నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్‌పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్‌గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్‌గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్‌లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది.
ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్‌ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్‌ఎంబీ అధికారులు గురువారం సాగర్‌డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు.
డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్‌ఎంబీ అధికారులు సాగర్‌డ్యామ్‌తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్‌రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్‌డ్యామ్‌పై పర్యటించిన వారిలో కేఆర్‌ఎంబీ ఎస్‌ఈ వరలక్ష్మి, సాగర్‌డ్యామ్ ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment