జీహెచ్‌ఎంసీ విలీన పంచాయతీలపై నేడు ఉన్నతస్థాయి భేటీ | Today High-level meeting will be held on GHMC merged panchayats | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ విలీన పంచాయతీలపై నేడు ఉన్నతస్థాయి భేటీ

Published Tue, Oct 1 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

Today High-level meeting will be held on GHMC merged panchayats

సాక్షి, హైదరాబాద్: శివార్లలోని గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రక్రియ ప్రహసనంగా మారిన నేపథ్యంలో మంగళవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విలీన సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని సక్రమం గా పాటించనందున ఆ పక్రియను హైకోర్టు కొట్టేసిన విషయం విది తమే. మొత్తం 35 పంచాయతీల విలీనం కోసం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేయగా.. దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మాత్రమే కోర్టుకు వెళ్లారు.
 
 ఆ పంచాయతీలకు సంబంధించి ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ కూడా ఆ పంచాయతీలను విలీనం చేసుకోవడాన్ని తిరస్కరిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మా నం కూడా చేసింది. ఇక శివారు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ విలీన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రు. అవసరమైతే వాటిని మునిసిపాలిటీలుగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ 35 గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాలా? లేక మునిసిపాలిటీలుగా మార్చాలా? అన్న అంశంపై సచివాలయంలో పంచాయతీరా జ్ శాఖ మంత్రి జానారెడ్డి చాంబర్ వేదికగా జరిగే మంత్రుల సమావేశంలో ఒక నిర్ణయానికి రావచ్చని చెబుతున్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా ఇతర అధికారులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement