
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, దివ్యాంగులకు మధ్య తలెత్తిన వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడారు. స్మితా సబర్వాల్ కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశారన్నారు.
సోషల్ మీడియా వేదికగా స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భట్టి తెలిపారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని,ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.