
పైపులైన్ లీకేజీతో కట్టలు తెంచుకుని పైకి ఎగజిమ్ముతున్న నీరు
సాక్షి, హుస్నాబాద్: మిషన్ భగీరథ ట్రయల్ రన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణం నడిబొడ్డున శుక్రవారం భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంత వరదమయమైంది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది. ఒక్కసారిగా నీరు పైకి ఎగజిమ్మడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత సన్నగా మొదలైన నీటి ధార చూస్తుండగానే ఉధృతమైన వరదలా మారింది. ట్యాంకర్ల కొలది నీరు రోడ్ల వెంట పరుగులు పెట్టింది. అధికారులకు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఓ యువకుడు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.