బంగారు తెలంగాణ కల సాకారం చేద్దాం
- ఆ కల సర్పంచ్‌లతోనే సాధ్యం
- ఆన్‌లైన్‌లో జీపీ నిధుల వివరాలు
- గ్రామీణాభివృద్ధి శాఖప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్
- ఘనంగా సర్పంచ్‌ల సంఘం ద్వితీయ వార్షికోత్సవం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీఎం కలలు కంటున్న బంగారు తె లంగాణ గ్రామ సర్పంచ్‌లతోనే సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అన్నారు. హరితహారం కార్యక్ర మం వారి సహకారంతోనే విజయవంతమైందని కితాబిచ్చారు. సర్పంచ్‌ల 21 స మస్యలను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. స్థా నిక బృందావన్‌గార్డెన్‌లో ఆదివారం స ర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంఘం ద్వితీయ వార్షికోత్సవ సభ జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ రాజ్యం బలపడాలని సీఎం భావిస్తున్నట్లు చె ప్పారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. పంచాయతీలకు నిధుల వివరాలను ఇకనుంచి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. రా ష్ట్రంలోని 5,700 గ్రామాలను క్లస్టర్లుగా గు ర్తించి వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చే యనున్నట్లు చెప్పారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవంతం చేయాలని సర్పంచ్‌లను కోరారు.
గ్రామాలకు పేరు తేవాలి
ప్రతి సర్పంచ్ తమ గ్రామపంచాయతీని ఉత్తమగ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రాం చంద్రన్ కోరారు. సర్పంచ్‌లు తమ విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 92శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని అభినందించారు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు.
సీఎం సహాయనిధికి విరాళం
సర్పంచ్‌లకు పెరిగిన ఒకనెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ప్రకటించారు. సర్పంచ్ సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా ప్ర ధాన కార్యదర్శులు మోదిపూర్ రవి, వెం కట్‌స్వామి, వెంకటేశ్వర్లుగౌడ్ పాల్గొన్నారు.