హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పంచాయతీరాజ్ వేతనాలు, అలవెన్సులు-రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వీసు నిబంధనలను కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని అన్ని సెక్షన్లు, నిబంధనలు తెలంగాణకు వర్తిస్తాయని, ఏపీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని పేరున్నచోట తెలంగాణ అని మార్పు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. ఈ ముసాయిదాకు ముఖ్యమంత్రి ఆమోద ం కోసం పంపించలేదని, చట్టంలో మార్పులు చేయాలంటే ముందుగా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని అధికా వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణకు వర్తింపు
Published Sat, Sep 13 2014 2:14 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement