Funds in the financial community
-
అభివృద్ధికి ‘షాక్’
జిల్లాకు రూ.192 కోట్లు ఆర్థిక సంఘం నిధులు కరెంటు బకాయిలు రూ.105 కోట్లు పాత బిల్లులకు జమ చేయాలని నిర్ణయం పంచాయతీల్లో అభివృద్ధికి మంగళం చిత్తూరు: పేరుకుపోయిన కరెంటు చార్జీల పాత బకాయిలు పంచాయతీలకు శాపంగా మారాయి. రెండు విడతలుగా జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు 192 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.105 కోట్లు కరెంటు చార్జీలు చెల్లించాలనే అధికారుల నిర్ణయంతో పంచాయతీల్లో అభివృద్ధి పడకేసే పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు నిలిపివేసింది. ఎన్నికల అ నంతరం ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే మొదటివిడతలో జిల్లాకు కేటాయించిన *67.5 కోట్లలో *39.5 కోట్లు గతంలో విడుదల అయ్యాయి. తాజాగా మిగిలిన *28 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కొంతమేర విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడత కింద మరో *125 కోట్లు త్వరలో జిల్లాకు అం దే పరిస్థితి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలి పారు. ఒక్కో వ్యక్తికి *400 దామాషాన జిల్లాలో 31.5 లక్షల జనాభా ఉన్నం దున మొత్తం *125 కోట్ల నిధులు జిల్లాకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నిధులతో గ్రామపంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించాలి. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపారు. అభివృద్ధి సందేహమే జిల్లాకు రూ. కోట్లు నిధులు వస్తున్నా పంచాయతీలు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో 1,363 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో విద్యుత్ బకాయిలు * 105 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మేజర్ పంచాయతీలు మాత్ర మే కరెంట్ బిల్లులు చెల్లిస్తుండగా మిగిలిన పంచాయతీలు బిల్లులు చెల్లించక పోవడంతో పేరుకుపోయాయి. దీంతో అధికారులు 13 వ ఆర్థిక సంగం నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే బకాయిలు *105 కోట్లు ఉండడంతో దాదాపు ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలు చెల్లిం చేందుకు సరిపోయే పరిస్థితి నెలకొంది. కొంత చెల్లిస్తాం అధికారులు మాత్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో తొలివిడతలో కొంత మేర బకాయిలు చెల్లించి, మిగిలిన బకాయిలు రెండో విడత నిధులతో చెల్లించడం ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా చూస్తామని చెబుతున్నారు. కానీ విద్యుత్ బకాయిలు చెల్లించిన తరువాత అభివృద్ధికి నిధులు మిగిలేది నామమాత్రమే. మిగిలిన * 153 కోట్ల నిధుల్లో ఒక్కో పంచాయతీకి కేవలం * 11 లక్షల నిధు లు మాత్రమే వస్తాయి. ఈ లెక్కన 1,363 పంచాయతీల్లో నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు. అభివృద్ధి అటెకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నిధులు విద్యుత్ బకాయిలకే పరిపోతే మేము ఎలా పనిచేయాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి అయినా నిధులిచ్చి, విద్యుత్ బకాయిలు చెల్లించడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. -
లెక్క చూపాల్సిందే !
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఇక ముందు కుదరదు. పనులు చేయకున్నా.. చేసినట్లు తప్పుడు బిల్లులు పెడితే దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఇనిస్ట్యూషన్ అకౌంటింగ్ పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చింది. ఇక మీదట జిల్లాలోని గ్రామీణ, మండల స్థాయిలో అభివృద్ధి పనులకు, మరమ్మతుల కోసం ఆర్థిక సంఘం నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేశా రు? వివరాలను ఖచ్చితంగా కేంద్రానికి తెలుపా ల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధులు ఎప్పటి నుంచి వస్తున్నాయో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్రం జిల్లా పంచాయతీ అధికారులకు సూచించింది. దీంతో పాత లెక్కలను ఎలా చూపాలోనని మండల పరిషత్ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా పాత లెక్కలను అడగటంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయోనని కట్టి పెట్టిన ఫైళ్లను వెతకడం మొదలు పెట్టారు. ఈ ఖర్చుల వివరాలు ఆన్లైన్లో పెడితే కానీ ఇప్పుడు మం జూరు చేసిన 2013-14 ఆర్థిక సంఘం నిధులు రూ.12 కోట్ల 61లక్షల 71 వేల 900, 2014-15 ఆర్థిక సంఘం నిధులు రూ. 13 కోట్ల 88 లక్షల 45 వేల 200ల వినియోగానికి అనుమతివ్వబోమని కేం ద్రం హెచ్చరించింది. జిల్లాకు మంజురు చేసిన ఆర్థిక సంఘం నిధుల వివరాలను జూన్ 1లోగా ఆన్లైన్లో నమోదు చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులకు గడువు కూడా విధించింది. దీంతో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో పాటు మండలాల ఉద్యోగులను అలర్ట్ చేశారు. డీఎల్పీఓ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో కంప్యూటర్లు పెట్టి ఏర్పాట్లు చేసి ఆపరేటర్లతో నిధుల ఖర్చుల వివరాలను ఆన్లైన్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలలో జిల్లాకు మంజూరు చేస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లూ ఆ నిధుల వినియోగంపై వివరాలు తెలుసుకోలేదు. ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఖర్చు చేసిన నిధులకు సంబంధిం చిన గ్రామం పంచాయతీల నుండి ధ్రువీకరణ పత్రాలను దాదాపు జిల్లాలోని 718 పంచాయతీల్లో ఎవరు కూడా ఇంత వరకు జిల్లా పంచాయతీ కా ర్యాలయంలో సమర్పించలేదు. ఎందుకంటే నిధు లు పక్కదారిపట్టాయని, దీనికి తోడు ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం కూడా కలిసి వచ్చిందని సం బంధిత వర్గాలు చెబుతున్నాయి. పాత, కొత్త లెక్క లు తీస్తే ఎక్కడ దొరికిపోతామోనని ఉద్యోగులు, పాలకులు జంకుతున్నారు. ఇక మీదట ఆర్థిక సం ఘం నిధుల్లోంచి నయా పైసా ముట్టాలన్నా.. పని చేసినట్లుగా సాక్ష్యాలు చూపి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి నిధుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని పలువురు పేర్కొంటున్నారు. -
‘పంచాయతీ’లో కాసుల గలగల
ఇందూరు, న్యూస్‌లైన్ : పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇకముందు నిధుల కొరత ఉండబోదు. పల్లెల అభివృద్ధి పనులకు కావాల్సిన్ని నిధులు పంచాయతీల ఖాతాల్లో వచ్చి చేరాయి. ఎన్నడూ లేనంతగా పంచాయతీల ఖజానా నిండుకుండలాగా మారింది. ఇటీవల ఆర్థిక శాఖ పంచాయతీలకు రూ.13,88,45,200 నిధులను కేటాయించి వాటి విడుదలకు ట్రెజరీ శాఖకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొద్దిగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా 2013-14కు చెందిన రూ. 12,61,71,900 నిధుల విడుదలకు ఆర్థిశాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకు పంచాయతీ అధికారులు గతంలోనే పంపిన బిల్లుల ఫైలును జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు బయటకు తీశారు. బిల్లులను సబ్ ట్రెజరీగా వారీగా కేటాయించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి విడుధలైన 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపితే ప్రస్తుతం రూ.26,51,17,100లకు చేరింది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని పంచాయతీ అధికారులు ట్రెజరీ శాఖ అధికారులకు సూచించారు. మొన్నటి వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక జీరో బ్యాలెన్స్ చూపించాయి. గ్రామ సర్పంచులు కూడా పనులు చేయించలేకపోయారు. ప్రస్తుతం లక్షల్లో పంచాయతీల ఖాతాల్లో నిధులు వచ్చి చేరాయి. ఇక పల్లెల్లో అవసరమైన పనులకు, అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉంటాయి. నిధుల సర్దుబాటు ఇలా... జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు నిధులను సర్దుబాటు చేశారు. జిల్లా ట్రెజరీ నుంచి సబ్ ట్రెజరీలకు నిధులను కేటాయించారు. వాటిని రెండు రోజుల్లో సర్దుబాటు చేసి పంచాయతీల ఖాతాల్లో వేస్తారు. ఆర్మూర్ సబ్ ట్రెజరీకి రూ.1,70,33,655, బాన్సువాడ రూ.1,26,03,440, భీంగల్ రూ.1,57,93,101, బోధన్ రూ.1,69,74,294, కామారెడ్డి రూ.2,01,63,699, మద్నూర్ రూ.1,09,57,521, నిజామాబాద్ రూ.2,10,39,743, ఎల్లారెడ్డి రూ.1,16,06,447