సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా 60 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన తండాలను పంచాయతీలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో తండాలవారీగా వివరాలు సేకరించింది. ఇం దులో తండా పరిధితో పాటు జనాభా, కుటుంబాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని పంచాయతీలు చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం జిల్లాలో 328 గిరిజన తండాలున్నాయి. వీటిలో ఐదువందల కంటే ఎక్కువ జనాభా ఉన్న తండాలు 60 ఉన్నాయి. ఇవి కాకుండా 268 తండాల్లో ఐదువందల కంటే తక్కువ జనాభా ఉన్నట్లు జిల్లా పంచాయతీ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఏర్పాటు చేస్తే జిల్లాలో 60 పంచాయతీలు ఏర్పాటయ్యే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు.
సామాజిక పింఛన్ల పెంపుతో లబ్ధిదారులకు మరింత సాయం అందనుంది. జిల్లాలో 2,63,145 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 1,30,496 మంది వృద్ధులున్నారు. అదేవిధంగా 31,757 మంది వితంతువులున్నారు. తాజా పెంపుతో వీరికి లబ్ధి చేకూరనుంది. వీరు కాకుండా వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు తీసుకునే పింఛన్లు సైతం పెరిగే అవకాశం ఉంది.
నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో ఆరువందల కుటుంబాలకు 1,800 ఎకరాల భూమి పంపిణీ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జిల్లాలో 28,810 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరికి తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ వేతనాలు అందనున్నాయి.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1060 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సర్కారు ప్రకటనతో వీరి ఉద్యోగాలు క్రమబద్ధీకరించే అవకాశం ఉంది.
అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో 18 మంది అమర వీరులున్నట్లు యంత్రాంగం గుర్తించింది. తాజా ప్రకటనతో ఈ 18 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
60 తండాలు ఇక పంచాయతీలు!
Published Thu, Jul 17 2014 11:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement