ఏప్రిల్ 1 నుంచే పెరిగిన గౌరవ వేతనాలు | Increased from April 1 Honorary wages | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1 నుంచే పెరిగిన గౌరవ వేతనాలు

Published Thu, Jun 25 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

Increased from April 1 Honorary wages

ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపుపై ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ జీవో జారీ చేశారు. పెరిగిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement