అభివృద్ధిలో అగ్రస్థానం: ఎర్రబెల్లి | Errabelli Dayakar Rao Conference In Hanamkonda | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో అగ్రస్థానం: ఎర్రబెల్లి

Published Thu, Jun 27 2019 2:30 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

Errabelli Dayakar Rao Conference In Hanamkonda - Sakshi

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, పక్కన ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితరులు

 సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రతీ అంశంలోనూ అభివృద్ధి సాధిస్తోందని... ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాలు ఇందులో అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి వేగంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరు జిల్లాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ, హరితహారం, పంచాయతీరాజ్‌ చట్టం అమలు, ఓడీఎఫ్‌ పురోగతి, దేవాదుల భూసేకరణ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, విద్య, వైద్యం, డబుల్‌ బెడ్‌రూం గృహాలు, వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

మిషన్‌.. బృహత్తర పథకం
మిషన్‌ భగీరథ’ బృహత్తర పథకం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భగీరథ కార్యక్రమం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ఒక్క మహిళ నెత్తిన బిందె పెట్టుకుని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదు. అధికారులు మంచిగ పని చేస్తున్నారు. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికీ వంద శాతం నీరు సరఫరా చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచితంగా నీరు సరఫరా చేసేలా పనులు పూర్తి చేయాలి.

పనులు వంద శాతం పూర్తయినట్లుగా గ్రామపంచాయతీ గ్రామసభలో ఆమోదించి సర్పంచ్‌తో సంతకం చేయించాలి. ఈ పనులపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రోడ్లపై ఉన్న నల్లాల పైపులను ఇంటిలోపలి వరకు బిగించాలి. తాగునీరు వృథా చేస్తే గ్రామపంచాయతీలు జరిమానా విధించాలి. మిషన్‌ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలి. మేడారం జాతర అవసరాలకు తగ్టట్లు నీరు సరఫరా చేసే పనులు జరిగేలా చూడాలి’ అని మంత్రి దయాకర్‌రావు సూచించారు.

హరితహారం.. యజ్ఞం
హరితహారంలో ఆరు జిల్లాలు అగ్రస్థానంలో ఉండాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ‘మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలి. భవిష్యత్‌ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలి. హరితహారంలో ప్రభుత్వ లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలి. అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాల్సి ఉండగా పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించాలి. మొక్కలను నాటడంతోనే ఆగిపోకుండా సంరక్షణ ముఖ్యం. మండంలో పని చేసే అధికారుల ఒక్కో గ్రామానికి బాధ్యులుగా ఉండాలి. ఎవరెవరు ఎన్ని మొక్కలు నాటారో గ్రామపంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అలా అయితే అవి ఎండిపోకుండా జాగ్రత్త పడతారు. చెట్లను నరికితే కఠినంగా వ్యవహరించాలి. వాల్టా చట్టం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ముందున్న గ్రామపంచాయతీలకు అభివద్ధి పనుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తాం’ అని మంత్రి అన్నారు.

గ్రామాలు.. స్వచ్ఛత
గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ అధికారి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ‘ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలి. జిల్లాల పునర్విభజన తర్వాత గ్రామాలను బాగు చేసే సువర్ణ అవకాశం కలెక్టర్లకు దక్కింది. కలెక్టర్లు అన్ని శాఖలను సమన్వయం చేయాలి. అవసరమైన మేరకు చట్టాలను కఠినంగానే అమలు చేయాలి. అధికారులు చేసే మంచి పనులకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పటికీ ఉంటది. పని చేయని వారిపైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఎవరూ మీకు అడ్డు చెప్పరు’ అని స్పష్టం చేశారు.

సాగునీరు.. రైతులకు భరోసా
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వ్యవసాయంపై భరోసా కలుగుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవాదుల భూసేకరణ ప్రక్రియలో జాప్యంపై అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ముఖ్యంగా ఆర్డీఓ తీరు సరిగా లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరు జిల్లాల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారని అన్నారు.
‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. దీని తొలి ఫలితం మన వరంగల్‌ జిల్లాకే అందుతోంది. కాళేశ్వరంతో వచ్చే నీరు ఎస్సారెస్పీ ద్వారా సాగు అవసరాలకు అందుతుంది. కాళేశ్వరం నీటితో ప్రతీ చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించారు. అవసరమైన ప్రతీచోట చెక్‌ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగాలి’ మంత్రి సూచించారు.

మంత్రి ఇంకా ఏమన్నారంటే...
 పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి.
► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి.
 వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్‌ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం.
 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు.      పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి.
 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి.
 వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్‌ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం.
 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు.

మంత్రి – ఎమ్మెల్యేల జల సంవాదం
బీంఘనపూర్, చలివాగు ప్రాజెక్టుల నుంచి నిర్ధేశిత నీటి మట్టం కంటే ఎక్కువ నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎత్తిపోయాలని పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, నీరు ఎత్తిపోయకుంటే మిట్ట ప్రాంతాలకు సాగు, నీరు ఎలా అందుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ‘మీరు పాలకుర్తి, జనగామకు నీరు తీసుకుపోతే మా ప్రాంతాల్లో ప్రాజెక్టు ఉన్నా నీరు అందకపోతే రైతులు, ప్రజలు మమ్ముల్ని నిలదీస్తారు’ అని ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు.

దీనికి ప్రతిగా ‘గతంలో నీటి కోసం మీరు చేసిందంతా నాకు తెలుసు’ అని మంత్రి అనడంతో ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతం కోసం వారు డిమాండ్‌ చేయడం సహజమేనని పేర్కొన్నారు. దీనిపై మంత్రి దయాకర్‌రావు స్పందిస్తూ ప్రాజెక్టుల్లో నీటి మట్టాల పర్యవేక్షణ, ఆయకట్టుకు విడుదల తదితర అంశాలను ఆ యా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్‌ ఎస్‌ఈలే పర్యవేక్షించాలని ఆదేశించారు. మంత్రిగా తాను కానీ ఎమ్మెలేలు కానీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు.

హాజరైంది వీరే...
సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతిరాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు శంకర్‌నాయక్, వొడితల సతీష్‌కుమార్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి, పంచాయతీరాజ్‌ – గ్రామీణాభివృద్ధి కమిషన్‌ నీతూకుమారి, మిషన్‌ భగీరథ అధికారి జి.కృపాకర్‌రెడ్డితో పాటు జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎం.హరిత, వినయ్‌కష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ రవీందర్, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌కు మెడికల్‌ కాలేజీ
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం కలెక్టర్‌ నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఈ సమావేశంలో వెల్లడించారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి దయాకర్‌రావు ‘కలెక్టర్‌ గారూ.. మానుకోటలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మెడికల్‌ కాలేజ్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.. సీఎం కేసీఆర్‌ గారు సానుకూలంగా స్పందించారు.. ఆ ఏర్పాట్లు కూడా చూడండి ’ అంటూ కలెక్టర్‌ శివలింగయ్యకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

సమావేశంలో పీఆర్‌ కమిషనర్‌ నీతూప్రసాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement