ఉపాధి పనులపై 20 నుంచి గ్రామ సభలు
Published Thu, Oct 20 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
– ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు
నంద్యాలరూరల్: ఉపాధి పనులపై ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించి సామాజిక తనిఖీ జరపాలని ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు ఆదేశించారు. బుధవారం నంద్యాల సీఎల్‌ఆర్‌సీ భవనంలో ఏపీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో డీఆర్పీలు, విలేజ్ సోషల్ ఆడిటర్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక తనిఖీల అనంతరం ఈనెల 28వ తేదీన నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బహిరంగ సామాజిక విచారణ జరుగుతుందని చెప్పారు. పనుల వారీగా ఫిర్యాదులను నమోదు చేసి మండల స్థాయి ఓపెన్ ఫోరానికి తీసుకొని రావాలని సూచించారు.
Advertisement