పైప్‌లైన్లు, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుపై స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌తో ఇంటింటికీ నల్లాతో పాటు ఇంటర్నెట్ కనె క్షన్ కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అందుబాట్లోకి రానుందని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ అన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్లతో పాటుగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేసే పనులపై శనివారం అన్ని జిల్లాల ఎస్‌ఈలతో స్పెషల్ సీఎస్ సమీక్షించారు. తొలిదశలో మంచి నీరందించే 9 నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ వదలకుండా నల్లా, ఇంటర్నెట్ కనెక్షన్లను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పైప్‌లైన్‌తో పాటుగా కేబుల్స్ వేసే విషయమై ఐటీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించడంలో ఐటీశాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్లకు ఐటీశాఖ నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ సమావే శంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్‌కుమార్, జగన్మోహన్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, ఐటీ శాఖ డెరైక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లాతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్
Published Sun, Jul 17 2016 3:06 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM
Advertisement
Advertisement