Laknavaram
-
లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫెనా..?
-
Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు
సాక్షి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు కాజ్‌వేల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాలు, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్ రామన్నగూడెం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు సరస్సులో నీటిపై తేలియాడుతున్నట్లుగా ఉన్న వంతెన కొండాయివద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు కొత్తగూడ: తాడు సాయంతో కత్తెర్ల వాగు దాటుతున్న వేలుబెల్లి గ్రామస్తులు వాజేడు: చింతూరుకు చెందిన మహిళ వైద్యం కోసం వెళ్తుండగా రోడ్డు దాటిస్తున్న యువకులు కోతకు గురైన నర్సింగాపూర్–బోర్లగూడెం ప్రధాన రహదారి కొత్తగూడెం: బూర్కపల్లి వాగు దాటుతున్న రామన్నగూడెం గ్రామస్తులు వాజేడు: భువనపల్లి–లక్ష్మీపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద దొంగలగట్టు వాగు లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న నది మహాముత్తారం: గండికామారం రోడ్డుపై వరద ఉధృతి కాటారం: గంగారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు కోతకు గురైన నర్సింగాపూర్–మీనాజిపేట రహదారి బూర్గుపేట–లక్ష్మీదేవిపేట మధ్య మారేడుగొండ చెరువు ఉధృతి ఏటూరునాగారం: చెల్పాక రోడ్డుపై నాగులమ్మ ఒర్రె వరద -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
లక్నవరానికి ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద ఉన్న కాటేజీలకు ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు లభించినట్లు లక్నవరం యూనిట్ మేనేజర్ రాజ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు తేజావత్ రామచంద్రుడు, వేణుగోపాలచారిలు లక్నవరం అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న 9 ఐలాండ్లలో 100 కాటేజీల నిర్మాణం కోసం ప్రధానికి ప్రతిపాదన అందజేసినట్లు ఆయన చెప్పారు. దీంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. లక్నవరం సరస్సు అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో పాటు టీఎస్‌టీడీసీ చైర్మన్ బోయినపల్లి మనోహర్‌రావులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు చేయిస్తున్నారన్నారు. ఇక్కడి రిసార్ట్స్‌కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా హరిత హోటల్, కాటేజీలలో ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట లక్నవరం బోట్ ఇన్చార్జి శ్రీనివాస్, రణధీర్‌లు ఉన్నారు. -
పెరుగుతున్న లక్నవరం
గోవిందరావుపేట : గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సుమారు అడుగున్నరకు పైగా ఎత్తుతో మత్తడి పోస్తుండడంతో సరస్సు తూముల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా లోలెవల్ కాజ్వే పైనుండి నీరు వెళుతోంది. ఉయ్యాలవంతెన సరస్సుపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మత్తడి పరవళ్లు తొక్కుతుండడంతో దయ్యాలవాగు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీటిలో మునుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
లక్నవరంలో ‘మూగమనసులు’ షూటింగ్
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద మూగమనసులు సీరియల్ షూటింగ్ శనివారం లక్నవరం సరస్సు వద్ద హీరో ఆదిత్యవర్మ, హీరోయిన్ ధరణి, మరికొందరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గగన్ టెలిషో సమర్పణలో గుత్తా వెంకటేశ్వరరావు నిర్మిస్తుండగా శ్రావణభాస్కర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను ఉయ్యాలవంతెన, రెస్టారెంట్ వద్ద గార్డెన్, బోటుపై వివిధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ లక్నవరంలో ప్రకృతి అందాలు బాగున్నాయని, వీటిని పరిశీలించి షూటింగ్‌కు ఎంతో మంచి ప్రదేశంగా భావించామని తెలిపారు. ఇప్పటికే 590 ఎపిసోడ్లు పూర్తయ్యాయని వివరించారు. ఆదివారం గోవిందరావుపేటలోని కోదండరామాలయంలో షూటింగ్ జరుపనున్నట్లు తెలిపారు. బృందంలో ఆర్టిస్టులు సత్తిపండు, ఆకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కృష్ణకాంత్, రచయిత బీవీ.రామారావు, శ్రీదేవిలు ఉన్నారు. -
లక్నవరం సందర్శించిన రేమండ్ పీటర్
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సును భూపరిపాలనా విభాగం రిటైర్డ్ చీఫ్ కమిషనర్ రేమండ్ పీటర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. గత నెలాఖరులో రిటైర్ అయిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్నవరం సరస్సు తాను ఊహించిన దానికంటే అందమైన ప్రాంతమన్నారు. వీఆర్ఓ రమేష్‌బాబుతో పాటు రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయగాల సరస్సు
మండలంలోని లక్నవరం సరస్సు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయిలో నిండింది. ఆదివారం మధ్యాహ్నం వరకు 33 అడుగుల 5 అంగుళాలకు నీరు చేరింది. దీంతో జిల్లాతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాట కులు భారీగా తరలివచ్చి సరస్సు అందాలను తిలకించారు. ఉయ్యాల వంతెనపై నుంచి నడుస్తూ సందడి చేశారు. – గోవిందరావుపేట -
పరవశించే లక్నవరం
మండలంలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. శనివారం ఉదయం వరకు జలాశయం 33 అడుగులకు చేరుకుంది. మరో అర అడుగు మేరకు నీరు చేరుకుంటే మత్తడి పడుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నెలలోనే సరస్సు పూర్తిస్థాయిలో నిండిందని వారు పేర్కొన్నారు. –గోవిందరావుపేట -
పోదాం.. లక్నవరం
హన్మకొండ : పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లక్నవరం జలాశయంలో నూతనంగా నిర్మించిన అద్దాల మేడలు, ఉడెన్ కాటేజీలు రేపటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఉదయం రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ హజరుకానున్నారు. లక్నవరం జలాశయంలో నిర్మించిన వేలాడే వంతెన, కాకరబోడు దీవిలో నిర్మించిన కాటేజీలకు పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీటికి అదనంగా లక్నవరం జలాశయంలో ఉన్న మరో దీవిలో కొత్తగా నాలుగు కాటేజీలను నిర్మించారు. అద్దాల మేడలు ఎత్తై కొండల మీద ఆకుపచ్చ రంగు చిక్కగా పరుచుకున్న దట్టమైన అడవిలో పదివేల ఎకరాల్లో విస్తరించిన చెరువు మధ్యలో వెలసిన దీవుల్లో అద్దాల మేడలను నిర్మించారు. దాదాపు రూ.40 లక్షల వ్యయంతో ఈ అద్దాల మేడలను నిర్మించారు. వీటిని సాంకేతిక పరిభాషలో ‘ఆన్ డై లైన్’ కాటేజీలు అంటారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన మెటీరియల్‌తో ఈ కాటేజీలు నిర్మించారు. తుప్పు, ఫంగస్ లాంటివి ఈ కాటేజీలకు పట్టవు. దాదాపు ఇరవై ఏళ్ల వరకు కాటేజీలు మెరుపును కోల్పోవు. ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు కాటేజీల్లో 90 శాతం అద్దాలతోనే గోడలు నిర్మించారు. దీంతో గదిలో నుంచే ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అద్దాల గదులతో పాటు గతంలో నిర్మించిన రెండు ఉడెన్ కాటేజీలను రేపు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కాకరబోడులో ఉన్న రెస్టారెంట్లో ఎనిమిది గదులు ఉన్నాయి. కొత్తగా నాలుగు గదులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో లక్నవరం హరిత హోటర్ సామర్థ్యం 12 గదులకు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీవిలో బస చేసే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సోలార్ విద్యుత్ దీపాలతో పాటు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. వేయి లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ఉంది. దీనితో పాటు పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ బస చేసే వారి కోసం మినీ రెస్టారెంటును నిర్మించారు. ఈ నాలుగు గదుల్లో వెస్ట్రన్ పద్ధతిలో టాయిలెట్లు నిర్మించారు. ఈ దీవిలో దాదాపు ఆరువేల చదరపు అడుగులు లాండ్ స్కేపింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ దీవికి చేరుకోవాలంటే 160 మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించి కాకరబోడు దీవికి చేరుకోవాలి. అక్కడి నుంచి బోటులో రెండో దీవికి చేరుకోవచ్చు. స్పీడ్‌బోటు కూడా అందుబాటులో ఉంటుంది. -
పర్యాటకులకు లక్న'వరం'
సిటీలో వాతావరణం సడెన్‌గా చల్లబడింది. హాలిడే మూడ్ వచ్చేసింది. అయితే ఆహ్లాదకర వాతావరణముంటే చాలదు. అందుకు తగిన పరిసరాలు కూడా ఉంటేనే కదా మనసు వాటితో మమేకమైపోయేది. అలాంటి పరిసరాలు ఉండాలంటే.. కాంక్రీట్ నగరంలో కష్టసాధ్యమే. మరేం చేయాలి? లక్నవరం వెళ్లండి అనేదే సమాధానం. - ఓ మధు ఆహ్లాద వాతావరణం, కొండలు, పారే నీరు, తదేకంగా ప్రవాహ గమనాన్ని తిలకిస్తూ ఎంతోసేపు ఉండిపోయేలా అవకాశమిచ్చే వంతెన.. మరోవైపు మనదైన ఏకాంతానికి స్వాగతం పలికే ద్వీపం. ఇలాంటి వాతావరణంలో సేదతీరితే.. ఓహ్. మదిదోచే నదిలా.. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఓ చిన్నపాటి నదిని తలపిస్తుంది. సిటీకి దగ్గర్లోనే ఉన్న ఈ ప్రశాంతమైన చోటు ఊహించనంత ఆనంద, ఆశ్చర్యాలను అందిస్తుంది. ఒకప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేని ఈ ప్లేస్ ఇప్పుడు ఒక చక్కని టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. వరంగల్ కోట, ఆలయాల తర్వాత లక్నవరానికి అంత ప్రాచుర్యం రావడానికి పర్యాటక శాఖ కృషి ప్రధాన కారణం. ప్రత్యేక ఆకర్షణలు - 10 వేల ఎకరాలలో ఉన్న వర్షాధారిత చెరువు. ఇందులో 13 దీవులున్నాయి. బోట్లలో విహారం చేస్తూ చెరువంతా చుట్టి రావచ్చు. - నదిపై 160 మీటర్ల పొడవైన వేలాడే వంతెన అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి 3 చిన్న చిన్న ద్వీపాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన దీనికి ఎంతో ప్రాముఖ్యతని తెచ్చిపెట్టింది. - ఇక్కడి అందాలను తనివితీరా చూసి సేదతీరేందుకు హరిత వసతి గృహ సముదాయం కూడా ఉంది. - కాకతీయులు ఈ చెరువుని గుర్తుంచి తూములు ఏర్పాటు చేశారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ తూము నేటికీ చూడొచ్చు. - చలికాలంలో ఇక్కడికి అనేక రకాల వలస పక్షులు వస్తుంటాయి. పక్షి ప్రేమికులు వెళ్లేందుకు ఇది సరైన సమయం. - సిటీకి 210 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలో ఉందీ లక్నవరం చెరువు. వరంగల్ సిటీకి 70 కి.మీ దూరంలో గోవిందరావ్‌పేట్ మండలం ములుగుకు సమీపంలో ఉండే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే 7 కి.మీ దట్టమైన బుస్సపూర్ అడవిలో ప్రయాణం చేయాలి.