మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరినట్లయింది. ట్రయల్ రన్‌లో భాగంగా పైల్‌లైన్‌లో లీకేజీ ఏర్పడి ఆ ప్రాంతమంతా వరదలో మునిగిపోయేలా చేసింది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది.