Raymond Peter
-
పాత పద్ధతిలో పాసు పుస్తకాలు
రెండు నెలల గందరగోళానికి తెర సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పట్టాలెక్కింది. ఇప్పటి వరకు ఆటకెక్కించిన రెవెన్యూ శాఖ ఇప్పుడు మళ్లీ పాత బట్టింది. ఆన్లైన్ విధానంపై ఆలోచనను తాత్కాలికంగా విరమించింది. రెండు నెలలపాటు కొనసాగిన అయోమయానికి తెరదించింది. కొత్త పుస్తకాల ముద్రణను ప్రారంభించింది. కొత్త జిల్లాల పేర్లు ఉండేవిధంగా ముద్రణకు ఆదేశించింది. పహాణీల మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకాలను కూడా ఆన్లైన్ ద్వారా అందజేయాలని గతంలో రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి నాటి సీసీఎల్ఏ రేమండ్‌పీటర్ కసరత్తు కూడా చేశారు. అది పూర్తికాకుండానే మాన్యువల్ పాసుపుస్తకాల జారీ నిలిపివేయాలంటూ రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వాటి ముద్రణ కూడా నిలిచిపోయింది. ఆన్లైన్ కోసం సాఫ్ట్వేర్ సిద్ధం కాకపోవటం, దానికి సంబంధిత సంస్థతో ఒప్పందం జరగకపోవటం, దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదమూ రాకపోవటంతో ఆ కసరత్తులో జాప్యం జరిగింది. ఇంతలో రేమండ్ పీటర్ పదవీవిరమణ చేశారు. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయోగాత్మకంగా ఓ మండలాన్ని ఎంపిక చేసుకుని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, చాలాచోట్ల ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతోందని తహసీల్దారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దిగొచ్చిన అధికారులు కాలం కలసి రాక ఖరీఫ్ పంటలను కోల్పోయిన రైతులు రబీపై దృష్టి సారించారు. పంట రుణాల కోసం సిద్ధమవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాల సమస్య వచ్చి పడింది. కొత్తగా పాసుపుస్తకాలు అవసరమైనవారికి రుణాలు పొందే వెసులుబాటు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సాగుకు అవసరమైన స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వ పథకం కింద దరఖాస్తు చేసుకుని సబ్సిడీ వెసులబాటు పొందాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక తండ్రి నుంచి సంక్రమించిన భూములను పంచుకునే క్రమంలో వారసులకు కొత్త పాసు పుస్తకాల జారీ కావటం లేదు. భూముల క్రయవిక్రయాలకూ ఇదే ఇబ్బంది ఏర్పడింది. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో జనం గగ్గోలు పెడుతుండటంతో ఎట్టకేలకు అధికారులు దిగొచ్చారు. -
లక్నవరం సందర్శించిన రేమండ్ పీటర్
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సును భూపరిపాలనా విభాగం రిటైర్డ్ చీఫ్ కమిషనర్ రేమండ్ పీటర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. గత నెలాఖరులో రిటైర్ అయిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్నవరం సరస్సు తాను ఊహించిన దానికంటే అందమైన ప్రాంతమన్నారు. వీఆర్ఓ రమేష్‌బాబుతో పాటు రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ
- దరఖాస్తుల పరిశీలనపై స్పష్టతనిచ్చిన సీసీఎల్ఏ - దరఖాస్తులను 4 కేటగిరీలుగా విభజించాలని ఆదేశాలు - 1,2 కేటగిరీలను వెంటనే పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా పత్రాలను జతచేసిన దరఖాస్తులను మాత్రమే భూముల క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల అంచనాకు మించి 11 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడంతో, పత్రాలు లేకుండా భూమి సాగులో ఉన్నవారు, సాదాబైనామా కాకుండా ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరహా దరఖాస్తులే అధికంగా ఉండడంతో పరిశీలన లో పాటించాల్సిన నిబంధనల విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని తహసీల్దార్లు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించిన అంశం మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎంతోమంది పట్టణ ప్రాంతాల్లో సాదాబైనామాతో కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు, ప్రభుత్వ సీలింగ్ భూములను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అలాంటి దరఖాస్తులను పూర్తిగా పక్కన పెట్టాలని సీసీఎల్ఏ సూచించారు. వ్యవసాయ భూముల్లోనూ నాలుగు కేటగిరీలు.. పట్టణ ప్రాంతాలు, ఇళ్లు, స్థలాల సంగతి పక్కనపెడితే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల్లోనూ బోలెడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సాదాబైనామా అంటే.. తెల్లకాగితం లేదా మరేదైనా కాగితంపై రాసుకున్న రిజిస్ట్రేషన్ కాని పత్రంగా ఉత్తర్వుల్లో పేర్కొనగా, ఎంతోమంది తప్పుగా అర్థం చేసుకున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొంతమంది సాదాబైనామాలు లేకుండా అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి పంపకాలు, పెద్దవాళ్లు పిల్లల పేరిట రాసిన వీలునామాలు.. తదితర పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించాలని రెవెన్యూ అధికారులకు సీసీఎల్ఏ సూచించారు. యూఎల్సీ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం: సీసీఎల్ఏ క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా దరఖాస్తు చేసుకోని వారి నుంచి యూఎల్సీ ఖాళీస్థలాలను స్వాధీనం చేసుకుంటామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిందని, ఇకపై గడువు పొడిగించే ప్రసక్తి లేదని చెప్పారు. ఆ నాలుగు.. ►సాదాబైనామా కలిగి ఉండి, రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతే ప్రస్తుతం సాగులో ఉండడం. ►సాదాబైనామా ఉన్న రైతు పేరు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకున్నా, సాగులో ఉన్నట్లు రుజువు ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతు సాగులో ఉండడం. ►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకుండా సాగులో ఉన్న రైతు. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులను విభజిం చాక, తొలిదశలో 1,2 కేటగిరీలకు సంబంధించి న దరఖాస్తులను వెంటనే పరిశీలన ప్రారంభిం చాలని సీసీఎల్ఏ అధికారులను ఆదేశించారు. మిగిలిన 3,4 కేటగిరీల కిందకు వచ్చే దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయమై త్వరలోనే మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు సీసీఎల్ఏ తెలిపారు. -
ఇప్పటికైతే జిల్లాలే
- కొత్త మండలాల ఏర్పాటు ఇప్పుడే వద్దు - ఉన్నవాటి బలోపేతానికి నిర్ణయం - జిల్లాల సంఖ్య 23 లేక 24? - ఇంకా వీడని సందిగ్ధత - నాలుగు పాయింట్లతో కసరత్తు: రేమండ్ పీటర్ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం మండలాల పునర్విభజనను తాత్కాలికంగా పక్కనపెట్టింది. రెండింటినీ ఏకకాలంలో చేపడితే మొత్తం ప్రక్రియ మరింత సంక్లిష్టంగా, గందరగోళంగా మారుతుందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పైగా మండలాలను బాగా పెంచితే ఉద్యోగులు, కార్యాలయాలు, మౌలిక వసతులు, నిర్వహణ వ్యయమంతా తడిసి మోపెడవనుంది. కాబట్టి ముందుగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కసరత్తులో భాగంగా తప్పనిసరైతేనే కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న రెవెన్యూ మండలాలను సాంకేతికంగా, సిబ్బందిపరంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి సారించాలని అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు దీన్ని ధ్రువీకరించారు. ‘‘ముందుగా జిల్లాల ఏర్పాటుపైనే మా ప్రధాన దృష్టి. అత్యవసరమైతే తప్ప మండలాల సంఖ్యను పెంచే ఆలోచన లేదు. ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాలకు సరిపడేంత సంఖ్యలో అధికారులు, ఉద్యోగులను సర్దుబాటు చేయాలి. ఇదే సమయంలో మండలాలనూ పెంచితే ఉద్యోగుల కొరత తలెత్తుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. సిరిసిల్లతోనే చిక్కుముడి మరోవైపు సిరిసిల్ల కేంద్రంగా రాజన్న జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనకు స్వీకరించింది. అదే జరిగితే కరీంనగర్, ప్రతిపాదిత జగిత్యాల జిల్లాల స్వరూపాల్లో భారీ మార్పులు జరుగుతాయి. మొత్తం జిల్లాల సంఖ్య 24కు చేరుతుంది. పైగా 2, 4 కలిపితే సీఎం తన అదృష్ట సంఖ్యగా భావించే 6 వస్తుంది గనుక మొత్తం జిల్లాల సంఖ్య 24కు చేరే అవకాశాలు ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. 25 నుంచి 40 ఎకరాల్లో కలెక్టరేట్లు జిల్లాల ఏర్పాటుకు ఒక్కో జిల్లాకు రూ.100 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పాలనకు రూ.70 కోట్లు, శాంతిభద్రతల నిమిత్తం పోలీసు యంత్రాంగానికి రూ.30 కోట్లు కావాల్సి ఉంటుంది. అన్నీ ఒకేలా ఉండవు ‘‘ప్రాంతం, జనాభాపరంగా జిల్లాలన్నీ ఒకేలా ఉండాలనే నిబంధన లేదు. ఎందుకంటే విస్తీర్ణపరంగా రంగారెడ్డి, హైదరాబాద్‌లకు పోలిక లేదు. జనాభాపరంగా వరంగల్, మహబూబ్‌నగర్ మధ్య భారీ వ్యత్యాసముంటుంది. జిల్లా కేంద్రం ప్రధానంగా ప్రజల అవసరాలకు కేంద్ర బిందువుగా ఉండాలి. పాలన, నిర్వహణ సౌలభ్యం, జిల్లా ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం, ఉద్యోగుల సర్దుబాటుకు అనుకూలత... ఈ నాలుగు నియమాలను ప్రామాణికంగా చేసుకోని కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తున్నాం’’ - సీసీఎల్ఏ రేమండ్ పీటర్ -
‘ఛాయ్’ సేవలు అభినందనీయం
♦ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్ ♦ ప్రత్యూష ఉపశాంతి రక్షణ కేంద్రం ప్రారంభం శామీర్‌పేట్ : ప్రాణాంతకమైన రోగాల బారిన పడి చివరి దశలో ఉన్న వారికి ఛాయ్ (క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ప్రత్యూష ఏ హోలిస్టిక్ పాలెటివ్ కేర్ (ప్రత్యూష ఉపశాంతి రక్షణ కేంద్రం) ఏర్పాటు చేయడం అభినందనీయమని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని దేవరయాంజాల్ గ్రామపరిధిలోని 50 పడకల సామర్థ్యం గల ప్రత్యేక ఆస్పత్రిని మంగళవారం క్యాన్సర్ రోగి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్, హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి చివరి రోజుల్లో వారికి కాస్త అయినా మనోధైర్యాన్ని కల్గించే విధంగా సిబ్బంది వారికి చేయూ త అందించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రిని ప్రారంభించిన ఛాయ్ సంస్థ ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఈ సెంటర్లో నామమాత్రపు రుసుంతో మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు ఛాయ్ డెరైక్టర్ పాదర్ టోమీ థామస్ అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చే సి రోగులకు సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సెంటర్లో ఇద్దరు వైద్యులు, ఐదుగురు సిస్టర్లు, 2 కౌన్సెలర్లు, ఒక కమ్యూనిటీ కోఆర్డినేటరు కలిసి 24 గంటల పాటు రోగులను కంటికి రెప్పలా కాపాడతారన్నారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ప్రకాశ్ మల్లవరపు, ఛాయ్ బోర్డు చైర్మన్ సిస్టర్ దీనా, డెరైక్టర్లు పాదర్ మాథ్యూ ఇబ్రహీం, స్పెషలిస్టు స్పోక్ పర్సన్ డాక్టర్ ఎల్ గాయత్రి, పాదర్ అర్భుతం, డాక్టర్ భరత్, రమేశ్, సుందర్, వెంకటగోపాల్, కృష్ణ, ఇలియాన్, దేవరయాంజల్ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ కల సాకారం చేద్దాం
- ఆ కల సర్పంచ్లతోనే సాధ్యం - ఆన్లైన్లో జీపీ నిధుల వివరాలు - గ్రామీణాభివృద్ధి శాఖప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ - ఘనంగా సర్పంచ్ల సంఘం ద్వితీయ వార్షికోత్సవం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీఎం కలలు కంటున్న బంగారు తె లంగాణ గ్రామ సర్పంచ్లతోనే సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అన్నారు. హరితహారం కార్యక్ర మం వారి సహకారంతోనే విజయవంతమైందని కితాబిచ్చారు. సర్పంచ్ల 21 స మస్యలను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. స్థా నిక బృందావన్‌గార్డెన్‌లో ఆదివారం స ర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంఘం ద్వితీయ వార్షికోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ రాజ్యం బలపడాలని సీఎం భావిస్తున్నట్లు చె ప్పారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. పంచాయతీలకు నిధుల వివరాలను ఇకనుంచి ఆన్లైన్లో పొందుపరుస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. రా ష్ట్రంలోని 5,700 గ్రామాలను క్లస్టర్లుగా గు ర్తించి వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చే యనున్నట్లు చెప్పారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవంతం చేయాలని సర్పంచ్‌లను కోరారు. గ్రామాలకు పేరు తేవాలి ప్రతి సర్పంచ్ తమ గ్రామపంచాయతీని ఉత్తమగ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రాం చంద్రన్ కోరారు. సర్పంచ్‌లు తమ విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 92శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని అభినందించారు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. సీఎం సహాయనిధికి విరాళం సర్పంచ్‌లకు పెరిగిన ఒకనెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ప్రకటించారు. సర్పంచ్ సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా ప్ర ధాన కార్యదర్శులు మోదిపూర్ రవి, వెం కట్స్వామి, వెంకటేశ్వర్లుగౌడ్ పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచే పెరిగిన గౌరవ వేతనాలు
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపుపై ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ జీవో జారీ చేశారు. పెరిగిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించారు. -
ఆధార్ లేకుంటే ఇదే ఆఖరి పింఛన్
తెలంగాణ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డు నంబర్ ఇవ్వని లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను నిలిపివేయాలని అధికారులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఆదేశిం చారు. ఫిబ్రవరి నుంచి ఇచ్చే పింఛన్లను పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారానే అందించాలని.. ఇందుకోసం ఖాతాల వివరాలను సేకరించాలని సూచించారు. డిసెంబర్ నెల పింఛన్లు ఎట్టి పరి స్థితుల్లోనూ సంక్రాంతిలోగా లబ్ధిదారులకు అం దించాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులతో పింఛన్లు, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై రేమండ్ పీటర్ సమీక్షించారు. జనవరి తర్వాత సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నం దున నగదు పంపిణీ పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆసరా పింఛన్లకు అర్హులైన, అనర్హులైన వారి జాబితాలను గ్రామ సభల్లో వెల్లడించాలని, అలాగే ఆధార్ కార్డులు లేనివారు వెంటనే నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్లు లేని వికలాంగులకు వాటిని వెంటనే ఇప్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ పనులను సంక్రాంతి తర్వాత ప్రారంభించవచ్చని, దీనిపై సీఎం ఆదివారం స్వయంగా సమీక్షిస్తారని చెప్పారు. -
ఏపీ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణకు వర్తింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పంచాయతీరాజ్ వేతనాలు, అలవెన్సులు-రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వీసు నిబంధనలను కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని అన్ని సెక్షన్లు, నిబంధనలు తెలంగాణకు వర్తిస్తాయని, ఏపీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని పేరున్నచోట తెలంగాణ అని మార్పు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. ఈ ముసాయిదాకు ముఖ్యమంత్రి ఆమోద ం కోసం పంపించలేదని, చట్టంలో మార్పులు చేయాలంటే ముందుగా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని అధికా వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. -
వాటర్ గ్రిడ్ ప్రణాళిక సిద్ధం చేయండి
నీలగిరి :జిల్లాలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తు తం గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా పైప్లైన్ల స్థితిగతులు,తాగునీటి పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, మంచినీటి ట్యాంకుల నిర్వహణ, పనితీరుపై ప్రత్యేకంగా నివేది రూపొందించాలని సూ చించారు. గ్రామాల్లో పైపులైన్లు, మంచినీళ్ల ట్యాంకులు సక్రమంగా ఉంటే తప్ప వాటర్ గ్రిడ్ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులకు స్పష్టం చేశారు. మన ఊరు-మన ప్రణాళికలో పేర్కొన్న మం చినీటి ట్యాంకుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏవిధంగా ఉందో ఏఈలు వెళ్లి పరిశీలించాలన్నారు. ఇటీవల రద్దుచేసిన తాగునీటి ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత కలి గిన వాటిని గుర్తించి జాబితాను మళ్లీ పంపించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అడ్వయిజర్ ఉమాకాంత్ రావు, ఎస్ఈ రాజేశ్వరరావు, ఈఈలు పాల్గొన్నారు. -
సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండాలి
సర్వేకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు రేమండ్ పీటర్ ఆదేశాలు రాంనగర్ : కుటుంబ వివరాలపై ఈనెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర సర్వేకు సర్వం సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవా రం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చి కుటుంబ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు ప్రజలందరూ సహకరించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం కంటే ఎక్కు వ కుటుంబాలు నివసిస్తున్నట్లయితే వారికి ఆయా ఇంటి నెంబర్ల కోసం తాత్కాలిక సంఖ్య ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులను చేరుకునేందుకు వాహన సదుపా యం కల్పించాలన్నారు. ఎన్నికల విధులకు రూట్ మ్యాప్‌లు ఉపయోగించిన విధంగానే కుటుంబ సర్వేకు కూడా రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. సర్వే అనంతరం వివరాలు నమోదు చేయడానికి అవసరమైన కంప్యూటర్లు, ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని తెలి పారు. కంప్యూటర్లలో వివరాల నమోదును ఒక ప్రదేశం నుంచే కాకుండా అనుకూలంగా ఉన్న కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లు, కళాశాలలు, పాఠశాలల నుంచి నేరుగా ఎంట్రీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎన్యుమరేటర్ల గుర్తింపు పూర్తి కుటుంబ సామాజిక వివరాలపై సమగ్ర సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లను గుర్తించి వారికి శిక్షణ పూర్తి చేసినట్లు రేమండ్ పీటర్‌కు జిల్లా కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. ఆలేరుకు విచ్చేసిన కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్ల చొప్పున కేటాయించామన్నారు. పింఛన్ పొందు తున్న వారి వివరాలు, ఇళ్ల మంజూరు వివరాలు, ల్యాండ్ రికార్డులు, సదరన్ క్యాంప్ లబ్ధిదారుల వివరాలు మొదలగునవి సరి చూసుకుని సర్వే చేసినట్లయితే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయని అధికారులకు వివరించినట్లు కలెక్టర్ చెప్పారు. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకొని నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, డీఆర్డీఏ పీడీ సుధాకర్, ఆలేరు నుంచి వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ రాంమ్మూర్తి, ప్రత్యేక అధికారి యాదగిరి, ఏడీఏ వెంకటేషం, ఇన్చార్జ ఎంపీడీఓ వెంక టరమణ తదితరులు పాల్గొన్నారు.