
మోరంపల్లిబంజర వద్ద ఎగసిపడుతున్న నీరు
బూర్గంపాడు: గోదావరి జలాలను కేటీపీఎస్‌కు తరలించే పైప్‌లైన్ మోరంపల్లిబంజర సమీపంలో లీకైంది. అక్కడే ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు గోదావరి జలాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునేందుకు బూర్గంపాడు నుంచి కేటీపీఎస్ వరకు పైప్‌లైన్ వేశారు. అధికారులు గోదావరి జలాలను తరలించేందుకు మంగళవారం ముందస్తుగా ట్రయల్ రన్ వేయగా.. పైప్‌లైన్ లీకైంది. సుమారు రెండు గంటల పాటు నీరు ఇలా రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది.