సాక్షి,ఖమ్మం: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఖమ్మంలో ఆదివారం(అక్టోబర్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ‘మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలను మహిళల కోసమే ప్రారంభించింది. మహిళల కోసం రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆర్థికంగా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు దీపావళి శుభాకాంక్షలు’అని భట్టి తెలిపారు.
ఇదీ చదవండి: రేవంత్ పాపం.. ఆయనకు శాపం: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment