ఇందూరు, న్యూస్‌లైన్ : పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇకముందు నిధుల కొరత ఉండబోదు. పల్లెల అభివృద్ధి పనులకు కావాల్సిన్ని నిధులు పంచాయతీల ఖాతాల్లో వచ్చి చేరాయి. ఎన్నడూ లేనంతగా పంచాయతీల ఖజానా నిండుకుండలాగా మారింది. ఇటీవల ఆర్థిక శాఖ పంచాయతీలకు రూ.13,88,45,200 నిధులను కేటాయించి వాటి విడుదలకు ట్రెజరీ శాఖకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొద్దిగా నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా 2013-14కు చెందిన రూ. 12,61,71,900 నిధుల విడుదలకు ఆర్థిశాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకు పంచాయతీ అధికారులు గతంలోనే పంపిన బిల్లుల ఫైలును జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు బయటకు తీశారు. బిల్లులను సబ్ ట్రెజరీగా వారీగా కేటాయించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి విడుధలైన 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపితే ప్రస్తుతం రూ.26,51,17,100లకు చేరింది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని పంచాయతీ అధికారులు ట్రెజరీ శాఖ అధికారులకు సూచించారు. మొన్నటి వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక జీరో బ్యాలెన్స్ చూపించాయి. గ్రామ సర్పంచులు కూడా పనులు చేయించలేకపోయారు. ప్రస్తుతం లక్షల్లో పంచాయతీల ఖాతాల్లో నిధులు వచ్చి చేరాయి. ఇక పల్లెల్లో అవసరమైన పనులకు, అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉంటాయి.
నిధుల సర్దుబాటు ఇలా...
జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు నిధులను సర్దుబాటు చేశారు. జిల్లా ట్రెజరీ నుంచి సబ్ ట్రెజరీలకు నిధులను కేటాయించారు. వాటిని రెండు రోజుల్లో సర్దుబాటు చేసి పంచాయతీల ఖాతాల్లో వేస్తారు. ఆర్మూర్ సబ్ ట్రెజరీకి రూ.1,70,33,655, బాన్సువాడ రూ.1,26,03,440, భీంగల్ రూ.1,57,93,101, బోధన్ రూ.1,69,74,294, కామారెడ్డి రూ.2,01,63,699, మద్నూర్ రూ.1,09,57,521, నిజామాబాద్ రూ.2,10,39,743, ఎల్లారెడ్డి రూ.1,16,06,447
‘పంచాయతీ’లో కాసుల గలగల
Published Tue, May 20 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement