Power dues
-
ఎమ్మార్వో కార్యాలయానికి కరెంట్ కట్
చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్ శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో.. అధికారులు బుధవారం కరెంట్ సరఫరాను ఆపేశారు. దీంతో కంప్యూటర్లు పని చేయక ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు బకాయిలు చెల్లించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బకాయిలు రూ.1,500 కోట్లు
ప్రభుత్వ విభాగాల కరెంటు బిల్లుల తీరిది నెలనెలా పెరిగిపోతుండడంతో డిస్కంలపై ఆర్థిక భారం ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలని ఇంధనశాఖ ప్రతిపాదన హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలకు చెందిన కరెంటు బకాయిలు రూ.1,500 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇవి మరింత షాక్ కొడుతున్నాయి. ఏటా సబ్సిడీల భారంతో పాటు సర్కారు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు డిస్కంలకు తడిసి మోపెడవుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు రాబట్టుకోకపోతే వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక డిస్కంలను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీ ఏమూలకు సరిపోవటం లేదని డిస్కంలు పదేపదే చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రతి నెలా రూ.100 కోట్ల సబ్సిడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే తరహాలో సర్కారు విభాగాల కరెంటు బకాయిలను సర్దుబాటు చేస్తే డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఇటీవలే ఇంధన శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నివేదిక ప్రకారం 13 విభాగాలు డిస్కంలకు రూ.1,453 కోట్లు బకాయి పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు వరకే టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.961 కోట్లు, టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ. 492 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడచిన మూడు నెలల్లో ఈ బకాయిల భారం మరో రూ.50 కోట్లు పెరిగిందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. తాగునీటి, సాగునీటి అవసరాలు, వీధిదీపాలతో ముడి పడి ఉన్న నాలుగు విభాగాలకు చెందిన బకాయిలే 80 శాతానికి మించి ఉన్నాయి. అత్యధికంగా పంచాయతీరాజ్ విభాగం రూ.885 కోట్లు, మున్సిపాలిటీలు రూ.153 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై విభాగాల రూ. 145 కోట్ల కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని క్షేత్ర స్థాయి నుంచి వసూలు చేయకుండా.. శాఖాపరమైన పద్దుల సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. -
అభివృద్ధికి ‘షాక్’
జిల్లాకు రూ.192 కోట్లు ఆర్థిక సంఘం నిధులు కరెంటు బకాయిలు రూ.105 కోట్లు పాత బిల్లులకు జమ చేయాలని నిర్ణయం పంచాయతీల్లో అభివృద్ధికి మంగళం చిత్తూరు: పేరుకుపోయిన కరెంటు చార్జీల పాత బకాయిలు పంచాయతీలకు శాపంగా మారాయి. రెండు విడతలుగా జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు 192 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.105 కోట్లు కరెంటు చార్జీలు చెల్లించాలనే అధికారుల నిర్ణయంతో పంచాయతీల్లో అభివృద్ధి పడకేసే పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. ఎన్నికల అ నంతరం ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే మొదటివిడతలో జిల్లాకు కేటాయించిన *67.5 కోట్లలో *39.5 కోట్లు గతంలో విడుదల అయ్యాయి. తాజాగా మిగిలిన *28 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కొంతమేర విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడత కింద మరో *125 కోట్లు త్వరలో జిల్లాకు అం దే పరిస్థితి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలి పారు. ఒక్కో వ్యక్తికి *400 దామాషాన జిల్లాలో 31.5 లక్షల జనాభా ఉన్నం దున మొత్తం *125 కోట్ల నిధులు జిల్లాకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నిధులతో గ్రామపంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించాలి. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపారు. అభివృద్ధి సందేహమే జిల్లాకు రూ. కోట్లు నిధులు వస్తున్నా పంచాయతీలు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో 1,363 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో విద్యుత్ బకాయిలు * 105 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మేజర్ పంచాయతీలు మాత్ర మే కరెంట్ బిల్లులు చెల్లిస్తుండగా మిగిలిన పంచాయతీలు బిల్లులు చెల్లించక పోవడంతో పేరుకుపోయాయి. దీంతో అధికారులు 13 వ ఆర్థిక సంగం నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే బకాయిలు *105 కోట్లు ఉండడంతో దాదాపు ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలు చెల్లిం చేందుకు సరిపోయే పరిస్థితి నెలకొంది. కొంత చెల్లిస్తాం అధికారులు మాత్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో తొలివిడతలో కొంత మేర బకాయిలు చెల్లించి, మిగిలిన బకాయిలు రెండో విడత నిధులతో చెల్లించడం ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా చూస్తామని చెబుతున్నారు. కానీ విద్యుత్ బకాయిలు చెల్లించిన తరువాత అభివృద్ధికి నిధులు మిగిలేది నామమాత్రమే. మిగిలిన * 153 కోట్ల నిధుల్లో ఒక్కో పంచాయతీకి కేవలం * 11 లక్షల నిధు లు మాత్రమే వస్తాయి. ఈ లెక్కన 1,363 పంచాయతీల్లో నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు. అభివృద్ధి అటెకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నిధులు విద్యుత్ బకాయిలకే పరిపోతే మేము ఎలా పనిచేయాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి అయినా నిధులిచ్చి, విద్యుత్ బకాయిలు చెల్లించడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.