Smita Sabarwal
-
స్మితాసబర్వాల్ వివాదం.. భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, దివ్యాంగులకు మధ్య తలెత్తిన వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడారు. స్మితా సబర్వాల్ కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశారన్నారు.సోషల్ మీడియా వేదికగా స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భట్టి తెలిపారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని,ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. -
స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డి సస్పెండ్..
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు పడింది. అతడ్ని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఈ ఆదేశాలను అందించనున్నారు. నిందితులు ఆనంద్, బాబు మేడ్చల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబు రాత్రి వేళ స్మిత సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించి హల్చల్ చేశారు. వీరిని చూసి భయాందోళనకు గురైనట్లు స్మిత సబర్వాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఆనంద్, బాబును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency — Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023 చదవండి: భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా -
స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన నిందితుడిపై అనుమానాలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురు వారం రాత్రి అనుమానాస్పదంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుడు బాబుతో కలిసి రాత్రి 11.34 గంటలకు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్ అక్కడినుంచి ‘ఎట్ యువర్ డోర్ స్టెప్’అంటూ ట్వీట్ చేశాడు. ఆమె నివాసముంటున్న ప్లాట్ యూసుఫ్‌గూడ పోలీసు లైన్స్‌లోని ప్లెజెంట్ వాలీ గేటెడ్ కమ్యూనిటీలో. అంతేకాకుండా 24 గంటలు పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. ఇంత బందోబస్తు ఉన్న ప్లాట్‌లోకి అంత ధీమాతో ఎలా వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడా లేక మానసిక స్థితి కోల్పోయాడా అన్నది తేలాల్సి ఉంది. నిందితుడు పక్కాప్లాన్‌తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. స్నేహితుడిని బయట కారులో ఉంచి ఆనంద్ మాత్రమే లోనికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం విషయం మాట్లాడాలంటే పగలు రావాలిగానీ రాత్రి ఎందుకు వచ్చారు అన్నది అర్థం కావడం లేదు. మరోవైపు నిందితుడు విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్, లా, జర్నలిజం చదివి న్యూఢిల్లీలో వార్త పత్రిక కరస్పాండెంట్‌గా, దక్కన్ క్రానికల్ ఆసియా ఏజ్ పత్రిక జర్నలిస్ట్‌గా, సూర్య పత్రిక న్యూఢిల్లీ జర్నలిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంత కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఈయన ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి ఆ విధంగా వెళ్లడం విడ్డూరంగా ఉంది. ఏదేమైనా నిందితులను కస్టడీలోకి తీసుకుంటేనే పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. చదవండి: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు -
సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు
సాక్షి, పరకాల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యక్తులు ఉన్నా లేకున్నా సరైన సిస్టం (వ్యవస్థ)ఉండాలని అప్పుడే సమస్యలు దూరమవుతాయని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా నిరంతరం సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం సందర్శించి సర్పంచ్ అల్లం బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు, పలు కమిటీల సభ్యులతో ఆమె గ్రామంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మోరీలు శుభ్రంచేశారా.. లైట్లు వెలుగుతున్నాయా.. ఇంకా ఇతర పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పనులు చేపట్టడానికి కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్ బాలిరెడ్డితో పాటు స్థానికుల కృషితో గ్రామం చాలా నీట్‌గా పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. పండుగ వాతావరణం నెలకొందని, రాత్రి పూట సమావేశం ఏర్పాటు చేస్తే చీకటిలో కూర్చున్నా ఒక్క దోమ కూడా ఎవరినీ కుట్టకపోవడం విశేషం అని అభినందించారు. దీంతో గ్రామం ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గ్రామానికి తీసుకుని వస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని, ఎలాగైనా వచ్చేలా చూడాలని సర్పంచ్ బాలిరెడ్డి కోరగా గ్రామం సాధించిన ప్రగతి గురించి సీఎంకు వివరిస్తానని ఆమె తెలిపారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, బడ్జెట్ గురించి సర్పంచ్ బాలిరెడ్డితో పాటు కమిటీల సభ్యులు తిరుమల్‌రెడ్డి దిలీప్‌రెడ్డి, ఆడెపు రాంనాధం, అల్లం చిన్నపురెడ్డి, బిట్ల నాగరాజు, పులిశేరి మంజుల, అద్దాల లలిత, శేషు ఆమెకు తెలిపారు. సర్పంచ్ కృషి, పట్టుదల, అంకితభావంతోనే గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని గ్రామస్తులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ముండ్రాతి హరిత, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అనితా రాంచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్‌చౌహాన్, డీపీఓ నారాయణరావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీఎల్పీవో స్వరూప, ఎంపీపీ బీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ శేషాంజన్‌స్వామి, ఏపీఓ మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పలు కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంతరం ఇదేస్పూర్తిని కొనసాగించాలి ధర్మసాగర్: 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం పనుల ద్వారా గ్రామంలో మార్పు కనిపిస్తుందని నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని స్మితా సబర్వాల్ అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఉపసర్పంచ్ బొడ్డు అరుణ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వారు తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలను గ్రామస్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు సహకరిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పీసీఈఓ ప్రసూనరాణి, ఎంపీడీఓ జి.జవహర్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత, ఎంపీటీసీ సభ్యులు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాగులోకి గిరిజనుల భూమి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడానికి చిన్ననీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో ఎస్టీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరుల ఉపయోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా నీరందే భూములకు కాకుండా, మిగిలిన భూములకు చిన్ననీటి వనరులైన చెరువులు, వాగుల ద్వారా నీరందించాలని సూచించారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా కొండలు గుట్టల్లో ఉంటాయని.. అందుకోసం పైపుల ద్వారా సాగునీరందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పోడు భూముల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని.. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎంత సాగుభూమి ఉందనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎస్టీ రైతులు మంచి పంటలు పండించుకునే విధంగా సాగునీటి ప్రణాళిక ఉండాలన్నారు. రాష్ట్రంలో 46,500 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టులున్నాయి. 16,771 చెరువులు విడిగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90% చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ చెరువులకు ఈ వర్షాకాలం నుంచే ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలి. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, పడువాటు నీళ్లు చెరువులకు చేరే విధంగా ఫీడర్ ఛానళ్లు, అలుగు కాలువలు ఈ ఎండాకాలంలోనే పూర్థిస్థాయిలో సిద్ధం చేయాలి’అని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ దృష్టి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కూడా అధికంగానే ఉంది. వాగులు, వంకలు చాలా ఉన్నాయి. వీటిపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు నీరందించవచ్చో గుర్తించాలి. మిగతా ప్రాంతాలకు చిన్ననీటి వనరుల ద్వారానే నీరివ్వాలి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకు చిన్ననీటి వనరుల వినియోగం ద్వారా గరిష్ట భూ–వినియోగం అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బూర్గంపాడు సమీపంలో జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు 1500 హెచ్‌పీ మోటార్లను ఉపయోగించి ఆ ప్రాంతానికి నీరివ్వాలని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును కోరారు. ఆదిలాబాద్‌లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్వరూపం, వాటివల్ల సాగయ్యే భూమి వంటి అంశాలను అధ్యయనం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో వట్టివాగు, లాతూరు గండిలను వినియోగించుకొనే మార్గాలను చూడాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అమూల్యమైన ఆరోగ్యనిధి ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథతో రాష్ట్రంలోని భావితరాలకు వెలకట్టలేని ఆరోగ్యనిధిని ప్రభుత్వం అందిస్తోందని ఆ ప్రాజెక్టు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి ప్రతి ఇంటికి తీసుకొస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. మిషన్ భగీరథ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)పాలసీ, మార్గదర్శకాలపై రెండ్రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌లో స్మితా సబర్వాల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి శుద్ధిచేసి న తాగునీరు సరఫరా చేసే కృషి సాగుతోందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, స్థిరమైన తాగునీటి సరఫరా అంశాలపై చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 గంటలు తాగునీటిని సరాఫరా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ‘‘అస్కీ’’డైరెక్టర్ శ్రీనివాసాచారి ప్రజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ మేథ(ఏఐ) ఉపయోగించి రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను సమర్థవంతంగా లెక్కగట్టొచ్చని ‘స్కార్ట్ టెర్రా’ ప్రతినిధి గోకుల్ చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి సంబంధిత వ్యాధులపై తాము సర్వే చేసినట్లు యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. -
‘ప్రతి ఇంటికి జూలై చివరకు నీరు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి జూలై ఆఖరు నాటికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి పారుదల (మిషన్ భగీరథ) కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. సోమ వారం అన్ని జిల్లాల మిషన్ భగీరథ ఎస్ఈలతో ఆమె సమీక్ష నిర్వహించారు. నల్లగొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో నీరు సరఫరా జరగని గ్రామాలకు 25న ట్రయల్‌రన్ నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 28న ట్రయల్‌రన్ ప్రారంభించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. -
త్వరలో టీవెబ్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వెబ్సైట్లలో సమా చారాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తున్నట్లు సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించి 265 వెబ్సైట్లు ఉన్నాయన్నారు. వీటిని మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు సోషల్ మీడియాతో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ఐటీ శాఖ ద్వారా ‘టీవెబ్’ను ఆవిష్కరిస్తామన్నారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. టీవెబ్ రూపకల్పనపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతీ శాఖ వెబ్‌సైట్‌ను సమీక్షించడంతో పాటు రేటింగ్, ఆడిట్ అవార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆయా శాఖలకు సంబంధించి రియల్ టైమ్ డేటాని డాష్‌బోర్డు ద్వారా తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అప్డేషన్ ప్రక్రియ పూర్తిచేసినందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేవాదాయ, వక్ఫ్, పట్టణ భూముల వివరాలను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ ద్వారా భూముల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతు బంధు పథకానికి సంబంధించి చెక్కుల ముద్రణ వివరాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు తెలిపారు. డాష్‌బోర్డు రూపకల్పనకు తీసుకున్న చర్యలపై జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా అధికారులకు వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి అవసరమైన అంశాలపై ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజయ్‌మిశ్రా, ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి, శాలినీ మిశ్రా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
పదవులకే కొత్త కళ తీసుకొచ్చిన స్మితా !
-
సీఎం పేషీలోకి స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలో ఐఏఎస్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు తొలి పోస్టింగ్ లభించింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులవుతున్నా.. ఇప్పటి వరకు పేషీలో ఎవరూ లేరు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్రావును నియమించాలని నిర్ణయించినా.. ఆయన కేంద్ర సర్వీసుల నుంచి ఇంకా రాలేదు. అలాగే మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి, హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న గోపాలరెడ్డి కూడా ఇంకా రిలీవ్ కాలేదు. నాలుగు రోజులుగా కేసీఆర్ తన కార్యాలయానికి రోజూ వస్తున్నా.. ఆయనకు అవసరమైన సమాచారాన్ని బ్రీఫింగ్ చేసే యంత్రాంగం ఏదీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు మెదక్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. సీసీఎల్ఏగా రాజీవ్‌శర్మ: తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.