లక్నవరం సందర్శించిన రేమండ్‌ పీటర్‌ | Laknavaram visited Raymond Peter | Sakshi
Sakshi News home page

లక్నవరం సందర్శించిన రేమండ్‌ పీటర్‌

Published Mon, Sep 12 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

Laknavaram visited Raymond Peter

గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సును భూపరిపాలనా విభాగం రిటైర్డ్‌ చీఫ్‌ కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. గత నెలాఖరులో రిటైర్‌ అయిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్నవరం సరస్సు తాను ఊహించిన దానికంటే అందమైన ప్రాంతమన్నారు. వీఆర్‌ఓ రమేష్‌బాబుతో పాటు రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement