UNICEF Representative
-
ఆశ్రమ పాఠశాలలో యూనిసెఫ్ బృందం
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని వాంకిడి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, బంబార ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శుక్రవారం యూనిసెఫ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ, ప్రథం, వేదిక్ మ్యాథ్స్, వందేమాతరం, దిశ మోడల్ స్కూల్ నిర్వహణ విషయాలు పరిశీలించారు. అనంతరం తరగతి వారీగా విద్యార్థులకు బోధన అంశాలపై, మధ్యాహ్న భోజన నిర్వహణ, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. యూనిసెఫ్ ఎడ్యుకేషనల్ చీఫ్ రాంచంద్రరావు బెగూర్ మాట్లాడుతూ గత నవంబర్‌మాసం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పటి నుంచి కార్యక్రమాల తీరుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై వివరాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పనితీరు బట్టి ఆయా పాఠశాలల్లో కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించడమే యూనిసెఫ్ ముఖ్యఉద్దేశమన్నారు. వారి వెంట యూనిసెఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ స్పెషలిస్టు సుకన్య, ఐటీడీఏ పీవో కష్ణ ఆదిత్య, డీటీడీవో దిలీప్‌కుమార్, ఏటీడీవో కనకదుర్గ, హెచ్ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ఆసిఫాబాద్‌రూరల్: దిశ మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిష్ట్ర ఆదిత్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టివాగు కాలనీలో పైలెట్ ప్రాజెక్టు కింద నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మోడల్ స్కూల్‌ను సెంట్రల్ స్టేట్ యూనిసెఫ్ ప్రతినిధి రామ చంద్రన్, డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంగ్లిష్ మీడియం బోధన సౌకర్యాలు, హాజరు శాతం, మెనూ ప్రకారం భోజనం వంటి విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సామర్థాలు, నైపుణ్యాలు ప్రదర్శించడంతో అభినంధించారు. దీంతోపాటు గ్రామస్తులు పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కమ్యూనిటీ భవనం నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, సీఆర్పీ రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
అమూల్యమైన ఆరోగ్యనిధి ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథతో రాష్ట్రంలోని భావితరాలకు వెలకట్టలేని ఆరోగ్యనిధిని ప్రభుత్వం అందిస్తోందని ఆ ప్రాజెక్టు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి ప్రతి ఇంటికి తీసుకొస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. మిషన్ భగీరథ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)పాలసీ, మార్గదర్శకాలపై రెండ్రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌లో స్మితా సబర్వాల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి శుద్ధిచేసి న తాగునీరు సరఫరా చేసే కృషి సాగుతోందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, స్థిరమైన తాగునీటి సరఫరా అంశాలపై చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 గంటలు తాగునీటిని సరాఫరా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ‘‘అస్కీ’’డైరెక్టర్ శ్రీనివాసాచారి ప్రజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ మేథ(ఏఐ) ఉపయోగించి రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను సమర్థవంతంగా లెక్కగట్టొచ్చని ‘స్కార్ట్ టెర్రా’ ప్రతినిధి గోకుల్ చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి సంబంధిత వ్యాధులపై తాము సర్వే చేసినట్లు యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. -
‘స్వచ్ఛ’ కాసులపల్లి...
► ఇంటింటికో ఇంకుడుగుంత ► గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం పెద్దపల్లిరూరల్ : సంపూర్ణ పారిశుధ్య లక్ష్యాల సాధనలో ముందున్న పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలం కాసులపల్లి, సుల్తానాబాద్ మండలం సుద్దాలలో బుధవారం కేంద్ర అధికారుల బృందం పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. కేంద్ర ఆర్థిక సలహాదారు తన్నీరుకుమార్, యునిసెఫ్ ప్రతినిధి సుధాకర్‌రెడ్డి బృందం ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం, హరితహారం తదితర పథకాల అమలుతీరుపై ఆరా తీసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సొంత గ్రామమైన కాసులపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు స్నానపుగదిని నిర్మించుకోవడాన్ని చూసిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. సర్పంచ్ ఇనుగాల తిరుపతిరెడ్డి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి ఆవరణలో కూరగాయల చెట్లు, రోడ్ల కిరువైపులా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటి సంరక్షించడాన్ని అభినందించారు. ప్రతీఇంటి ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించుకోవడంతో మురుగునీటి కాలువల్లోకి నీరు ఎక్కువగా రాక గ్రామంలో దోమల వృద్ధి ఉండదని గ్రామస్తులు వివరించారు. తమ గ్రామంలో నూరుశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించుకున్నామని పేర్కొన్నారు. తమ గ్రామంలో వర్మికంపోస్టు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సహకారమందించాలని సర్పంచ్ తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ చంద్రారెడ్డి కోరారు. అంతర్గత రహదారులు దాదాపుగా అభివృద్ధికి నోచాయని, మిగిలిన కొన్ని రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించుకునేందుకు ఇతర అభివృద్ధి పనులకోసం నిధులను ఇప్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత సుల్తానాబాద్ రూరల్: మండలంలోని సుద్దాల గ్రామాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. గ్రామంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య పనుల గురించి పరిశీలించింది. గ్రామస్తులతో సభ్యులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛభారత్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ సమీర్‌కుమార్ మాట్లాడుతూ అందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. రాష్ట్ర యుని సెఫ్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీఎంలు రమేశ్, లింగస్వామి, రాఘవులు, ఎంపీడీవో వినోద్, తహసీల్దార్ రజిత, సర్పంచ్ అంజలి, గ్రామస్తు లు పాల్గొన్నారు.