష్టికి తెచ్చారు. ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావలసిన వాటాను, జీఎస్టీ కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహార పన్నులను నియమాలకు విరుద్ధంగా కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో, పబ్లిక్ అకౌంట్‌లో చేర్చి తన ఖర్చులకు వాడుకుంటోందన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు జరపాలి
ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయం కారణంగా తెలంగాణ లోని 10 జిల్లాలో 9 జిల్లాలు.. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంటు అందుకునే ప్రాంతాల కింద ఉండేవని హరీశ్ తెలిపారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద కేంద్రం సహాయం అందించాల్సి ఉంటుంద న్నారు. ఈ గ్రాంటు కింద తెలంగాణకు ఇవ్వాల్సిన రూ. 450 కోట్లను ఈ నెలలో విడుదల చేయాలని కోరారు.
మిషన్ కాకతీయ, భగీరథలకు..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దాదాపు కోటి ఎకరాల భూమికి నీరందించడం కోసం చేపట్టిన చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు సహాయం అందించాలని హరీశ్ కోరారు. మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు మూడేళ్లలో ప్రత్యేక సాయంగా ఇవ్వాల ని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని 2020–21 బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తగిన నిధులను రానున్న బడ్జెట్‌లో అందించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందే అర్హత కలిగిన కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రానున్న బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని హరీశ్ కోరారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మా గారం నెలకొల్పవలసి ఉందని ఈ దిశలో వేగిర చర్యలు చేపట్టాలని కోరారు.
పన్ను మాఫీ పథకం ప్రకటించాలి
రాష్ట్రాల పెట్టుబడి అవసరాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఆకర్షణీయమైన పన్ను మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని హరీశ్ సూచించారు. ఎగ్గొట్టిన పన్నుపై తక్కువ వడ్డీ పథకాన్ని ప్రకటించి ప్రకటిత సొమ్మును పదేళ్ల పాటు రాష్ట్రాలకు సహాయం అందించే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో ఉంచే పథకం ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి ఊతమివ్వవచ్చని హరీశ్‌రావు సూచించారు. ఆరి్థక వ్యవస్థ మందగమనాన్ని అరికట్టడం కోసం ఆరి్థక వనరుల పరంగా రాష్ట్రాలకు అధికారాన్ని, స్వేచ్ఛను కలి్పంచాలని హరీశ్‌రావు సూచించారు. భారీ ఆరి్థక విధానాలను పక్కనపెడితే ఇతరత్రా ఆరి్థక కార్యకలాపాలు ఎక్కువగా రాష్ట్రాల్లోనే జరుగుతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment