pipeline leackage
-
పనులెందుకు జరుగుతలేవ్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ ధర్మారం: కింది స్థాయిలో కొత్తగా చేరిన ఇంజనీర్‌కు బడితె పూజ చేస్తే తప్ప అప్పగించిన పనులు పూర్తి కావనుకున్నాడో ఏమో ఆ అధికారి. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చండశాసనుడైన అధికారి ఎవరినీ ఉపేక్షించడు అనే సందేశాన్ని ఇతర అధికారులకు కూడా పంపించాలనుకున్నాడు ఆ సారు. ఇంకేముంది కర్రతో వాతలు పెట్టే పని మొదలుపెట్టి.. ఆ ఘన కార్యాన్ని వీడియో సైతం తీయించారు! అది కాస్తా వైరల్ అవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత శాఖ సిబ్బంది కథనం ప్రకారం.. మండలంలోని మేడారం, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈఈ తిరుపతిరావు నందిమేడారం గ్రామంలో కొనసాగుతున్న పనుల పరిశీలనకు వెళ్లారు. నందిమేడారంలోని ఆలయం వద్ద పైప్‌లైన్‌కు, ట్యాంకు మధ్య ఇంటిగోడ ఉండటంతో పైప్‌లైన్ లింకేజీ పని పూర్తి కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఈ.. కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆయన సమక్షంలోనే పైప్‌లైన్ లింక్ ఎందుకు పూర్తి చేయలేదని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను కర్ర తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న మహిళా వర్క్ ఇన్స్పెక్టర్ని పిలిచి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ చేయాలని అన్నారు. ఆమె వీడియోలో చిత్రీకరిస్తుండగా, ఎందుకు పనులు చేయించడం లేదని కర్రతో తొడలు, మోకాళ్లపై కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఏఈ విలాస్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడే ఉన్న డీఈఈ రాజ్కుమార్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తున్నా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సమాధానాలు చెబుతున్నా వినిపించుకోకుండా చేతిలో కర్రను ఊపుతూ ఈఈ చేస్తున్న హంగామాను డీఈ సైతం ఆశ్చర్యంగా చూడటం గమనార్హం. అక్కడ నుంచి ధర్మారంలోని మసీద్ వద్దకు వచ్చి పైప్‌లైన్ లింక్ ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా.. లింక్ చేసే అనుభవమున్న మెకానిక్‌లు దొరకటం లేదని సమాధానం చెప్పినప్పటికీ వినకుండా తిట్ల వర్షం కురిపించినట్లు సమాచారం. ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి కిందిస్థాయి అధికారిని కారులోనే తీసుకువెళ్లి అక్కడ కూడా పనుల జాప్యంపై ఆగ్రహించారు. కాగా ఆయా గ్రామాల్లోని కాంట్రాక్టర్లకు ఎన్ని సార్లు చెప్పినప్పటికి స్థానికంగా నెలకొన్న వివిధ సమస్యలతో పనులు ముందుకు సాగటం లేదని ఏఈ చెప్పినా వినిపించుకోకుండా మందలించినట్లు సమాచారం. అక్కడి నుంచి తిరిగి వారిని పెద్దపల్లికి తీసుకువచ్చినట్లు ఏఈ తెలిపారు. కొత్తగా ఏఈగా ఉద్యోగంలో చేరిన విలాస్ తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురై అదే రాత్రి యూనియన్ నాయకులకు సమాచారం అందించారు. మంగళవారం యూనియన్ నాయకులతో కరీంనగర్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలసి ఈఈ చేసిన నిర్వాకాన్ని, తన తొడలపై వచ్చిన వాతలను చూపించి ధర్నా నిర్వహించారు. ఈఈ చేసిన బడితెపూజపై అధికార యంత్రాంగంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అస్తవ్యస్తంగా పైప్‌లైన్..!
సాక్షి,నల్లగొండ : ఇంటింటికీ తాగునీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధి కారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో అ బాసుపాలవుతోంది. ఒకవైపు వేసవికాలం ప్రా రంభమై శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్న మిషన్ భగీరథ పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్న హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. అసంపూర్తి పైపులైన్లతో ఇబ్బందులు.. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు గ్రామాల్లో పైపులైన్ నిర్మాణాలు జరుగకపోవడంతో కృష్ణా జలాలలకు సంబంధించిన జీఎల్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న పైపులైన్లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మండలకేంద్రం నుంచి మండలంలోని శాలిలింగోటం, రామగిరి, అంబారిపేట, గురుజాల, తుడిమిడి, చిత్తలూరు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించేందుకు వేసిన మెయిన్ పైపులైన్‌ను మండలకేంద్రంలోని బస్టాప్ వద్ద సుమారు 200 మీటర్ల మేర భూమిలో నుంచి వేయకుండా వదిలివేసి రోడ్డుపైనుంచే వేశారు. సుమారు సంవత్సర కాలంగా తాగునీటి మెయిన్ పైపులైన్ రోడ్డుమీదనుంచే ఉండటంతో పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెయిన్ పైపులైన్లలో ఏర్పడిన రంద్రాలు, లీకేజీలను సరిచేసి తాగునీటిని అందించాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
ట్రయల్ రన్‌లోనే లీక్.. ఉవ్వెత్తున జలపాతం!
సాక్షి, హుస్నాబాద్: మిషన్ భగీరథ ట్రయల్ రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణం నడిబొడ్డున శుక్రవారం భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంత వరదమయమైంది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది. ఒక్కసారిగా నీరు పైకి ఎగజిమ్మడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత సన్నగా మొదలైన నీటి ధార చూస్తుండగానే ఉధృతమైన వరదలా మారింది. ట్యాంకర్ల కొలది నీరు రోడ్ల వెంట పరుగులు పెట్టింది. అధికారులకు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఓ యువకుడు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. -
మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ
-
రుయాలో పగిలిన ఆక్సిజన్ పైప్‌లైన్
తిరుపతి (అలిపిరి): రుయాలో ఫుట్‌పాత్ ఏర్పాటు కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా జేసీబీ రోడ్డు తవ్వుతుండగా ఆక్సిజన్ సరఫరా అయ్యే పైప్‌లైన్ తెగిపోయింది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వెంటిలేటర్‌పై వైద్యం పొందుతున్న రోగుల బంధువులు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఇన్చార్జి సబ్ కలెక్టర్ కనక నరసారెడ్డి, అర్బన్ తహసీల్దార్ చంద్రమోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పైప్‌లైన్ మరమ్మతులను పరిశీలించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం కలెక్టర్ ప్రద్యుమ్మ దృష్టికి పోవడంతో రాత్రి 10 గంటలకు కలెక్టర్ రుయాకు చేరుకుని కట్ అయిన పైపులైన్‌ను పరిశీలించారు. అనంతరం ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆస్పత్రి రూట్‌మ్యాప్‌ను దగ్గరుంచి పనులు చేపట్టాలని రుయా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్ కట్ అయ్యే సమయంలో 12 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆక్సిజన్ సిలిండర్‌ను కమిషనర్ హరికిరణ్, తుడా చైర్మన్ నరసింహయాదవ్‌తో కలసి పరిశీలించారు. రుయా వార్డులను పరిశీలించి ఆక్సిజన్ సిలిండర్లపై ఆరా తీశారు. రుయా సూపరిం టెండెంట్ డాక్టర్ సిద్దానాయక్, ఆర్ఎంవో శ్రీహరి పాల్గొన్నారు. -
మిషన్ లీకేజీ!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్‌రన్ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్‌వాల్వ్‌లు ఊడిపోతున్నాయి. మిషన్ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నిజాంసాగర్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్‌ౖ లెన్ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్‌రన్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్– సంగారెడ్డి, బోధన్– హైదరాబాద్, నిజాంసాగర్ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్లకు లీకేజీలు మిషన్ భగీరథ ట్రయల్‌రన్ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్ జాయింట్ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మిషన్ భగీరథ నీటికి ట్రయల్‌రన్ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్వాల్ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్– హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్ కనెక్షన్ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్వాల్ ఆన్ఆఫ్ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘ట్రయల్’.. ట్రబుల్
బూర్గంపాడు: గోదావరి జలాలను కేటీపీఎస్కు తరలించే పైప్‌లైన్ మోరంపల్లిబంజర సమీపంలో లీకైంది. అక్కడే ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు గోదావరి జలాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునేందుకు బూర్గంపాడు నుంచి కేటీపీఎస్ వరకు పైప్‌లైన్ వేశారు. అధికారులు గోదావరి జలాలను తరలించేందుకు మంగళవారం ముందస్తుగా ట్రయల్ రన్ వేయగా.. పైప్‌లైన్ లీకైంది. సుమారు రెండు గంటల పాటు నీరు ఇలా రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. -
దేవాదుల పైప్‌లైన్ లీకేజీ
ములుగు(వరంగల్): దేవాదుల మొదటి దశ పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్ ను రైతులు ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం నల్లగుంట వద్ద దేవాదుల గేట్‌వాల్‌ను శనివారం అర్ధరాత్రి సమీప గ్రామాల రైతులు లీక్ చేశారు. దీంతో పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్ ద్వారా భారీగా నీరు ఎగజిమ్ముతోంది. వృథాగా పోతున్న నీటిని సమీపంలోని ఆరెకుంటలోకి మళ్లించడంతో అది నిండిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.