సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథతో రాష్ట్రంలోని భావితరాలకు వెలకట్టలేని ఆరోగ్యనిధిని ప్రభుత్వం అందిస్తోందని ఆ ప్రాజెక్టు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి ప్రతి ఇంటికి తీసుకొస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. మిషన్ భగీరథ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)పాలసీ, మార్గదర్శకాలపై రెండ్రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌లో స్మితా సబర్వాల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి శుద్ధిచేసి న తాగునీరు సరఫరా చేసే కృషి సాగుతోందన్నారు.
మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, స్థిరమైన తాగునీటి సరఫరా అంశాలపై చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 గంటలు తాగునీటిని సరాఫరా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ‘‘అస్కీ’’డైరెక్టర్ శ్రీనివాసాచారి ప్రజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ మేథ(ఏఐ) ఉపయోగించి రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను సమర్థవంతంగా లెక్కగట్టొచ్చని ‘స్కార్ట్ టెర్రా’ ప్రతినిధి గోకుల్ చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి సంబంధిత వ్యాధులపై తాము సర్వే చేసినట్లు యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు.
అమూల్యమైన ఆరోగ్యనిధి ‘భగీరథ’
Published Sat, Feb 2 2019 1:44 AM | Last Updated on Sat, Feb 2 2019 1:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment