జిల్లాకు రూ.192 కోట్లు ఆర్థిక సంఘం నిధులు
కరెంటు బకాయిలు రూ.105 కోట్లు
పాత బిల్లులకు జమ చేయాలని నిర్ణయం
పంచాయతీల్లో అభివృద్ధికి మంగళం
చిత్తూరు: పేరుకుపోయిన కరెంటు చార్జీల పాత బకాయిలు పంచాయతీలకు శాపంగా మారాయి. రెండు విడతలుగా జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు 192 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.105 కోట్లు కరెంటు చార్జీలు చెల్లించాలనే అధికారుల నిర్ణయంతో పంచాయతీల్లో అభివృద్ధి పడకేసే పరిస్థితి ఏర్పడింది.
గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. ఎన్నికల అ నంతరం ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే మొదటివిడతలో జిల్లాకు కేటాయించిన *67.5 కోట్లలో *39.5 కోట్లు గతంలో విడుదల అయ్యాయి. తాజాగా మిగిలిన *28 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కొంతమేర విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడత కింద మరో *125 కోట్లు త్వరలో జిల్లాకు అం దే పరిస్థితి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలి పారు. ఒక్కో వ్యక్తికి *400 దామాషాన జిల్లాలో 31.5 లక్షల జనాభా ఉన్నం దున మొత్తం *125 కోట్ల నిధులు జిల్లాకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నిధులతో గ్రామపంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించాలి. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపారు.
అభివృద్ధి సందేహమే
జిల్లాకు రూ. కోట్లు నిధులు వస్తున్నా పంచాయతీలు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో 1,363 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో విద్యుత్ బకాయిలు * 105 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మేజర్ పంచాయతీలు మాత్ర మే కరెంట్ బిల్లులు చెల్లిస్తుండగా మిగిలిన పంచాయతీలు బిల్లులు చెల్లించక పోవడంతో పేరుకుపోయాయి. దీంతో అధికారులు 13 వ ఆర్థిక సంగం నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే బకాయిలు *105 కోట్లు ఉండడంతో దాదాపు ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలు చెల్లిం చేందుకు సరిపోయే పరిస్థితి నెలకొంది.
కొంత చెల్లిస్తాం
అధికారులు మాత్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో తొలివిడతలో కొంత మేర బకాయిలు చెల్లించి, మిగిలిన బకాయిలు రెండో విడత నిధులతో చెల్లించడం ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా చూస్తామని చెబుతున్నారు. కానీ విద్యుత్ బకాయిలు చెల్లించిన తరువాత అభివృద్ధికి నిధులు మిగిలేది నామమాత్రమే. మిగిలిన * 153 కోట్ల నిధుల్లో ఒక్కో పంచాయతీకి కేవలం * 11 లక్షల నిధు లు మాత్రమే వస్తాయి. ఈ లెక్కన 1,363 పంచాయతీల్లో నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు. అభివృద్ధి అటెకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నిధులు విద్యుత్ బకాయిలకే పరిపోతే మేము ఎలా పనిచేయాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి అయినా నిధులిచ్చి, విద్యుత్ బకాయిలు చెల్లించడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
అభివృద్ధికి ‘షాక్’
Published Tue, Dec 9 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement